సుమంత్రుడు చెప్పిన సలహామేర దశరథుడు అంగరాజ్యానికి వెళ్లి ఋష్యశృంగ మహర్షిని శాంతా సహితం గా ఆహ్వానించి అయోధ్యకు తీసుకొచ్చి తగిన విధం గా సత్కరించి తను చేయు యజ్ఞం గురించి మంత్రి పురోహోతులతో కలసి సవివర్క్మ్ గా తెలియ జేశాడు.
వసంతంలో చైత్రపూర్ణిమనాడు దశరథుడు యజ్ఞం ప్రారంభించాడు. ఋష్యశృంగునికి నమస్కరించి ప్రధాన ఋత్విక్కుగా అభ్యర్థించాడు.
ఆ ముని అంగీకరించాడు. సుయజ్ఞ వామదేవ జాబాలి కాశ్యప వసిష్ఠులతో కలిసి యజ్ఞనిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. అవసరమైన సంభారాలకు ఆజ్ఞాపించాడు.
దశరథుడు ఋత్విక్కులనందరినీ యథావిధిగా పూజించాడు. మీ అందరి ఆశీస్సులతో యజ్ఞం నిర్విఘ్నుంగా కొనసాగాలి.
ఋష్యశృంగుని ప్రభావంవల్ల ఇది సఫలమై నా సంతానేచ్ఛ నెరవేరాలి. ఇదీ నా ప్రార్థన ఆన్నాడు
నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఒకరు కాదు - నల్గురు పుత్రులు నీకు ఉదయిస్తారని ఋత్విక్కులు ఏకకంఠంగా ఆశీర్వదించారు.
వసిష్ఠ ఋష్యశృంగుల సూచనల మేరకు సంవత్సరం పొడుగునా ఎవరు చెయ్యవలసిన జప హోమాది కార్యక్రమాలకు వారు బద్ధకంకణులై వెళ్లిపోయారు
సంవత్సరం గిర్రున తిరిగింది. మళ్ళీ వసంతం వచ్చింది. ఆ రోజున దశరథ మహారాజు వసిష్ఠునికి నమస్కరించి అసలైన ముఖ్యయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించమని ప్రార్థించాడు.
అంతా నీదే భారం అన్నాడు. వసిష్ఠుడు అంగీకరించి నేర్పరులైన యాజ్ఞకులను ఆహ్వానించాడు.
సుమంత్రుణ్ని ప్రత్యేకంగా పిలిచి ధర్మాత్ములైన రాజులందరికీ ఆహ్వానాలు పంపమన్నాడు.
అన్నిదేశాలనుంచీ అన్ని వర్ణాలవారినీ ఆహ్వానించమన్నాడు. మిథిలా-కాశీ-కేకయ- అంగ రాజ్యాధిపతులను స్వయంగా వెళ్ళి పిలిచి రమ్మన్నాడు.
సింధు సౌవీర సౌరాష్ట్ర దాక్షిణాత్య దేశాధిపతులకు ఆహ్వానాలు పంపమన్నాడు. మనకు మిత్రులైన
తక్కిన రాజులు అందరినీ ఆహ్వానించమన్నాడు.
వసిష్ఠుని నోటినుండి వచ్చినమాట వచ్చినట్టు అమలు జరిగిపోతోంది.
ఏ పని ఎంతవరకూ జరిగిందో ఎప్పటికప్పు పనులు జరుగుతున్న తీరుకు వసిష్ఠుడు సంతృప్తి చెందారు.
ఎవరికీ ఏ అవమానమూ జరగకూడదు ఎవరికి ఏది ఇచ్చినా శ్రద్ధతో ఇవ్వండి. అశ్రద్ధతో నిర్లక్ష్యంగా మ్రొక్కుబడిగా ఇవ్వకండి. అలా ఇస్తే దాతకు హాని కలిగిస్తుంది.
ఈ హెచ్చరికను పదే పదే చేస్తున్నాడు. యజ్ఞవాటికా నిర్మాణం పూర్తి అయ్యింది. బహుదూరాలనుంచి రేయింబవళ్ళు ప్రయాణించి రాజులంతా వచ్చారు.
రత్న మణిమాణిక్యాలు బహుమతులు తెచ్చారు. అందరినీ యథోచితంగా సత్కరించి వారి వారికి కేటాయించిన గుడారాలలో విడిది చేయించాడు. స్వయంగా వెళ్లి దశరథ మహారాజుకు అం అంతా తెలియజేసాడు.
రాజేంద్ర! మనస్సుతో నిర్మింపబడినదా అన్నంత అద్భుతంగా అందంగా యజ్ఞవాటిక రూపుదిద్దుకొంది.ఇక యజ్ఞం ప్రారంభిచమని ప్రార్థించాడు వశిష్ఠుడు...
( సశేషము )..
No comments:
Post a Comment