రామ లక్ష్మణులు విశ్వామిత్రుడు ముగ్గురు తాటకా వనం లో రాత్రి నిద్రించారు....
ఉదయం విశ్వామిత్రుడు రామునితో స్నానమాచరించి రమ్మని...
అనేక రకాల దివ్యాస్త్రాలను ఉపదేశం చేసాడు....
వాటి ఉపసంహరాలను సైతం ఉపదేశం చేసాడు.రాముడు వాటిని తదేక దృష్టి తో ధ్యానం చేసాడు అవి అన్ని ప్రత్యక్షమయ్యాయి.
ఓ దివ్యాస్త్రములారా న మనసులో వశించండి తగిన సమయం లో సహకరించండి.అని ఆదేశించాడు అవి రాముని ఆజ్ఞను శిరశావహిస్తాము అని చెప్పి మారలినాయి.....
విశ్వామిత్రిని వెంట రాముడు లక్ష్మణుడు నడక సాగిస్తున్నారు.....
మేఘ మండల సదృశం గా ఓ పెద్ద వృక్ష సమూహం కనపడింది....
రాముడు ప్రశ్నించాడు....
విశ్వామిత్రుడు సమాధానం గా....
హే మహాబాహో ! రఘురామా ! విష్ణుమూర్తి కొన్ని వందల యుగాలపాటు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకున్నాడు.
వామనునికి ఇదే పూర్వాశ్రమం. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ మహా తపస్సులు సిద్ధిస్తాయి.
విష్ణుమూర్తి ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలోనే విరోచనుని కొడుకు బలి- ఇంద్రునితో సహా సర్వదేవతలనూ జయించి ముల్లోకాలనూ తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.
ఆ సందర్భంగా ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ సమయంలో సర్వదేవతలూ ఈ ఆశ్రమానికి వచ్చి, బలి చేస్తున్న యజ్ఞ వార్తను విష్ణుర్తికి విన్నవించి
ఆ యజ్ఞం పూర్తి అయ్యేలోగానే దేవకార్యం చక్కబెట్టమని అభ్యర్థించారు. ఎవరు ఎక్కడ ఏది ఎంత అడిగితే అదల్లా ఇచ్చేస్తాడట బలి.
హే విష్ణు ! దేవహితం కోసం నీవు వామనుడవై మాయాయోగంతో మాకు మేలు చేకూర్చు - అని ప్రార్ధించారు సరిగ్గా అదే సమయానికి
అదితి సహితుడైన కాశ్యపుడు, విష్ణు ప్రీతికోసం వేయి సంవత్సరాల మహావ్రతం పూర్తిచేసుకొని, అక్కడకు వచ్చాడు.
తపోమయుడు, తపోమూర్తి తపోరాశి అయిన కాశ్యపునికి సంతోషించి విష్ణుమూర్తి వరం అడగమన్నాడు.
మహానుభావా ! నీ శరీరంలో సమస్త జగత్తునూ చూస్తున్నాను. నీవు అనాదివి. అనిర్దేశ్యుడవు. శరణు మహాప్రభూ! శరణు శరణు ఈ యాచిస్తున్న దేవతలకూ మా దంపతులకూ సంతోషకరంగా ఒకే వరం అడుగుతున్నాను అనుగ్రహించు.
నీవు మాకు పుత్రుడవుగా అవతరించు. మా పెద్దకుమారుడు ఇంద్రునికి సోదరుడవై శోకార్తులైన ఈ
దేవతలకు సహాయం చెయ్యి.
ఉత్తిష్ఠ భగవన్! ఇకనుంచి ఇది సిద్ధాశ్రమ నామంతో ప్రసిద్ధికెక్కుతుంది.
కాశ్యపుని ప్రార్ధనను విష్ణుమూర్తి మన్నించాడు. అదితి గర్భంలో వామనుడుగా జన్మించాడు.
బలిని సమీపించాడు. మూడడుగులు యాచించాడు. ముల్లోకాలనూ ఆక్రమించాడు. బలిని అదుపుచేసి దేవేంద్రునికి దేవరాజ్యం తిరిగి అప్పగించాడు.
రామా ! ఇది ఆ మహామహుడు వామనుడు నివసించిన ఆశ్రమం. భక్తి ప్రపత్తులతో నేనుకూడా ఇక్కడే ఉంటున్నాను
యజ్ఞ విఘ్నకారులైన రాక్షసులు ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడే నీవు వారిని సంహరించాలి
నాయనా ! రామా ! రా ! ఉత్తమోత్తమమైన సిద్ధాశ్రమంలో కిప్పుడే ప్రవేశిద్దాం...
( సశేషము )
No comments:
Post a Comment