శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 21 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జయవర్థనుడు ఇష్టం లేకపోయినా తండ్రి మరీ మరీ చెప్పడంతో బయటకు పరుగెత్తాడు ! అప్పటికే ఉదయనుడి గుర్రం ఆలయం ముందర వచ్చి ఆగింది ! దిగి లోపలకు వెళ్లాడు ! దేవుడి మెడలో మాల సవరిస్తున్న పూజారి వైపు క్రూరంగా చూస్తూ, ‘‘ఆ రాతి బొమ్మకేం వేస్తావు ? అసలు దేవుడిని నేను ! నా మెడలో వేయి !’’ అంటూ గద్దించాడు ! అతనట్లా గద్దించడంతో కోపం , అసహ్యం కలిగాయి పూజారికి ! అందుకే భయపడకుండా ‘‘పాపాత్ముడా ! ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసావు ! ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ధర్మశాస్తా అయ్యప్పస్వామిని శరణు వేడుకో ! నిన్ను మన్నించి సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ పరబ్రహ్మ , జ్యోతిరూపుడు’’ అంటూ హితవు చెప్పాడు.
🌿ఆ మాటలకు మరింత కోపంతో కళ్లనుండి నిప్పులు కురిపించాడు ఉదయనుడు ! ‘‘నాకు ఎదురు చెప్పే సాహం చేస్తావా , ముసలి బ్రాహ్మణుడా ! ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను చూడు !’’ అంటూ కత్తిని చర్రున దూసి పూజారి కడుపులో బలంగా గుచ్చాడు ఉదయనుడు ! ‘‘హా ! అయ్యప్పా ! స్వామియే శరణం!’’ అంటూ నేలకొరిగిపోయాడు పూజారి ! ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయాయి.
‘హా.. హ.. హ ! నాకే చెప్పే సాహసం చేస్తాడా ! తగిన శిక్ష విధించాను అనుకుంటూ అక్కడ వున్న పూజా ద్రవ్యాలన్నిటిని చిందరవందరగా విసిరేసి స్వామి విగ్రహాన్ని పెకలించి ప్రక్కకు విసిరేసి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఉదయనుడు !
🌸 ‘‘ఏమిటి ! ఉదయనుడు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడా ? పూజారిని చంపి గుడిని ధ్వంసం కావించాడా ? ఎంతటి ఘోరానికి సిద్ధపడ్డాడు ! ఎట్లా వాడి దుండగాలను అరికట్టడం ? ఎవరు ఆ కార్యం చేయగలరు ? అయ్యప్ప స్వామే పూనుకుని వాడిని అంతం చేయాలి ! ఆ స్వామిని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగింది !’’ అంటూ తమ పూజా గృహంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కరించి ధ్యానించాడు పంబరాజు !
🌹‘‘తేజో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్ప శరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రాభయం
బిభ్రాణాంకరపంకజైర్ మదగజ స్కంధాది రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం!’’ 🌹
🌷 (తేజోమండల మధ్యలో దివ్యాభరణాలతో , పట్టువస్త్రాలతో అలంకరింపబడి మూడు నేత్రాలతో ప్రకటితమై హస్తాలలో పుష్పం , చెరుకుగడ, శరాలు , విల్లు , మాణిక్య పాత్ర ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ , శతృవులను సంహరించడానికి మత్తగజాన్ని అదిరోహించి వస్తున్న ధర్మశాస్తా అయ్యప్ప స్వామిని మూడు లోకాలను తన దివ్య మోహన రూపంతో సమ్మోహితులను కావించే స్వామిని ఎల్లప్పుడూ భజిస్తూ వుంటాను)🌷
🌿 ఆయన మనోనేత్రం ముందు కదలాడిన దివ్యరూపాన్ని చూస్తూ పరవశించిపోయాడు ! ‘‘హే జ్యోతిరూపా ! పందళరాజకుమారుడివి నీవు ! ఈనాడు ఈ దుస్థితి నీ రాజ్యానికి ఉదయనుడనే దుర్మార్గునివల్ల సంభవించింది ! మా మీద దయతో అతడిని వధించి మమ్మల్ని కాపాడు ! మహిషి సంహారం కోసం అవతరించిన నీవు తిరిగి నీ భక్తులను ఉద్ధరించడానికి తరలిరా తండ్రీ !’’ అంటూ ప్రార్థించాడు !
🌸రాజు ప్రార్థన స్వామిని చేరింది ! అందుకే శాంత గంభీర స్వరంతో పలికాడు ! ‘‘రాజా ! ఉదయనుడి కాలం తీరడానికి మరికొంత వ్యవధి ఉన్నది ! ప్రస్తుతం కలిపురుషుని ప్రభావంతో అతడు కావిస్తున్న దుష్కర్మలు అంతం కావించడానికి త్వరలోనే నేను తిరిగి నీ వంశంలోనే అవతరిస్తాను !
🌿రాజా ! మరికొద్దికాలంలో నీ దగ్గరకు ఒక బ్రాహ్మణ కుమారుడు వస్తాడు ! అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం కావించు !’’ ఆ పలుకులు అమృతపు జల్లులా కురిసాయి రాజు కర్ణపుటాలలో ! ‘‘మీరు చెప్పినట్లే కావిస్తాను ! నా మీద ఎంతటి కరుణ చూపావు తండ్రీ ! నీకు నా కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ అంజలి ఘటించాడు రాజు !
🌸‘‘జయవర్థనా ! లే ! వెంటనే బయలుదేరి పంబల రాజ్యానికి వెళ్లు ! అన్న పలుకులు స్పష్టంగా వినపడటంతో చప్పున లేచి కూర్చున్నాడు జయవర్థనుడు !
ఉదయనుడి నుండి తప్పించుకొని పరుగు తీసిన పూజారి కుమారుడు ఎట్లాగో మణికంఠుడు పులిపాలకోసం వచ్చిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నాడు !
🌿ఆ ప్రాంతమంతటా స్వామి సంచరించినది కావడంతో పవిత్రమైంది ! దేవతల ప్రార్థనతో స్వామి విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ‘పొన్నంబలమేడు’ గా పిలువబడుతూ ఆటవికుల నివాస స్థానమై వుంది జయవర్థనుడు అక్కడకు చేరిన సమయంలో ! ఆ పవిత్ర స్థానంవైపు ఉదయనుడు రాలేకపోవడానికి స్వామి మహిమే కారణంగా భావిస్తూ సురక్షితంగా అక్కడివారితో కలిసి కాలం గడుపుతూ వున్నాడు జయవర్థనుడు !
🌸అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచాయి ! తనను ప్రబోధించినదేవరై వుంటారా అనుకుంటూ లేచి ఆశ్రమం బయటకు వచ్చాడు జయవర్థనుడు ! ఇంకా బ్రాహ్మీముహూర్తం కాలేదు ! ‘పంబలరాజ్యానికి వెళ్లమంటున్నదెవరు ? వెళ్లి ఏం చేయాలి ?’ అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు ! ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది ! తేజోమండల మధ్యంలో పులిమీద ఆసీనుడై వున్న అయ్యప్పస్వామి దర్శనమిచ్చాడు !
🌿 ‘‘జయవర్థనా ! నీవు పంబల రాజ్యానికి వెళ్లి ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కుమార్తెను వివాహంచేసుకోవలసి వున్నది ! నీకు నీ తండ్రికి నాపట్లగల నిర్మలమైన భక్తి విశ్వాసాలకు ప్రసన్నుడినైనాను ! అందుకే నీకు పుత్రుడిగా అవతరించాలని సంకల్పించాను. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరు ! అన్న ఆదేశం వినడంతో ఆనందంగా పందల రాజ్యం వైపు సాగిపోయాడు జయవర్థనుడు !
🌸‘‘మహారాజా ! మహారాజా ! ఎవరో యువకుడు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ! పంపమంటారా ?’’ పరిచారిక తెచ్చిన వార్త భయాందోళనలతో సతమతవౌతున్న రాజులో ఆనందాన్ని నింపింది !
స్వామి చెప్పిన యువకుడి రాకకోసం ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తుండగానే కొన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి ! ఉదయనుడు ఇతర రాజ్యాలమీదకు దండయాత్రలు సాగిస్తుండటంతో పంబల రాజ్యం వైపు రాకపోవడం కొంతవరకు ఊరట కలిగించినా , ఎప్పుడు వచ్చి విరుచుకుపడతాడోనన్న భయంతోనే కాలం గడుపుతున్నారు రాజు , ప్రజలు !
🌿 వాళ్ళు భయపడుతున్నట్లుగానే స్వయంగా ఉదయనుడే దండెత్తి రాకపోయినా అతని వద్దనుండి వచ్చిన వర్తమానం రాజును సంకటంలో పడేసింది ! ‘‘రాజా ! నీ కుమార్తె అందచందాల గూర్చి ఈమధ్యే విన్నాను ! ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ! కొద్ది రోజుల్లో వస్తున్నాను ! వివాహానికి ఏర్పాట్లు కావించిసిద్ధంగా ఉండు !’’ ఉదయనుండి వ్రాలు ! అని అతడు వ్రాసి పంపిన సందేశం రాజు కుటుంబంలో కలవరాన్ని రేకెత్తిచింది !
🌸 ‘స్వామీ ! ఏమిటీ విపరీతం ! మీరు సెలవిచ్చిన బ్రాహ్మణ కుమారుడి జాడ లేదు. ఈ దుర్మార్గుడి నుండి ఇటువంటి వార్త వచ్చి పడింది ! నాకేమి చేయాలో తోచడంలేదు ! అయ్యప్పా ! నీదే భారం !’’ అంటూ ఏం చేయాలో తోచని పరిస్థితిలో సతమతవౌతున్న రాజు పరిచారిక తెచ్చిన వార్త విని సంభ్రమాశ్చర్యాలతో లేచి యువకునికి ఎదురువెళ్ళాడు ! సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపాడు !
🌿 ‘‘కుమారా ! నీ కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాము ! ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది ! ఇక మాకే చింతా లేదు ! ఆ దుర్మార్గుడు ఉదయనుడి బారి నుండి మమ్మల్ని కాపాడాల్సిన భారం నీదే’’ అన్న రాజు మాటలకు చిన్నగా నవ్వాడు జయవర్థనుడు ! ‘‘అంతా అయ్యప్పస్వామి సంకల్పం ప్రకారమే జరుగుతుంది ! నన్ను మీ కుమార్తెను వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించి పంపారు స్వామీ !’’ అన్నాడు.
🌸 ‘‘అవును ! మాకు అటువంటి ఆదేశమే ఇచ్చారు స్వామి ! మీకు మా కుమార్తెను ఇచ్చి వెంటనే వివాహం జరిపిస్తాను ! ఎందుకంటే ఆ ఉదయనుడు ఏ క్షణంలోనైనా ఇక్కడకు రావచ్చును !’’ అంటూ అప్పటికప్పుడు ఏ ఆడంబరాలు లేకుండా అయ్యప్పస్వామి విగ్రహం ముందరే తన కుమార్తె శశికళను జయవర్థనుడికిచ్చి వివాహం జరిపించాడు !
🌿 ‘‘ఇక మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి అనుమతినివ్వండి మహారాజా ! ఆ ప్రాంతం అయ్యప్పస్వామి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కావడంతో అటువైపు ఆ దుర్మార్గుడు రాలేడు !’’ అన్నాడు జయవర్థనుడు భార్యా సమేతంగా వెళ్లడానికి సిద్ధమై ! ‘‘అవును ! త్వరగా మీ ప్రాంతానికి చేరుకోవడమే మంచిది ! వెళ్లిరండి ! స్వామి దయతో సర్వశుభాలతో సంతోషంగా జీవించండి’’ అంటూ ఆశీర్వదించి వాళ్లు వెళ్లిపోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు రాజు తేలిక పడిన హృదయంతో.
🌸 ‘‘ఏమిటి? నీ కుమార్తెకు ఎప్పుడో వివాహమైపోయిందా ? ఆమె నీ భవనంలో లేదా ? రాజా ! నీవు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు ! ఆమెనెక్కడో దాచి నా కంటబడకుండా చేసావు గదూ ? నిన్ను తేలిగ్గా వదిలిపెట్టను !’’ కోపంగా రాజును కొరడాలతో కొట్టించి కసి తీరక కారాగారంలో బంధించివేశాడు ఉదయనుడు !
🌿రాజభవనమంతా వెతికించి రాకుమార్తె కనబడకపోడంతో నిరాశ కోపం ఆపుకోలేక అక్కడ అంతా ధ్వంసం చేసి పరివారాన్ని చంపివేసి తన ప్రతినిధులను రాజ్యపాలనకు నియోగించి వెళ్లిపోయాడు ఉదయనుడు !.. సశేషం.. 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻

No comments:
Post a Comment