Adsense

Monday, June 2, 2025

వాల్మీకి రామాయణం -15

పాయస విభాగం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న జననం. శ్రీ మహావిష్ణువులో అర్ధాంశ-రాముడు,
అతనిలో చతుర్థాంశ (1/8)- భరతుడు,
అర్ధాంశ (1/4) లక్ష్మణుడు, మరొక చతుర్థాంశ (1/8) - శత్రుఘ్నుడు, పాయసం పంచిన పరిమాణంలోనే అవతారాంశలు.


తనకు ఇచ్చిన పాయసభాగాన్ని కౌసల్య అందరికంటే ముందు భుజించింది. అందుకని అందరికంటే పెద్దవాడు రాముడు జన్మించాడు.

సుమిత్ర తనకు ఇచ్చిన పాయసభాగాన్ని (1/4) వెంటనే భుజించకుండా, మిగిలినదాన్ని మహారాజు ఎవరికి ఎలా ఇస్తాడో అని క్షణకాలం వేచిచూచింది.

ఈ లోగా తనకు అందిన భాగాన్ని (1/ 8) కైక భుజించింది అప్పుడు మిగిలిన భాగాన్ని కూడా (1/8) దశరథుడు సుమిత్రకు ఇవ్వగా రెండూ కలిపి చివరగా భుజించింది అందుకని ఇదే క్రమంలో భరతుడు (1/8) లక్ష్మణ (1/4) శత్రుఘ్నులు (1/8) జన్మించారు.
ఇదీ సాంప్రదాయికుల సమన్వయం)

రాముని జనన కాలం లో
అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.

వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి. గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది.

సూత వందిమాగధులకూ బ్రాహ్మణులకూ గోవిత్తసహస్రాలను దశరథుడు పంచిపెట్టాడు.

ఇంకా చాలామందికి చాలా బహుమతులు అందించాడు. ఆనందోత్సాహాలతో పదకొండు రోజులు గడిచాయి. పన్నెండవనాడు నామకరణ మహోత్సవం జరిగింది.

జ్యేష్ఠునికి రాముడని, కైకేయీపుత్రునికి భరతుడని, సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడూ అని వసిష్ఠులవారు నామకరణం చేసారు. జాతకర్మాదులు జరిపించారు.

పౌరజానపదులకూ బ్రాహ్మణులకూ దశరథుడు బ్రహ్మాండమైన విందు చేసాడు. రత్నరాశులు పంచిపెట్టాడు.

వీరిలో జ్యేష్ఠుణ్ని చూస్తే తండ్రికి చెప్పరాని ఆనందం కలుగుతోంది.
సర్వ ప్రకృతి ఆనందపరవశం అవుతోంది

నలుగురూ వేదవేదాంగాలను అభ్యసించారు.
ధనుర్వేదంలో నిష్ణాతులయ్యారు. సకలనీతిశాస్రాలూ అభ్యసించారు.

గజాశ్వరథ విద్యలు నేర్చారు. గురు శుశ్రూషారతులు,
పితృ శుశ్రూషారతులుగా దినదిన ప్రవర్ధమానులు అయ్యారు..

( స‌శేష‌ము )..

No comments: