వాల్మీకి ఆశ్రమం లో చతుర్ముఖ బ్రహ్మ జరిగిన సంఘటన తెలుసుకొని,
జరిగిన రామకథ అంతయు నీకు ప్రత్యక్ష సమానాకారముగా గోచరమగును అని వరమును ఇచ్చెను.
నీవు రచించు ఈ కావ్యం లో ఒక్క మాటైన అసత్యము ఉండదు.రామ కథ పుణ్యమైనది.మనోహరమైనది.
యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
పర్వతములు,నదులు భూమి మీద ఉన్నంత వరకు రామకథ లోకములో వ్యాపించి ఉంటుంది.
తదుపగత సమాససన్ధియోగం
సమమధురోపనతార్థ
వాక్యబద్ధమ్,
రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్.
ఈ రామచరితము రావణ వధ వాక్యాలు మధురంగా అర్థభరితముగా ఉంటాయి
ఈ కావ్యము సుమారు 24 వేల శ్లోకాలు,7 కాండలతో విరాజిల్లుతుంది.
వేదోపబృంహనార్థాయ....
వేదము యొక్క సమగ్ర వివరణ గాను, చదివినను,పాడినను మధురంగా ఉంటుంది.
ఇంకా ఆయుష్యం, పుష్టిజనకం, సర్వశ్రుతిమనోహరం....అని వరం ఇచ్చారు బ్రహ్మగారు.
బ్రహ్మ గారి వరప్రభావం వలన జరిగిన రామచరిత్రను అంతా కళ్ళకు కట్టినట్టు కనపడింది
తదేక దృష్టితో రచన సాగించారు మహర్షి రామచరిత్రకు 3 పేర్లు సూచన చేశారు
1.రామాయణం
2.మహత్తుకలిగిన సీతమ్మ చరిత్ర
3.పౌలస్త్య వధ.
ఈ రాసిన గ్రంథం మొతాన్ని ఆశ్రమమ లో ఉన్న రామచంద్రుని పుత్రులు కుశ లవుల కు నేర్పించాడు.
వారు అయోధ్యలో గానం చేశారు అక్కడ ఉన్న నగర పౌరులు బాగుందని ప్రశంసించారు,బహుమతులు బహుకరించారు.
ఆ నోటా ఈ నోటా ప్రచారం చెంది రామచంద్రుని వరకు ఆ గాన ప్రవాహం చేరింది.
రాముడు కూడా అక్కడవున్నవారితో ఈ సీతాచరిత్ర నాకు కూడా ఊరట కలింగించింది. సావధాన చిత్తులై వినండి అని ఆదేశించారు.
ఇక మనము కూడా రామచరిత్రను అనుభవిద్దాము...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment