శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 24 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు !
అయ్యప్ప లేచి ‘‘సెలవు భక్తులారా !’ అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు ! ఒక దివ్య
జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది ! ‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు ! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా ‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్పా ! మా నమ్మకం నిజమని నిరూపించావు ! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు ! నీకు కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ నమస్కరించారు !
🌸అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం ! స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు ! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)
🌹అభిషేకాలు - వాటి ఫలితాలు🌹
🌿పాలాభిషేకం - యశోవృద్ధి
పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం , మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
తేనె అభిషేకం - సిరిసంపదలు , తరగని ఐశ్వర్యం కలుగుతాయి
చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
పంచామృత అభిషేకం (పాలు , పెరుగు , నెయ్యి , తేనె , పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్తిభావం మనస్సులో స్థిరమౌతాయి !
🌸ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి !
గంథంతో అభిషేకం - పుత్రలాభం , స్వర్గభోగాలు లభిస్తాయి
భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి , ఆరోగ్యాభివృద్ధి
🌿సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి , శతృవులపై విజయం
శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి , సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం , పాపనివృత్తి లభిస్తాయి.
నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ , శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
🌸పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు ! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
🌹అయ్యప్పస్వామి భజన
"పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే -
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వామికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా - అయ్యప్పా స్వామియే !! "🌹
🌿 భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ - మంగళ హారతి గానం చేశారు.
🌹అయ్యప్ప స్వామి హారతి🌹
🌹"ఓం ఓం ఓంకార రూపునకు
మంగళం జయమంగళం
నాద బిందు కళాతీత
గురుమూరితకి మంగళం జయ మంగళం
మందహాస భక్తవరదునకు
మంగళం జయమంగళం
పూర్ణాపుష్కళ నాధునకు ,
భూతనాథునకు మంగళం జయమంగళం ! " 🌹
🌸 హారతి అందరూ భక్తిగా కళ్లకద్దుకున్నారు ! తీర్థ , ప్రసాదాలు స్వీకరించారు ! అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని , కళ్ళు మూసుకుని అయ్యప్ప ధ్యానంలో నిమగ్నమై వుండిన వావరు , కొచ్చుకడత్త , కరప్ప , మల్లన్ , విల్లన్‌లు ఒక్కసారిగా లేచి ‘‘స్వామియే శరణం ! మిత్రా ! నిన్ను విడిచి ఇక మేము వుండలేము ! మమ్మల్ని నీలో చేర్చుకో స్వామీ !’’ అని పెద్దగా అంటూ నేలపై ఒరిగిపోయారు ! వారి జవాత్మలు విడుదలై పరమాత్మలో విలీనమైనాయి ! అందరూ ఆ హఠాత్పరిణామానికి ముందు నిర్ఘాంతపోయినా కొద్దిసేపటికి తేరుకున్నారు ! పూజారులు ఈ విధంగా చెప్పారు !
🌹నవవిధ భక్తులు🌹
🌿‘ఈ నలుగురు అయ్యప్పకు ఆప్తమిత్రులు ! ఆ స్వామిని మిత్రునిగా భావించి ఎప్పుడూ ఆయన దగ్గరే వుండాలని ఆశించడం కూడా భక్తి మార్గాలలో ఒకటి ! ప్రజలారా ! మీ అందరికీ తెలుసో లేదో మరి ! మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ! భగవంతుని ఆరాధించి ఆ స్వామిని చేరుకోవడానికి నవ విధ (తొమ్మిది) భక్తి మార్గాలలు పురాణాలలో చెప్పబడ్డాయి.
🌸 వాటిలో సఖ్యత్వం (స్నేహం , మైత్రి) ఆ స్వామిని సేవించడం ఒక మార్గం ! పూర్వం విభీషణుడు , సుగ్రీవుడు స్వామితో మైత్రి చేసి ఆ మార్గాన తరించారు !
మిగిలిన ఎనిమిది మార్గాల గూర్చి చెబుతాము , వినండి !
🌿శ్రవణం (వినడం) ద్వారా భగవంతుని ఆరాధించవచ్చును ! భగవంతుని గూర్చి , ఆ స్వామి లీలల గూర్చి పెద్దలు చెబుతుంటే వినడం ద్వారా భక్తిభావం హృదయాలలో బలపడి ఆ మార్గాన స్వామిని సేవించడం జరుగుతుంది !
🌸 పరీక్ష్మిన్మహారాజు వారం రోజులపాటు భాగవత పురాణాన్ని విని తరించిన విషయం మీకందరికీ తెలుసు కదా ! దాస్యం (సేవ చేయడం కింకరునిలాగా) భగవంతుని సేవించడం ఎంతటి పుణ్య ప్రదమో దాసాంజనేయస్వామి లోకాలకు తాను స్వయంగా ఆచరించి తెలియచెప్పాడు ! ‘నన్ను నీ కింకరునిగా (సేవకునిగా) స్వీకరించు , వేరే ఏమీ అవసరం లేదు ’ అని వేడుకుంటూ స్వామిని చేరుకోవడం ఒక భక్తిమార్గం !
🌿వందనం - నమస్కరించడం కూడా ఒక భక్తిమార్గమే ! పదే పదే నమస్కరిస్తూ ధ్యానించడంవల్ల భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది !
🌸అర్చనం - షోడోపచారాలతో అర్చించడం మీదే భక్తిమార్గాన్ని సామాన్యంగా భక్తులందరూ అనుసరిస్తుంటారు !
🌿సంకీర్తనం - స్వామి లీలలను పాడుతూ తరించడం ! దీన్ని భజన అని కూడా అంటారు ! స్వామి మీద పాటలు రాసి , వాటిని పాడుతూ , వాటిలో తాదాత్మ్యం చెందిన ఆనందానుభూతిని పొందడం ఒక భక్తి మార్గంగా చెప్పబడింది !
🌸పాదసేవనం - స్వామి పాదాలను వత్తుతూ ఆనందానుభూతి చెందడం ! ఆ భాగ్యం అందరికి సులభంగా లభించేది కాదు ! అయినా భక్తి మార్గంలో ఆ విధంగా పాదసేవనం చేస్తున్నట్లు అనుభూతి చెందవచ్చును ! ఇది ఒక మార్గం ! పరమ భాగోవోత్తములు అనుసరించేది !
🌿స్మరణం - ఎల్లప్పుడూ స్వామి నామాన్ని స్మరిస్తూ (ద్యానిస్తూ) వుండటం వల్ల భగవదనుగ్రహం లభిస్తుంది ! ‘నామస్మరణ ధన్యోపాయం’ (నామస్మరణ జన్మ ధన్యత్వం పొందే ఉపాయం) అని చెప్పబడింది ! అందుకే నిరంతరం అయ్యప్ప నామస్మరణ చేస్తూ వుండటంవల్ల క్రమంగా ఆ భక్తి మార్గం మిమ్మల్ని స్వామి సన్నిధికి చేరుస్తుంది !
🌸ఆత్మ నివేదనం - జీవాత్మను పరమాత్మకు నివేదన చేయడం భక్తి పరాకాష్టను తెలుపుతుంది నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను ! నాకు ఏ కోర్కెలు లేవు ! నన్ను నీలో ఐక్యం చేసుకో ! అని ఎప్పుడైతే నిర్మలమైన మనస్సును స్వామికి అర్పణ కావిస్తారో వాల్లను తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు !
🌿 ఈ విధంగా స్త్రీలు ఆత్మ నివేదన చేయడాన్ని ‘మధురభక్తి’ మార్గమని గూడా అంటారు !
స్త్రీ రూపంలోని జీవాత్మను పురుష రూపంలో ఊహించుకుంటూ ఆత్మనివేదన చేసి ముక్తి పొందడానికి గోపికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును ! వాళ్లు నిర్మల హృదయాలతో శ్రీకృష్ణునిలో తాదాత్మ్యం చెందాలని కోరుకున్నందువల్ల వాళ్లందరికి ముక్తిని అనుఘ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ !
🌸భక్తులారా ! మీకు సందర్భం వచ్చింది గనుక నవ విధ భక్తుల గూర్చి తెలియజెప్పాము ! ఈ నలుగురు సఖ్య భక్తిమార్గంలో అయ్యప్పస్వామిలో ఐక్యమైనారు ! వాళ్లు ధన్యజీవులు ! వీళ్లకు దహన సంస్కారాలు కావించి పంపా నదిలో తర్పణాలు విడవండి ! మీరందరూ మీకు అనుకూలమైన మార్గాలలో అయ్యప్పస్వామిని ఆరాధించి ధన్యులు కండి !
🌿పూజారులు చెప్పిన విషయాలను ఏకాగ్రతతో , భక్తిశ్రద్ధలతో విన్నారు రాజులు , ప్రజలు గూడా !
‘‘మా నాయకులే మాకు ఆదర్శం ! మేమూ అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆ స్వామిని దర్శించడానికి దీక్షాధారులమై వస్తాము ! మా నాయకులకు కూడా ఎప్పటికి గుర్తు వుండేలా గుడులు నిర్మించి పూజించుకుంటాము !’’ అన్నారు వావర్ అనుచరులు ఆవేశంగా !
🌸 ‘‘అవును ! మంచి ఆలోచన ! ఆలాగే చేద్దాము !’’ అన్నారు పంబల , పాండ్య రాజులు. అందరూ అయ్యప్ప స్వామి విగ్రహానికి మరొకసారి నమస్కరించి , స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని తిరుగు ప్రయాణమైనారు ! ఆలయానికి కొద్ది దూరంలో అయ్యప్ప చెప్పగా ఆయుధాలు వుంచిన అశ్వత్థ వృక్షాన్ని సమీపించారందరూ !
🌿‘‘తంత్రి స్వాములారా ! మీరు ప్రతిరోజూ అయ్యప్ప విగ్రహన్ని పూజార్చనలతో సేవించే భాగ్యాన్ని పొంది ధన్యులైనారు ! స్వామి సైనికులను ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఆయుధాలు వుంచమనడంతో కారణమేమైనా వుంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్మా’’ అడిగాడు పంబలరాజు అంతవరకు తమను వీడ్కొలుపడానికి వచ్చిన పూజారులనుద్దేశించి ! ‘
🌸‘మహారాజా ! ఆయుధాలను రజోగుణం గలవారు ఇతరులకు హాని కలిగించటానికి వాడుతారు ! అటువంటివాటికి తన దగ్గర స్థానం లేదనీ , వాటిని విడిచి తననే నమ్మి తన సన్నిధికి రావలసి వుంటుందని తెలియచెప్పారు. అయ్యప్పస్వామి ! అంతేగాక అశ్వత్థ వృక్షం మహావిష్ణు ప్రతిరూపంగా చెప్పబడింది ! అందుచేత ఆ వృక్ష సమీపంలో విడివడటంవల్ల ఆయుధాలు పవిత్రతను పొంది ఇతరుల రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతాయి !
అశ్వత్థ వృక్షం యొక్క మహిమ గూర్చి బ్రహ్మాండ పురాణంలో వివరంగా తెలుపబడింది ! ఆ విషయాలు చెబుతాము ! వినండి !’’ అంటూ చెప్పసాగారు పూజారులు !
🌹అశ్వత్థ వృక్ష మహిమ🌹
🌿అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) పరమ పవిత్రమైనది ! మహావిష్ణువు దాల్చిన వృక్ష రూపం. త్రిమూర్తులకు సంకేతం అశ్వత్థ వృక్షం ! ఈ వృక్షం మూలంలో బ్రహ్మ , మధ్యలో మహావిష్ణువు , పైభాగంలో పరమేశ్వరుడు వుంటారు !

🌸త్రిమూర్తులు వృక్షం యొక్క ఉత్తర , దక్షిణ , పడమర దిక్కులలోని కొమ్మలలోనూ , ఇంద్రాది దేవతలు తూర్పు దిక్కున వుండే కొమ్మలలోనూ వుంటారు ! సప్త సముద్రాలు , పుణ్యనదులు కూడా తూర్పు వైపు కొమ్మలలోనే వుంటాయి !
🌿 చెట్టుమూలంలో వేర్లలో మహర్షులు , గోబ్రాహ్మణులు , నాలుగు వేదాలు వుంటాయి ! ఇంతేగాక వృక్షమూలంలో ‘అ’కారము , కాండలో ‘ఉ’కారము , ఆకులు పండ్లలో ‘మ’కారము లీనమై వుండి ప్రణవ స్వరూపం (ఓం)గా కూడా చెప్పబడింది ! అశ్వత్థ వృక్షం అందుకే అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పూజింపబడుతున్నది ! అశ్వత్థ వృక్షమూలంలో శుభ్రమైన నీటి ని పోసి , ప్రదక్షిణ నమస్కారాలు మూడుసార్లు చేయాలి ! ‘అశ్వత్థ నారాయణ నమః’ అని ధ్యానిస్తూ పాలను మూలంలో పోసి , పసుపు , కుంకుమలు అర్చించాలి !
🌸ప్రతి శనివారం ఈ విధంగా పూజించి , చెట్టును తాకి కళ్లకద్దుకోవాలి ! మృత్యుంజయ మంత్రం పఠించడంవల్ల అపమృత్యుభయం తొలగిపోతుంది ! ఆపదలు , ప్రమాదాలు పరిహరింపబడుతాయి !
🌹మృత్యుంజయ మంత్రం🌹
‘‘త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనమ్ఉ
ర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
🌿 సంతాన భాగ్యం కోరేవారు ఆ సంకల్పం చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు (పదకొండుసార్లు) చేయడంవల్ల కోరిక సిద్ధిస్తుంది ! అశ్వత్థ వృక్షం మూలంలో దారిద్య్రానికి అధిదేవతయైన జ్యేష్ఠా దేవి కూడా వసిస్తూ వుంటుందని పురాణాలలో తెలుపబడింది ! ఇందుకు సంబంధించిన కథనం
వివరణ...సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞

No comments:
Post a Comment