Adsense

Saturday, March 30, 2024

హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్నిరకాలు,ఎన్ని వత్తులు?


శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.

ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.
దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసినవారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసినవారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.

హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించబడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.

అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపుస్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్ప బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి.

ఒకే ఒక దీపం – ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం – రథదీపం, మనిషి – పురుషదీపం, కొండ – మేరు దీపం, శివపంచాకృతులు – పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం – గజ దీపం, ఎద్దు ఆకారం – వృషభ దీపం, కుండ – కుంభ హారతి దీపం అని అంటారు.
అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

ఏకహారతి – మహేశ్వరుడు
ద్విహారతి – ఉమా మహేశ్వరులు
త్రిహారతి – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి – పంచభూతాలు
సప్తహారతి – సప్త ఋషులు
అష్టహారతి – అష్టమూర్తులు
నవహారతి – తొమ్మిది గ్రహాలు
దశహారతి – దిశానాయకులు
నాగదీపహారతి – వాసుకి
రథదీపహారతి – సదాశివుడు
మేరుదీపహారతి – బ్రహ్మ
వృషభదీపహారతి – నంది
పురుషదీప హారతి – శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి – పంచముఖశివుడు

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.
పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.
కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.
రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.
చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.
నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.
కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.
ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.
కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ‘ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి’ అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి.
సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

Wednesday, March 27, 2024

అరవై ఏళ్ల క్రితం వంటకాలు

9 video tips



Make videos about topics people search for

Make them high-quality

Optimize titles

Optimize descriptions

Create eye-catching thumbnails

Add time stamps

Embed videos in webpages

Add schema markup to pages

Build links to pages with videos

8 Alternatives to Google Trends



1. TrendFeed

2. Treendly

3. Insider Intelligence

4. Topic Research

5. AnswerThePublic

6. TrendHunter

7. Keyword Overview

8. Keyword Tool


పంచశ్లోక సూర్యప్రార్ధన Panchasloka Surya Pradhana

ఆదివారం రోజున ఆరుసార్లు పంచశ్లోక సూర్యప్రార్ధన చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాది శుభములు ప్రాప్తించును.

1. జయః సూర్యాయ దేవాయ తమోహంత్రే వివస్వతే జయప్రదాయ సూర్యాయ భాస్కరాయ నమోస్తుతే

2. గ్రహోత్తమాయ దేవాయ జయః కళ్యాణకారినే జయ పద్మ వికాసాయ బుధరూపాయతే నమః

3. జయః దీప్తి విధానాయ జయః శాంతి విధాయినే తమోఘ్నాయ జయాయైన అజితాయ నమోనమః

4. జయార్క జయదీప్తిశ సహస్ర కిరణోజ్వల
జయనిర్మిత లోకస్త్యమజితాయ నమోనమః 

5. గాయత్రీదేహ రూపాయ, సావిత్రీదైవతాయచ ధరాధరాయ సూర్యాయ మార్తాండాయ నమో నమః



If you do Panchasloka Suryapradhan six times on Sunday, you will get good health and happiness.

1. Jayah suryaya devaya tamohantre vivaswathe jayapradaya suryaya bhaskaraya namostute

2. Grahotamaya Devaya Jayah Kalyanakarine Jaya Padma Vikasaya Budharupayathe Namah

3. Jayah Dipti Vidhanaya Jayah Shanti Vidhayane Tamoghnaya Jayayana Ajithaya Namonamah

4. Jayarka Jayadeeptisha Sahasra Kiranojvala
Jayanirmita Lokastyamajitaya Namonamah

5. Gayatrideha rupaya, savitridaivatayacha dharadharaya suryaya marthandaya namo namah

అపూర్వ శ్రీ లక్ష్మీ స్తోత్రం Apoorva Lakshmi Stotram

శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
విష్ణుప్రియే మహామాయే మహాలక్ష్మి నమోస్తుతే దారిద్య్రదుఃఖశమని మహాలక్ష్మి నమోస్తుతే. రాజలక్ష్మి రాజ్యలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
వీరలక్ష్మి విశ్వలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
వైకుంఠ హృదయవాసే మహాలక్ష్మి నమోస్తుతే క్షీరరూపే క్షీరదాత్రి మహాలక్ష్మి నమోస్తుతే
 వేదరూపే నాదరూపే మహాలక్ష్మి నమోస్తుతే కుబేరలక్ష్మి మాతంగి మహాలక్ష్మి నమోస్తుతే 
శ్రీ చక్రవాసిని మహాలక్ష్మి నమోస్తుతే 
స్తోత్రప్రియే రమేరామే మహాలక్ష్మి నమోస్తుతే రామనామ ప్రియేదేవి మహాలక్ష్మి నమోస్తుతే అప్రైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మి నమోస్తుతే హనుమద్భక్తి సంతుష్టే మహాలక్ష్మి నమోస్తుతే

Monday, March 25, 2024

బ్రహ్మానందం HAPPINESS IN LIFE



✳️ మనిషికి ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు♪. అంతకుమించిన ఐశ్వర్యం లేదు♪. కానీ, మనిషి జీవితంలో ఆనందంకోసమంటూ విషాదాన్ని సృష్టించుకుంటున్నాడు♪. మానవ జీవితాల్లో ఇదో పెద్ద విషాదం♪.

❓ ఆనందం అంటే ఏమిటి? అదెక్కడ దొరుకుతుంది? -  వీటికి సమాధానాలను నేడు 'గూగుల్' లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది♪.

✅ నిజమైన ఆనందం మన మనసులోనే ఉంటుంది♪. ఆ విషయాన్ని కనుగొనడమే అసలైన ఆనందం♪. జీవితంలో ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు♪. జీవితంలో అప్టైశ్వర్యాలున్నా.. అందులో ఒకటైన ఆనందం లేకపోతే మిగతావన్నీ వృథానే♪. అందుకనే ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు♪. ఇది ఉంటే మాత్రం మిగతావన్నీ రాణిస్తాయి♪. అటువంటి ఆనందాన్ని పొందాలంటే జీవితాన్ని ఆధ్యాత్మిక వనం చేసుకోవాలి♪.

✳️ ఓ సినీ కవి - *'లేనిది కోరేవు.. ఉన్నది వగచేవు'* అని చెప్పినట్టు మనమంతా ఉన్న వాటి పట్ల చులకన భావంతో ఉన్నాం♪. లేని వాటి కోసం అర్రులు చాస్తూ భ్రమల్లో బతుకుతున్నాం♪. జీవం లేని వాటిని ప్రేమిస్తున్నాం♪. ప్రాణంతో ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం♪. ఇలా చేస్తే ఆనందం దక్కుతుందా? లేని దాని కోసం వెంపర్లాడటమే ఆనందమనే మాయలో పడి కొట్టుమిట్టాడుతూ దానిని జీవన విధానంగా మార్చుకుంటున్నాం♪. ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం చిన్నబుచ్చుకుంటున్నాం♪.

❓ ప్రతి ఒక్కరు జీవితంలో కోరుకునేదేమిటి?
✅ సమాధానం: ఆనందంగా జీవించడం.

❓ ఆనందంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి?

✅  సమాధానం: ఆరోగ్యం.

✳️ మనం మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కలిగిఉంటే, మన ఆలోచనలు బాగుంటాయి♪. మన చేతలు బాగుంటాయి♪. మనం చేసే ప్రతి పనీ మంచి ఫలితాన్నీ, ఆనందాన్నీ ఇవ్వాలని ఆశిస్తాం♪. అది సహజమే♪. కానీ చేసే కర్మను బట్టే ఫలితం ఉంటుంది♪. కొన్ని, తాత్కాలికమైన స్వల్పకాలిక ఆనందాలను ఇస్తాయి♪. అయితే, ఒక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తుంది♪. అదేమిటో తెలుసుకుంటే జీవితం ఆరోగ్యానందాల కలబోత అవుతుంది♪.

✳️ 'వేదాంత పంచదశి' అనే గ్రంథంలో మూడు రకాలైన ఆనందాలను గురించి వివరించారు.
1. విషయానందం.
2. విద్యానందం.
3. బ్రహ్మానందం.

✳️ ఈ మూడింటిలోనూ మళ్లీ 'బ్రహ్మానందం' శ్రేష్ఠమైనది♪. ఇది శాశ్వతమైనదని ఇతిహాసాలు, పురాణాలు, భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి♪.

✳️ మొదటిదైన 'విషయానందం' - కొంతకాలమే..

✳️ సిరి సంపదలు, భోగాలు, దాంపత్యం, బంధాలు, మమకారాలు, సుఖసంతోషాలు.. ఇవన్నీ విషయానందం ఇచ్చే అంశాలు. ఇవన్నీ మన జీవన దశలో వివిధ కాలాల్లో ఉంటూ వివిధ కాలాల్లో క్రమేపీ కనుమరుగవుతుంటాయి. ఒడిదుడుకుల జీవన గమనంలో ఆటుపోట్లకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విషయవాంఛలు సైతం వెగటుగా అనిపిస్తాయి♪.

✳️ రెండవదైన -  'విద్యానందమూ' పరిస్థితులకు లోబడేదే♪.

✳️ విద్యానందం అనేది జ్ఞానాభిలాష మూలంగా కలుగుతుంది. ఇది గౌరవాన్ని పెంచుతుంది. మనిషిని రాజపూజితునిగా చేస్తుంది. అహంకారం, పరిస్థితుల స్థితిగతులు ఈ ఆనందాన్ని తుంచివేయవచ్చు. కాబట్టి విద్యానందం పొందాలనుకునే వారు పరిస్థితుల విషయంలో జాగరూకులై ఉండాలి.

🙏 బహ్మానందమే శాశ్వతం..

✳️ మూడవదైన -  'బ్రహ్మానందం' - ఆత్మకు సంబంధించిన జ్ఞానం♪. ఈ సకల సృష్టిలో ఏది సత్యమై, నిత్యమై వెలుగొందుతూ, చైతన్యవంతంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది ఈ చరాచర జగత్తుకు మూలమో, జీవుల పుట్టుక, మరణాలకు కారణహేతువో- ఆ బ్రహ్మాండమైన వెలుగును భగవత్ స్వరూపంగా గ్రహించగలిగేదే బ్రహ్మజ్ఞానం♪. ఇలా గ్రహించగలిగే జ్ఞానం ఇచ్చేదే అఖండమైన బ్రహ్మానందం♪. అది శాశ్వతానందాన్ని చేకూరుస్తుంది♪. ఇక దానికి తుది అంటూ లేదు♪. నిజమైన ఆనందాన్ని కోరుకునే వారు బ్రహ్మానందాన్ని మాత్రమే కోరుకోవాలి♪. అదొక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని కలిగించేది అని తెలుసుకోవాలి.

మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి Srilakshminrisimhaswamy Temple Mangalagiri

మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం :

శ్రీ హరికోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి. మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరాన గండాలు నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నృసింహునికి కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజూ పానకం వినియోగమవుతున్నా, గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం వుంది. కొండకింద శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామిని పాండవులు ప్రతిష్టించారని స్థలపురాణం. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో మంగళగిరి వుంది. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.

Sunday, March 24, 2024

ఈరోజు కామదహనం ఫాల్గుణ శుద్ధ చతుర్దశి...!!

 ఈరోజు కామదహనం  ఫాల్గుణ శుద్ధ చతుర్దశి....!!

సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు.

ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా.

అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు.

భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని  తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధించసాగాడు.

పర్వతరాజు హిమవంతుడు , మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేయగా.

వారి తపస్సు కు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా

" నీవే మాకు పుత్రికగా రావాలి! "అని కోరతారు. సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది.

శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు.

హిమవంతుని పుత్రికయైన పార్వతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది.

హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.

-అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి-
సంబరమున ప్రాణేశునిజూచి
యో మౌనులారా !
చాల భక్తి గలిగి మ్రొక్కేనూ
దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు
శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా !
కానడు బ్రహ్మానందమువలనా

ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు , నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు.

అప్పుడు అందరూ కలిసి పార్వతీశివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు.

నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి  బాటలు వేయమని ఆదేశిస్తాడు.

శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరే నంటాడు.

-అమరాధిపునిజేరి యానారదుండి-
-విమలుడీవిధమెల్ల వినిపించగాను-
-మంచిదని పృత్రారి మన్మథున్జూచి-
-సహాయము లిడి బ్రతిమాలి-
-కాలకంఠునిజేరి కాచుకోనియుండి-
-బాలపార్వతి మీద భ్రమనొందజేయు-
-మనుచు సురపతి పయన మంపేటివేళ-
-కనుగొని కాముని కాంత యిట్లనియె.-

తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన

మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.

రతియిటెంతయు జెప్పినన్ వినక మూర్ఖంబొంది యామన్మధుం
డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా వేళ్ళుచున్
శితికంఠున్ని పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా
వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్

వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు.

ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు.

కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని కృద్ధుడై అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు.

వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.

విరహకంటకుడట్లు వేగానజూచి
హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను
ప్రళయానలముబట్టి పారేటివేళ
బలువైనకాముండు భస్మమైపోయె
పసలేకరతిదేవి పడిమూర్చబోయె
కుసుమ శరుడు భీతి గొని పారిపాయె

ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు.

తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు.

అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అ మరుసటి రోజే హోళి అని అంటారు.

( వ్యాసంలో జతపరచిన ద్విపద మరియు గద్యాలు శ్రీ ముద్దు బాలంభట్టు గారిచే రచింపబడిన శ్రీ మంథని శివపురాణం లోనివి )

తాంబూలం గురించిన ఈ శ్లోకం చూడండి-

తాంబూలం తెలుసుకుందాం


తాంబూలం గురించిన
ఈ శ్లోకం చూడండి-

ప్రాతః కాలే ఫలాధిక్యం
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ
తాంబూలమితి లక్షణం

తాంబూలంలో మూడు వస్తువులున్నాయి.
1. ఆకులు, 2. వక్కలు, 3. సున్నం
ఇవి ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేదీ
శ్లోకం.
ప్రాతఃకాలంలో వక్కలు ఎక్కువగాను
మధ్యాహ్నం సున్నం ఎక్కువగాను
రాత్రి తమలపాకులను ఎక్కువగాను
ఉన్న తాంబూలం సేవించాలని అర్థం.

ఉదయం పైత్యాన్ని హరిస్తుంది వక్క,
మధ్యాహ్నం ఉష్ణాధిక్యాన్ని తగ్గిస్తుంది సున్నం,
రాత్రి తమలపాకు జీర్ణశక్తిని కలుగజేస్తుంది

సున్నం శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది.
పుట్టబోయే బిడ్డకు ఎముకలుకు బలాన్నిం ఇచ్చేందుకు
గర్భిణీ స్త్రీలు తాంబూలం వేసుకోవాలి.
ఇది ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
వివాహితులే తాంబూలం వేసుకోవడం మంచిది.
అలాగే భోజనానంతరమే వేసుకోవాలి
ఎప్పుడూ నమలుతూ ఉండటం మంచిది కాదు.

సుభిక్షాన్ని అనుగ్రహించేసూర్య దేవుని ఆలయాలు...!!




1)దక్షిణార్కా ఆలయం
(గయ..బీహార్)

గయలో వున్న యీ ఆలయం ప్రాచీనమైనది.

విష్ణుపాద ఆలయానికి సమీపాన  తూర్పు ముఖంగా వున్నది.

ఈ ఆలయంలో లెక్కకు
అందని సూర్యనారాయణ
మూర్తి విగ్రహాలు వున్నాయి.  ఇక్కడ వున్న సూర్యభగవానుడు ,
గుండె కు కవచాన్ని
ధరించి సుందరంగా దర్శనమిస్తున్నాడు.

ఆలయ తూర్పు దిశలో సూర్య గుండ తీర్ధం. విష్ణు, బ్రహ్మ  ,పరమశివుడు
త్రిమూర్తులతో , సూర్యుడు, దుర్గ విగ్రహాలు యిక్కడ వున్నవి.

ఇంకా కొన్ని సూర్యభగవానుడి ఆలయాలు గయలోను, గయను చుట్టిన ఊళ్ళలోను వున్నవి.

2)బ్రహ్మన్యదేవ్ ఆలయం
(ఉణవ్ మధ్యప్రదేశ్)

మధ్యప్రదేశ్ ఝాన్సీ కి సమీపమున వున్నది ఉణవ్.ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్రహ్మన్యదేవ్ ఆలయం అనే పరంజూ ఆలయం వున్నది.

సూర్యభగవానుని ఆలయమైన యీ ఆలయంలో సూర్యనారాయణుడు పరమ సౌందర్యంతో దర్శనానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు.

కుష్టువ్యాధి వారు, దృష్టి లోపాలు వున్నవారు 
సూర్య భగవానుని యీ ఆలయంలో ప్రార్ధించి ఆరోగ్యమును పొందుతున్నారు.

ఈ ప్రాంతాన్ని ఏలిన పీష్వాల ఇష్ట దైవం ఈ సూర్యభగవానుడు.

3)సూర్యబహార్
(అస్సాం)

అస్సాం రాష్ట్రంలోని గోల్పారా సమీపమున సూర్యబహార్ కొండ మెట్ట  మీద నిర్మించబడినది యీ ఆలయం.

వలయాకారంలోని రాళ్ళ
వేదిక మీద ద్వాదశ సూర్యులు దర్శనమిస్తున్నారు.  మధ్యలో సూర్య భగవానుని తండ్రి కశ్యప ప్రజాపతి దర్శనమిస్తున్నాడు.

కశ్యప ప్రజాపతి  అదితి
దంపతుల పుత్రుడే సూర్యభగవానుడు.
ఈ దంపతులకు యిక్కడ
విశిష్టమైన స్థానం

కాలిక పురాణంలో, సూర్యుని
కొండ, మరియు శిఖరాన్ని
గురించి  వివరించబడినది. అది యీ కొండే అంటారు.

ఈ శిఖరానికి అడుగున
ఒక లక్ష శివలింగాలు
వుండేవిట..కాలక్రమంలో
చాలా వరకు మాయమైనవి. ఈనాటకి
ఈ కొండ లోయలో అనేక శివలింగాలు కనిపిస్తాయి.

4)అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి
(ఆంధ్రప్రదేశ్)

ఈ ఆలయం 7 వ శతాబ్దంలోనిది.  కళింగదేశపు రాజు నిర్మించీనది. 5 అడుగుల ఎత్తుతో, చేతిలో పద్మాన్ని ధరించి, ఉషా, ఛాయాదేవి సమేతుడై
దర్శనమిస్తున్నాడు.

ఈ స్వామి కి పద్మపాణి అనే పేరు వున్నది. చేతిలోని పద్మం జ్ఞానాన్ని
చూపిస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కాకుళానికి సమీపమున
వున్నది యీ ఆలయం.

5)మోదేరా సూర్యభగవానుని
ఆలయం
(గుజరాత్)

1026--లో  కోణార్క్ ఆలయంలాగే  నిర్మించబడినది సూర్యనారాయణ మూర్తి ఆలయం.

ఉత్తరాయణ పుణ్యకాలం
మొదటి రోజున సూర్యుని విగ్రహం మీద సూర్య కిరణాలు పడతాయి.
మండప స్ధంభాల మీద
సూర్యభగవానుని  శిల్పాలు వేరు వేరు భంగిమలలో దర్శనమిస్తాయి.

ఇక్కడే ప్రతి సంవత్సరం
జనవరి మాసంలో
".మోద్రా నాట్య ఉత్సవం"
ఘనంగా జరుపుతారు.

సూర్యాష్టోత్తరశతనామావలీ

సూర్యాష్టోత్తరశతనామావలీ



సూర్య బీజ మన్త్ర –
ఓం హ్రాఁ హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః ॥

సూర్యం సున్దర లోకనాథమమృతం వేదాన్తసారం శివమ్
జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైకచిత్తం స్వయమ్ ॥

ఇన్ద్రాదిత్య నరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిమ్
బ్రహ్మా విష్ణు శివ స్వరూప హృదయం వన్దే సదా భాస్కరమ్ ॥

ఓం అరుణాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం కరుణారససిన్ధవే నమః ।
ఓం అసమానబలాయ నమః ।
ఓం ఆర్తరక్షకాయ నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం ఆదిభూతాయ నమః ।
ఓం అఖిలాగమవేదినే నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అఖిలజ్ఞాయ నమః ॥ ౧౦ ॥

ఓం అనన్తాయ నమః ।
ఓం ఇనాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం ఇజ్యాయ నమః ।
ఓం ఇన్ద్రాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం ఇన్దిరామన్దిరాప్తాయ నమః ।
ఓం వన్దనీయాయ నమః ।
ఓం ఈశాయ నమః ।
ఓం సుప్రసన్నాయ నమః ॥ ౨౦ ॥

ఓం సుశీలాయ నమః ।
ఓం సువర్చసే నమః ।
ఓం వసుప్రదాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ఉజ్జ్వలాయ నమః ।
ఓం ఉగ్రరూపాయ నమః ।
ఓం ఊర్ధ్వగాయ నమః ।
ఓం వివస్వతే నమః ।
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ॥ ౩౦ ॥

ఓం హృషీకేశాయ నమః ।
ఓం ఊర్జస్వలాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం నిర్జరాయ నమః ।
ఓం జయాయ నమః ।
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః ।
ఓం ఋషివన్ద్యాయ నమః ।
ఓం రుగ్ఘన్త్రే నమః ।
ఓం ఋక్షచక్రచరాయ నమః ।
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః ॥ ౪౦ ॥

ఓం నిత్యస్తుత్యాయ నమః ।
ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః ।
ఓం ఉజ్జ్వలతేజసే నమః ।
ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః ।
ఓం పుష్కరాక్షాయ నమః ।
ఓం లుప్తదన్తాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం కాన్తిదాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం కనత్కనకభూషాయ నమః ॥ ౫౦ ॥

ఓం ఖద్యోతాయ నమః ।
ఓం లూనితాఖిలదైత్యాయ నమః ।
ఓం సత్యానన్దస్వరూపిణే నమః ।
ఓం అపవర్గప్రదాయ నమః ।
ఓం ఆర్తశరణ్యాయ నమః ।
ఓం ఏకాకినే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం ఘృణిభృతే నమః ॥ ౬౦ ॥

ఓం బృహతే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం ఐశ్వర్యదాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం హరిదశ్వాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం దశదిక్సమ్ప్రకాశాయ నమః ।
ఓం భక్తవశ్యాయ నమః ।
ఓం ఓజస్కరాయ నమః ।
ఓం జయినే నమః ॥ ౭౦ ॥

ఓం జగదానన్దహేతవే నమః ।
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః ।
ఓం ఉచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః ।
ఓం అసురారయే నమః ।
ఓం కమనీయకరాయ నమః ।
ఓం అబ్జవల్లభాయ నమః ।
ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః ।
ఓం అచిన్త్యాయ నమః ।
ఓం ఆత్మరూపిణే నమః ।
ఓం అచ్యుతాయ నమః ॥ ౮౦ ॥

ఓం అమరేశాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం అహస్కరాయ నమః ।
ఓం రవయే నమః ।
ఓం హరయే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం తరుణాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం గ్రహాణాంపతయే నమః ।
ఓం భాస్కరాయ నమః ॥ ౯౦ ॥

ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః ।
ఓం సౌఖ్యప్రదాయ నమః ।
ఓం సకలజగతాంపతయే నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం పరేశాయ నమః ।
ఓం తేజోరూపాయ నమః ।
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ।
ఓం హ్రీం సమ్పత్కరాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం ఐం ఇష్టార్థదాయనమః ।
ఓం అనుప్రసన్నాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శ్రేయసేనమః ।
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః ।
ఓం నిఖిలాగమవేద్యాయ నమః ।
ఓం నిత్యానన్దాయ నమః ।
ఓం సూర్యాయ నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి సూర్య అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ 

Saturday, March 23, 2024

పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది?

శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి “ఇవి మీ వొదిన కేయూరాలేగదా!   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు” అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా ....
"నాహం జానామి కేయురే           
నాహం జానామి కుండలే           
నూపురే త్వభి జానామి           
నిత్యం పాదాభివందనాత్"
.
దీనర్ధం ఏమిటంటే.. “ఓ అన్నా!వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి!”

పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం

అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?

ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?

తల్లి సుమిత్రాదేవి పెంపకం!!

రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు        ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !

"రామం దశరధం విధ్ధి,
మాం విధ్ధి జనకాత్మజాం,
అయొధ్యాం అటవీం విధ్ధి
గచ్చ తాత యధాసుఖం"

రాముణ్ణి దశరధుడనుకో,
సీతను నన్ననుకో!
అడవిని అయొధ్య అనుకో
హాయిగా వెళ్ళిరా నాన్నా!

ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే  లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు.
చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు... తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది!

నేడు ప్రతి తల్లి  తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా !

పిల్లలను ఈవిధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది?
నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి?  బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?
రామాయణం, రామకధలు విరివిగా ప్రచారం చేయండి !

పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో ! స్త్రీలతో ఎలామెలగాలో అన్నీ తెలుస్తాయి !
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!
                       

లోకా సమస్తా సుఖినోభవన్తు!

దీనినే గోకర్ణం అనే వారు.

దీనినే  గోకర్ణం  అనే వారు.  లోగడ వివాహాలలో  ఈ గిన్నెతో పులుసు వడ్డించే  వారు.  ఈ  గిన్నె లోపల  కళాయి  వేసే వారు.  కళాయి  లేకుండా  పులుసు వంటి  పులుపు వస్తువులు  వడ్డిస్తే , ఆ పదార్థాలు  కిలము పట్టి  తొందరగా  పాడవుతాయి  అని  గిన్నె లోపల కళాయి వేయించే వారు.  ఆ కాలంలో   వివాహాలలో  పల్చని సగ్గుబియ్యము మరియు  సేమియాతో  తయారుచేసిన పాయసం కూడా  గోకర్ణంతో   ఆకు దొన్నెలలో  పోసేవారు.  క్రమంగా  వడ్డించడం అనే సాంప్రదాయం కనుమరుగయ్యేసరికి  ఆనాటి  వస్తువులు  కూడా కనిపించడం  అపురూపమయ్యాయి.  ఇప్పుడంతా  " బాబ్బాబు  రాంబాబు  " అనే బఫే భోజనాలే కదా !  స్పూనుతో  వడ్డనలే.

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం Lakshmi Nrisimha Karavalamba Stotram

లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౨

సంసారదావదహనాకరభీకరోరు-
జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౩

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేన్ద్రియార్థ బడిశాశ్చ రుషాత్మనశ్చ |
ప్రోత్తంబిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౪

సంసారకూపమతిఘోరమగాధమూలం
సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౫

సంసారభీకరకరీంద్రకరాభిఘాత
నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౬

సంసారసర్పవిషదుష్టభయోగ్రతీవ్ర
దంష్ట్రా కరాళ విషదగ్ధ వినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౭

సంసారవృక్షబీజమనంతకర్మ-
శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౮

సంసారసాగరవిశాలకరాళకాళ
నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౯

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౦

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత
కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-
మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౪

అంధస్య మే హృతవివేకమహాధనస్య
చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-
వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౬

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాః
తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్  ౧౭

శ్రీ లక్ష్మీనారాయణాష్టకం

శ్రీ లక్ష్మీనారాయణాష్టకం


1)ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే ||


2)అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


3)భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


4)సుహృదం సర్వ భూతానాం సర్వ లక్షణ సంయుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


5) చిదచిత్సర్వ జంతూనాం ఆధారం వరదం పరమ్ |అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


6) శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


7)పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్ర శోభితమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||

8)హస్తేన దక్షిణేన యజం అభయ ప్రదమక్షరమ్ |అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||


9)యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీ నారాయణాష్టకమ్ |విముక్తస్సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్ఛతి ||

ఇతి శ్రీ లక్ష్మీనారాయణాష్టకమ్ ||

గ్రామదేవతా వ్యవస్థ

గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.

అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది..

గ్రామదేవతల ఆవిర్భావము

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో..

పృధ్వీ దేవత: పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో  గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది..

జల దేవత: జలానికి సంభందించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

అగ్ని దేవత: మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ)..

వాయు దేవత: నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు..

ఆకాశ దేవత: ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు..

గ్రామదేవతా నామ విశేషాలునం రకరకాల పేర్లతో పిలిచే  ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది..

'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని సేదన్నమాట. 

ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది..

ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ= కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది..

స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది..

సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది..

ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది.

Wednesday, March 20, 2024

Hyderabad ORR (Outer Ring Road) Routes

Hyderabad ORR Exit Numbers are 19.

Distance Between Exit No 17 (Rajendra Nagar Entry Point) To Exit No 16 (Shamshabad Exit Point) is 8.25km

Exit No 1 - Kokapet
Exit No 2 - Edula Nagulapally.

Exit No 3 - Patancheru

Exit No 4 - Sultanpur

Exit No 5 - Dindigal/ Saragudemdsn

Exit No 6 - Medchal

Exit No 7 - Shamirpet

Exit No 8 - Keesara

Exit No 9 - Ghatkesar

Exit No 10 - Taramptipet

Exit No 11 - Pedda Amberpet

Exit No 12 - Bonguluru

Exit No 13 - Raviryal

Exit No 14 - Tukkugud

Exit No 15 - Pedda Golconda

Exit No 16 - Shamshabad

Exit No 17 - Rajendra Nagar

Exit No 18 - TSPA

Exit No 19 - Nanakramguda.

Total length - 158 Km

Design speed - 120 Kmph

Right of Way (ROW) - 150 m

Main Carriage Way - 8 lanes
Hard shoulder for emergency Parking/breakdown vehicles - 3 m wide.
Width of Central Median - 5 m
Service Roads on either side - 2 lanes
Interchanges - 19

Happy & Safe Driving

WhatsApp Tricks for you

 
WhatsApp has become an integral part of our daily lives, connecting us with friends and family with just a few taps. But did you know that there are several hidden tricks and features in WhatsApp that can level up your messaging game? In this blog, we will suggest some amazing WhatsApp tricks that you may not be aware of.

1. Customize notifications for different contacts: Tired of receiving notifications for every WhatsApp message? Well, you can customize it now. Just go to the contact's profile, tap on the three dots on the top right corner and select 'Custom Notifications'. Here, you can set a different notification tone, vibration pattern and LED colour for that particular contact.
2. Pin important chats: If you have a long list of chats and struggle to find the important ones, then this trick is for you. You can pin up to three chats to the top of the chat list for easy access. Just long press on the chat and select the pin icon from the top bar. This way, your important chats will always be at the top.

3. Format your text: Want to make your text bold, italic or strikethrough in WhatsApp? It's simple. To make your text bold, add an asterisk (*) before and after the desired word or phrase. To make it italic, add an underscore (_) before and after the text. And to strikethrough, use a tilde (~) before and after the text.

4. Send messages without typing: We all have faced situations where we don't want to type but still need to send a message urgently. Well, WhatsApp has a solution for that too. Just go to the chat where you want to send a message, tap on the microphone icon next to the typing bar and speak your message. WhatsApp will convert it into text and send it.

5. Star important messages: Sometimes we receive important information or links in WhatsApp messages, and it gets lost in the sea of other messages. To avoid this, you can star such messages for quick access. Just long press on the message and select the star icon from the top bar. You can access all your starred messages by going to 'Settings' > 'Starred Messages'.

6. Create shortcuts for important chats: Do you have a few contacts with whom you chat frequently? You can create a shortcut for their chat on your home screen for easy access. Just long press on the chat and select 'Add chat shortcut' from the top bar. This way, you won't have to go through the whole list of chats to find them.

7. Hide your last seen: Sometimes we don't want others to know when we were last active on WhatsApp. You can change your privacy settings to hide your last seen from everyone or only from specific contacts. Just go to 'Settings' > 'Account' > 'Privacy' > 'Last Seen' and choose your preferred option.

8. Use WhatsApp Web: If you're working on your laptop or PC and don't want to switch to your phone every time a message comes, then you can use WhatsApp Web. Just go to web.whatsapp.com on your browser, scan the QR code with your phone and voila! You can now access all your chats on your computer.

9. Send messages to multiple contacts at once: WhatsApp allows you to send messages to multiple contacts at once, saving you time and effort. Just go to the chat list, tap on the three dots on the top right corner and select 'New broadcast'. Now select all the contacts you want to send the message to and type away!

10. Mute group chats: We all have that one annoying group chat that keeps buzzing throughout the day. Well, you can mute it now without leaving the group. Just go to the group chat, tap on the three dots on the top right corner and select 'Mute notifications'. You can choose to mute it for 8 hours, a week or a year.

11. Recover deleted messages: Accidentally deleted an important message? Don't worry; you can recover it. WhatsApp backs up your messages every day at 2 am, so if you have deleted a message after that, you can uninstall and reinstall WhatsApp to restore the deleted messages.

12. Use WhatsApp as a notepad: Did you know that you could use WhatsApp to save important notes or information? Just create a group with no members and use it as your personal notepad. You can access it from any device and even share it with others if needed.

13. Mute videos before sending: We have all been in situations where we want to send a video but don't want to disturb others around us. Well, you can mute the video before sending it. Just tap on the speaker icon at the top right corner of the video and send it.

14. Use WhatsApp as a calculator: Instead of switching between apps, you can use WhatsApp as a calculator too. Just open any chat, type in a calculation, and WhatsApp will give you the answer.

15. Use voice commands: Did you know that you could use voice commands to send messages on WhatsApp? Just say "Hey Google" or "Hey Siri" followed by "send a WhatsApp message to (contact's name)" and dictate your message. This is especially helpful while driving or in situations where you cannot type.

These are just some of the many tricks and features that WhatsApp offers. So go ahead and try them out; they will surely make your WhatsApp experience more enjoyable and efficient. Have fun chatting!

Celebrate Holi with These Essential Tips

 Holi, also known as the festival of colors, is a vibrant and joyous celebration of the triumph of good over evil. It is a time for friends and family to come together, play with colors, and spread love and happiness. As Holi approaches, it is important to be mindful of certain tips that will ensure a safe and enjoyable experience for everyone. So, here are some essential tips to keep in mind while celebrating Holi.
1. Use Natural and Skin-Friendly Colors
The use of chemical-based colors has become a common practice during Holi. These colors can cause severe skin irritation and even allergies. Therefore, it is advisable to use natural and skin-friendly colors made from flowers or organic ingredients. You can also make your own colors at home using turmeric, beetroot, or henna powder. This not only ensures the safety of your skin but also contributes to a more eco-friendly celebration.

2. Protect Your Hair
Holi colors can be damaging to your hair as well. The harsh chemicals in these colors can strip away the natural oils and leave your hair dry and brittle. To protect your hair, apply coconut oil or any other oil of your choice before stepping out to play Holi. This will create a barrier between your hair and the colors, making it easier to wash them off later.

3. Dress Appropriately
While Holi is all about getting drenched in colors, it is important to dress appropriately for the occasion. Wear old clothes that you don't mind getting stained or ruined. Avoid wearing white or light-colored clothes as they tend to get stained easily. It is also advisable to wear full-sleeved clothes to protect your skin from direct contact with the colors.

4. Stay Hydrated
With all the running around and playing with colors, it is easy to forget about staying hydrated during Holi. It is important to drink plenty of water and other fluids to keep yourself hydrated throughout the day. You can also carry a bottle of water with you while playing Holi to avoid dehydration.
5. Protect Your Eyes
Holi colors can be harmful to your eyes if they enter them. It is important to protect your eyes by wearing sunglasses or using a protective eye gear while playing Holi. If colors do enter your eyes, rinse them immediately with clean water and seek medical help if the irritation persists.

6. Use Natural Gulal Instead of Water Guns
Water guns, also known as pichkaris, have become a popular tool for playing Holi. However, these can cause serious harm to the environment and also waste a lot of water. Instead, opt for natural gulal (powdered colors) to play with. This not only reduces water wastage but also eliminates the risk of chemical-based colors entering your body through the water.

7. Be Mindful of Others
While playing Holi, it is important to be mindful of others around you. Not everyone may want to participate in the celebrations, so it is important to respect their wishes. Also, avoid forcefully applying colors on anyone and be considerate towards those who may have allergies or skin sensitivities.

8. Avoid Bhang Consumption
Bhang, a traditional drink made from cannabis leaves, is often consumed during Holi. While it may add to the festive spirit, it is important to consume it in moderation as it can have adverse effects on your health. Also, make sure not to drive or operate heavy machinery after consuming bhang.

9. Clean Up Responsibly
After all the fun and festivities, it is important to clean up responsibly and not litter the streets with empty color packets or bottles. Dispose of them properly and try to use eco-friendly methods for cleaning off the colors from your body and surroundings.

10. Take Care of Your Skin and Hair After Holi
Once the celebrations are over, it is crucial to take care of your skin and hair. Use a mild soap or body wash to remove colors gently from your skin. You can also use a mixture of besan (gram flour) and milk to scrub off the colors. For your hair, use a mild shampoo and conditioner to wash off the colors. Apply a nourishing hair mask or oil to restore the moisture in your hair.

In conclusion, Holi is a festival that brings people together and spreads joy and happiness. By following these essential tips, you can ensure a safe and enjoyable experience for yourself and those around you. So, go ahead and celebrate Holi with all the colors of the rainbow while keeping these tips in mind. Happy Holi!