శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 20 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఇరుముడిలో పెట్టే వస్తువులు:🌹
🌸రెండు అరలుగా వున్న ఒక సంచీని తీసుకుని ముందు అరలో స్వామికి సమర్పించవలసిన వస్తువులను , వెనక అరలో ఆహార పదార్థాలను వుంచి తాడుతో మూట కట్టడంతో ఇరుముడి తయారౌతుంది ! ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం ,
🌿అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి !
వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , ఇతర తినుబండారాలు పెట్టుకోవచ్చును.
🌹ఇరుముడి కట్టే విధానం:🌹
🌸ఇరుముడి దేవాలయంలోగాని , గురుస్వామి ఇంటిలోగానీ కట్టడం జరుగుతుంది. ముందుగా కొబ్బరి కురిడీ లేక ముద్రను సిద్ధం చేస్తారు !
🌹ముద్రను సిద్ధం చేసే విధానం:🌹
🌿శుభ్రమైన మంచి కొబ్బరికాయకు పీచు తీసి నున్నగా చేసిదాని కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి కాయలో వున్న నీటిని తీసివేయాలి ! ఆ కాయను కలశం మీద వుంచి దీక్ష పూర్తిచేసిన స్వామి చేత కొబ్బరికాయను ఆవు నేతితో నింపిస్తారు గురుస్వామి ! ఆ సమయంలో ఇద్దరూ మనస్సులో అయ్యప్పస్వామిని ధ్యానిస్తూ వుండాలి ! నింపిన తర్వాత గురుస్వామి రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది ! కాబట్టి కొబ్బరికాయలోని నెయ్యి బయటకు రాకుండా జాగ్రత్తతీసుకుంటారు ! ఈ విధంగా నెయ్యితో నింపబడ్డ కొబ్బరికురిడీనే ముద్ర అంటారు !
🌸 ఈ ముద్రను ఒకవస్త్రంలో నాణాలతో కలిపి కట్టి దానిని ఇతర పూజా ద్రవ్యాలతో కలిపి సంచీ ముందుభాగంలో వుంచటం జరుగుతుంది. ఆ భాగాన్ని గట్టిగా కట్టివేసి , వెనక భాగంలో ఆహార పదార్థాలను వుంచి కట్టిన తర్వాత రెంటినీ కలిపి ఒకటిగా ముడివేస్తారు ! దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి వుంటుంది !
🌿కొబ్బరి కురిడీ ముద్ర అంతరార్థం
కొబ్బరికాయలకు మూడు కళ్లువుంటాయి ! వాటిలో రెండు కళ్లు గట్టిగా వుండి ఒకటి మెత్తగా వుంటుంది ! గట్టిగా వుండే రెండు కళ్ళు మనిషిలో పైకి కనిపించే రెండు కళ్లకు సంకేతాలు ! మెత్తని కన్ను మనిషి లోపలి జ్ఞాన నేత్రానికి సంకేతం ! జ్ఞాన నేత్రం మాత్రమే సాధనవల్ల భగవంతుని తనలోనే దర్శించగల సమర్థత కలిగివుంటుంది !
🌸మెత్తని కన్నును తెరిచి నీరు తీసివేసి స్వచ్ఛమైన నేతితో నింపినట్లు జ్ఞాన నేత్రం అహంకారాన్ని వదిలి భక్తి భావంతో భగవంతుని దర్శించాలన్న సందేశం దాగి వుంది ముద్రను సిద్ధం చేయటంలో !
🌹ఇరుముడికి పూజ:🌹
🌿కట్టడం పూర్తిచేసిన ఇరుముడిని భక్తితో పూజిస్తారు దీక్షాధారులు ! ఇరుముడి వల్ల కలిగే శక్తి యాత్రను సజావుగా శుభప్రదంగా సంపన్నం అయ్యేలాచేస్తుంది ! పూజ పూర్తయినాక ఇరుముడి కట్టించిన గురుస్వామికి నమస్కరించి , దక్షిణ సమర్పించి గురుస్వామి చేత మూటను పెట్టించుకుని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని యాత్రసఫలం కావించమని ప్రార్థించాలి !
🌸ఇరుముడిని స్వామి ప్రక్కన వుంచి పూలమాల వేసి నమస్కరించాలి ! ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరుముడులకు హారతి చూపి , శరణుఘోష చేస్తూ దీక్షాధారలందరూ ప్రయాణం ప్రారంభించి శబరిగిరి వైపు సాగిపోతారు ! ఇతరులు మేళతాళాలతో ఊరి పొలిమేరల వరకు వారి వెంట వెళ్లి వీడ్కోలు చెప్పి జయప్రదంగా యాత్ర ముగించుకు రావాలని శుభకాంక్షలు తెలిపి వెనుదిరుగుతారు !
🌿ఇరుముడికి - జాగ్రత్తలు
ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇతరుల ఇండ్లకు వెళ్లగూడదు !
దేవాలయాలు , సత్రాలలో తప్ప ఇతరుల గృహాలలో బస చేయకూడదు !
స్వామివారికి అర్పించే పూజాద్రవ్యాలు , ముద్ర వున్న భాగం శిరస్సు ముందుభాగంలో వుండేలాగా , జారిపోకుండా జాగ్రత్త వహించాలి !
🌸యాత్రాకాలంలో కూడా రోజూ ఉదయం , సాయంత్రం ఇరుముడికి హారతి ఇచ్చి భజనలు చేయాలి !
పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి స్వామి సన్నిధానాన్ని చేరేవరకు ఇరుముడిని పవిత్రంగా చూసుకోవాలి !
మొదటిసారి వెళుతున్న దీక్షాధారులు (కన్నిస్వాములు) తాము స్వయంగా ఇరుముడిని తలపై నుండి దింపటం తిరిగి ఎత్తుకోవడం చేయకూడదు ! ఆరు సార్లు వెళ్లి వచ్చినవాళ్ల సహాయంతో ఆ పని చేయాలి ! ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావిస్తూ పూజిస్తూ శబరిగిరి చేరుకోవాలి.
🌿శబరిగిరి యాత్రకు
తీసుకువెళ్లవలసిన ఆయుధాలు
మొదటి సంవత్సరం యాత్రకు వెళ్ళేవారు తమ వెంట ఒక బాణాన్ని తీసుకువెళ్లి శరణుగుచ్చిలో అర్పించాలి ! మొదటిసారిగా దీక్ష స్వీకరించే ఈ స్వాములను కన్నిస్వాములంటారు !
రెండవ సంవత్సరం వెళుతున్న దీక్షధారులు కత్తిని సమర్పించాలి !
మూడవ సంవత్సరం గంటను తీసుకువెళ్లి అర్పించాలి.
🌸నాలుగవ సంవత్సరం గదను
ఐదవ సంవత్సరం విల్లును
ఆరవ సంవత్సరం దీపాన్ని వెలిగించి అర్పించాలి!
ఏడవ సంవత్సరం సూర్యప్రతిమను (సూర్యుని రాగి రేకు)
ఎనిమిదవ సంవత్సరం చంద్రప్రతిమను (చంద్రుని రాగిరేకు)🌿తొమ్మిదవ సంవత్సరం త్రిశూలాన్ని
పదవ
సంవత్సరం విష్ణుచక్రాన్ని
పదకొండవ సంవత్సరం
శంఖాన్ని
పన్నెండవ సంవత్సరం నాగాభరణాన్ని
పదమూడవ సంవత్సరం వేణువును
పధ్నాల్గవ సంవత్సరం తామర పువ్వును
పదిహేనవ సంవత్సరం శూలంని (కుమారస్వామి ఆయుధం)
పదహారవ సంవత్సరం రాయిని
పదిహేడవ సంవత్సరం ఓంకారంగల రాగిరేకును
పద్ధెనిమిదవ సంవత్సరం కొబ్బరిమొక్కను తీసుకువెళ్లి సమర్పించాలి !
🌸ఈ విధంగా పద్ధెనిమిది సంవత్సరాలు మండల దీక్షను స్వీకరించి పద్ధెనిమిదిమెట్లు ఎక్కివెళ్లి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆయుధాన్ని స్వామికి సమర్పించేవారికి అయ్యప్పస్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది ! వారి జన్మ ధన్యమై ఇహంలో సర్వాభీష్టాలు నెరవేరి చివరకు ముక్తిని పొందుతాడు ! ఏదీ, అందరూ ఒక్కసారి ముక్తకంఠాలతో ఆ స్వామిని మనోనేత్రాలతో దర్శించి నమస్కరించండి.
‘🌹‘హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్యపాదుకం
హరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ్ ! 🌹
🌿ఓం స్వామియే శరణం అయ్యప్ప’’
అంటూ స్తుతించారు సూత మహర్షి కన్నులరమోడ్చి , అంజలి ఘటిస్తూ ! ‘‘ఓం స్వామియే శరణం ! శరణం అయ్యప్ప !’’ అంటూ ముక్తకంఠాలతో మనులందరూ శరణుఘోష భజన చేస్తుంటే నైమిశారణ్య ప్రాంతమంతా భక్తిపూరిత వాతావరణం నెలకొన్నది !
🌸శబరిమల మీద విగ్రహ రూపంలో వెలసిన అయ్యప్పస్వామి తర్వాత ఏం చేశారు ? ఎవరికైనా కనిపించారా ?
‘‘అయ్యప్పస్వామి జ్యోతిగా మారాక జరిగిన విషయాలు పురాణాలలో చెప్పబడలేదు ! భక్తులందరూ కాలినడకన అరణ్యప్రాంతంలో కష్టపడి ప్రయాణించి శబరిమలకు చేరుకుని స్వామి దర్శనం చేశాడు గదా ! క్రమంగా యాత్ర చేసే భక్తుల సంఖ్య పెరిగి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది శబరిమల ప్రాంతం ! అంతవరకే పౌరాణిక గాథ !
🌿 అయితే ఆ ప్రాంతంలో వుండే ప్రజలలో ఒక జానపద గాథ చాలా ప్రచారంలో వుండేది ! అది అయ్యప్పస్వామికి సంబంధించి వుండటంతో దాన్ని కూడా అయ్యప్ప చరితంలో భాగంగానే భావిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ! చాలా ఆసక్తికరంగా వుంటుంది.
🌹అయ్యప్పస్వామి జానపద చరితం - స్వామి మహిమ
ధర్మశాస్తా పంచరత్నం🌹
🌸‘‘లోక వీర్యం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణుం శంభుప్రియసుతం
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం
ప్రణమామ్యహం!
మత్తమాతంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మద్ శతృ వినాశనం
అస్మదిష్ట ప్రదాతారాం
శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంగ తిలకం
కేరళే కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యహం!
పంచ రత్నాఖ్యమే తద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !
🌿‘‘అయ్యప్పస్వామి ! నీవు శబరిమల మీద వెలసి మమ్మల్నందరిని కాపాడుతూ వుంటానని మాట ఇచ్చావు గదా ! మరి ఈ కష్టాలు మాకెందుకు కలుగుతున్నాయి స్వామీ ! పాండ్య వంశస్థుడైన రాజశేఖరునికి పుత్రుడివై పందల రాజకుమారుడిగా నీవు పాలించిన పందల రాజ్యం ఈనాడు ఉదయనుడే గజదొంగ దాడులతో ఛిన్నాభిన్నమైపోయింది !
🌸ఆ వంశపు వాళ్లు ఇక్కడ కట్టించిన మీ దేవాలయంలో మీ పూజార్చనలు ఎంతో కష్టంమీద జరుపుతూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం నేనూ , నా కుమారుడు !ధర్మదేవతను శాసించే హే ! ధర్మశాస్తా ! అయ్యప్పా ! ఇప్పుడు నామమాత్రంగా మిగిలిన ఈ చిన్న పందల రాజ ప్రభువు రాజశేఖరుడు కూడా మీ దయాదృష్టికోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు ! మా అందరి కష్టాలు తీర్చి మమ్మల్ని కాపాడుస్వామి !
🌿’’పందల రాజ్యంలోని ధర్మశాస్తా మందిరం పూజారి స్వామి విగ్రహం ముందు నిలుచుని దీనంగా మొరపెట్టుకున్నాడు !
ఆ సమయంలో కలి పురుషుని ప్రభావానికి లోనైన ఉదయనుడనే గజదొంగ కారణంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన పందల రాజ్యంలో కొంత కాలంగా అరాచకత్వం , బీభత్సం తాండవిస్తున్నాయి. !
🌸ఉదయనుడు తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన వారిని దారుణంగా చంపివేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుని వీరవిహారం సాగిస్తున్నాడు ! రాజైన రాజశేఖరుడికి అతడిని ఎదిరించే బలం లేకపోవడంతో భగవంతునిమీద భారం వేసి రోజులు భారంగా గడుపుతున్నాడు !
🌿ఆ రోజు ధర్మశాస్తా మందిరంలో స్వామిని ప్రార్థిస్తున్న పూజారి వులిక్కిపడి లేచాడు గుర్రం డెక్కల చప్పుడు విని ! అతని గుండెలు దడదడమన్నాయి ! ‘ఉదయనుడే ఇట్లు వస్తున్నట్లున్నాడు’! ఈ ఆలయంమీద ఆ దుష్టుడి చూపు పడి లోపలకు రాడు గదా ! అనే ఆలోచన వచ్చేసరికి భయంతో గజగజలాడుతున్న పూజారి ప్రక్కగా దేవుడి పళ్లాల సవరిస్తున్న కొడుకు వైపు ఆందోళనగా చూస్తూ ‘‘జయవర్థనా ! నాయనా ! పరుగెత్తి వెళ్లి ఎక్కడైనా దాక్కో ! ఆ దుర్మార్గుడు గుడిలోపలకు వస్తాడేమో ! పారిపో , వాడి కంటబడకుండా !’’ అంటూ తొందరపెట్టాడు !
🌸 ‘‘మరి మీరో ?’’ తండ్రివైపు చూస్తూ అడిగాడు పన్నెండేళ్ల జయవర్థనుడు ! ‘‘నీవు ప్రాణాలు దక్కించుకో నాయనా , నా మాట విను ! నేను పరుగెత్తలేను ! ఇక్కడే మనం నమ్మిన స్వామి దగ్గరే వుంటాను ! ఏమైతే అది అవుతుంది ! వెళ్లు , ఆలస్యం చేయకు !’’ అన్నాడు పూజారి విష్ణుదత్తుడు !....సశేషం..🙏
No comments:
Post a Comment