Adsense

Wednesday, November 27, 2024

కాకి దొండ ప్రయోజనాలు KAKI DONDA

కాకి దొండ‌కాయ ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో, పండిన త‌రువాత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కాకి దొండ‌కాయ కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. కాకిదొండకాయ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకిదొండ‌కాయ‌ల‌తో కూర వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌పడుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల నాడీ మండ‌ల వ్యాధులు, మ‌తిమ‌రుపు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ప‌చ్చిగా ఉన్న కాకిదొండ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల నోట్లో పుండ్లు, నోటి అల్స‌ర్లు త‌గ్గుతాయి.
మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ కాకి దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే వాంతులతో బాధ‌ప‌డే వారు ఈ అడ‌వి దొండ‌లో ఉండే గింజ‌ల‌ను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వాంతులు త‌గ్గుతాయి. ఈ అడ‌వి దొండ తీగ‌లో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఎక్కువ‌గా డ‌యాబెటిస్ కు సంబంధించిన మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఈ దొండ ఆకుల ర‌సాన్ని 5 నుండి 10 గ్రాముల మోతాదులో క్ర‌మం త‌ప్ప‌కుండా 40 రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుంది. ఈ ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌ల్ల క‌లిగే ఇత‌ర స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటారు. అలాగే ఈ కాకి దొండ ఆకుల ర‌సాన్ని గేదె పెరుగుతో క‌లిపి తీసుకుంటే వారం రోజుల్లోనే కామెర్ల వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

No comments: