శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 26 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿 ఇప్పటికీ ఈ మార్గాన చాలామంది భక్తులు పంబా నదీ తీరాన్ని చేరుకుంటున్నారు. అడవి మార్గాన సుమారుగా 50-60 కి.మీ నడవవలసి వుంటుంది ! అడవి మార్గాన కాకుండా వాహనాలమీద ప్రక్కగా వుండే రహదారి మార్గాన (చిన్నపాదం) కూడా భక్తులు పంబానదీ తీరాన్ని చేరి ఆ రోజుకు అక్కడ విశ్రమిస్తారు ! (అక్కడ నుండి 6 కి.మీ మార్గం నడిచి కొండ ఎక్కి సన్నిధానం చేరుకుంటారు)
🌹పంబానది:🌹
🌸పంబ అంటే పాపవినాశిని అని అర్థం ! దక్షిణదేశపు గంగానదిగా ప్రఖ్యాతిగాంచింది ఈ పంబానది ! ‘దక్షిణ గంగ’ అని కూడా పిలువబడుతున్నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదీ జలాలలో స్నానం శరీరానికి , మనసుకు శాంతిని , ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది !
🌿 పాపవినాశిని గనక భక్తులు ఈ నదీ స్నానం చేయడంవల్ల వారిలోని రజోతమోగుణాలు నశిస్తాయనీ , సాత్విక గుణం మాత్రం కలిగి వుంటారనీ చెప్పబడింది ! శ్రీరామచంద్రుడు కూడా వనవాస కాలంలో ఈ నదిలో స్నానం ఆచరించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది ! అందుకు గుర్తుగా పంబా తీరాన రాతి శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి !
🌸అయ్యప్పస్వామి శిశువుగా పంబళరాజుకు పంబాతీరానే దొరకటంవల్ల పంబా తీర దర్శనం , పంబా స్నానం పవిత్రంగా భావించబడుతున్నాయి !
🌹పంబాతర్పణం: 🌹
🌿అయ్యప్పస్వామి సైన్యాలకు , ఉదయనుడి సైన్యాలకు యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రక్కల ఎందరో సైనికులు మరణించడం జరిగింది ! చనిపోయినవారికి పంబా తీరానే పిండప్రదానం కావిస్తారు మిగిలిన సైనికులు అయ్యప్ప చెప్పడంతో ! పంబా నీటితో తర్పణాలు విడవటం , పిండ ప్రదానాలు చేయడంవల్ల పితరులకు సద్గతులు కలుగుతాయి. అనంతమైన పుణ్యం లభిస్తుంది ! భక్తులు తమ పూర్వీకులకు పిండప్రదానాలు కావిస్తారు , తర్పణాలు విడుస్తారు ! పంబానదిలో స్నానం ఆచరించి పవిత్రులౌతారు ! దీక్షాకాలంలో ధరించిన నల్లవస్త్రాలు విడిచి కొంతమంది సత్వగుణానికి చిహ్నమైన తెల్లని వస్త్రాలు ధరిస్తారు !
🌹పంబా సద్ది: 🌹
స్నానం, తర్పణాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ తీరాన ‘పంబాసద్ది’ అనే విందు భోజనం తయారుచేస్తారందరూ కలిసి ! ఇక్కడ కాయగూరలు , వంటసామగ్రి కట్టెలు , విస్తరాకులు మొదలైన సరుకులు అమ్మకానికి తీసుకువస్తారు ఆ ప్రాంతంవాళ్లు ! వాటిని కొనుక్కుని విందుభోజనం తయారుచేస్తారు ! ముందుగా ఇరుముడులు వుంచిన స్థలంలో ఒక విస్తరి వేసి అందులో వడ్డిన పదార్థాలన్నిటిని వుంచి అయ్యప్పస్వామికి నివేదన చేస్తారు !
🌸అందులో స్వామి భోజనం ఆరగించుతారని భక్తుల విశ్వాసం ! భక్తులందరూ స్వామి నామస్మరణ చేస్తూ తృప్తిగా భుజించిన తరువాత స్వామి కోసం వేసిన విస్తరాకును వేలం వేస్తారు ! ఆరోగ్యం , సంతానం , ఐశ్వర్యం మొదలైన కోరికలు తీరడం కోసం భక్తులందరూ ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటారు !
🌿అందరికంటే ఎక్కువ పాడిన భక్తుడు ఆకును స్వంతం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరగించటం జరుగుతుంది ! తరువాత ఆ ఆకును భక్తిశ్రద్ధలతో తలమీద వుంచుకుని పంబాతీరానికివచ్చి ఆకును నదిలో విడిచిపెట్టడంతో పంబాసద్ది కార్యక్రమం పూర్తవుతుంది !
🌹పంబావిళక్కు: 🌹
🌸విళక్కు అంటే దీపం అని అర్థం ! రాత్రి కాగానే చిన్న ఆకు దొన్నేలలో దీపాలు వెలిగించి నదిలో వదలిపెడతారు ! దీప జ్యోతులు మెల్లగా సాగిపోతూ నయనానందకరంగా కనిపిస్తాయి ! ఈ దీపాలు వదిలే కార్యక్రమాన్ని కన్నిస్వాములు చేస్తారు ! పంబా నదీ తీరంలో వున్న గణపతి , ఆంజనేయస్వాముల గుడులను దర్శించి కొబ్బరికాయలు కొట్టి యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించి రాత్రి పంబా తీరంలో విశ్రమిస్తారు !
🌹నాలుగవ రోజు ప్రయాణం: 🌹
🌿ఉదయాన్నె బయలుదేరి భక్తులు నీలిమల మార్గాన అప్పాచిమేడు చేరుకుంటారు ! ఇక్కడినుండి శబరిగిరి మీదకు ఎక్కటం ప్రారంభిస్తారు ! ముందుగా గిరికి రెండువైపులా వున్న లోయలలోకి భూతగణాల తృప్తికోసం బియ్యపు వుండలు విసురుతారు ! ఆ విధంగా చేయడంవల్ల అవి యాత్రకు ఆటంకం కలిగించవని భక్తుల విశ్వాసం !
🌹శబరిపీఠం: 🌹
🌸మార్గంలో ముందుగా వచ్చేది శబరిపీఠం ! ఈ ప్రాంతంలోనే అయ్యప్ప భక్తురాలు స్వామిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని , దర్శించి మోక్షప్రాప్తిని పొందింది ! తర్వాతికాలంలో పంబలరాజ వంశీయులు ఇక్కడ శబరి పేరుమీద విద్యాపీఠాన్ని ఏర్పర్చటం జరిగింది ! ఈ పీఠాన్ని దర్శించి ముందుకు సాగి ‘శీరం గుత్తి’ అనే ప్రాంతాన్ని చేరుకుంటారు.
🌹శీరంగుత్తి:🌹
🌿ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు ! శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు , శరీరం పరవశించిపోతాయి !
🌹స్వామి సన్నిధానం 🌹
🌸గర్భగుడిలోని స్వామిని ఎప్పుడెప్పుడు కన్నుల కరువుదీరా దర్శిద్దామా అన్న ఆత్రుత అందరూ దీక్షాధారులలో , భక్తులలో అధికమౌతుంటుంది ! ఒక వరుసలో శరణుఘోష చెప్పుకుంటూ తూర్పు నుండి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళే పద్ధెనిమిది పవిత్రమైన మెట్లును దీక్షాధారులు ఎక్కటం ప్రారంభిస్తారు.
🌹పదునెట్టాంబడి - పద్ధెనిమిది మెట్లు: 🌹
🌿ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి ! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం, ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి ! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు ! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
🌹పడిపూజ: 🌹
🌸ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు ! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది !
🌹మెట్లు ఎక్కటం:🌹
🌿మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి , మరోప్రక్క కడుత్తన్ స్వామి విగ్రహాలు ఉంటాయి ! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు ! మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , దంబం లనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి ! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి !
🌸తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును , చెవులతో విన్న పాపపు మాటలను , చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి ! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ , రజో , తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి !
🌿చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి ! ఈ విధంగా అష్టరాగాలను , పంచతత్వాల చేత జరిగే పాపాలను , త్రిగుణాలను విద్య , అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు.
🌸(ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు ! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం , మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగింది. 1985 ప్రాంతంలో)
🌿ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు !
🌹మూల విగ్రహం: 🌹
🌸మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి , నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి ! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహం ను దర్శించుకుంటారు ! మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో , పంచలోహ మూర్తిగా , చిన్ముద్రా , అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది ! అత్యంత మనోహరము , శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు . మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు ! ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు , పూజలు జరుగుతుంటాయి.
🌿ఆ దివ్యమంగళ స్వరూపుడు, భక్తుల పాలిట సులభ సాద్యుడు , అభయ ప్రదాయకుడు , ఆ శాస్తా రూపం లో ఇమిడి ఉన్న అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు ! అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
🌹మాలికాపురత్తమ్మ ఆలయం🌹
🌸మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి , మంజల్ మాతా పేరిట , దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది ! మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ , వారి కోర్కెలను తీర్చ వలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు , పసుపు , కుంకుమలు సమర్పిస్తారు !

🌿అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డలు ఋతుక్రమం సమయంలో స్త్రీలు వాడరాదు. పెళ్లికాని కన్యలు , మంచి భర్తకై ప్ర్రార్థించి , శబరిమల వెళ్ళు భక్తుల ఇరుముడులో తమ స్వహస్తాలతో వేసి , తమ కోర్కును వారు ఆ దేవాది దేవుడి కి చెప్పుకుంటారు. ఇరుముడిలో సమర్పిస్తారు. అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు...సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment