Adsense

Tuesday, May 27, 2025

వాల్మీకి రామాయణం - 5

అది అయోధ్యానగరం. సరయూ నది తీరం. మనుచక్రవర్తి స్వయంగా సంకల్పబలం చే నిర్మించినాడు. సంతుష్టులగు ప్రజలతో,ధనధాన్యాలతో నిండియుండి కోసల దేశం గా ప్రసిద్ధి చెందింది.


అయోధ్యా నగరం 12 యోజన ముల పొడవు,3 యోజనముల వెడల్పు గలది.మంచి పుష్పాలతో నిండిన తోటలు,రాజమార్గాలు

సుంగంధభరితమైన తోరణాలు,చక్కగా అమర్చినటువంటి వీధులతో గొప్ప పట్టణం గా విరాజిల్లుచుండెను.

మిక్కిలిఎత్తైన రాజభవనాలతోను,వాటిపై ఎగురుచున్న జెండాలతో ను,పెద్ద పెద్ద నర్తన శాలలతోను,

పూదోట లతోను ఉన్న నగరం లోకి శత్రువులు ప్రవేశింపడానికి
వీలుకాకుండా లోతైన ఆగడ్తలతోను అయోధ్యానగరం ప్రకాశించుచున్నది.

ఏనుగులు,గుఱ్ఱములు,ఒంటెలు,అవులతోను,అధికంగా సామంతరాజులతోను ,దేశ విదేశ రాజులు,వ్యాపారస్తులతో క్రిక్కిరిసి ఉండెను.

ఇలా పరిపూర్ణ హంగులతో ఉన్న ఆ నగరం దేవేంద్రుని అమరావతి తో సమానం గా ఉండెను.

తల్లిదండ్రులు,భార్యాపుత్రులుమనుమలు,బంధువులతో లేని ఇల్లు ఒక్కటైనను అయోధ్యలో కనపడదు.

చదువురానివారు కానీ,దుష్టుడు కానీ,దొంగ కానీ,నాస్తికుడు కానీ పట్టణం లో వెదికనను కనపడడు.

ఇట్టి మహా నగరాన్ని అజ మహారాజు పుత్రుడగు దశరథ మహారాజు పాలన చేస్తుండెడి వాడు...

( స‌శేష‌ము )..

Note.1 యోజనము =12కిలో మీటర్ల దూరం తో సమానం.


No comments: