పుత్రకామేష్టి పాయస విభాగం.
శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తత్త్వ దీపిక ....
శ్రీమహావిష్ణువు ఒక్కడే పాయసము ద్వారా ముగ్గురు భార్యలలో నాలుగు రూపములతో జన్మింపబోవుచున్నాడు.
ఇతర పురాణములలో శేషుడు లక్ష్మణుడుగ, శంఖ, చక్రములు భరతశతృఘ్నులుగ వచ్చినట్లు ఉన్నది.
కాని శ్రీరామాయణమున విష్ణువే నాలుగు రూపములతో వచ్చినట్లు చెప్పబడియున్నది.
దీనిలో తెలుసుకో దగిన రహస్యము ఇమిడియున్నది. ఈ శరీరములో ఉన్న జీవుని పురుషుడు అందురు.
పురుషుడు జన్మించినందుకు కొన్ని ఫలములను కోరి సాధించవలెను. వారికి పురుషార్ధములందురు. అవి నాలుగు, ధర్మము, అర్ధము, కామము, మోక్షము.
ధర్మార్థ కామములు మూడును ఎట్లు సాధింపవలెనో వేదములలో పూర్వభాగము చెప్పినది.
ఉత్తర భాగమున మోక్షము ఎట్లు సాధింపవలెనో చెప్పెను.
మానవుని శరీరము సత్వ, రజ, స్తమోగుణములతో కూడిన ప్రకృతిచే ఏర్పడినది. ఇది జీవువిచే భరింపతగినది.
అనగా భరించి పోషింపతగినది. అందుచే శరీరము భార్య ఆత్మ భర్త శరీరమునందు సత్వము
సమస్సు అవి మూడు గుణములు ఉండుటచే మూడు విధములుగ ప్రవర్తించుచుండును.
ఈ కథలో దశరధుడు జీవుడుగ, కౌసల్య, సుమిత్ర, కైకేయి అవెడి ముగ్గురు భార్యలు సత్వ, రజ, స్తమోగుణముల చే భిన్నన్వభావలగు ముగ్గురు భార్యలుగ కనపడుచున్నారు,
శరీరమును పాందినవాడు ఈ శరీరములో సాధించవలసిన నాలుగు పురుషార్థములను పొందుటయే ఇందు నిరూపింపబ ఉనది.
ముగ్గురు భార్యలు, నలుగురు పుత్రులు అనునది ఈ రహస్యమును సూచించుచున్నది.
పాయసభాగముచే నలుగురు కలిగినట్లు కథలో స్పష్టమగుచున్నది.
శ్రీమన్నారాయణుడు అవతార స్వీకరణ చేస్తున్నాడు కనుక ఇతర దేవతలు ఎలా జన్మిస్తున్నారో రేపటి రోజున న చూద్దాం......
( సశేషము )..
No comments:
Post a Comment