Adsense

Tuesday, May 27, 2025

వాల్మీకి రామాయణం - 06

అయోధ్యా పురి చక్రవర్తి అయిన దశరథ మహారాజు వేదవేదాంతములను తెలిసిన వాడు. పౌరులకు మేలుకలిగించు అనేక యజ్ఞములు చేస్తుండెడి వాడు. ఆ మహారాజు కొలువులో 8 మంది మంత్రులు. వారు దృష్టి,
జయంతుడు,విజయుడు,సిద్ధార్థుడు,అర్థసాధకుడు,అశోకుడు,మంత్రపాలుడు,మరియు సుమంత్రుడు(అత్యంత ముఖ్య వ్యవహారాలను చూసే వాడు).

ఈ మంత్రి వర్గం ఇతర రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నది ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు.తప్పుచేసిన తనబిడ్డలైనను శిక్షించ గల నిబద్ధత గల వారు.

నిరపరాదులైన పగవారైనను క్రోధముతో శిక్షింపక సమబుద్ది కలవారు.త్రికరణ శుద్దిగా అందరూ ఏకతాటిపై రాజ్యవ్యవహారాలను చూసెడి వారు.

వశిష్టుడు, వామదేవుడు అను మహర్షులు చాలాకాలము నుండి
ఇక్ష్వాకువంశపురోహితులై, ఆ దశరధునికి హితులై ప్రాధాన్యము వహించి యుండిరి.

ఇంకను జాబాలి మున్నగు ఋషులును ప్రధానులైయుండిరి. రాజ్యవ్యవహారము లందు వీరికిని ముందు పేర్కొన్న మంత్రులతో బాటు ప్రాముఖ్యముండెడిది.

అందువలననే అయోధ్యానగరమునగాని కోసలదేశమునందుగాని ఎచ్చటను అసత్యము పలుకుటగాని,

మోసముగాని, స్త్రీ వ్యామోహముగాని, అధర్మముగాని, అన్యాయముగాని మచ్చుకకైన కనిపించెడిదికాదు.

నగరమునందు, దేశము నందు నివసించువారు మంచి వస్త్రములు ధరించి, చక్కని ఆలంకారములు దాల్చి మంచి నడవడికగలవారై తమరాజగు దశరథుని మేలుకొఱకై సదా నీతి యందు జాగురూకతతో ప్రవర్తించుచుండిరి.

తనయందు ప్రీతిగలవారును, బుద్ధికౌశలము గలవారును, రాజ్యకార్యాచరణ దక్షులును అగు మంత్రులచే పరివేష్టితుడై

ప్రకాశవంతములగు కిరణములతో నొప్పు బాలభానునివలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుడువలె నీ భూమండలము నంతను దశరథ మహారాజు పాలించుచుండెను.

ఇంతటి ప్రభావం కలిగిన దశరథ చక్రవర్తి కి చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వలన మనసులో చింతన ఏర్పడింది.

సంతానం కోసం మంత్రి,పురోహిత వర్గం తో సమావేశం ఏర్పాటు చేసి సమాలోచన చేసెను దశరథుడు...

( స‌శేష‌ము )..

No comments: