Adsense

Wednesday, April 3, 2024

శీతలా అష్టమి

హోళీ తర్వాత వచ్చే సప్తమి, అష్టమి తిధులను శీతలా సప్తమి, శీతలా అష్టమి గా వ్యవహారిస్తారు.

శీతల అష్టమిని *'బసోడా పూజ'* అని కూడా పిలుస్తారు. నేడు శీతలా దేవి వ్రతం ఆచరించటం ద్వారా అనేక వ్యాధుల నుండి విముక్తులు అవుతారు అని నమ్ముతారు.

శీతలా మాతా గాడిదపై ఆశీనురాలై, ఒక చేతితో చీపురు, ఇంకో చేతిలో కుండ పట్టుకొని దర్శనం ఇస్తుంది.

శీతలా అష్టమి వేడుకలు ఉత్తర భారత రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశ్లలో భక్తులు ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు.

ఈ సందర్భంగా భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది మరియు అనేక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుకుంటారు.

శీతలా అష్టమి నాడు సాంప్రదాయాల ప్రకారం కుటుంబాలు వంట కోసం అగ్నిని వెలిగించరు, అందువల్ల వారు ఒక రోజు ముందుగానే ఆహారాన్ని తయారుచేస్తారు.

ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే శీతలా దేవికి నివేదించే ప్రత్యేకమైన ఆచారం ఉంది.

భక్తులు ఉదయాన్నే లేచి, సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు.
వారు శీతలా దేవి ఆలయాన్ని సందర్శించి, దేవతను 'హల్ది', 'బజ్రా' తో పూజిస్తారు.

అనంతరం వారు *'బసోద వ్రత కథ'* వింటారు.
'రాబ్రీ', 'పెరుగు' మరియు ఇతర ముఖ్యమైన నైవేద్యాలను శీతలా దేవికి సమర్పిస్తారు.

వారి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.
సిద్ధం చేసిన ఆహారాన్ని శీతలా దేవీ కి నివేదిస్తారు.
దీనిని వారు 'బసోడా' అని పిలుస్తారు.
అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తారు మరియు ఇతర భక్తులకు కూడా పంచుతారు.

ఈ రోజున 'శీతలాష్టకం' చదవడం చాలా శుభంగా , మంగళకరంగా భావిస్తారు...

*_శ్రీ శీతలా దేవి అష్టకం_*

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః
అనుష్టుప్ ఛన్దః శీతలా దేవలా దేవతా లక్ష్మీర్బీజం – భవానీశక్తిః సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

*ఈశ్వర ఉవాచ:*

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్|
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్||

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్|
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్||

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః|
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి||

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః|
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే||

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ|
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్||

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్|
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ||

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్|
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్||

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే|
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్||

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్|
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే||

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా|
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే||

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః|
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్||

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా|
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః||

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః|
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః||

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్|
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే||

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్|
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై||

ఇతి శ్రీస్కన్దపురాణే శీతలాష్టకం సంపూర్ణం

 శ్రీ మాత్రే నమః 

Tuesday, April 2, 2024

Here are some of the best Indian summer foods to beat the heat

* Aam Panna: This is a delicious and refreshing drink made from raw mangoes, spices, and sugar. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Lassi: This is a yogurt-based drink that is often flavored with fruits, nuts, or spices. It is a refreshing and healthy drink that is perfect for summer.
* Chaas: This is a salty yogurt drink that is often flavored with mint and cumin. It is a refreshing and hydrating drink that is perfect for summer.
* Sattu: This is a roasted gram flour that is often mixed with water, spices, and vegetables. It is a healthy and filling snack that is perfect for summer.
* Fruit Chaat: This is a delicious and refreshing snack made from fruits, nuts, and spices. It is a great way to get your daily dose of fruits and vegetables, and it is also a great way to stay hydrated and cool down on a hot day.

* Kulfi: This is a traditional Indian ice cream that is made from milk, cream, and sugar. It is a delicious and refreshing treat that is perfect for summer.
* Falooda: This is a delicious and refreshing drink made from milk, ice cream, vermicelli, and fruits. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Jalebi: This is a sweet and crispy Indian snack that is made from deep-fried batter. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Gulaab Jamun: This is a sweet and juicy Indian dessert that is made from milk, rose water, and sugar. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Rasgulla: This is a sweet and spongy Indian dessert that is made from milk, sugar, and cardamom. It is a delicious and satisfying treat that is perfect for summer.
* Iced Tea: This is a refreshing and delicious drink that is made from tea, sugar, and ice. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Lemonade: This is a refreshing and delicious drink that is made from lemon juice, sugar, and water. It is a great way to stay hydrated and cool down on a hot day.
* Fruit Juice: This is a refreshing and delicious drink that is made from fruits. It is a great way to get your daily dose of fruits and vegetables, and it is also a great way to stay hydrated and cool down on a hot day.

"వైకుంఠపాళి" - కొంచెం పెద్దదే, కానీ "చదివితే జీవితం తెలుస్తుంది."

తెలుగు తోటలో పండిన విక్రమకేళి - వైకుంఠపాళి

కేవలం నాలుగు గవ్వలతో మూడో నాలుగో చింత పిక్కలతో (ఆడేవాళ్ళ సంఖ్యను బట్టి) జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగు వారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి.

ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కో వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక 11 గడులలో ‘పరమపదసోపానపటము’ అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన “ధరసింహాసనమైనభంబు గొడుగై తద్దేవత భృతులై...సిరిభార్యామణియై” అన్నట్లుగా పదిమంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవల్సిన స్థానం అది. అక్కడకు చేరుకొనే వరకు (జీవితమనే) ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా ఒకటి నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని హెచ్చరిక.

పదకొండు అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశీవ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణం అనే మూడూ తప్పని సరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశీ వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనేది పురాణ కథనం. అయితే ఇదంతా ఆధ్యాత్మికం.

గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్ధం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలున్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం. గవ్వలతో గెలవగలవని జీవితం కోసం ‘రవ్వ’ పెట్టుకోవద్దని ఉపదేశం.

ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. అంతలో ఉత్సాహం అంతలోనే నిరుత్సాహం. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇదీ ఆట నడిచేతీరు.

ఈ ఆటలో పాములు, నిచ్చెనల గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం. జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందైపుడతావనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పందిలా హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం.

అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక 12 వ గడిలోకి పాకుతుంది. 43 గడులు కిందికి జారిపోవడం పైకి కనిపించే ఓటమి. దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దాని వల్లే కురు వంశ క్షయం. అలానే... మనమూ అసూయపడితే జీవితం నరకప్రాయమవుతుందని, సుఖ శాంతులు నశిస్తాయని హెచ్చరిక.

పాముల అమరిక ఇంత అర్ధవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్ధ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగుతుంది. అక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయమన్నది పరమైతే..ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలొస్తాయన్నది ఇహం.

అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని ఉంటుంది. దాని కొస 105వ గడిలో ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలో ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాకవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయని అంతరార్ధం. లోకంలో మహానుభావుడిగా కీర్తిపొందుతారని విశేషార్ధం. ఏ చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగుజాతి.

ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఈ ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడి వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంక 16 గడులు దాటితే పండిపోయినట్లే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతి లోకి వచ్చి పడతాడు. అంటే ప్రముఖుణ్ణి (సెలబ్రిటీ) అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు (ఒకటి వెయ్యడం)చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయం అని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పనిచేసినా మళ్ళీ కిందకి జారిపోవడం తప్పదని చెప్పడం.

ఇంత జరిగినా ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్ధిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాళీయే నేమో!

ఇంతకీ చివిరిదైనా చిన్నది కాని విషయం మరొకటుంది.

GK TODAY. 31/03/2024

1. Which Union Minister has inaugurated the special CCMS of NIA?

Ans:- Amit Shah


2. India and which country have signed the Law and Dispute Agreement?

Ans:- Singapore

3. Who has flagged off the new Vande Bharat Express in Jharkhand state?

Ans:- Narendra Modi

4. How many million loan agreement has been signed by the Government of India and ADB to strengthen the Fintech ecosystem?

Ans:- 23 million dollars.

5. Who has become the new Chief Information Commissioner of Uttar Pradesh?

Ans:- DGP Rajkumar Vishwakarma.

6. Who has been appointed as Director (Project) of NHPC Limited?

Ans:- Shri Sanjay Kumar Singh.

7. Who has been appointed as the new Chairman and Managing Director of NCL?

Ans:- B Sairam.

8. Which team has won the Women's Premier League 2024 title?

Ans:- Royal Challengers Bangalore.

9. For which country will the Indian government buy 1650 tonnes of onion from traders?

Ans:- Bangladesh.

10. Majuli mask of which state has been given GI tag?

Ans:- Assam‌‌

Sunday, March 31, 2024

అష్ట మంగళ చిహ్నాలు..!!

శ్రీ వైష్ణవ సంప్రదాయం లో  యజ్ఞ యాగాదుల  సమయంలో అష్ట మంగళ చిహ్నాలకి, మహాకుంభాభిషేకానికి  ఎంతో ప్రాధాన్యత వుంది.

మహా కుంభానికి చుట్టూ యీ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. ఈ అష్ట మంగళ శక్తులు మహా కుంభానికి చేరి , పరమాత్మ లో లీనమౌతాయి. ఇప్పుడు అష్ట మంగళ చిహ్నాలని  వేటిని అంటారో చూద్దాము..

1. శ్రీ వత్సము..

శ్రీ హరి వక్షస్ధలం మీద లక్ష్మీ దేవి నివసించే ప్రదేశము.  లక్ష్మీ దేవికి జన్మస్థలం పాలకడలి.

దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతమనే ఏనుగు, ఉఛ్ఛైశ్వర్యమనే అశ్వము , కామధేనువు అనే గోమాత తో పాటు ఉద్భవించింది శ్రీ మహా లక్ష్మీ దేవి. శ్రీ మన్నారాయణుని పతిగా పొందిన సౌభాగ్య వతి.

ఆయన వక్షస్ధలమునే  నివాసస్ధానము చేసుకొన్న ది. శ్రీ మన్నారాయణుని  ఎన్నటికీ విడివడని హృదయ నివాసిని యైనది. ఆ నివాస స్ధలమునే  శ్రీ వత్సము అని అంటారు.


2.పూర్ణ కుంభము....

బంగారము, వెండి, రాగి  వస్తువులను బిందెలో వేసి ,నీటి తో నింపి బిందె బైట వైపు దారంతో  చుట్టి దాని మీద పసుపు కుంకుమ ,చందనములతో  అలంకరించి,

పట్టు వస్త్రము చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి  కొమ్మలు పెట్టి  , దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించినదే పూర్ణకుంభము.

లక్ష్మీ దేవి అంశగాను, మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతోంది. 

ఎవరైనా ప్రముఖులు, ఉన్నతాధికారులు, అన్ని రంగాల లో వున్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో  పూర్ణకుంభంతో ఆహ్వానిస్తారు.

3.భేరీ...

భేరీ , నాదం వలన  దుష్ట శక్తులు దరి చేరవు. 
భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో , భేరీ మ్రోగిస్తారు.  భేరీ ధ్వనులతో అమంగళం అప్రతిహతమౌతుంది. 


4. దర్పణ మండము....
దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురు గా పెడతారు.  అద్దంలో శ్రీ హరి ప్రతి బింబం కనపడుతుంది.  ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో , శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే  తత్వం తెలపడానికి యీ దర్పణం...

5. రెండు మీనాలు....
ఒకదాని కొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకొనే విధంగా అమర్చిన మీనాలు.  మీనాలు రెండూ జీవాత్మ పరమాత్మ . మీనాలు నీళ్ళల్లో మాత్రమే నివసిస్తాయి.  తీరానికి వస్తే జీవం కోల్పోతాయి.

చేపలు నీటిని విడచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మ ల ఐక్యత తెలుపుతుంది. 
మనం భగవంతుని ప్రార్ధించేటప్పుడు, మనజీవాత్మ పరమాత్మ తో ఏకమై ప్రార్ధించాలి.

6 . శంఖం...

శంఖం తెల్లగా,స్వఛ్ఛమైనది.  పవిత్ర మైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది. 
శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ శంఖు చక్రాలను ధరించి వుంటాడు.  శంఖాలు రెండు రకాలు. దక్షిణావర్త శంఖం యిది మంగళకరమైనది. పాలకడలి లో శ్రీ మహాలక్ష్మి తో పాటు పుట్టినదే.  యీ వలంపురి శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో వుంటుంది.  వలంపురీ శంఖం నుండి
ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది.

7. శ్రీ చక్రం....

వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం.  కాలాన్ని కాల చక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడని అంటారు. 
చక్రత్తాళ్వారు శ్రీ  చక్రం యొక్క అంశ.  శ్రీ మన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీ మన్నారాయణుడు ఎప్పుడూ చక్రమును చేతిలో ధరించి వుంటాడు.

8. గరుత్మంతుడు.....

కశ్యపముని వినతల పుత్రుడు.  ఆయనను "గరుడాళ్వార్"అని "పెరియ తిరువడి" అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం.  బ్రహ్మోత్సవాల  సమయంలో  గరుడోత్సవం ఘనంగా జరుపుతారు.
గరుత్మంతుడు మహాబలశాలి ,ధైర్యశాలి.
దానవులతో యుధ్ధం చేసి,అమృత కలశమును భద్రముగా తీసుకుని వచ్చినవాడు.
నిరంతరం వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యము పొందిన వాడు గరుత్మంతుడు.

ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు,కాంతిమంతుడు. నాగులను ఆభరణములుగా ధరించిన వాడు. వైకుంఠం లో భగవంతుని కి అద్దంగా నిలబడినట్లు చెప్తారు. శ్రీ మహావిష్ణువు ఆలయమునుండి ఊరేగింపు కి బయలుదేరుటకు ముందు అద్దాల సేవ జరుగుతుంది.

సర్వాంతర్యామి యైన భగవంతుడు భక్తుల పూజలను స్వీకరించి సర్వదా సంరక్షిస్తూ వుంటాడు....స్వస్తి.

సుందరకాండ విశిష్టత ...!!

సుందరకాండ విశిష్టత ...!!


ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ.

ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు.

హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.

సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి.

తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.

భగవానునికి విష్ణు సహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.

అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ.

సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.

సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.

పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.

మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి.

ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును.

అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము.

సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము.

ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు...జై శ్రీరామ్.

అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి గురించి తెలుసుకుందాం. Let's learn about Ahalya, Draupadi, Sita, Tara and Mandodari

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.

అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.

అహల్య
అహల్య గౌతమ మహర్షి భార్య..! ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.

ద్రౌపదీ..
పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేచ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు. మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది.

సీతాదేవి! వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్'' అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం... ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు. ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందర్భాలలో చెప్పారు.

తారాదేవి!
వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అద్భుతంగా వివరించబడి ఉంది.

మండోదరి దేవి!!
రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడు కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది.

Saturday, March 30, 2024

హారతి దీపం విశిష్టతలు ఏమిటి? ఎన్నిరకాలు,ఎన్ని వత్తులు?


శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.

ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.
దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసినవారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసినవారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.

హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించబడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.

అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపుస్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్ప బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి.

ఒకే ఒక దీపం – ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతి దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం – రథదీపం, మనిషి – పురుషదీపం, కొండ – మేరు దీపం, శివపంచాకృతులు – పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం – గజ దీపం, ఎద్దు ఆకారం – వృషభ దీపం, కుండ – కుంభ హారతి దీపం అని అంటారు.
అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు.

ఏకహారతి – మహేశ్వరుడు
ద్విహారతి – ఉమా మహేశ్వరులు
త్రిహారతి – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి – పంచభూతాలు
సప్తహారతి – సప్త ఋషులు
అష్టహారతి – అష్టమూర్తులు
నవహారతి – తొమ్మిది గ్రహాలు
దశహారతి – దిశానాయకులు
నాగదీపహారతి – వాసుకి
రథదీపహారతి – సదాశివుడు
మేరుదీపహారతి – బ్రహ్మ
వృషభదీపహారతి – నంది
పురుషదీప హారతి – శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి – పంచముఖశివుడు

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వత్తి ఉంటుంది.
పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.
కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.
రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.
చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.
నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.
కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.
ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.
కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.

మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పుతున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య తిప్పాలని చెప్పబడింది. దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. దేవాలయాలలో దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ‘ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామి’ అనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి.
సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

Wednesday, March 27, 2024

అరవై ఏళ్ల క్రితం వంటకాలు

9 video tips



Make videos about topics people search for

Make them high-quality

Optimize titles

Optimize descriptions

Create eye-catching thumbnails

Add time stamps

Embed videos in webpages

Add schema markup to pages

Build links to pages with videos

8 Alternatives to Google Trends



1. TrendFeed

2. Treendly

3. Insider Intelligence

4. Topic Research

5. AnswerThePublic

6. TrendHunter

7. Keyword Overview

8. Keyword Tool


పంచశ్లోక సూర్యప్రార్ధన Panchasloka Surya Pradhana

ఆదివారం రోజున ఆరుసార్లు పంచశ్లోక సూర్యప్రార్ధన చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాది శుభములు ప్రాప్తించును.

1. జయః సూర్యాయ దేవాయ తమోహంత్రే వివస్వతే జయప్రదాయ సూర్యాయ భాస్కరాయ నమోస్తుతే

2. గ్రహోత్తమాయ దేవాయ జయః కళ్యాణకారినే జయ పద్మ వికాసాయ బుధరూపాయతే నమః

3. జయః దీప్తి విధానాయ జయః శాంతి విధాయినే తమోఘ్నాయ జయాయైన అజితాయ నమోనమః

4. జయార్క జయదీప్తిశ సహస్ర కిరణోజ్వల
జయనిర్మిత లోకస్త్యమజితాయ నమోనమః 

5. గాయత్రీదేహ రూపాయ, సావిత్రీదైవతాయచ ధరాధరాయ సూర్యాయ మార్తాండాయ నమో నమః



If you do Panchasloka Suryapradhan six times on Sunday, you will get good health and happiness.

1. Jayah suryaya devaya tamohantre vivaswathe jayapradaya suryaya bhaskaraya namostute

2. Grahotamaya Devaya Jayah Kalyanakarine Jaya Padma Vikasaya Budharupayathe Namah

3. Jayah Dipti Vidhanaya Jayah Shanti Vidhayane Tamoghnaya Jayayana Ajithaya Namonamah

4. Jayarka Jayadeeptisha Sahasra Kiranojvala
Jayanirmita Lokastyamajitaya Namonamah

5. Gayatrideha rupaya, savitridaivatayacha dharadharaya suryaya marthandaya namo namah

అపూర్వ శ్రీ లక్ష్మీ స్తోత్రం Apoorva Lakshmi Stotram

శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
విష్ణుప్రియే మహామాయే మహాలక్ష్మి నమోస్తుతే దారిద్య్రదుఃఖశమని మహాలక్ష్మి నమోస్తుతే. రాజలక్ష్మి రాజ్యలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
వీరలక్ష్మి విశ్వలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే 
వైకుంఠ హృదయవాసే మహాలక్ష్మి నమోస్తుతే క్షీరరూపే క్షీరదాత్రి మహాలక్ష్మి నమోస్తుతే
 వేదరూపే నాదరూపే మహాలక్ష్మి నమోస్తుతే కుబేరలక్ష్మి మాతంగి మహాలక్ష్మి నమోస్తుతే 
శ్రీ చక్రవాసిని మహాలక్ష్మి నమోస్తుతే 
స్తోత్రప్రియే రమేరామే మహాలక్ష్మి నమోస్తుతే రామనామ ప్రియేదేవి మహాలక్ష్మి నమోస్తుతే అప్రైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మి నమోస్తుతే హనుమద్భక్తి సంతుష్టే మహాలక్ష్మి నమోస్తుతే

Monday, March 25, 2024

బ్రహ్మానందం HAPPINESS IN LIFE



✳️ మనిషికి ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు♪. అంతకుమించిన ఐశ్వర్యం లేదు♪. కానీ, మనిషి జీవితంలో ఆనందంకోసమంటూ విషాదాన్ని సృష్టించుకుంటున్నాడు♪. మానవ జీవితాల్లో ఇదో పెద్ద విషాదం♪.

❓ ఆనందం అంటే ఏమిటి? అదెక్కడ దొరుకుతుంది? -  వీటికి సమాధానాలను నేడు 'గూగుల్' లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది♪.

✅ నిజమైన ఆనందం మన మనసులోనే ఉంటుంది♪. ఆ విషయాన్ని కనుగొనడమే అసలైన ఆనందం♪. జీవితంలో ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు♪. జీవితంలో అప్టైశ్వర్యాలున్నా.. అందులో ఒకటైన ఆనందం లేకపోతే మిగతావన్నీ వృథానే♪. అందుకనే ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు♪. ఇది ఉంటే మాత్రం మిగతావన్నీ రాణిస్తాయి♪. అటువంటి ఆనందాన్ని పొందాలంటే జీవితాన్ని ఆధ్యాత్మిక వనం చేసుకోవాలి♪.

✳️ ఓ సినీ కవి - *'లేనిది కోరేవు.. ఉన్నది వగచేవు'* అని చెప్పినట్టు మనమంతా ఉన్న వాటి పట్ల చులకన భావంతో ఉన్నాం♪. లేని వాటి కోసం అర్రులు చాస్తూ భ్రమల్లో బతుకుతున్నాం♪. జీవం లేని వాటిని ప్రేమిస్తున్నాం♪. ప్రాణంతో ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం♪. ఇలా చేస్తే ఆనందం దక్కుతుందా? లేని దాని కోసం వెంపర్లాడటమే ఆనందమనే మాయలో పడి కొట్టుమిట్టాడుతూ దానిని జీవన విధానంగా మార్చుకుంటున్నాం♪. ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం చిన్నబుచ్చుకుంటున్నాం♪.

❓ ప్రతి ఒక్కరు జీవితంలో కోరుకునేదేమిటి?
✅ సమాధానం: ఆనందంగా జీవించడం.

❓ ఆనందంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి?

✅  సమాధానం: ఆరోగ్యం.

✳️ మనం మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కలిగిఉంటే, మన ఆలోచనలు బాగుంటాయి♪. మన చేతలు బాగుంటాయి♪. మనం చేసే ప్రతి పనీ మంచి ఫలితాన్నీ, ఆనందాన్నీ ఇవ్వాలని ఆశిస్తాం♪. అది సహజమే♪. కానీ చేసే కర్మను బట్టే ఫలితం ఉంటుంది♪. కొన్ని, తాత్కాలికమైన స్వల్పకాలిక ఆనందాలను ఇస్తాయి♪. అయితే, ఒక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తుంది♪. అదేమిటో తెలుసుకుంటే జీవితం ఆరోగ్యానందాల కలబోత అవుతుంది♪.

✳️ 'వేదాంత పంచదశి' అనే గ్రంథంలో మూడు రకాలైన ఆనందాలను గురించి వివరించారు.
1. విషయానందం.
2. విద్యానందం.
3. బ్రహ్మానందం.

✳️ ఈ మూడింటిలోనూ మళ్లీ 'బ్రహ్మానందం' శ్రేష్ఠమైనది♪. ఇది శాశ్వతమైనదని ఇతిహాసాలు, పురాణాలు, భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి♪.

✳️ మొదటిదైన 'విషయానందం' - కొంతకాలమే..

✳️ సిరి సంపదలు, భోగాలు, దాంపత్యం, బంధాలు, మమకారాలు, సుఖసంతోషాలు.. ఇవన్నీ విషయానందం ఇచ్చే అంశాలు. ఇవన్నీ మన జీవన దశలో వివిధ కాలాల్లో ఉంటూ వివిధ కాలాల్లో క్రమేపీ కనుమరుగవుతుంటాయి. ఒడిదుడుకుల జీవన గమనంలో ఆటుపోట్లకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విషయవాంఛలు సైతం వెగటుగా అనిపిస్తాయి♪.

✳️ రెండవదైన -  'విద్యానందమూ' పరిస్థితులకు లోబడేదే♪.

✳️ విద్యానందం అనేది జ్ఞానాభిలాష మూలంగా కలుగుతుంది. ఇది గౌరవాన్ని పెంచుతుంది. మనిషిని రాజపూజితునిగా చేస్తుంది. అహంకారం, పరిస్థితుల స్థితిగతులు ఈ ఆనందాన్ని తుంచివేయవచ్చు. కాబట్టి విద్యానందం పొందాలనుకునే వారు పరిస్థితుల విషయంలో జాగరూకులై ఉండాలి.

🙏 బహ్మానందమే శాశ్వతం..

✳️ మూడవదైన -  'బ్రహ్మానందం' - ఆత్మకు సంబంధించిన జ్ఞానం♪. ఈ సకల సృష్టిలో ఏది సత్యమై, నిత్యమై వెలుగొందుతూ, చైతన్యవంతంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది ఈ చరాచర జగత్తుకు మూలమో, జీవుల పుట్టుక, మరణాలకు కారణహేతువో- ఆ బ్రహ్మాండమైన వెలుగును భగవత్ స్వరూపంగా గ్రహించగలిగేదే బ్రహ్మజ్ఞానం♪. ఇలా గ్రహించగలిగే జ్ఞానం ఇచ్చేదే అఖండమైన బ్రహ్మానందం♪. అది శాశ్వతానందాన్ని చేకూరుస్తుంది♪. ఇక దానికి తుది అంటూ లేదు♪. నిజమైన ఆనందాన్ని కోరుకునే వారు బ్రహ్మానందాన్ని మాత్రమే కోరుకోవాలి♪. అదొక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని కలిగించేది అని తెలుసుకోవాలి.

మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి Srilakshminrisimhaswamy Temple Mangalagiri

మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం :

శ్రీ హరికోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి. మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరాన గండాలు నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నృసింహునికి కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజూ పానకం వినియోగమవుతున్నా, గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం వుంది. కొండకింద శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామిని పాండవులు ప్రతిష్టించారని స్థలపురాణం. విజయవాడ గుంటూరు రహదారిలో విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో మంగళగిరి వుంది. కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7గం. లనుంచి సాయంత్రం 3 గం.లదాకా మాత్రమే తెరచి వుంటుంది.

Sunday, March 24, 2024

ఈరోజు కామదహనం ఫాల్గుణ శుద్ధ చతుర్దశి...!!

 ఈరోజు కామదహనం  ఫాల్గుణ శుద్ధ చతుర్దశి....!!

సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు.

ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా.

అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు.

భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని  తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధించసాగాడు.

పర్వతరాజు హిమవంతుడు , మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేయగా.

వారి తపస్సు కు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా

" నీవే మాకు పుత్రికగా రావాలి! "అని కోరతారు. సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది.

శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు.

హిమవంతుని పుత్రికయైన పార్వతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది.

హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.

-అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి-
సంబరమున ప్రాణేశునిజూచి
యో మౌనులారా !
చాల భక్తి గలిగి మ్రొక్కేనూ
దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు
శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా !
కానడు బ్రహ్మానందమువలనా

ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు , నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు.

అప్పుడు అందరూ కలిసి పార్వతీశివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు.

నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి  బాటలు వేయమని ఆదేశిస్తాడు.

శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరే నంటాడు.

-అమరాధిపునిజేరి యానారదుండి-
-విమలుడీవిధమెల్ల వినిపించగాను-
-మంచిదని పృత్రారి మన్మథున్జూచి-
-సహాయము లిడి బ్రతిమాలి-
-కాలకంఠునిజేరి కాచుకోనియుండి-
-బాలపార్వతి మీద భ్రమనొందజేయు-
-మనుచు సురపతి పయన మంపేటివేళ-
-కనుగొని కాముని కాంత యిట్లనియె.-

తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన

మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.

రతియిటెంతయు జెప్పినన్ వినక మూర్ఖంబొంది యామన్మధుం
డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా వేళ్ళుచున్
శితికంఠున్ని పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా
వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్

వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు.

ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు.

కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని కృద్ధుడై అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు.

వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.

విరహకంటకుడట్లు వేగానజూచి
హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను
ప్రళయానలముబట్టి పారేటివేళ
బలువైనకాముండు భస్మమైపోయె
పసలేకరతిదేవి పడిమూర్చబోయె
కుసుమ శరుడు భీతి గొని పారిపాయె

ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు.

తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు.

అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అ మరుసటి రోజే హోళి అని అంటారు.

( వ్యాసంలో జతపరచిన ద్విపద మరియు గద్యాలు శ్రీ ముద్దు బాలంభట్టు గారిచే రచింపబడిన శ్రీ మంథని శివపురాణం లోనివి )

తాంబూలం గురించిన ఈ శ్లోకం చూడండి-

తాంబూలం తెలుసుకుందాం


తాంబూలం గురించిన
ఈ శ్లోకం చూడండి-

ప్రాతః కాలే ఫలాధిక్యం
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ
తాంబూలమితి లక్షణం

తాంబూలంలో మూడు వస్తువులున్నాయి.
1. ఆకులు, 2. వక్కలు, 3. సున్నం
ఇవి ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేదీ
శ్లోకం.
ప్రాతఃకాలంలో వక్కలు ఎక్కువగాను
మధ్యాహ్నం సున్నం ఎక్కువగాను
రాత్రి తమలపాకులను ఎక్కువగాను
ఉన్న తాంబూలం సేవించాలని అర్థం.

ఉదయం పైత్యాన్ని హరిస్తుంది వక్క,
మధ్యాహ్నం ఉష్ణాధిక్యాన్ని తగ్గిస్తుంది సున్నం,
రాత్రి తమలపాకు జీర్ణశక్తిని కలుగజేస్తుంది

సున్నం శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది.
పుట్టబోయే బిడ్డకు ఎముకలుకు బలాన్నిం ఇచ్చేందుకు
గర్భిణీ స్త్రీలు తాంబూలం వేసుకోవాలి.
ఇది ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
వివాహితులే తాంబూలం వేసుకోవడం మంచిది.
అలాగే భోజనానంతరమే వేసుకోవాలి
ఎప్పుడూ నమలుతూ ఉండటం మంచిది కాదు.

సుభిక్షాన్ని అనుగ్రహించేసూర్య దేవుని ఆలయాలు...!!




1)దక్షిణార్కా ఆలయం
(గయ..బీహార్)

గయలో వున్న యీ ఆలయం ప్రాచీనమైనది.

విష్ణుపాద ఆలయానికి సమీపాన  తూర్పు ముఖంగా వున్నది.

ఈ ఆలయంలో లెక్కకు
అందని సూర్యనారాయణ
మూర్తి విగ్రహాలు వున్నాయి.  ఇక్కడ వున్న సూర్యభగవానుడు ,
గుండె కు కవచాన్ని
ధరించి సుందరంగా దర్శనమిస్తున్నాడు.

ఆలయ తూర్పు దిశలో సూర్య గుండ తీర్ధం. విష్ణు, బ్రహ్మ  ,పరమశివుడు
త్రిమూర్తులతో , సూర్యుడు, దుర్గ విగ్రహాలు యిక్కడ వున్నవి.

ఇంకా కొన్ని సూర్యభగవానుడి ఆలయాలు గయలోను, గయను చుట్టిన ఊళ్ళలోను వున్నవి.

2)బ్రహ్మన్యదేవ్ ఆలయం
(ఉణవ్ మధ్యప్రదేశ్)

మధ్యప్రదేశ్ ఝాన్సీ కి సమీపమున వున్నది ఉణవ్.ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్రహ్మన్యదేవ్ ఆలయం అనే పరంజూ ఆలయం వున్నది.

సూర్యభగవానుని ఆలయమైన యీ ఆలయంలో సూర్యనారాయణుడు పరమ సౌందర్యంతో దర్శనానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు.

కుష్టువ్యాధి వారు, దృష్టి లోపాలు వున్నవారు 
సూర్య భగవానుని యీ ఆలయంలో ప్రార్ధించి ఆరోగ్యమును పొందుతున్నారు.

ఈ ప్రాంతాన్ని ఏలిన పీష్వాల ఇష్ట దైవం ఈ సూర్యభగవానుడు.

3)సూర్యబహార్
(అస్సాం)

అస్సాం రాష్ట్రంలోని గోల్పారా సమీపమున సూర్యబహార్ కొండ మెట్ట  మీద నిర్మించబడినది యీ ఆలయం.

వలయాకారంలోని రాళ్ళ
వేదిక మీద ద్వాదశ సూర్యులు దర్శనమిస్తున్నారు.  మధ్యలో సూర్య భగవానుని తండ్రి కశ్యప ప్రజాపతి దర్శనమిస్తున్నాడు.

కశ్యప ప్రజాపతి  అదితి
దంపతుల పుత్రుడే సూర్యభగవానుడు.
ఈ దంపతులకు యిక్కడ
విశిష్టమైన స్థానం

కాలిక పురాణంలో, సూర్యుని
కొండ, మరియు శిఖరాన్ని
గురించి  వివరించబడినది. అది యీ కొండే అంటారు.

ఈ శిఖరానికి అడుగున
ఒక లక్ష శివలింగాలు
వుండేవిట..కాలక్రమంలో
చాలా వరకు మాయమైనవి. ఈనాటకి
ఈ కొండ లోయలో అనేక శివలింగాలు కనిపిస్తాయి.

4)అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి
(ఆంధ్రప్రదేశ్)

ఈ ఆలయం 7 వ శతాబ్దంలోనిది.  కళింగదేశపు రాజు నిర్మించీనది. 5 అడుగుల ఎత్తుతో, చేతిలో పద్మాన్ని ధరించి, ఉషా, ఛాయాదేవి సమేతుడై
దర్శనమిస్తున్నాడు.

ఈ స్వామి కి పద్మపాణి అనే పేరు వున్నది. చేతిలోని పద్మం జ్ఞానాన్ని
చూపిస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కాకుళానికి సమీపమున
వున్నది యీ ఆలయం.

5)మోదేరా సూర్యభగవానుని
ఆలయం
(గుజరాత్)

1026--లో  కోణార్క్ ఆలయంలాగే  నిర్మించబడినది సూర్యనారాయణ మూర్తి ఆలయం.

ఉత్తరాయణ పుణ్యకాలం
మొదటి రోజున సూర్యుని విగ్రహం మీద సూర్య కిరణాలు పడతాయి.
మండప స్ధంభాల మీద
సూర్యభగవానుని  శిల్పాలు వేరు వేరు భంగిమలలో దర్శనమిస్తాయి.

ఇక్కడే ప్రతి సంవత్సరం
జనవరి మాసంలో
".మోద్రా నాట్య ఉత్సవం"
ఘనంగా జరుపుతారు.

సూర్యాష్టోత్తరశతనామావలీ

సూర్యాష్టోత్తరశతనామావలీ



సూర్య బీజ మన్త్ర –
ఓం హ్రాఁ హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః ॥

సూర్యం సున్దర లోకనాథమమృతం వేదాన్తసారం శివమ్
జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైకచిత్తం స్వయమ్ ॥

ఇన్ద్రాదిత్య నరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిమ్
బ్రహ్మా విష్ణు శివ స్వరూప హృదయం వన్దే సదా భాస్కరమ్ ॥

ఓం అరుణాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం కరుణారససిన్ధవే నమః ।
ఓం అసమానబలాయ నమః ।
ఓం ఆర్తరక్షకాయ నమః ।
ఓం ఆదిత్యాయ నమః ।
ఓం ఆదిభూతాయ నమః ।
ఓం అఖిలాగమవేదినే నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం అఖిలజ్ఞాయ నమః ॥ ౧౦ ॥

ఓం అనన్తాయ నమః ।
ఓం ఇనాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ।
ఓం ఇజ్యాయ నమః ।
ఓం ఇన్ద్రాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం ఇన్దిరామన్దిరాప్తాయ నమః ।
ఓం వన్దనీయాయ నమః ।
ఓం ఈశాయ నమః ।
ఓం సుప్రసన్నాయ నమః ॥ ౨౦ ॥

ఓం సుశీలాయ నమః ।
ఓం సువర్చసే నమః ।
ఓం వసుప్రదాయ నమః ।
ఓం వసవే నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం ఉజ్జ్వలాయ నమః ।
ఓం ఉగ్రరూపాయ నమః ।
ఓం ఊర్ధ్వగాయ నమః ।
ఓం వివస్వతే నమః ।
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ॥ ౩౦ ॥

ఓం హృషీకేశాయ నమః ।
ఓం ఊర్జస్వలాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం నిర్జరాయ నమః ।
ఓం జయాయ నమః ।
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః ।
ఓం ఋషివన్ద్యాయ నమః ।
ఓం రుగ్ఘన్త్రే నమః ।
ఓం ఋక్షచక్రచరాయ నమః ।
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః ॥ ౪౦ ॥

ఓం నిత్యస్తుత్యాయ నమః ।
ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః ।
ఓం ఉజ్జ్వలతేజసే నమః ।
ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః ।
ఓం పుష్కరాక్షాయ నమః ।
ఓం లుప్తదన్తాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం కాన్తిదాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం కనత్కనకభూషాయ నమః ॥ ౫౦ ॥

ఓం ఖద్యోతాయ నమః ।
ఓం లూనితాఖిలదైత్యాయ నమః ।
ఓం సత్యానన్దస్వరూపిణే నమః ।
ఓం అపవర్గప్రదాయ నమః ।
ఓం ఆర్తశరణ్యాయ నమః ।
ఓం ఏకాకినే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం ఘృణిభృతే నమః ॥ ౬౦ ॥

ఓం బృహతే నమః ।
ఓం బ్రహ్మణే నమః ।
ఓం ఐశ్వర్యదాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం హరిదశ్వాయ నమః ।
ఓం శౌరయే నమః ।
ఓం దశదిక్సమ్ప్రకాశాయ నమః ।
ఓం భక్తవశ్యాయ నమః ।
ఓం ఓజస్కరాయ నమః ।
ఓం జయినే నమః ॥ ౭౦ ॥

ఓం జగదానన్దహేతవే నమః ।
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః ।
ఓం ఉచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః ।
ఓం అసురారయే నమః ।
ఓం కమనీయకరాయ నమః ।
ఓం అబ్జవల్లభాయ నమః ।
ఓం అన్తర్బహిః ప్రకాశాయ నమః ।
ఓం అచిన్త్యాయ నమః ।
ఓం ఆత్మరూపిణే నమః ।
ఓం అచ్యుతాయ నమః ॥ ౮౦ ॥

ఓం అమరేశాయ నమః ।
ఓం పరస్మై జ్యోతిషే నమః ।
ఓం అహస్కరాయ నమః ।
ఓం రవయే నమః ।
ఓం హరయే నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం తరుణాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం గ్రహాణాంపతయే నమః ।
ఓం భాస్కరాయ నమః ॥ ౯౦ ॥

ఓం ఆదిమధ్యాన్తరహితాయ నమః ।
ఓం సౌఖ్యప్రదాయ నమః ।
ఓం సకలజగతాంపతయే నమః ।
ఓం సూర్యాయ నమః ।
ఓం కవయే నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం పరేశాయ నమః ।
ఓం తేజోరూపాయ నమః ।
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ।
ఓం హ్రీం సమ్పత్కరాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం ఐం ఇష్టార్థదాయనమః ।
ఓం అనుప్రసన్నాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం శ్రేయసేనమః ।
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః ।
ఓం నిఖిలాగమవేద్యాయ నమః ।
ఓం నిత్యానన్దాయ నమః ।
ఓం సూర్యాయ నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి సూర్య అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్