THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, March 19, 2025
పురుషుల్లో గైనికోమాస్టియా (Gynecomastia) అంటే..
అరటిఆకులో భోజనం ఆరోగ్యానికి మంచిదంటారు, ఎందుకు?
అరటి ఆకు ముందు భోజనం మిక్కిలి పరిశుభ్రమైనదిగా, శ్రేష్టమైనదిగా ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది.
- అరటి ఆకులో భోజనం కఫము వాతములను హరిస్తుంది.
- బలమును, ఆరోగ్యమును ఎక్కువగా చేయను.
- శరీర కాంతిని పెంపొందిస్తుంది.
- ఆకలి దానితోపాటు, దంతములు యొక్క కాంతిని పెంపొందిస్తుంది.
- పైత్యంను శాంతింప చేస్తుంది.
- శ్లేష్మ వికార్లని, బాడీపెయిన్స్ ను తొలగిస్తుంది.
- క్రిమినాశకారి అని అంటారు.
అరిటాకులు అనేక వైద్య గుణాలు దొరుకుతాయని పెద్దలు తెలియజేసినారు. సామాన్యంగా అరటి ఆకును తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. సామాన్యంగా పచ్చని ఆకులలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది ఈ పదార్థము మానవుని ఆరోగ్యమునకు చాలా అవసరమైనది ఆకుపచ్చని అరటి ఆకులు భోజనం చేయడం వల్ల ఆకుపచ్చని పదార్థము ఆహారమునకు చేరి దేహా ఆరోగ్యమునకు సహాయకారిగా ఉండును. ఇంకా పేగులలో ఉన్న కెమికల్ నాశనం చేయను.
(స్నానము, భోజనము, తాంబూలం అనే పుస్తకంలోని సంగ్రహించడం జరిగినది) పోటో (గూగుల్ సౌజన్యం)
పచ్చకర్పూరంతో ఆరోగ్యానికి ఏమేమి లాభాలు ఉన్నాయి?
Pacha Karpuram ఇది అద్భుతమైన ఔషధ పదార్ధం ఇది తెల్లగా ఉండి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతూ ఉండే ఈ కర్పూరాన్ని ఆహార పదార్ధాలలో కూడా విరివిగా వినియోగిస్తారు. దీనిద్వారా మంచి టేస్ట్ మరియు సువాసనతో పాటు ఆరోగ్యానికి ఈ పచ్చ కర్పూరం ఎంతో మేలు చేస్తుంది.
మొత్తం 15 రకాల కర్పూరాలు
అయితే ఈ పచ్చ కర్పూరం రెండు రకాలుగా దొరుకుతుంది వాటిలో ఒకటి పచ్చ కర్పూరం అయితే రెండవది షాపుల్లో దొరికే పూజకి వాడే కర్పూరం. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది అంతేకాక కర్పూరాలు సుమారు 15రకాల వరకూ ఉన్నాయి.
సాదారణ కర్పూరం మరియు Pacha Karpuram మద్య తేడా
సాధారణంగా మనకు లబించే కర్పూరం అనేది హారతి కర్పూరం దీనిని టర్పెన్టైన్ ఆయిల్ నుండి ప్రోసెస్ చేసి దీనిని తయారు చేస్తారు. ఈ కర్పూరం “లారేసీ” అనే చెట్టు నుండి లబిస్తుంది.
Pacha Karpuram ఎలా తయారు చేస్తారు
ఇక Pacha Karpuram ఎలా తయారవుతుందో మీకు తెలుసా ఎంతో సువాసనను ఇచ్చే ఈ చెట్టు కొమ్మలు కాండం వద్ద కొన్ని గాట్లు పెట్టడం ద్వారా ఆ గాట్లలోంచి తెల్లని పాలు వంటి జిగురు పదార్ధం బయటికి వస్తుంది దానిని సేకరించి ఆర్గానిక్ పద్దతిలో దీనిని తయారు చేస్తారు.
దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇక సాధారణ కర్పూరం ఆహారంగా వాడకూడదు దీన్ని పలు రసాయనాల మిశ్రమంతో
తయారు చేస్తారు ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Pacha Karpuram తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చ కర్పూరం ఉపయోగాలు ఒకటి రెండు కాదు దీనితో అనేక అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి వాటిలో తలనొప్పి, జ్వరం, శరీరంపై గాయాలు, పిప్పిపన్ను, కీళ్ల నొప్పులు, తలలో పేలు, మొటిమలు, జుట్టురాలడం జలుబు, శీఘ్రస్కలనం, విరేచనాలు, మొటిమలు గుండెదడ వంటి మరెన్నో సమస్యలనుండి పచ్చ కర్పూరంతో నివారించుకోవచ్చు.
pacha karpuram
Pacha Karpuram Benefits in Telugu
- Pacha Karpuram పూజలు చేసిన తరువాత హారతి గా ఉపయోగిస్తారు అసలు దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా పచ్చకర్పూరం వెలిగించడం వల్ల ఇది ఒకరకమైన వాయువులను విడుదల చేస్తుంది. అవి మనం తీసుకునే ఆక్సిజన్ లోని వైరేస్ వంటి హానికారక బ్యాక్టీరియాలను సుద్ది చేస్తుంది.
- మోకాలి నొప్పి తో పాటు కీళ్లనొప్పులకు ఈ Pacha Karpuram పూర్వం నుండే వాడేవారు కొంచెం కొబ్బరి నూనెలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి కొద్దిగా వేడిచేసి దానిని మోకాళ్లు లేదా ఏదైనా నొప్పులపై రాస్తే వెంటనే నొప్పులు తగ్గుతాయి.
- పిప్పి పన్ను నొప్పితో బాధపడే వారు కొద్దిగా దూది తీసుకుని పచ్చకర్పూరం నూనెలో ముంచి దానిని పిప్పి పంటిపై ఉంచితే పిప్పి పంటి నొప్పి తగ్గుతుంది. అస్తమా మరియు శ్వాస సంబంధిత వ్యాదితో బాధపడేవారు పచ్చకర్పూరం వాడడం వల్ల ఉపసమనం లబిస్తుంది.
- శరీర దుర్గంధంతో బాధపడేవారు రోజూ స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి స్నానం చేస్తూ ఉన్నట్లయితే మంచి సువాసనతో మంచి రేఫ్రేష్ణర్ గా ఉంటుంది. చర్మ వ్యాదుల నుండి ఉపసమనం కూడా పొందవచ్చు.
- జ్వరంతో బాధపడుతున్న వారు కొంచే పచ్చ కర్పూరాన్ని నీటితో గందంలాగ తీసి నుదుటిన లేపనం చేసిన యెడల శరీర వేడి తగ్గుముఖం పట్టి జ్వరం తగ్గుతుంది.
- శరీరం ఐ వచ్చే రాషేష్ తో పాటు దురదలను ఈ Pacha Karpooram తో నివారించుకోవచ్చు.
- శరీరపై తగిలిన గాయాలనుండి రక్త స్రావం అవుతున్నట్లయితే దేశవాళీ స్వచ్చమైన ఆవినేయ్యి తీసుకుని దానిలో కొద్దిగా కర్పూరంలో వేసి కరిగిన తరువాత దానిని గాయాలపై లేపనం చెయ్యడం వల్ల రక్త స్రావం ఆగుతుంది.
- చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు అలాంటివారికి కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం కొద్దిగా పచ్చ కర్పూర తైలాన్ని పడుకునే ముందు నాలుగు చుక్కలు మంచం పై లేదా దిండుపై చల్లినట్లైతే దీని ప్రభావం వల్ల నిద్రకు అవసరమయ్యే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి త్వరగా నిద్ర పడుతుంది.
- తలలో పేలు సమస్యతో బాదపడుతున్న వారికి పచ్చకర్పూరం రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కొంచే కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి కరిగిన తరువాత తల మాడుపై అప్లై చెయ్యడం వల్ల తలలోని పేలు క్రమంగా తగ్గుతాయి.
- జుట్టు విపరీతంగా రాలుతున్న వారు కొంచెం నోబ్బరినూనేలో కర్పూరాన్ని కరిగించి తలకు రాస్తుంటే మాడు చలవ చేసి ఒత్తిడిని దూరం చెయ్యడంతో పాటు కుదుల్లను గట్టిబరుస్తుంది.
భోజనం తర్వాత శతపావళితో ఆరోగ్యం
శతపావళి..అంటే భోజనం తరువాత వంద అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. జీవనశైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.*
*శతపావళి అంటే…*
*శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందినది. శత అంటే వంద, పావళి అంటే అడుగులు. వంద అడుగులు వేయడం అని అర్థం. భోజనం తరువాత నడవడం అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు. మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారం బాగా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు సూచించారు. శతపావళి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. దీని వల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.*
*భోజనం తరువాత నడిస్తే లాభాలు..*
*తిన్న తర్వాత అపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన వెంటనే జీర్ణ క్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవడం మొదలవుతుంది. భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.*
*మెరుగైన నిద్ర..*
*రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాలు పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.*
*డయాబెటిస్ అదుపులో..*
*టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక కచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ ను వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.*
*బరువు తగ్గేందుకు..*
*రాత్రి భోజనం చేసిన తర్వాత పావుగంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.*
*ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి. ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.*
Source:Facebook
ఈ ఆలయంలో నిరంతరం మంటలు వస్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్కడ ఉందంటే..?
ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి.
వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి ఆలయం కూడా ఒకటి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుందనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము.
మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. జ్వాలాముఖి ఆలయంను జ్వాలజి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం జ్వాలాముఖి అనే హిందూ మత దేవతకు అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మవారు జ్వాలా రూపంలో ఉండటం వల్ల అమ్మవారికి జ్వాలాముఖి అనే పేరు వచ్చినది అని చెబుతారు. ఇక్కడ తొమ్మిది జ్యోతులు ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.
ఈ ఆలయంలో ఇలా తొమ్మిది జ్వాలలు ఎలాంటి సహాయం లేకుండా ఎలా వెలుగుతున్నాయనే విషయాన్నీ తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ ఆ మిస్టరీ ఏంటనేది ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట ఉండగా, ఆ గుంట పక్కన ఉన్న చిన్న రంధ్రం నుండి అరచేతి మందంతో ఒక జ్వాల నిరంతరం వెలుగుతుండగా, ఆ జ్వాల సతీదేవి యొక్క నాలుక రూపం అని చెబుతారు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించినవారు భంగపడకా తప్పలేదు.
మొగల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా… నిప్పుని ఆర్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తల్చుకుంటూ వెనుదిరగక తప్పలేదు. అయితే అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.
Dupatta set
Kurti pant set
Trending sparkle handwork look for festival
NEW BOLLYWOOD STYLE DRESS, NEW TREADING DRESS
పురుషుల్లో ఆండ్రోపాజ్ (Andropause) లక్షణాలు- జాగ్రత్తలు
మెనోపాజ్ లక్షణాలు, జాగ్రత్తలు
స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
కర్పూరంలో దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరంలో ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించావు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది.
చాలా రకాల సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అయితే మామూలుగా కొంతమంది ప్రతిరోజూ స్నానం చేస్తే మరి కొందరు రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసిన తర్వాత ఒక గంటలోపే ఆ తాజాదనం మొత్తం పోతుంది. నెమ్మదిగా చెమట వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన రాకుండా ఉండడం కోసం చాలామంది పెర్ఫ్యూమ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పర్ఫ్యూమ్ లు కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ స్థానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉండవచ్చు అని చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందట. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారు ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉందట. అలాగే గోరు వెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట , బలహీనత తగ్గుతాయట. మీరు చురుకుగా కూడా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుందట. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.
Tuesday, March 18, 2025
Tea: టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..
ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది.
అప్పటివరకు ఉన్న బద్ధకం తొలగిపోతుంది. కొందరు ఉదయాన్నే టీ తాగుతారు. మరికొందరు సాయంత్రం కూడా సేవిస్తూ ఉంటారు. అయితే టీ రుచికరంగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా వివిధ పద్ధతులు చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే.. మరికొందరు పాలు చిక్కగా ఉండాలని అంటూ ఉంటారు. అయితే టీ తయారు చేసే విధానంలో కూడా మార్పులు చేస్తే రుచికరంగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కామన్ గా కాకుండా ఈ రకంగా టీ చేయడం వల్ల కొత్త టీ ని చూస్తారని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ఎలా తయారు చేయాలంటే?
సాధారణంగా టీ తయారు చేసేటప్పుడు ముందుగా పాలు పోస్తూ ఉంటారు. ఆ తర్వాత టీ పౌడర్ వేసి మరి కోసేపటి తర్వాత తర్వాత పంచదార వేస్తారు. ఆ తర్వాత మొత్తం మరిగించి టీ ని తయారు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల టీ ఏ మాత్రం రుచికరంగా ఉండదని కొందరు ఉంటున్నారు. ఒకవేళ రుచికరంగా ఉన్న కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉండవని పేర్కొన్నారు. అయితే టీ ని ఇలా తయారు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. అది ఎలాగంటే?
ముందుగా స్టవ్ పై వేడి నీళ్లను మరిగించాలి. ఆ తర్వాత టీ పౌడర్ ను వేయాలి. ఈ రెండు మిశ్రమాన్ని కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత టీ పౌడర్ ముద్దలాగా అయిన తర్వాత వడగట్టాలి. అప్పుడు టీ పౌడర్ లోని చేదు వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ నీటినీ మరోసారి స్టవ్ పై ఉంచి మరిగిస్తూ అందులో పాలు పోయాలి. ఇలా కొద్దిసేపు మాత్రమే మొత్తం మిశ్రమాన్ని ఉంచాలి. ఈ రకంగా టీ తయారు చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందని కొందరు కుకింగ్ స్పెషలిస్టు చెబుతున్నారు.
పాలతో కలిపి టీ పౌడర్ ను మరిగించడం వల్ల టీ పౌడర్ లో ఉండే చేదు మొత్తం పాలతో కలిసిపోతుందని.. దీంతో టీ రుచి తేడా ఉంటుందని అంటున్నారు. అందువల్ల ముందుగా టీ పౌడర్ కలిపిన నీళ్లను మరిగించాలి. వీటిని వడగట్టిన తర్వాతనే పాలను కలపాలి. అప్పుడు టీ రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సందేహం చాలా మందికి ఇప్పటికే ఉంది. దీని కాసేటప్పుడు పాలు ముందుగా పోయాలా? లేదా చివరకు పోయాలా అనేది కొంతమంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల టీ రుచికరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో బ్రాండెడ్ టీ పౌడర్ తో పాటు మంచి పాలను కూడా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడే అనుకున్న విధానంలో టి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి టీ నీ బందువులు వచ్చినప్పుడు సరఫరా చేసి వారినిఆకట్టుకోవచ్చు.
మూడమిలో పెళ్ళిచూపులు జరిపించవచ్చా?
పూర్వకాలామృతం ప్రకారం ‘అదౌస్వేప్సిత దేవతాం గ్రహగణం సంపూజ్యకర్తుస్తదా - తారాచంద్ర బలాన్వితే శుభదినే లగ్నే శుభేవాసరే’ అని చెప్పారు.
దేవతలను గ్రహగణములను పూజించి తారాచంద్ర బలములతో కూడి శుభదిన శుభలగ్న శుభ వారములలో జ్యోతిశ్శాస్తవ్రేత్తలను సంప్రదించి వధూవరుల జాతక వివరాలు చూపి ప్రయత్నాలు ప్రారంభించమని చెప్పారు. మరి తారాబలం కూడిన శుభ దినంలోనే మాటలాడమని చెప్పారు కదా! ఇక ఆషాఢం, భాద్రపదం, పుష్యమాసాలు, మూఢమి దినములు శుభముకు పనికిరావు కదా. అందువలన ఈ మూఢమి వంటి రోజులలో పెండ్లి చూపులు చూడరాదు. దానికి ఒక పెద్ద కారణం ఉంది.
వధూవరులు ఇరువురు మొదట చూసుకున్న సమయం మంచిది కాకపోతే ఆ ప్రభావం జీవితాంతం వెంబడిస్తుంది. శాస్త్రంతో పనులు చేద్దాం అనుకుంటే శాస్త్రం చెప్పినవి అన్నీ చేయాలి. అలాగ చేయకపోతే సమస్యలు రాగలవు. సరే ఇక మనం యాంత్రిక జీవనంలో వున్నాం సమయం చాలా అరుదుగా కుదిరే సందర్భాలలో మూఢమి వంటివి వస్తే ఏమి చేయాలి అనే ప్రశ్న అందరినీ బాధిస్తుంది. అందుకే శాస్తజ్ఞ్రులయిన పెద్దలు అనుభవం మీద కొన్ని విశేషాలు తెలియజేశారు. అది ఏమిటి అంటే దేవాలయం దైవసన్నిధి.కి దోషం వుండదు కావున వధూవరులను మొట్టమొదట ఏదేని దేవాలయంలో చూసుకునేలాగ చేయుట అనంతరం వారి గృహమందు కలియుట ద్వారా మూఢమి దోషం ఉండదు అని చెబుతారు. ప్రతి విషయంలోనూ దైవ సన్నిధిలో చేయుటకు విశేషం అని వింటున్నాం కదా.
మనం ఏ కార్యం చేసినా గణపతిని ఆరాధించి పెద్దలు, వేద పండితుల ఆశీస్సులు తీసుకొని ప్రారంభించడం మన సంస్కృతి మనకు నేర్పిన పాఠం. రోజువారీ కార్యక్రమాల విషయంగా ఒక వేళ ఈ నియమం పాటింపక పోయినా ప్రతి విశేష కార్యములలోనూ పై నియమం పాటింపవలసినదే అనేది భారతీయ వాదన. విఘ్నములు పోగొట్టువాడు కావున గణపతిని అర్చించడం, పెద్దలు పూజ్యుల నుండి స్వస్తి మంగళ వాచకములు ఆశీఃపూర్వకంగా తీసుకొని ప్రారంభిస్తే అంతా శుభం కలుగుతుంది అనేది ఒక గట్టి నమ్మకం. మంచి పొందేవాడు పై మంచి పనులు తప్పక చేస్తాడు. అలాంటిది జీవితకాల బంధాలకు సంబంధ మైన వివాహం విషయంలో మంచి చూసి ప్రారంభించాలి. సంబంధం తెలిసి దాని ప్రయత్నంలో ప్రారంభంలో ఈ విధంగా గణపతిని పూజ్యులను పూజించి వెళ్లుట శ్రేయస్కరం.
అలా మంచి సమయం కుదరని వారు ఆషాఢంలోనే ఒక మంచిరోజు (ఉన్నంతలో) మంచి వారం తారాబలం కుదిరిన రోజున దైవసన్నిధిలో దేవాలయంలో పెళ్లిచూపులు చూసుకోవడం ద్వారా దుష్ఫలితాలు రావు అని పండితులు చెబుతారు. వధువు తరఫు పెద్దలు వరుని చూచుటకు, వరుని తరఫు పెద్దలు వధువును చూచుటకు ఆషాఢ, భాద్రపద, పుష్య, మూఢమి దోషాలు పట్టింపు కాదు. ఈ మధ్య చాలా అపహాస్యమైన పద్ధతి నడుచుచున్నది. అది ఏమనగా మంచి రోజులలో ఒక సంబంధం చూసేస్తే, తరువాత వాటికి మంచి రోజులతో పట్టింపు లేదు అని. అది తప్పుడు వాదన.
ప్రతి ప్రయత్నంలోనూ మంచి రోజులు చూసుకోవడం తప్పనిసరి. ఎన్ని సంబంధాలు చూసినా మంచి రోజులకే ప్రాధాన్యం ఇచ్చి శాస్త్ర వాక్యం పాటించిన వారు జీవితాంతం సుఖపడతారు. శాస్త్ర వాక్యములు వాటి పరమార్థం పూర్తిగా తెలుసుకోకుండా మనకు తోచిన మాటలు చెప్పడం సమంజసం కాదు. శాస్త్ర వాక్యాలు లేదా పెద్దల మాటలు తెలుసుకొని చర్చించుకోవడం ద్వారా శాస్త్ర గౌరవం కాపాడినవారవుతారు. తద్వారా ఆచరించిన వారు సుఖపడతారు.
శుక్రమూఢమి ప్రారంభం.. చేయాల్సినవి.. చేయకూడనివి
అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?❓
🪷 గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.
🪷 మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
✅👉 శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.
🪷 మౌఢ్యమిని *"మూఢమి"* గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నా... గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.
🪷 శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.
🪷 శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసారజీవితo సజావుగా సాగదు. ఇలాంటి వారు "ఇంద్రాణీదేవి స్తోత్రం"పారాయణం చేయండి.
❌ మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:- ❌
❌👉 పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనo, గృహారంభo, గృహప్రవేశo, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానo, విగ్రహప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనము కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెoట్రుకలకు, వేదవిద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు, దేహశుద్ధి మొదలగునవి చేయరాదు.
✅👉 మౌఢ్యమిలో చేయదగిన పనులు :- ✅
🪷 ఆత్మశుద్ధి, జాతకర్మ , జాతకo వ్రాయించుకోవడo, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా, శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును♪.
🪷 గర్భిణి స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిథులలో అశ్వని, రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుoది♪.
Monday, March 17, 2025
పురాణాల్లో 56 రాజ్యాలు అని చెప్తారు. అవి ఏమిటి?
పాంచాల , కులిందా , కిన్నెర , కోసల , మత్స్య , నేప , హర హూణ , కాశ్మీర , మద్ర , కేకేయ, సింధు , కాంబోజ , కోసల (దక్షిణ ), కాశి , మత్త (north of మగధ ), కురు , కురు (పశ్చిమ ), వత్స (కురు భాగం ), మగధ , గయ ( లేక కికత )south of మగధ ),)విదేహ , అంగ (east of Magadh ), ప్రాగ్జ్యోతిష , వంగ , పౌండ్ర , కళింగ (ఒరిస్సా ), సూహ్మ , సోనిత , ఉత్కళ , సారస్వత , అభిర , సురసేన , అనార్త , ద్వారిక , ఛేది , కుంతి (నార్త్ అవంతి ), మాటవ , హేహేయ , దశార్ణ , పులింద , విదర్భ , అనుపా , శూరపాక , కొంకణ , దండక , వ్రజి , గాంధార (నార్త్ వెస్ట్ ), పల్లవ ,ఆంధ్ర /ఆంధ్రక , కిష్కింద , పాండ్య , కేరళ (చేర ), చోళ , తెలింగ (కాకతీయ ), గోమంత , గోకర్ణ , మహిశాఖ , మషిక , తులుంగ , టంక , సింహళ.
Source :నిత్యానందపీడియా.ఆర్గ్
Errors & Omissions Exempted.
నిజాం పాలన కంటే ముందు హైదరాబాద్‌ని పరిపాలించిన రాజు ఎవరు? ఏ ఏ ప్రాంతాలు పాలించారు?
1. కాకతీయ రాజ్యము (1163–1323 CE):
- మొదటగా ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలించారు.
- వారి రాజధాని ఒరుగల్లు (ఇప్పటి వరంగల్).
- గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి శక్తివంతమైన రాజులు కాకతీయ సామ్రాజ్యాన్ని బలంగా నిలిపారు.
- కానీ 1323లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసి కాకతీయ రాజ్యాన్ని కూల్చివేశాడు.
2. బహమనీ సుల్తానేట్ (1347–1518 CE):
- కాకతీయుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని బహమనీ సుల్తానులు పరిపాలించారు.
- 1347లో అలాఉద్దీన్ హసన్ బహమన్ షా ఈ రాజ్యాన్ని స్థాపించాడు.
- ఈ రాజ్యం నశించిన తర్వాత, దక్కన్ ప్రాంతం ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.
- అందులో ఒకటి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం.
3. గోల్కొండ కుతుబ్ షాహీలు (1518–1687 CE):
- సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518లో గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు.
- మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు.
- 1687లో ఔరంగజేబ్ గోల్కొండను జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
4. మొఘల్ పాలన (1687–1724 CE):
- గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయిన తర్వాత, మొఘల్ గవర్నర్లు ఇక్కడ పాలించారు.
- అయితే, 1724లో మిర్ కమరుద్దీన్ (అసఫ్ జాహ్-I) నిజాం రాజవంశాన్ని స్థాపించాడు.
- అప్పటి నుంచి నిజాం పాలన ప్రారంభమైంది.
హైదరాబాద్ మీద కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ కుతుబ్ షాహీలు, మొఘల్ గవర్నర్లు పాలన జరిపారు.
చివరకు 1724లో నిజాం రాజులు అధికారం చేపట్టారు.
(సేకరణ)
ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు.. కంటి చూపు వస్తుందట..!
సాధారణంగా ఈ ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని వింతలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆలయాల్లో జరిగే అద్భుతాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది.
ఈ క్రమంలోనే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో జరిగే వింతలు అంతుచిక్కనివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది.
కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో నంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంఠేశ్వర ఆలయం ఉన్నది. కంబిని నది తీరంలో గల శ్రీ కంఠేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయాన్ని నంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ గోపురం ఎత్తు - 120 అడుగులు. ఇక్కడ ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం.
అయితే టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే.. ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం. ఇక ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇవి 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియుచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి. ఈ స్వామిని దర్శించినవారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం.
Sunday, March 16, 2025
ఎమ్.ఎస్.సి (MSc) ఫిజిక్స్ తర్వాత పీహెచ్డీ (PhD)
ఎమ్.ఎస్.సి (MSc) ఫిజిక్స్ తర్వాత పీహెచ్డీ (PhD) చేయడం ఒక గొప్ప ఎంపిక, ముఖ్యంగా రీసెర్చ్, అకాడెమిక్ లేదా ఇండస్ట్రియల్ రంగాల్లో లోతైన జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి. పీహెచ్డీ గురించి సంపూర్ణ సమాచారం ఇక్కడ ఉంది:
1. పీహెచ్డీకి అర్హతలు
- బేస్ డిగ్రీ: ఎమ్.ఎస్.సి (ఫిజిక్స్) లేదా సంబంధిత రంగంలో సాధారణంగా 55–60% మార్కులు (యూనివర్సిటీ/కాలేజీపై ఆధారపడి ఉంటుంది).
- ఎంట్రన్స్ టెస్ట్: చాలా యూనివర్సిటీలు యుజిసి-నెట్ (UGC-NET), CSIR-NET, GATE, JEST (ఫిజిక్స్ స్పెషలైజేషన్ కోసం) లేదా స్వంత ఎంట్రన్స్ టెస్ట్లను నిర్వహిస్తాయి.
- ఇంటర్వ్యూ: ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత, రీసెర్చ్ ప్రపోజల్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్పై ఇంటర్వ్యూ ఉంటుంది.
2. పీహెచ్డీ ప్రక్రియ
- డ్యురేషన్: సాధారణంగా 3–5 సంవత్సరాలు (రీసెర్చ్ ప్రోగ్రెస్పై ఆధారపడి).
- కోర్స్ వర్క్: మొదటి సంవత్సరంలో కొన్ని కోర్సులు (ఫిజిక్స్లో అడ్వాన్స్డ్ టాపిక్స్) మరియు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ (Comprehensive Exam) ఉంటాయి.
- రీసెర్చ్ ప్రపోజల్: మీరు ఎంచుకున్న టాపిక్పై సూపర్వైజర్ మార్గదర్శకత్వంలో ప్రపోజల్ సమర్పించాలి.
- థీసిస్ సబ్మిషన్: రీసెర్చ్ పూర్తయిన తర్వాత, థీసిస్ను యూనివర్సిటీకి సమర్పించి, వివాద్ (Viva-Voce) లేదా ఓరల్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాలి.
3. ఫండింగ్ & ఫెలోషిప్లు
- యుజిసి-జేఆర్‌ఎఫ్ (UGC-JRF): NET ఉత్తీర్ణులకు నెలకు ₹31,000–35,000 స్టైపెండ్.
- CSIR ఫెలోషిప్: ఫిజిక్స్ రీసెర్చ్ కోసం ప్రత్యేక ఫండింగ్.
- ఇన్స్పైర్ ఫెలోషిప్ (INSPIRE): ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వ మద్దతు.
- యూనివర్సిటీ ఫెలోషిప్లు: IITs, IISc, TIFR వంటి సంస్థలు స్కాలర్షిప్లు అందిస్తాయి.
- ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు: ISRO, DRDO, BARC వంటి సంస్థలతో కలిసి రీసెర్చ్ చేసే అవకాశాలు.
4. రీసెర్చ్ ఏరియాస్ (ఫిజిక్స్లో)
- థియరెటికల్ ఫిజిక్స్: క్వాంటం మెకానిక్స్, స్ట్రింగ్ థియరీ, కాస్మాలజీ.
- ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్: న్యూక్లియర్ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్, న్యానోటెక్నాలజీ.
- అస్ట్రోఫిజిక్స్: బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, గెలాక్సీ ఫార్మేషన్.
- అప్లైడ్ ఫిజిక్స్: ఆప్టిక్స్, ప్లాస్మా ఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్.
5. టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా
- ఐఐఎస్‌సి (IISc) బెంగళూరు: ఫండమెంటల్ ఫిజిక్స్ కోసం ప్రపంచ స్థాయి రీసెర్చ్.
- ఐఐటీలు (IITs): IIT Bombay, IIT Madras, IIT Delhiలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లు.
- టిఐఎఫ్‌ఆర్ (TIFR): థియరెటికల్ మరియు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
- ఐఐఎస్టి (IIST): స్పేస్ సైన్స్ మరియు టెక్నాలజీ.
- ఎన్ఐయుఎ (NIUA): అస్ట్రోఫిజిక్స్ మరియు పార్టికల్ ఫిజిక్స్.
6. ఇంటర్నేషనల్ ఆప్షన్స్
- యునైటెడ్ స్టేట్స్: MIT, Caltech, Stanford వంటి విశ్వవిద్యాలయాలు.
- యూరప్: CERN (స్విట్జర్లాండ్), Max Planck ఇన్స్టిట్యూట్ (జర్మనీ).
- ఫెలోషిప్లు: Fullbright, DAAD, Erasmus Mundus.
7. కెరీర్ అవకాశాలు
- అకాడెమియా: ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్.
- రీసెర్చ్ ల్యాబ్స్: ISRO, BARC, DRDO, CSIR.
- ఇండస్ట్రీ: R&D సెక్టార్లో (ఉదా: సెమీకండక్టర్, ఎనర్జీ).
- డేటా సైన్స్/టెక్: క్వాంటమ్ కంప్యూటింగ్, AI.
- సైన్స్ కమ్యూనికేషన్: రైటర్, సైన్స్ అడ్వైజర్.
8. కీ స్కిల్స్ రిక్వయర్డ్
- స్ట్రాంగ్ మ్యాథమెటికల్ & అనాలిటికల్ స్కిల్స్.
- పరిశోధనలో సహనం & డెడికేషన్.
- ప్రయోగాలు/సిమ్యులేషన్లకు టెక్నికల్ స్కిల్స్ (Python, MATLAB వంటి టూల్స్).
- ఇంగ్లీష్లో రీసెర్చ్ పేపర్లు రాయడం & ప్రెజెంటేషన్ స్కిల్స్.
9. ప్రత్యేక సూచనలు
- మెంటర్ ఎంచుకోవడం: మీ రీసెర్చ్ ఇంటరెస్ట్కు సంబంధించిన ప్రొఫెసర్లను రిసర్చ్ గేట్/Google Scholarలో సెర్చ్ చేయండి.
- పబ్లికేషన్లు: PhD సమయంలో జర్నల్లలో కనీసం 2–3 పేపర్లు పబ్లిష్ చేయాలి.
- కాన్ఫరెన్స్లు: ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో పాల్గొని నెట్‌వర్కింగ్ చేయండి.
10. సవాళ్లు
- పీహెచ్డీ ఒక స్థిరమైన మానసిక సామర్థ్యాన్ని కోరుతుంది.
- రీసెర్చ్ టాపిక్‌లో ఫలితాలు రాకపోతే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది.
- అకాడెమిక్ ఫీల్డ్లో కాంపిటిషన్ ఎక్కువ.
ముగింపు: పీహెచ్డీ ఒక సవాలుగా ఉంటుంది, కానీ ఫిజిక్స్ పట్ల అభిరుచి ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముందుగా యుజిసి-నెట్/CSIR-NET కు ప్రిపేర్ అవ్వండి, మీ రీసెర్చ్ ఇంటరెస్ట్ను క్లియర్ చేసుకోండి మరియు మంచి మెంటర్ ఎంచుకోండి. ప్రపంచం మీద పని చేసే శాస్త్రవేత్తలతో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి!
రిసోర్సెస్:
- arXiv.org e-Print archive (రీసెర్చ్ పేపర్లు).
- ప్రయాగ్ (ఫిజిక్స్ టెస్ట్ సిరీస్).
- యూట్యూబ్ ఛానెల్స్: PBS Space Time, Veritasium.
AI ఉత్పత్తి కంటెంట్ ఉద్ధరణం: పై ఉన్న సమాధానం
రచయిత/సృష్టికర్త (AI మోడల్ [Grok-3,Claude, Qwen, Gemini,ChatGPT-4,Deepseek ): Deepseek
జనరేట్ చేయబడిన తేదీ: 2025 mar 15
మూలం [OpenAI, Google, Anthropic, Alibaba Cloud, xAI Team, Deepseek 2025]:Deepseek 2025
శీర్షిక పై ఉన్న- అనుభవం / అవగాహన : 5 ఏళ్లు / 20 ఏళ్లు
సవరించిన లేదా పూర్తిగా AI ఉత్పత్తి శాతం : AI 100% - మానవ కలాపం 0%
వెచ్చించిన సమయం : 10 నిమిషాలు
శివుడికి రుద్రాభిషేకం ఇంట్లో ఎలా చేయాలి?
శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన.శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే.
శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు.
అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాల రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం. రుద్రాభిషేకాలు 8 విధములు అవి.. రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…
1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు. 2. ఆవృత్తి - నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు. 3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం - 11 సార్లు, 4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు, 5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు, 6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు, 7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు, 8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు, ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.