Adsense

Tuesday, September 17, 2024

తెలుగు వారి భోజనంలో ఏది ఏ వరుసలో తినాలి?

సాధారణంగా తెలుగు వారి భోజనం లో ఉసిరిగపచ్చడి,ముద్దపప్పు,రెండు కూరలు,ఊరగాయ,పులుసు,చారు,పచ్చడి,గారెలు,బూరెలు,అప్పడాలు,వడియాలు,పాయసం,పెరుగుపచ్చడి,పెరుగు ఉంటాయి.

ముందుగా ఉసిరిగ పచ్చడి తో భోజనం మొదలు పెడతారు. దీనికి కారణం పులుపు మరియు కారం నాలికలోని రుచిని ఆస్వాదించటానికి ఉండేటువంటి టేస్ట్ బడ్స్ ను ఆక్టివేట్ చేస్తాయి.

తర్వాత ముద్ద పప్పు పులుసు లేదా ఊరగాయ నంచుకుంటూ తింటారు.

మరికొందరు గారెలు నంచుకుంటూ ముద్దపప్పు అన్నంతింటారు. ఇంకొందరు గారెలు పులుసులో నంచుకుంటూ తింటారు.

తర్వాత కూరలతో అన్నం తింటారు.

ఆంధ్రుల అభిమాన వంటకం గోంగూర పచ్చడి ఉల్లిపాయతో తింటారు.

పాయసం తాగి గారెలు బూరెలు తింటారు.

పెరుగుపచ్చడిలో గారెలు నంచుకుంటూ, నేతిలో బూరెలుముంచుకుంటూ తింటారు.

వడియాలు, అప్పడాలు నంచుకుంటూ చారన్నం తింటారు.

ఆఖర్న నిమ్మకాయ ఊరగాయతో పెరుగుఅన్నంతిని భోజనాన్ని ముగిస్తారు.

ఉత్తరాంధ్రవాళ్లు పెరుగుఅన్నంలో అరటిపండు తింటారు.

కొంతమంది పెరుగన్నం తిన్నతర్వాత పాయసం తాగుతారు.

ఇదేరకంగా తినాలని రూలేమీలేదు, వారివారి అభిరుచిని బట్టి, భోజనాన్ని ఆస్వాదించే తీరును బట్టి వరుసక్రమం మారుతూ ఉంటుంది.


Monday, September 16, 2024

గణపతిబప్పా మోరియా అంటే ఏమిటి ? గణపతి ముందు గుంజిలు ఎందుకు తీస్తారు ?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ *మోరియా* అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి *మోరియా* అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రాలోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడి నుంచి మోరే గావ్ వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట.. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. *మోరియా* గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి *గణపతి బప్పా మోరియా*..అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు *గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా*.. అని మరాఠీ లో నినదిస్తాం.. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.



నిత్యజీవితంలో ఎన్నో దోషాలు కలుగుతాయి . మనకు తెలియకుండానే మనము పాపాలు చేస్తూ ఉంటాము .దీనివలన మనము చేసే కార్యాలకు విఘ్న ములు

ఏర్పడతాయి. గణపతి విఘ్న నివారకుడని మన అందరికీ తెలుసు మనము చేసిన చేసిన తప్పు లకు ప్రాయశ్చిత్తముగా ఆయన ముందు గుంజీలు తీసి మన జీవితంలో ఉన్న ఆటంక ములను నివారించాలని కోరుకుంటాం. కాబట్టే గణపతి ముందు గుంజీలు తీసే సంప్రదాయం ఉన్నది.





Saturday, September 14, 2024

ఎనిమిది ఆకారంలో నడవడం వలన శరీరానికి ఉపయోగాలు ఏమిటి?

శారీరక ప్రయోజనాలు:

🔅 బరువు తగ్గడానికి సహాయపడుతుంది.., ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల సాధారణ నడక కంటే ఎక్కువ కేలరీలు కాలతాయి,

🔅 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది…. క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి

🔅 వ్యాయామం పెరుగుతుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వలన చేతులు, కాళ్ళు మరియు కోర్ కండరాలకు వ్యాయామం లభిస్తుంది.

🔅 జాయింట్ల నొప్పిని తగ్గిస్తుంది….. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మోకాళ్ళు మరియు కీళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది,

🔅 శక్తిని పెంచుతుంది… క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి

🔅 సమతుల్యత మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల మెదడు మరియు శరీరం మధ్య సమన్వయం మెరుగుపడుతుంది.

🔅 మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది…. ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ లక్షణాలు తగ్గుతాయి.

🔅 నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది…. క్రమం తప్పకుండా ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల నిద్రలోకి జారుకోవడం సులభమవుతుంది

🔹🔹 ఎనిమిది ఆకారంలో ఎలా నడవాలి ?

🔹 ఖాళీ ప్రదేశంలో రెండు చిన్న వృత్తాలను ఎనిమిది ఆకారంలో ఉంచండి.

🔹 ఒక వృత్తం చుట్టూ కుడివైపు నడవండి.

🔹 రెండవ వృత్తం వద్దకు వచ్చినప్పుడు, ఎడమవైపు నడవండి.

🔹 మొదటి వృత్తం వద్దకు వచ్చినప్పుడు, దిశను మళ్లీ మార్చండి మరియు కుడివైపు నడవండి.

🔹 30 నిమిషాలు లేదా అలసిపోయే వరకు ఇలా కొనసాగించండి.

🔹 చేతులను సహజంగా ఊపుతూ, వేగాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోండి.

🔹 10-15 నిమిషాల పాటు ప్రారంభించండి క్రమంగా 30 నిముషాల వరకు సమయాన్ని పెంచుకోవచ్చు.

పెళ్లికి జాతకాలు చూసేటప్పుడు షష్ట-అష్టకాలు అంటే ఏమిటీ?

పెళ్లికి షష్ట-అష్టకాలు
వీడియో వీక్షించేందుకు పై లింక్ క్లిక్ చేయండి.