Adsense

Showing posts with label badhrachalam temple. Show all posts
Showing posts with label badhrachalam temple. Show all posts

Sunday, April 18, 2021

రూ.5వేల టిక్కెట్ కొంటే భద్రాచలంలో ప్రత్యేక పూజ

 రూ.5వేల టిక్కెట్ కొంటే భద్రాచలంలో ప్రత్యేక పూజ



భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఈనెల 21న సీతారాముల కల్యాణం, 22న పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు అన్ని దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. రూ.5వేల కల్యాణం టిక్కెట్లు, రూ.1,116 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుకు వారి గోత్ర నామాలతో పూజ జరిపిస్తారు. రూ.5వేల టిక్కెట్ వారికి మిస్రీ ప్రసాదం, కుంకుమ, కల్యాణ తలంబ్రాలు, వస్ర్తములు, సచిత్ర కల్యాణ తంబ్రాలు రామాయణ పుస్తకం, రూ.1,116 టిక్కెట్ భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు, పోస్టు ద్వారా పంపిస్తామన్నారు. మీసేవ, టీ యాప్ ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని సూచించారు.

నిరాడంబరంగా నవాహ్నిక ఉత్సవాలు - భద్రాచలం సీతారాముల ఆలయంలో నవమి ఉత్సవాలకు అంకురార్పణ

 


భద్రచాలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య క్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం (17.4.2021) అంకురార్పణ చేశారు. ఉదయం ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య పవిత్ర గోదావరి నదీ గర్బం (500 నదులు కలిసిన) నుంచి జలాలను వెండి బిందెలో తీసుకొచ్చారు.  

నేడు (18.4.2021 - ఆదివారం) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ ధ్వజ పంట లేఖనం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న ధ్వజ స్తంభం వద్ద గరుడ పటాన్ని ఆవిష్కరిస్తారు.