THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, March 22, 2025
menopause diet and meal plan
Friday, March 21, 2025
Menopause vaginal care
Thursday, March 20, 2025
WOMAN BEAYTY Natural BIG BREAST OIL - 100ML
"Reversible Microfiber Comforter | Extra Soft 220 GSM | All-Weather Single Bed (60x90 inches)"
Ethinic Cotton Kurtis
అతి పెద్ద రాయిని తొలచి నిర్మించిన ఆలయం ఇది.. దీన్ని ఎవరు కట్టారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు..!
కైలాష్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్నది. గుహ అంటే ఈ టెంపుల్ బయటకు కనపడదని కాదు. నిక్షేపంగా కనిపిస్తుంది.ఇది ఇటుకలతోనో, పెద్దపెద్ద రాళ్ళు పేర్చో కట్టిన కట్టడం కాదు.
అత్యంత ఆశ్చర్యం, సంక్లిష్టత కలిగిన ఈ మచ్చలేని ఏకశిలా ఆలయాన్ని క్రీశ 8 శతాబ్దం( 756-773)లో రాష్ట్రకూటులు నిర్మించారు. అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకురావాలంటే అప్పటిరోజులనుబట్టి కనీసం 200 సంలు కావాలి.
కానీ కేవలం 18సంలు మాత్రమే పట్టింది. 18 ఏళ్ళపాటు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలచి కైలాస్ టెంపుల్ కట్టారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి. అంటే రోజుకు 60 టన్నులు. రోజులో 12గంటలపాటు పని చేసారనుకున్నా గంటకు 5 టన్నుల రాయిని పెకిలించాలి. అది కూడా అడ్డదిడ్డంగా కాదు. ఆలయానికి కావలసిన షేప్లో చెక్కుతూ అంతరాయిని తీసేయాలి. ఇప్పుడున్న అంత అత్యాధునిక మిషనరీలు వాడినా గంటలో 5 టన్నుల రాయిని పెకిలించటం అసాధ్యం.
మరి అలాంటివాళ్ళు ఇంత ఘనకార్యాన్ని ఎలా సాధించారో వారికే తెలియాలి. ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ షేప్ లో ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయనిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. ఎక్కడికక్కడ డ్రైనేజ్, రహస్యమార్గాలు, బాల్కానీలు, అప్‌స్టైర్స్ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అన్నికూడా రాయితో చెక్కినవే. ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు.
ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు. వారు విశ్రాంతి లేకుండా 3 సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీ వాళ్ళు చేసింది కేవలం కొన్ని విగ్రహాలకు గాట్లు పెట్టడమే అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. ఏంవింతో గానీ కనీసం ఆలయంలోని గర్భ గుడిలో కూడా వెళ్ళలేకపోయాడు. మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో.ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు.
Wednesday, March 19, 2025
ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా..? జస్ట్ ఈ ట్రిక్‌తో హాయిగా ఉండొచ్చు.. ఇక నో టెన్షన్
చాలా సార్లు కారు ప్రయాణం కొంతమందికి సమస్యగా మారుతుంది. అలాంటి వారు వాంతులు చేసుకుంటారని కారులో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కారులోనే కాకుండా చాలా మంది బస్సుల్లో కూడా వాంతులు చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో వారు కారు గ్లాస్ మూసివేయడానికి కూడా ఒప్పుకోరు. దీని కారణంగా కారులో కూర్చున్న ఇతర వ్యక్తులు కూడా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించలేరు. మీ కారులో..
చాలా సార్లు కారు ప్రయాణం కొంతమందికి సమస్యగా మారుతుంది. అలాంటి వారు వాంతులు చేసుకుంటారని కారులో వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కారులోనే కాకుండా చాలా మంది బస్సుల్లో కూడా వాంతులు చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో వారు కారు గ్లాస్ మూసివేయడానికి కూడా ఒప్పుకోరు. దీని కారణంగా కారులో కూర్చున్న ఇతర వ్యక్తులు కూడా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించలేరు. మీ కారులో కూర్చున్న వ్యక్తులు కార్ మోషన్ సిక్‌నెస్ లేదా ఊపిరాడకుండా ఉన్నట్లయితే, ఈ ట్రిక్‌ని అనుసరించండి. దీని తర్వాత మీ ప్రయాణం హాపీగా సాగుతుంది. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో ‘మోషన్ సిక్ నెస్’ (Motion Sickness) అంటారు.
మీ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి:
మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో KineStop కార్ సిక్‌నెస్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్‌ని Google Play Store, Apple App Store రెండింటి నుంచి కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 5.8 రేటింగ్‌ను పొందింది. అలాగే లక్ష మందికి పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ చేసిన తర్వాత, మీరు మొబైల్ డిస్‌ప్లేలో చుక్కలు కనిపించడం ప్రారంభిస్తారు. ఈ వాహనాలు మోషన్ డిటెక్షన్‌తో వస్తాయి. అంటే కారు కదులుతున్నప్పుడు అవి కూడా అదే దిశలో కదులుతాయి. దీని కారణంగా కారులో ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఇది కారు కదలికతో పాటుగా కదులుతుంది. తద్వారా మీ దృష్టి ఈ చుక్కలపై ఉంటుంది. దీని తర్వాత మీకు కార్ మోషన్ సిక్‌నెస్, వాంతులు రావు.
ఐఫోన్ వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను చేయాలి:
ఐఫోన్ ఉన్న వ్యక్తులు పైన పేర్కొన్న యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికే ఈ ఫీచర్‌ని iOS 18లో పొందుతున్నారు. ఐఫోన్ సెట్టింగ్‌లు, యాక్సెసిబిలిటీకి వెళ్లి మోషన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత షో వెహికల్ మోషన్ క్యూస్ ఎంపికను ప్రారంభించండి.
కారు ప్రయాణం ప్రారంభించే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
కారు లేదా బస్సులో ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది ప్రయాణ సమయంలో మీరు వాంతులు అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. మీరు తేలికపాటి ఆహారాన్ని తినే బదులు భారీ ఆహారం తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరినప్పుడు చాలా వాంతులు అవుతాయి. దీని కారణంగా కారు కదలడం ప్రారంభించినప్పుడు అది సమస్యలను కలిగిస్తుంది. ఇది వాంతులు అయ్యే అవకాశాలను పెంచుతుంది.
ఇది కాకుండా, వాంతులు నివారించగల కొన్ని వస్తువులతో వెంట ఉంచుకోవాలి. మీరు మీ జేబులో నారింజ, లవంగాలు లేదా నల్ల మిరియాలు కూడా ఉంచుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు వాటిని తినవచ్చు. మీరు ప్రతిసారీ కారును ఆపి బయట గాలిని పొందాలి. కారులో మోషన్ సిక్‌నెస్‌తో బాధపడేవారు కారు ముందు సీటుపై కూర్చోవాలి. అయితే ప్రయాణ సమయంలో అల్లం, పిప్పరమెంట్ నమలడం వల్ల వాంతుల సమస్యను తగ్గించుకోవచ్చు.
పురుషుల్లో గైనికోమాస్టియా (Gynecomastia) అంటే..
అరటిఆకులో భోజనం ఆరోగ్యానికి మంచిదంటారు, ఎందుకు?
అరటి ఆకు ముందు భోజనం మిక్కిలి పరిశుభ్రమైనదిగా, శ్రేష్టమైనదిగా ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.
- అరటి ఆకులో భోజనం కఫము వాతములను హరిస్తుంది.
- బలమును, ఆరోగ్యమును ఎక్కువగా చేయను.
- శరీర కాంతిని పెంపొందిస్తుంది.
- ఆకలి దానితోపాటు, దంతములు యొక్క కాంతిని పెంపొందిస్తుంది.
- పైత్యంను శాంతింప చేస్తుంది.
- శ్లేష్మ వికార్లని, బాడీపెయిన్స్ ను తొలగిస్తుంది.
- క్రిమినాశకారి అని అంటారు.
అరిటాకులు అనేక వైద్య గుణాలు దొరుకుతాయని పెద్దలు తెలియజేసినారు. సామాన్యంగా అరటి ఆకును తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. సామాన్యంగా పచ్చని ఆకులలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది ఈ పదార్థము మానవుని ఆరోగ్యమునకు చాలా అవసరమైనది ఆకుపచ్చని అరటి ఆకులు భోజనం చేయడం వల్ల ఆకుపచ్చని పదార్థము ఆహారమునకు చేరి దేహా ఆరోగ్యమునకు సహాయకారిగా ఉండును. ఇంకా పేగులలో ఉన్న కెమికల్ నాశనం చేయను.
(స్నానము, భోజనము, తాంబూలం అనే పుస్తకంలోని సంగ్రహించడం జరిగినది) పోటో (గూగుల్ సౌజన్యం)
పచ్చకర్పూరంతో ఆరోగ్యానికి ఏమేమి లాభాలు ఉన్నాయి?
Pacha Karpuram ఇది అద్భుతమైన ఔషధ పదార్ధం ఇది తెల్లగా ఉండి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతూ ఉండే ఈ కర్పూరాన్ని ఆహార పదార్ధాలలో కూడా విరివిగా వినియోగిస్తారు. దీనిద్వారా మంచి టేస్ట్ మరియు సువాసనతో పాటు ఆరోగ్యానికి ఈ పచ్చ కర్పూరం ఎంతో మేలు చేస్తుంది.
మొత్తం 15 రకాల కర్పూరాలు
అయితే ఈ పచ్చ కర్పూరం రెండు రకాలుగా దొరుకుతుంది వాటిలో ఒకటి పచ్చ కర్పూరం అయితే రెండవది షాపుల్లో దొరికే పూజకి వాడే కర్పూరం. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది అంతేకాక కర్పూరాలు సుమారు 15రకాల వరకూ ఉన్నాయి.
సాదారణ కర్పూరం మరియు Pacha Karpuram మద్య తేడా
సాధారణంగా మనకు లబించే కర్పూరం అనేది హారతి కర్పూరం దీనిని టర్పెన్టైన్ ఆయిల్ నుండి ప్రోసెస్ చేసి దీనిని తయారు చేస్తారు. ఈ కర్పూరం “లారేసీ” అనే చెట్టు నుండి లబిస్తుంది.
Pacha Karpuram ఎలా తయారు చేస్తారు
ఇక Pacha Karpuram ఎలా తయారవుతుందో మీకు తెలుసా ఎంతో సువాసనను ఇచ్చే ఈ చెట్టు కొమ్మలు కాండం వద్ద కొన్ని గాట్లు పెట్టడం ద్వారా ఆ గాట్లలోంచి తెల్లని పాలు వంటి జిగురు పదార్ధం బయటికి వస్తుంది దానిని సేకరించి ఆర్గానిక్ పద్దతిలో దీనిని తయారు చేస్తారు.
దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇక సాధారణ కర్పూరం ఆహారంగా వాడకూడదు దీన్ని పలు రసాయనాల మిశ్రమంతో
తయారు చేస్తారు ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Pacha Karpuram తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చ కర్పూరం ఉపయోగాలు ఒకటి రెండు కాదు దీనితో అనేక అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి వాటిలో తలనొప్పి, జ్వరం, శరీరంపై గాయాలు, పిప్పిపన్ను, కీళ్ల నొప్పులు, తలలో పేలు, మొటిమలు, జుట్టురాలడం జలుబు, శీఘ్రస్కలనం, విరేచనాలు, మొటిమలు గుండెదడ వంటి మరెన్నో సమస్యలనుండి పచ్చ కర్పూరంతో నివారించుకోవచ్చు.
pacha karpuram
Pacha Karpuram Benefits in Telugu
- Pacha Karpuram పూజలు చేసిన తరువాత హారతి గా ఉపయోగిస్తారు అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా పచ్చకర్పూరం వెలిగించడం వల్ల ఇది ఒకరకమైన వాయువులను విడుదల చేస్తుంది. అవి మనం తీసుకునే ఆక్సిజన్ లోని వైరేస్ వంటి హానికారక బ్యాక్టీరియాలను సుద్ది చేస్తుంది.
- మోకాలి నొప్పి తో పాటు కీళ్లనొప్పులకు ఈ Pacha Karpuram పూర్వం నుండే వాడేవారు కొంచెం కొబ్బరి నూనెలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి కొద్దిగా వేడిచేసి దానిని మోకాళ్లు లేదా ఏదైనా నొప్పులపై రాస్తే వెంటనే నొప్పులు తగ్గుతాయి.
- పిప్పి పన్ను నొప్పితో బాధపడే వారు కొద్దిగా దూది తీసుకుని పచ్చకర్పూరం నూనెలో ముంచి దానిని పిప్పి పంటిపై ఉంచితే పిప్పి పంటి నొప్పి తగ్గుతుంది. అస్తమా మరియు శ్వాస సంబంధిత వ్యాదితో బాధపడేవారు పచ్చకర్పూరం వాడడం వల్ల ఉపసమనం లబిస్తుంది.
- శరీర దుర్గంధంతో బాధపడేవారు రోజూ స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి స్నానం చేస్తూ ఉన్నట్లయితే మంచి సువాసనతో మంచి రేఫ్రేష్ణర్ గా ఉంటుంది. చర్మ వ్యాదుల నుండి ఉపసమనం కూడా పొందవచ్చు.
- జ్వరంతో బాధపడుతున్న వారు కొంచే పచ్చ కర్పూరాన్ని నీటితో గందంలాగ తీసి నుదుటిన లేపనం చేసిన యెడల శరీర వేడి తగ్గుముఖం పట్టి జ్వరం తగ్గుతుంది.
- శరీరం ఐ వచ్చే రాషేష్ తో పాటు దురదలను ఈ Pacha Karpooram తో నివారించుకోవచ్చు.
- శరీరపై తగిలిన గాయాలనుండి రక్త స్రావం అవుతున్నట్లయితే దేశవాళీ స్వచ్చమైన ఆవినేయ్యి తీసుకుని దానిలో కొద్దిగా కర్పూరంలో వేసి కరిగిన తరువాత దానిని గాయాలపై లేపనం చెయ్యడం వల్ల రక్త స్రావం ఆగుతుంది.
- చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు అలాంటివారికి కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం కొద్దిగా పచ్చ కర్పూర తైలాన్ని పడుకునే ముందు నాలుగు చుక్కలు మంచం పై లేదా దిండుపై చల్లినట్లైతే దీని ప్రభావం వల్ల నిద్రకు అవసరమయ్యే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి త్వరగా నిద్ర పడుతుంది.
- తలలో పేలు సమస్యతో బాదపడుతున్న వారికి పచ్చకర్పూరం రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కొంచే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి కరిగిన తరువాత తల మాడుపై అప్లై చెయ్యడం వల్ల తలలోని పేలు క్రమంగా తగ్గుతాయి.
- జుట్టు విపరీతంగా రాలుతున్న వారు కొంచెం నోబ్బరినూనేలో కర్పూరాన్ని కరిగించి తలకు రాస్తుంటే మాడు చలవ చేసి ఒత్తిడిని దూరం చెయ్యడంతో పాటు కుదుల్లను గట్టిబరుస్తుంది.
భోజనం తర్వాత శతపావళితో ఆరోగ్యం
శతపావళి..అంటే భోజనం తరువాత వంద అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.*
*శతపావళి అంటే…*
*శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందినది. శత అంటే వంద, పావళి అంటే అడుగులు. వంద అడుగులు వేయడం అని అర్థం. భోజనం తరువాత నడవడం అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు. మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారం బాగా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు సూచించారు. శతపావళి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. దీని వల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.*
*భోజనం తరువాత నడిస్తే లాభాలు..*
*తిన్న తర్వాత అపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన వెంటనే జీర్ణ క్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవడం మొదలవుతుంది. భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.*
*మెరుగైన నిద్ర..*
*రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాలు పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.*
*డయాబెటిస్ అదుపులో..*
*టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక కచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ ను వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.*
*బరువు తగ్గేందుకు..*
*రాత్రి భోజనం చేసిన తర్వాత పావుగంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.*
*ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి. ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.*
Source:Facebook
ఈ ఆలయంలో నిరంతరం మంటలు వస్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్కడ ఉందంటే..?
ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి.
వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి ఆలయం కూడా ఒకటి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము.
మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. జ్వాలాముఖి ఆలయంను జ్వాలజి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వల్ల అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.
ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్నీ తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా, ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాల నిరంతరం వెలుగుతుండగా, ఆ జ్వాల సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు.
మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా… నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు. అయితే అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.
Dupatta set
Kurti pant set
Trending sparkle handwork look for festival
NEW BOLLYWOOD STYLE DRESS, NEW TREADING DRESS
పురుషుల్లో ఆండ్రోపాజ్ (Andropause) లక్షణాలు- జాగ్రత్తలు
మెనోపాజ్ లక్షణాలు, జాగ్రత్తలు
స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
కర్పూరంలో దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరంలో ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించావు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది.
చాలా రకాల సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అయితే మామూలుగా కొంతమంది ప్రతిరోజూ స్నానం చేస్తే మరి కొందరు రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసిన తర్వాత ఒక గంటలోపే ఆ తాజాదనం మొత్తం పోతుంది. నెమ్మదిగా చెమట వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన రాకుండా ఉండడం కోసం చాలామంది పెర్ఫ్యూమ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పర్ఫ్యూమ్ లు కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ స్థానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉండవచ్చు అని చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందట. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారు ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉందట. అలాగే గోరు వెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట , బలహీనత తగ్గుతాయట. మీరు చురుకుగా కూడా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుందట. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.
Tuesday, March 18, 2025
Tea: టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..
ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది.
అప్పటివరకు ఉన్న బద్ధకం తొలగిపోతుంది. కొందరు ఉదయాన్నే టీ తాగుతారు. మరికొందరు సాయంత్రం కూడా సేవిస్తూ ఉంటారు. అయితే టీ రుచికరంగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా వివిధ పద్ధతులు చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే.. మరికొందరు పాలు చిక్కగా ఉండాలని అంటూ ఉంటారు. అయితే టీ తయారు చేసే విధానంలో కూడా మార్పులు చేస్తే రుచికరంగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కామన్ గా కాకుండా ఈ రకంగా టీ చేయడం వల్ల కొత్త టీ ని చూస్తారని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ఎలా తయారు చేయాలంటే?
సాధారణంగా టీ తయారు చేసేటప్పుడు ముందుగా పాలు పోస్తూ ఉంటారు. ఆ తర్వాత టీ పౌడర్ వేసి మరి కోసేపటి తర్వాత తర్వాత పంచదార వేస్తారు. ఆ తర్వాత మొత్తం మరిగించి టీ ని తయారు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల టీ ఏ మాత్రం రుచికరంగా ఉండదని కొందరు ఉంటున్నారు. ఒకవేళ రుచికరంగా ఉన్న కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉండవని పేర్కొన్నారు. అయితే టీ ని ఇలా తయారు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. అది ఎలాగంటే?
ముందుగా స్టవ్ పై వేడి నీళ్లను మరిగించాలి. ఆ తర్వాత టీ పౌడర్ ను వేయాలి. ఈ రెండు మిశ్రమాన్ని కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత టీ పౌడర్ ముద్దలాగా అయిన తర్వాత వడగట్టాలి. అప్పుడు టీ పౌడర్ లోని చేదు వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ నీటినీ మరోసారి స్టవ్ పై ఉంచి మరిగిస్తూ అందులో పాలు పోయాలి. ఇలా కొద్దిసేపు మాత్రమే మొత్తం మిశ్రమాన్ని ఉంచాలి. ఈ రకంగా టీ తయారు చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందని కొందరు కుకింగ్ స్పెషలిస్టు చెబుతున్నారు.
పాలతో కలిపి టీ పౌడర్ ను మరిగించడం వల్ల టీ పౌడర్ లో ఉండే చేదు మొత్తం పాలతో కలిసిపోతుందని.. దీంతో టీ రుచి తేడా ఉంటుందని అంటున్నారు. అందువల్ల ముందుగా టీ పౌడర్ కలిపిన నీళ్లను మరిగించాలి. వీటిని వడగట్టిన తర్వాతనే పాలను కలపాలి. అప్పుడు టీ రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సందేహం చాలా మందికి ఇప్పటికే ఉంది. దీని కాసేటప్పుడు పాలు ముందుగా పోయాలా? లేదా చివరకు పోయాలా అనేది కొంతమంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల టీ రుచికరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో బ్రాండెడ్ టీ పౌడర్ తో పాటు మంచి పాలను కూడా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడే అనుకున్న విధానంలో టి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి టీ నీ బందువులు వచ్చినప్పుడు సరఫరా చేసి వారినిఆకట్టుకోవచ్చు.