Adsense

Tuesday, March 12, 2024

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు?

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు?


సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!

దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు.

వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.

శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.

ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.

కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది

వాగ్దేవతలు Gods of speech

వాగ్దేవతలు:


తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం:
అ నుండి అః వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత...వశిని.! అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.
క"నుండి ..భ..వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని సౌర ఖండం..అంటారు. సౌర ఖండంలోని క..నుండి ఙ..వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.
చ"నుండి..ఞ..వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత .మోదిని.! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
ట..నుండి ణ..వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి ..విమల.! అంటే మలినాలను తొలగించే దేవత.
త"..నుండి..న..వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత ..అరుణ.! కరుణను మేలుకొలిపేదే అరుణ.
ప..నుండి..మ..అనే ఐదు అక్షరాలకు అధిదేవత..జయని.! జయమును కలుగ చేయునది.
మ"నుండి.."క్ష..వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని అగ్ని ఖండం..అంటారు. అలాగే అగ్ని ఖండంలోని య, ర,ల, వ* అనే అక్షరాలకు అధిష్టాన దేవత..సర్వేశ్వరి.! శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
ఆఖరులోని ఐదు అక్షరాలైన శ, ష, స, హ, క్ష లకు..అధిదేవత ..కౌలిని.!
ఈ అధిదేవతలనందరినీ ..వాగ్దేవతలు.. అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.
అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.
ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.
మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.
అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.
భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.
కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.
మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.
మనం చేసే శబ్దమే..ఆ దేవత..!
మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.
ఎంత అద్భుతం. ఇది సనాతన ధర్మం.
ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.

Monday, March 11, 2024

Medicinal properties in AJWAIN (VAMU)

Medicinal properties in AJWAIN (VAMU)


Used medicinally and as a home remedy, it is pungent in taste. Vam has been used since ancient times. Let us know in brief how to use  ajwain   which is very useful in health care as a cure for diseases.

* If the ajwain is fried and dried, salt is added to it, and ghee is added to the first lump and fed to small children, the food will be digested well.

ajwain is used for milk secretion and digestion in lactating children. Those who prepare milk from milk powder should wrap the vam in a thin cloth and boil this water in the water used for milk (very little vam should be used) and use that water to mix the milk.

* If adults eat the first bite after roasting the ajwain and adding salt, pepper and asafoetida to the powder, indigestion problems and gas production will not occur. Keeps BP under control. Relieves constipation.

*  ajwain Kasha helps to dissolve kidney stones when taken medicinally. Eliminates problems in intestines and digestive system.

* Causes nausea. the food

Useful in preventing impatience and stimulating the brain. + From vamu, if you drink that juice, it reduces the inflammation in the stomach. Strengthens the body. It is said that the inclusion of vampoo in baby foods helps the uterus to contract.

*  ajwain leaves are made into chutney, bajjiluka, curry and eaten, it dissolves mucus, flu, malaria.

It works like a panacea for fevers. If vam is included in the food, worms do not form in the stomach of children.

* Boiling ajwain in water and using ghee in that water will reduce cramps. Vamu infusion given three times a week as medicine to children does not cause celiac disease. Also, if the powder of vamu, salt and peppernuri is taken in food, blood will increase.

* If you add salt to ajwain   powder and eat it, Bhuktaayasam, flatulence and stomachache will be reduced. It also works well in regularizing bowel movements to prevent insomnia and induce restful sleep. * If you eat vam mixed with jaggery powder, the rash caused by allergy will be reduced. If you smell the vamu powder wrapped Reduces cold.

Keep away anger

All those who are successful in life do not show anger towards others. Focus on the problem that caused the anger. Anger is a danger to anyone when it crosses some limits as if his own anger is his enemy. About the past, about the future, tension.. then anger is very natural. Regardless of the reasons for such anger, it is important to monitor your mental state from time to time in order to overcome the anger that has overtaken you. Do we have control over ourselves! Or! It should be checked often.
Anger has a root cause. Situations or people can cause anger. Sometimes the reason for anger can be our way of thinking. Anger is caused by negative thoughts. So reevaluate your perspective on the thing that made you angry. Anger can be caused by fear, low self- esteem or a bruised ego. Control this emotion first. Anger will subside by itself. Good and bad are like toys for the coin of life. Thinking about bad things may be the cause of your anger. In every case there is a positive with a negative Focus on things. A positive attitude gives the confidence to work effectively even in adverse situations. People with low self- confidence are often stressed. Such people are haunted by failures. To reduce anger, first accept your shortcomings. Try to overcome weaknesses and increase strengths.

Work hard to change the situation. The problem is likely to become more complicated if the emotional conflicts are resolved with anger. Think constructively and work towards problem solving. Anger gets in the way by itself. Have a clear understanding of the purpose and destination of life. Think about the things that will help you reach the goal. Keep things and people away that make you angry and frustrated. Practice controlling emotions. Also, don't hesitate to change the things that are causing your anger. Researchers say that temper tantrums have an immeasurable negative impact on a person's health. Unnecessary anger can cause a lot of damage. Such people are prone to addictions like smoking and drinking. The immune system is greatly reduced. There can be many reasons for anger. Any kind of anger has serious consequences. Anger causes passions to explode in man and moral judgment is destroyed. Adequate knowledge is lacking. Malice prevails. A man loses his wisdom and does things that cannot be done. But is it better not to have anger! If you see that, besides the person who shows anger, the person who has no real anger is not so trustworthy. It is not a man who can see and bear injustice before his eyes. He who tolerates iniquity and cannot resist evil is more dangerous.

Any anger at all is pointless. If there is an angry co- worker, a boss, or an unhealthy relationship, positively explore the cause. Discuss the reasons in a friendly atmosphere. Take initiative in solving the problem yourself. Your behavior can be the solution to your problem. It would be great if everything was 100% correct. So fighting for the sake of it only brings boredom and problems every now and then. Don't lose faith in your energetic abilities. Don't forget that every defeat leads to victory. To get that victory, the first duty is to stay away from anger.

శివప్రదోష స్తోత్రము



కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః

ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః
హర హర మహాదేవ

ఫాల్గుణమాసం - పయోవ్రతం

ఫాల్గుణమాసం - పయోవ్రతం
(రేపటినుండి "ఫాల్గుణమాసం సందర్భంగా...)


 చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం♪. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం♪. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది♪.

 ఫాల్గుణం... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం♪. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి శ్రీమహావిష్ణువుకి నైవేద్యంగా క్షీరాన్నం సమర్పిస్తే అభీష్టసిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది♪.

ఈ పయోవ్రతాన్ని ఆచరించిన అదితి సాక్షాత్తు శ్రీహరినే (వామనుడు) తన పుత్రుడిగా పొందింది♪. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి♪.

వసంత పంచమి నుంచి ఫాల్గుణ పౌర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది♪. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు♪. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది♪.

ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడే రావణుడితో యుద్ధానికి వానర సేనను వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు♪.

ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది♪.

 రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు♪. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు♪.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు♪. ఇక మహాత్ములైన శ్రీకృష్ణచైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ నెలలోనే జరిగింది♪. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరుంది♪. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి♪.

ఇక, తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పండుగను ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు♪. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు♪. వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను *‘వసంతోత్సవం’* పేరిట జరుపుకునేవారు♪.

 ప్రహ్లాదుని చంపబోయిన హిరణ్య కశ్యపుని సోదరి హోలిక తాను దహనమవుతుంది♪. ఆ రాక్షసి చనిపోయిందనే ఆనందంలో హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. లోకకల్యాణం కోసం పార్వతీపరమేశ్వరుల వివాహం జరిపించాలని నిర్ణయించిన దేవతలు, గిరిపుత్రికపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుడి సాయం కోరారు. దేవతల కోరిక మేరకు శివుడిపైకి మన్మథుడు పూలబాణాన్ని ప్రయోగించి, తపోభంగం చేస్తాడు♪. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి ఆయనను భస్మం చేస్తాడు♪. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామ దహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు♪.

మరో పక్క పాల్గుణ శుద్ధ పౌర్ణిమ రోజున కృష్ణభగవానుణ్ణి ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్‌లో డోలికోత్సవాన్ని నిర్వహిస్తారు♪.


 శాస్త్రీయ కారణాల ప్రకారం.. వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి♪. ఈ సమయంలో కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు, నీళ్లను శరీరంపై చల్లుకోవడం వల్ల వ్యాధుల తగ్గుముఖం పడతాయనేది మరో వాదన♪.

ఫాల్గుణమాసం విశిష్టత The specialty of Falgunamasam

ఫాల్గుణమాసం విశిష్టత
[ 11-03-2024 సోమవారం నుండి 08-04-2024 సోమవారం వరకు ]

 శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణమాసం♪.
ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు♪.

 ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి♪.

ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది♪. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేషఫలితాలను ఇస్తుంది♪.

 పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది♪. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను♪. దీనిని *డోలోత్సవం* అని అంటారు♪. దీనినే కొన్ని ప్రాంతాలలో *డోలాపూర్ణిమ* అని అంటారు♪.

_*నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం*_
_*ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌*_

ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి♪.

ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది♪. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి _*'చూతకుసుమ భక్షణం'*_ తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి♪. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి♪.

_*చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం*_
_*తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే*_

అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి♪.

అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది♪. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది♪. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు♪. ఈ పూర్ణిమ శక్తితో కూడినది♪. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది♪. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు♪. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది♪.

ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది♪. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది♪. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమ నాడు మామిడిచెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది♪. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు♪. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది♪. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు♪. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం♪.

సేకరణ:

పతివ్రతా ధర్మములు Pativrata virtues

పతివ్రతా ధర్మములు 


పతివ్రతాధర్మము శ్రేష్ఠంబని వర్ణింపబడినది. అదెట్లనగా?

పతివ్రత - భర్త భుజించిన తరువాతనే భుజింపవలెను. అతడు నిలచియున్నచో తానును నిలుపబడవలెను.

భర్త నిద్రించిన పిమ్మట తాను శయనింపవలెను. అతడు మేలుకొనక ముందు తాను నిద్ర నుండి లేవవలెను.

ఎట్టిదావరికము లేనిదై ఎల్లకాలము భర్తకు హితము నాచరింపవలెను. సాధ్వీవనిత తాన అలంకరించుకొనియే భర్తకు కనుబడవలెను. అతడు గ్రామాంతరము వెళ్ళినపుడు మాత్రము కుంకుమ మొదలగు మంగళద్రవ్యములను ఉపయోగించి, అలంకారమును మానవలెను.

భర్త పేరు తానెప్పుడు ఉచ్చరింపరాదు. ఒకవేళ అతడు తీక్షముగా మాటలాడినను శిక్షించినను తాను మరల నాక్రోశము జెందరాదు.

భర్త పిలచినపుడు ఇంటి పనులను విడచి వెళ్ళి నమస్కరించి స్వామీ! ఏమిటి! అని వినయముతో ప్రశ్నించి యాతడు చెప్పిన కార్యమును ప్రసన్నమనంబున గావింపవలెను.

ఇంటివాకిలిని చాల కాలము తాను నిలువబడరాదు. పరగృహమునకు భర్త అనుమతి లేనిది పోకూడదు.

భర్త నుడివిన రహస్య వృత్తాంతము ఇతరులకు చెప్పవలదు.

భర్త దేవుని పూజించుటకు వలయు పత్రపుష్పాదులను చెప్పకమునుపే సమర్చియుంచవలెను.

భర్తకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావలెనో అట్టి అవసరముల తీర్చుటకై పతివ్రత - సంసిద్ధురాలై యుండవలెను.

పతి - అభిమతము లేనిది కాశీరామేశ్వరాది తీర్ధక్షేత్రములకు వెళ్ళకూడదు.

ఊరేగింపులు సమాజములు మున్నగు వానిలో పాలుగొనరాదు. ఒకవేళ పుణ్యతీర్ధములందు గ్రుంకులిడవలెనని కోర్కెగలిగినచో భర్తగారి పాదోదకమును చల్లుకొని పుచ్చుకొనవలెను.
ఎందుకనగా? గంగాది పుణ్యతీర్ధములు కాశ్యాది పుణ్యక్షేత్రములును పతి చరణోదకమునందు కలవని పతివ్రతాధర్మశాస్త్రము చెప్పుచున్నది. కావున సంశయింపరాదు.

భర్త తినగా మిగిలినది ప్రసాదమని భావించి సాధ్వీమణి పరిగ్రహింపవలెను.

దేవతా నివేదనమును చేయకుండా పితృదినమునాడు పెద్దలకు సమర్పించను, అతిధులకు పరిచారకులకు పశువులకు బిచ్చగాండ్రకు నొసగకుండను. తాను ఆహారమును స్వీకరించరాదు.

గృహమున పరికరముల నన్నిటి నెప్పటికప్పుడు సరిజూచుకొనవలెను. విసుగు లేనిదై సంబరమున నుంటూ అనవసర వ్యయముల జేయనిదై అనగా పొదుపు గలిగి యుండవలెను.

భర్త యాజ్ఞలేనిది ఉపవాసమును చేయరాదు. ఒకవేళ స్వేచ్ఛగా నుపవాసము నాచరించినచో అట్టి వనితకు ఉపవాస ఫలము సమకూరుకుండుటయే గాక నరకంబు నొనగూరును.

ప్రాణనాధుడు సుఖముగా నిశ్చింతగా నున్నపుడు యధేష్టము విహరించునపుడు ఆటంకములను కల్పించరాదు.

భర్తబలహీనుడైనను కష్టాలపాలైనను రోగగ్రస్తుడైనను ముదుసలియైనను సంతోష స్వాంతుడైనను మిడుకువాడైనను ఆతనిని తిరస్కరింపరాదు.

రజస్వలగా నున్నతణ్ణి మూడుదినములు భర్తకు కనుపడనిదై తనమాటను వినుపింపఁగూడదు. నాలుగవనాడు సుస్నాతయై మొట్టమొదట భర్త ముఖమును చూడవలెను. వీలులేనిచో పతిని మదిని తలచుకొని సూర్యునవలోకింపవలెను.

పసుపు, కుంకుమలు, సింధూరము, కాటుక, రవిక, తాంబూలము, మంగళసూత్రము, గాజులు, కమ్మలు, మొదలగు మాంగల్య వస్తువులను పతివ్రతయగు వనిత దూరము చేయరాదు. అనగా ఎల్లకాలము ధరించియుండవలెనని భావము మరియు తలవెంట్రుకలను దూసుకొని కొప్పునమర్చుట నేముగాదు. వీని నన్నిటిని విడువకుండు సువాసిని తన భర్త చిరకాలము జీవింపవలెనని యపేక్షించు సాధ్విగా గుర్తింపబడునని సారాంశము.

చాకలిదానితోడను రంకులాడితోడను సన్యాసురాలితోడను నిర్నిమిత్తముగా ద్వేషించుదాని తోడను ఒకప్పుడైనను చెలిమి జేయరాదు.

భర్తను బాధించు నామెతో మాటలాడగూడదు. ఒంటరిగా నుండకూడదు. దిసమొలతో జలక మాడరాదు (చిన్న వస్త్రమునైన ధరించి స్నానముఁజేయవలెనని భావము).

రోలు పైనను రోకలి పైనను మూకుడు పైనను బండపైనను గడపపైనను తిరుగలి విసుర్రాయి పైనను కూర్చుండరాదు.

ఏకాంతమున భర్తతో సుఖించునపుడు దక్క ఇతర సమయములలో స్వతంత్రించి సంభాషింపకూడదు.

భర్తకు ఇష్టమైన వస్తువుల యందు పనుల యందు తాను గూడ ప్రేమ కలిగి యుండవలెను.

భర్త సంతోషముతో నున్నతఱి తాను సంబరముతో నుండవలెను. ఏదేనొక సంకటమున భర్త బాధపడుచు విచారపడుచుండినచో తానును ఖిన్నురాలుగ నుండవలెను.

సంపదలయందు ఆపదలయందు నొకేవిధముగా నుంటూ ధైర్యముగలదై సంతోషాతిశయమును గాని దుఃఖాడంబరమును గాని చూపరాదు.

ఇంటియందు నెయ్యి లవణము (ఉప్పు) మంచినూనె మున్నగునవి లేనపుడు భర్తకు నెమ్మదిగా తెలుపవలెను గాని హఠాత్తుగా చెప్పియాతనిని బాధింపకూడదు.

పార్వతీదేవీ! నిజముగా విచారింప పతివ్రతకు భర్త- బ్రహ్మవిష్ణు మహేశ్వరుల కన్న నధికుడని తేటపడును. అనఁగా ప్రతి సాధ్వీమణి - తన పతి సాక్షాత్ శివుడనియే భావింపవలెనని సారాంశము.

వ్రతములను ఉపవాసములను భర్తను నిరాకరించి చేయునామె పతిదగు ఆయుష్యమును హరించును. మరియు మరణించిన తరువాత నరకదుఃఖము ననుభవించును.

భర్త యెద్దియేని కఠినముగా చెప్పినపుడు తాను క్రోధముతో సమాధానము నిచ్చునెడ గ్రామమున ఆడుకుక్కయైగాని అరణ్యమున ఆడునక్కయైగాని జన్మించును.

భర్తకూర్చుండు దానికన్న నెత్తైన పీఠమునందు తాను కూర్చుండరాదు.
దుర్మార్గుల చెంతకు వెళ్ళకూడదు. భర్త నుద్దేశించి నిందావాక్యములుగాని భీతి గొలుపుమాటలను గాని యాడరాదు. ఒకరిని నిందింపఁ గూడదు. పోట్లాటను దూరమొనర్పవలెను. అనఁగా తానెప్పుడును కలహింపరాదని భావము.

పెద్దలముందు హెచ్చుగా మాటలాడరాదు. హెచ్చుగా నవ్వకూడదు. భర్త బయట నుండి వచ్చుటను గమనించి మందస్మితముతో నెదుర్కొని ఆహార పానీయములను తాంబూలాదుల నొసగి పాదసేవ జేయుచు మార్గాయాసమును పోగొట్టు సంతోష మనోహర వచనముల పలుకుచు నాతని రంజింప జేయు సాధ్వీమణి ముల్లోకములను సంతసింప చేశినదగును.

తండ్రిగాని అన్నదమ్ములుగాని కుమారుఁడు గాని కలుగఁజేయు సుఖము పరిమితమై యుండును. భర్త వలన నేర్పడు శరీర సుఖముగాని మానసిక ఆనందము! ఇహపరముల రెంటికిని సాధనమగును. కావున నట్టి భర్త నెల్లకాలము గౌరవిం నవమానింపరాదు.

తన మాంగళ్య జీవనమునకు కీర్తిప్రతిష్ఠలకును భర్తయే కారణమ దైవముగా భావింపవలెను.

భర్తయే దేవుఁడు భర్తయే గురువు. పతియే ధర్మము పుణ్యతీర్ధములు వ్రతములు నగువాడు. అందువలన వ్రతోపవాసాది నియమములను విడనాడి భర్తనే సేనింపవలెను.

భర్తను నిరాకరించి రహస్యముగా ప్రవర్తించు వనిత - చెట్టు తొఱ్ఱయందు నివసించు పెద్ద ఫిట్టయై పుట్టును.

భర్త దండింపగా తాను నాతనిని కొట్టదలచిన యామె - ఆడు పెద్దపులిగా జన్మించును.

పరపురుషుని కడకంటి చూపులతో గాంచునది - మెల్లకన్నుగలదగును.

భర్తకు పెట్టకుండా తాను మిష్టాన్నమును భుజించునెడ ఊర పంధియై గాని ఆడుమేకయై గాని జన్మించును.

ప్రియుని నీవు అని పలుకరించునది మూగదై పుట్టును.

సవతినెల్ల కాలము ద్వేషించు వనిత ప్రతి జన్మయందును దౌర్భాగ్యురాలగును.

భర్త చూపు తప్పించి పరపురుషుని మోహముతో గాంచు భార్య - ఒకకన్ను గ్రుడ్డిదై పెడముఖముతో కురూపిగా జన్మించును.

జీవాత్మ అనగా ప్రాణము లేని శరీరము క్షణకాలములో అపవిత్ర మైనట్లు పెనిమిటి లేని తరుణి బాగుగా స్నానము జేశి యలంకరించు కొనినను పరిశుద్ధురాలు కాకుండును.

పతివ్రతను కనిన తలిదండ్రులు ధన్యులు; పతివ్రతను పరిగ్రహించిన పురుషుఁడును పుణ్యాత్ముడని చెప్పవచ్చును. పతివ్రతఁ తగు సత్ప్రవర్తనమున చేసి తండ్రివంశము వారు ముగ్గురు, తల్లివంశమువారు ముగ్గురు, భర్తవంశమువారు ముగ్గురును స్వర్గమున దివ్యసుఖముల ననుభవింతురు, స్త్రీలు దుర్మార్గమున నడచినచో మాతాపితృపతికుల త్రయమును పుణ్యలోకముల నుండి పడద్రోయుదురు.

పతివ్రత యొక్క పాదము స్పృశించు ప్రదేశము పవిత్రమై సంచరించువారి పాపములను పోగొట్టును.

సూర్యభగవానుడు చంద్రుడు వాయుదేవుడును సాధ్విదగు చరణమును స్పృశించి తమకు పావనత్వము నొదవజేసుకొందురు.

ఉదకములు పతివ్రతను తాకి “ఇప్పుడుగదా మా కల్మషమును తొలగించుకొంటి" మని భావించును. ఐతే భర్తయే పరమదైవమని భావించి ప్రవర్తించు సాధ్వీమణులను పురుషులు చులకన జేయరాదని దిగువ సందర్భమున గాననగును.

భార్యా సంతానవృద్ధయే గృహస్థుని సంసారము చక్కగా సాగుటకు ఇల్లాలే మూలము; శారీరక వాచిక మానసిక సుఖముల బడయుటకు ధర్మపత్నియే నిదానము; ధర్మార్థకామ మోక్షఫలముల నొందుటకును భార్యయే భర్తకు సహకరించును. మంచి సంతానమును బడసి వంశవృద్ధి గలుగజేయుటకును సతియే కావలెను.

సౌందర్యము అంగసౌష్టవముగల తరుణీమణులు సర్వసాధారణముగా గృహముల నుండువారు కాని పూర్వజన్మమున గావింపఁబడిన శివారాధనము వలనను ఈజన్మ యందలి పురుషునకు పతివ్రతయగు భార్యలభించును. సాధ్విని పత్నిగా పొందినవాడు ఇహపరలోకమ అయింవఁజాలును.

భార్యలేనివాడు దేవతా కార్యమును పితృకర్మను అతిథి సత్కా యజ్ఞయాగ వ్రతములను చేయుటకు తగినవాడుకాడు.

పతివ్రతయగు భార్య తనయింట గల భర్తయే సర్గృహస్థుడని చెప్పవచ్చును. అట్లుకానిచో ముదుసలి తనము శరీరమును క్షీణింప చేయునట్లు రాక్షసి తన ఎదుట ఉన్న వారిని మ్రింగునట్లును దుర్మార్గురాలగు భార్య - భర్తను పీడించుచు క్రుంగదీయును.

గంగాస్నానముతో దేహము పవిత్ర మగునట్లు పతివ్రతా దర్శనము వలన సమస్త చరాచరము పావనంబగును.

గంగానదికిని పతివ్రతకు నెట్టి భేదములేదు. అందువలన పతివ్రతయు తత్పతియు గౌరీశంకరులనియే భావింపవలెను.


పతివ్రతలు-విధానాలు

అమ్మా! గిరిజాదేవీ; పతివ్రతాధర్మము నిట్లు వర్ణించితిని. ఇక నాధర్మముదగు భేదములను నుడువుచున్నాను. సావధానముగా వినుము!

పతివ్రతలు - ఉత్తమురాలు మధ్యమురాలు కనిష్ఠురాలు మిక్కిలి నికృష్టురాలునని నాలుగు తెఱగులుందురు.

స్వప్నమున గూడ తన అంతఃకరణమున భర్తనే గాంచుచు పరపురుషుని కలలోనైన భావింపని వనిత - ఉత్తమపతివ్రత అనబడును.

పరపురుషుని తండ్రి వలెగాని సహోదరుని వలెగాని కుమారుని వలెగాని చూచెడు బుద్ధిమంతురాలు మధ్యమ పతివ్రత అనబడును.

స్వధర్మము కాదని గుర్తెరిగి వ్యభిచరింపని మగువ కనిష్ఠ పతివ్రత యగును.

భర్తకు భయపడిగాని తనవారికి వెఱచిగాని భ్రష్టురాలు కానట్టి తరుణి అతి నికృష్టయగు పతివ్రతయని గ్రహింపనగును.

ఈ నాలుగు విధముల వారును పాపములను పోగొట్టు పతివ్రతలనియే చెప్పవచ్చును. మరియు వీరు ఇహపర లోకములయందును సంతృప్తిజెందువారై లోకములను పవిత్రము జేయుదురు.

ఫాల్గుణమాసం ప్రారంభం:

ఫాల్గుణమాసం ప్రారంభం:


తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు. ఆనాడు నువ్వులతో కలిపి వండిన అన్నంతో హోమం చేస్తే సర్వవిఘ్నాలు నశిస్తాయి. ఆనాడు పుత్రగణపతి వ్రతం కూడా ఆచరించాలి. పంచమినాడు అనంతపంచమి వ్రతాన్ని ఆచరించాలి.

ఫాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్లపక్షంతో ప్రారంభించి ఫాల్గుణ బహుళ ద్వాదశి వరకు నృసింహారాధన చేయాలి. ఫాల్గుణ పూర్ణిమనాడు హోళీ వస్తుంది. ఆనాడు రాబోయే వసంతానికి స్వాగతం చెబుతూ వసంతోత్సవాలు జరుపుకుంటారు.

Sunday, March 10, 2024

Prasad without salt is the belief of the devotees here

It seems that the offerings reported to the Lord are done not only with care but also with taste. But in this Tiruvannagar Venkatachalapati temple called Oppiliyappan, only saltless prasads are offered to the lord. As Venkateswara Swamy's brother, this Swami who is being worshiped as a Bhakta Varada who arranges marriages quickly...

Oppiliyappan Temple...recognized as one of the hundred and eight Vaishnavisms...has an impressive architectural style with a five- storied Rajagopuram in a spacious courtyard. Thirunageswaram is located near Kumbakonam in Tamil Nadu. The temple Lord Vishnu is worshiped here by Oppiliyappa Nga. This lord is considered to be the brother of Tirumala Venkateswara. People who are unable to go there due to any reason to pray to Lord Venkateswara in Tirumala can visit this Lord and pay their prayers. In this temple built by the Cholas in the eighth century, Swami Bhudevi appears along with her and blesses the devotees. It is called Markandeya Kshetra.
Sthalapuranam
According to Brahmanda Purana... once Tulasimatha did penance for Lord Vishnu. Appreciating that penance, she asked that if Lord Vishnu appeared, she would be given a place in Swami's bosom, equal to Goddess Lakshmi. Swami blessed him and told him to wait for him. So Tulsi came to this place

She started waiting for Swami. Also... Sage Markandeya.. Lord Vishnu took pity on Lakshmi when he did penance to give birth to his daughter. So when sage Markandeya saw a baby girl named Tulsiva, he brought her and raised her as Bhumi Devi/ Bhudevi. Some years ago, an old man came and asked Maharshi that he would marry that girl, Sasemira said. He told various reasons that she could not cook properly.. and it was too small. Even so.. when the old man insisted that he would marry her, he understood that it was Vishnumurthy and happily prepared to marry her. It is believed that Swami married Tulsi, the embodiment of Goddess Lakshmi, and settled in this area. If the Chola kings built a temple here some years ago, it is said that it was developed by the Thanjavur kings. To this temple

Along with Bhudevi and Markandeya...
Devotees going past the Rajagopuram to the sanctum sanctorum see the Lord standing at a height of eight feet. Swami Chenta Bhu Devi and Markandeya Maharshi can be seen sitting. After that, you can visit the idols of Krishna, Rama, Hanuman, Garuda, Alwars, etc. in this premises. If unmarried people worship this lord, they will get married soon.. Those who are married

It is a belief that married life will go smoothly without any problems if visited. Also, devotees show interest in performing Shashtipurti and Satabhishekam ceremonies in the presence of Swami.

Why not have salt...

Like all the temples.. Pulihora, Daddyodanam, Katte pongali, Vadalu, Murukulu, Sukarpongali etc. are reported here to the Lord. But there is no salt in the rice. Because... when Lord Vishnu came to marry Goddess Bhudevi, he said to sage Markandeya that he would eat whatever was cooked by the goddess... even without salt. That is why salt is not added in the prasads that are reported to the Lord. But it is said that if prasads are eaten inside the temple premises, they taste good even if they are not salted, but when they come out, they feel bland.

శ్రీకృష్ణదేవరాయల జన్మరహస్యం. The secret of the birth of Sri Krishna Devaraya

ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి, కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న సాళ్వ నరసింహరాయల గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ వృద్ధ ప్రభువుకు ఎంతకాలానికీ సంతానం కలుగలేదు.

అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచన చేసి, జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుల్ని రప్పించి “దైవజ్ఞ శబ్దానికి సార్ధకత కలిగించగలిగిన మీవంటి మహనీయులతో ఒక పని పడింది. మీకు భూత భవిష్యత్ వర్తమానకాలాలు మూడూ తెలిసినవే కనుక - ప్రాచీన జ్యోతిష్యగ్రంథాన్ని పరిశీలించి, రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతానయోగం కలిగే మార్గం చెప్పండి" అన్నాడు.

అప్పుడా సిద్ధాంతులంతా ఆరుమాసాల వ్యవధి కోరారు. ఇళ్లకు వెళ్లి అంతవరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు. ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జనన సూచక విషయం కనిపించింది.

దాని ప్రకారం - ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశీ భానువారం నాటి రాత్రి తులాలగ్నం రెండు ఘడియలు భుక్తి జరిగిన వెనుక ఆ గ్రామానికి ఉత్తరదిశగా రెండుకోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమ్మీద పడుతుందని సిద్ధాంతులు గ్రహించారు. దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకుని, ఆ నక్షత్రాన్ని ఒక కలశంలోని నీటిలోనికి పట్టి, జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రిగారికి తెలిపారు.

మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి, దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి, మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసే శక్తి గల్గిన వృద్ధ పండితుని దానిమీదకు చేర్చడంతోపాటు పవిత్రోదకంతో నింపిన బంగారు కలశాన్ని అతని చేతికిచ్చారు. రాజు, మంత్రులు, సామంతులు, పౌరులు, గ్రామగ్రామాలవారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి, రెప్పవాల్చకుండా ఆకాశం కేసి చూడసాగారు. ఆ సిద్ధాంతులు చెప్పిన వేళకు మిరుమిట్లు గొల్పుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలశంలోనికి తళుకుమంటూ జారింది. మంత్రి ఎంతో సంతోషించి ప్రతిభను రాజుగారికి విన్నవించగా, నరసింహరాయలు ఆ దైవజ్ఞకు చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు.

ఆ తర్వాత ఆ కలశంలోని నీటిని రాజు గ్రహించి, తన చిన్న భార్యను పడక సుఖం అందించవలసిందిగా కోరగా ఆమె కాన్పు వల్ల యవ్వనం జారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసిని తనలాగానే అలంకరించి ఆ ముసలి రాజును పంచించింది.

పవిత్రకలశోదకం ఆమెక్కూడా కొంత పోసి, నరసింహరాయలు ఆమెతో రతి సుఖం అనుభవించాడు. ఆ తర్వాత కొంతసేపటికప్పుడో, ఆమె దాసీ అని తెలుసుకుని, ఆమెను చంపబోతూ, ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు.

అంత అర్ధరాత్రి ప్రభువు కబురు పెట్టాడంటే ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని, ఆదరా బాదరాగా వచ్చిన మంత్రి రాజు కోపం చూసి - అతని చేతిలో కత్తి లాగి పారేసి "దేవా! ఆగు! ఎందుకింత సాహసం తలపెట్టావు? ఈమె చేసిన తప్పేమిటి?" అని అడిగాడు. నరసింహరాయల జరిగిందంతా చెప్పి "నీ అభిప్రాయమేమిటి?" అడిగాడు.

అప్పుడా బుద్ధి కుశలుడైన మంత్రి "ప్రభూ! ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా? ముసలి భర్తతో కులకడానికి వైముఖ్యం చూపిన చిన్నరాణి దగ్గరే ఉంది తప్పు! బాల్యచాపల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో! ఇక జరిగిపోయినదానికి విచారించి ప్రయోజనం లేదు. ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరకే చెడగొట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు! క్షేత్రం ఏదయినా బీజం ప్రధానం అన్నారు. దైవసంకల్పం ఇలా ఉంటే మార్చడం మన తరమా? పుత్రులలో ఔరసుడు - క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. దీనికి పుట్టేవాడు ఔరసుడనబడతాడు.

ధర్మశాస్త్రరీత్యా అతడ్ని మీరు పుత్రుడిగా పరిగ్రహించవచ్చు! కనుక, ఈ సంగతి రెండో కంటికి తెలీకుండా, అంతః పుర సరిహద్దులు దాటకుండా, ఈమెక్కూడా రాణి హోదా కల్పించండి! అది అన్ని విధాలా శ్రేయస్కరం" అని బోధపరిచేసరికి, స్త్రీ హత్య మహాపాతకమనీ - అందునా తనకు రతి సుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపం అనీ నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు.

మంత్రి ఇంటికెళ్లేసరికి తెల్లతెల్లవారుతోంది. అప్పటికే అంతఃపుర జనులు రాచనగరి వీధుల్లో గుసగుసలాడు కుంటున్నారు. అయినా అదేమీ పట్టించుకోకుండానే ఇల్లు చేరుకున్నాడు. భార్య ఎదురొచ్చి "రాజుగారు అర్ధరాత్రి పూట కబురు చేశారేం? విశేషమేమిటి?" అని ప్రశ్నించింది.

“రాచకార్యపు తొందర” అన్నాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం ఇష్టంలేక. అందుకామె నర్మగర్భంగా నవ్వి "మీరు చెప్పకపోయినా కొంతవరకూ తెలుసులెండి! చిన్నరాణీగారు ప్రభువులను వంచించి, దాసీ దాన్ని అలంకరించి రాజుగారికి పడకసుఖం అందించి రమ్మని పంపిందట కదా! ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు కాబోతున్నాడన్న మాట!" అంది.

మంత్రి చాలా ఆశ్చర్యపోయి "ఆహా! లోకం ఎంతటిది? నాకంటే ముందే ఈ వార్త రాణివాసమంతటికీ తెలిసిపోయిందే!" అనుకున్నాడు. ఐతే ఈ విషయం మాత్రం ప్రభువులవారికి చేరకుండా జాగ్రత్తపడ్డాడు.

ఆ దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపీ విజయనగరాన్ని పరిపాలించాడు. అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన ఘనుడా ప్రభువు. ఇదీ శ్రీకృష్ణదేవరాయల యొక్క జన్మరహస్యం.

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు.!!

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు.!!

1 *.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి*

2 *.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి*

3 *.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ  సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః - శరణాగతి కీ , సర్వ శుభాలకీ*

4 *.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ - ఆయుర్దాయం కోసం*

5 *.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి*

*హర హర మహాదేవ్ .... 

ద్వాదశ ఆర్య స్తుతి

ద్వాదశ ఆర్య స్తుతి

ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః ।
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు ॥ 1 ॥

నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే ।
క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ ॥ 2 ॥

కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ।
ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ ॥ 3 ॥

త్వం హి యజూఋక్సామః త్వమాగమస్త్వం వషట్కారః ।
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ ॥ 4 ॥

శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ ।
శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి ॥ 5 ॥

త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేంద్రియజదోషాః ।
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు ॥ 6 ॥

ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ ।
బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః ॥ 7 ॥

యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలమ్ ।
ధృతబోధం తం నళినీభర్తారం హర్తారమాపదామీడే ॥ 8 ॥

యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమాంశుబింబగతః ।
భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః ॥ 9 ॥

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాఽశేషరోగపటలం నః ।
కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్ ॥ 10 ॥

వాతాశ్మరీగదార్శస్త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ ।
గ్రహణీభగంధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసి ॥ 11 ॥

త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః ।
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో ॥ 12 ॥

ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నభఃస్థలాత్పతితమ్ ।
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ ॥ 13 ॥

ఇతి శ్రీసాంబకృతద్వాదశార్యాసూర్యస్తుతిః ।


-- ద్వాదశ ఆర్య స్తుతి

లింగోద్భవ గద్యం

లింగోద్భవ గద్యం.

జయ జయ శివ లింగ జ్యోతిర్మహాలింగ లింగోద్భవ శ్రీ మహాలింగ వేదత్రయీ లింగ నిర్లింగ సంస్పర్శ లింగ క్షమా లింగ సద్భావ లింగ స్వభావైక లింగ ...దిగ్దేశ కాల వ్యవఛ్చేద రాహిత్య లింగ స్వయంభూ మహాలింగ పాతాళలింగ క్రియాలింగ పంచాక్షరీ లింగ పంచప్రకారోపదీపక్రియా లింగ వారాణసీ క్షేత్ర సింధూ గయా రుద్ర పాదద్వయీ శ్రీగిరి స్థాన శోణాచల వ్యాఘ్రపుర్యాది నానావిధ స్థాన సంసిద్ధి ప్రమాణాప్రమేయ ప్రభా లింగ  విద్యాకళాలింగ షత్కర్త లింగాగమామ్నాయ లింగా ప్రతిష్టా కళా లింగ, మూలాలవాలాంతరాళానలావాణ  కోణత్రయీ గేహ రోహ ప్రథా లేఖికాస్యూతి నిధ్యాన షట్పుష్కరీ నిమ్న టంక్రోడ విష్కంభ నిష్కంప శంపాలతా లంఘిత బ్రహ్మరంధ్ర స్రవచ్చాంద్రసాన్ద్రామ్రుత స్యందనస్పందితానంద లింగాదిమధ్యాంతశూన్య స్వరూపాభిధాలింగ ఖట్వాంగ లింగా హిలింగాభ్రగంగాసరిల్లింగ సారంగలింగాత్మభూలింగ ఐంలింగ ఈంలింగ ఓంలింగ వృక్షాపరోక్ష విరూపాక్షా లింగా నమస్తే  నమస్తే నమస్తే నమః

హర హర మహాదేవ

గణపతి ప్రార్థన Ganapati Prayer

గణపతి ప్రార్థన

॥శ్లో॥
యం నిర్జరాసుర నరా అఖిలార్థ సిద్ధ్యై
భూర్యన్తరాయహతయే౬నుదినం నమన్తి |
తం భక్తకామ పరిపూరణ కల్పవృక్షం
భక్త్యాగణేశ మఖిలార్థద మానతో౬స్మి||

 అమరులు, అసురులు, మానవులు తమ సమస్త వాంఛా సిద్ధ్యర్థము, అంతరాయ నివారణార్థము, ఏ దేవునకు అనుదినము నమస్కరిస్తున్నారో, ఆ భక్తుల వాంఛలను అనుగ్రహించు కల్పవృక్షము అయిన ఆ గణేశ పరమాత్మకు, అఖిలార్థ ప్రదాతకు భక్తితో నమస్కరిస్తున్నాను. 

గణేశ మహిమ్నః స్తోత్రమ్.. Ganesha Mahimnah Stotram

గణేశ మహిమ్నః స్తోత్రమ్..


శ్రీ గణేశాయ నమః |

అనిర్వాచ్యం రూపం స్తవననికరో యత్ర గలిత స్తథా వక్ష్యే స్తోత్రం ప్రథమపురుషస్యాఽత్ర మహతః |
యతో జాతం విశ్వం స్థితమపి సదా యత్ర విలయః
స కీదృగ్గీర్వాణః స్తునిగమనుతః శ్రీగణపతిః

గణేశం గాణేశాః శివమితి చ శైవాశ్చ విబుధా
రవిం సౌరా విష్ణుం ప్రథమపురుషం విష్ణుభజకాః |
వదన్త్యేకం శాక్తా జగదుదయమూలాం పరిశివాం
న జానే కిం తస్మై నమ ఇతి పరం బ్రహ్మ సకలమ్  ౨

తథేశయోగజ్ఞా గణపతిమిమం కర్మ నిఖిలం
సమీమాంసా వేదాన్తిన ఇతి పరం బ్రహ్మ సకలమ్ |
అజాం సాంఖ్యో బ్రూతే సకలగుణరూపాం చ సతతం
ప్రకర్తారం న్యాయస్త్వథ జగతి బౌద్ధా ధియమితి  ౩

కథం జ్ఞేయో బుద్ధేః పరతర ఇయం బాహ్యసరణిర్యథా
ధీర్యస్య స్యాత్ స చ తదనురూపో గణపతిః |
మహత్కృత్యం తస్య స్వయమపి మహాన్ సూక్ష్మమణువద్
ధ్వనిర్జ్యోతిర్బిన్దుర్గగనసదృశః కిం చ సదసత్  ౪

అనేకాస్యోఽపారాక్షి కరచరణోఽనన్తహృదయస్తథా
నానారూపో వివిధవదనః శ్రీగణపతిః |
అనన్తాహ్వః శక్త్యా వివిధగుణకర్మైకసమయే
త్వసంఖ్యాతానన్తాభిమత ఫలదోఽనేకవిషయే  ౫

న యస్యాఽన్తో మధ్యో న చ భవతి చాదిః సుమహతామలిప్తః
కృత్వేత్థం సకలమపి ఖంవత్ స చ పృథక్ |
స్మృతః సంస్మర్తౄణాం సకలహృదయస్థః ప్రియకరో
నమస్తస్మై దేవాయ సకలసురవన్ద్యాయ మహతే
   ౬

గణేశాద్యం బీజం దహనవనితాపల్లవయుతం
మనుశ్చైకార్ణోఽయం ప్రణవసహితోఽభీష్టఫలదమ్ |
సబిన్దుశ్చాగాద్యాఙ్గణకఋషిఛన్దోఽస్య చ నిచృత్
స దేవః ప్రాగ్బీజం విపదపి చ శక్తిర్జపకృతామ్  ౭

గకారో హేరమ్బః సగుణ ఇతి పునిర్గుణమయో
ద్విధాఽప్యేకో జాతః ప్రకృతిపురుషో బ్రహ్మ హి గణః |
స చేశశ్చోత్పత్తిస్థితి లయకరోఽయం ప్రథమకో
యతో భూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః  ౮

గకారః కణ్ఠోర్ధ్వే గజముఖసమో మర్త్యసదృశో
ణకారః కణ్డాధోఠరసదృశాకార ఇతి చ |
అధోభాగః కట్యాం చరణ ఇతి హీశోఽస్య చ తను
ర్విభాతీత్థం నామ త్రిభువనసమం భూర్భువఃసువః  ౯

గణేశేతి త్ర్యర్ణాత్మకమపి వరం నామ సుఖదం
సకృత్ప్రోచ్చైరుచ్చారితమితి నృభిః పావనకరమ్ |
గణేశస్యైకస్య ప్రతిజపకరస్యాస్య సుకృతం
న విజ్ఞాతో నామ్నః సకలమహిమా కీదృశవిధః
  ౧౦

గణేశేత్యాహ్వాం యః ప్రవదతి ముహుస్తస్య పురతః
ప్రపశ్యంస్తద్వక్త్రం స్వయమపి గణస్తిష్ఠతి తదా |
స్వరూపస్య జ్ఞానం త్వముక ఇతి నామ్నాఽస్య భవతి
ప్రబోధః సుప్తస్య త్వఖిలమిహ సామర్థ్యమమునా  ౧౧

గణేశో విశ్వేఽస్మిన్ స్థిత ఇహ చ విశ్వం గణపతౌ
గణేశో యత్రాస్తే ధృతి మతిరనైశ్వర్యమఖిలమ్ |
సముక్తం నామైకం గణపతిపదం మంగలమయం
తదేకాస్యం దృష్టేః సకలవిబుధాస్యేక్షణ సమమ్
   ౧౨

బహుక్లేశైర్వ్యాప్తః స్మృత ఉత గణేశే చ హృదయే
క్షణాత్ క్లేశాన్ ముక్తోభవతి సహసా త్వభ్రచయవత్ |
బనే విద్యారమ్భే యుధి రిపుభయే కుత్ర గమనే
ప్రవేశే ప్రాణాన్తే గణపతిపదం చాఽఽశు విశతి  ౧౩

గణాధ్యక్షో జ్యేష్ఠః కపిల అపరో మంగలనిధి
ర్దయాలుర్హేరమబో వరద ఇతి చిన్తామణిరజః |
వరానీశో ఢుణ్ఢిర్గజవదననామా శివసుతో
మయూరేశో గౌరీతనయ ఇతి నామాని పఠతి  ౧౪

మహేశోఽయం విష్ణుః సకవిరవిరిన్దుః కమలజః
క్షితిస్తోయం వహ్నిః శ్వసన ఇతి ఖం త్వద్రిరూదధిః |
కుజస్తారః శుక్రో గురురుడుబుధోఽగుశ్చ ధనదో
యమః పాశో కావ్యః శనిరఖిలరూపో గణపతిః  ౧౫

ముఖం వహ్విః పాదౌ హరిరపి విధాతా ప్రజననం
రవిర్నేత్రే చన్ద్రో హృదయమపి కామోఽస్య మదనః |
కరౌ శక్రః కట్యామవనిరూదరం భాతి దశనం
గణేశస్యాసన్ వై క్రతుమయవపుశ్చైవ సకలమ్
   ౧౬

అనర్ధ్యాలంకారైరరుణవసనైర్భూషిత తనుః
కరీన్ద్రాస్యః సింహాసనముపగతో భాతి బుధరాట్ |
స్థితః స్యాత్తన్మధ్యేఽప్యుదిత రవిబిమ్బోపమరుచిః
స్థితా సిద్ధిర్వామే మతిరితరగా చామరకరా  ౧౭

సమన్తాత్తస్యాసన్ ప్రవరమునిసిద్ధాః సురగణాః
ప్రశంసన్తీత్యగ్రే వివిధనుతిభిః సాఽఞ్జలిపుటాః |
బిడౌజాద్యైర్బ్రహ్మాదిభిరనువృతో భక్తనికరై
ర్గణక్రీడామోదప్రముదవికటాద్యైః సహచరైః  ౧౮

వశిత్వాద్యష్టాష్టాదశదిగఖిలాల్లోలమనువాగ్
ధృతిః పాదూః ఖడ్గోఽఞ్జనరసబలాః సిద్ధయ ఇమాః |
సదా పృష్ఠే తిష్టన్త్యానిమిషిదృశస్తన్ముఖలయా
గణేశం సేవన్తేఽత్యతినికటసూపాయనకరాః  ౧౯

మృగాంకాస్యా రమ్భాప్రభృతిగణికా యస్య పురతః
సుసంగీత కుర్వన్త్యపి కుతుకగన్ధర్వసహితాః |
ముదః పారో నాఽత్రేత్యనుపమపదే దోర్విగలితా
స్థిరం జాతం చిత్తం చరణమవలోక్యాస్య విమలమ్
   ౨౦

హరేణాఽయం ధ్యాతస్త్రిపురమథనే చాఽసురవధే
గణేశః పార్వత్యా బలివిజయకాలేఽపి హరిణా |
విధాత్రా సంసృష్టావురగపతినా క్షోణిధరణే
నరైః సిద్ధౌ ముక్తౌ త్రిభువనజయే పుష్పధనుషా  ౨౧

అయం సుప్రాసాదే సుర ఇవ నిజానన్దభువనే
మహాన్ శ్రీమానాద్యో లఘుతరగృహే రంకసదృశః |
శివద్వారే ద్వాఃస్థో నృప ఇవ సదా భూపతిగృహే
స్థితో భూత్వోమాంకే శిశుగణపతిర్లాలనపరః ౨౨

అముష్మిన్ సన్తుష్టే గజవదన ఏవాపి విబుధే
తతస్తే సన్తుష్టాస్త్రిభువనగతాః స్యుర్బుధగణాః |
దయాలుర్హేరమ్బో న చ భవతి యస్మింశ్చ పురుషే
వృథా సర్వం తస్య ప్రజననమతః సాన్ద్రతమసి||

సుబ్రహ్మణ్య స్వామి విభూతికి అంత శక్తి. Subrahmanya Swami Vibhuti is so powerful

సుబ్రహ్మణ్య స్వామి విభూతికి అంత శక్తి 
సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయబడిన లేదా సుబ్రహ్యణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఈయబడిన విభూతిని ఇంటికి తెచ్చి ఏ మూల పెట్టినా సరే ఇంటికి రక్షణగా ప్రహరీ గోడ ఎంతవరకు ఉన్నదో అంత వరకు భూతప్రేతములు చూడడానికి భయపడి పోయి వెళ్ళిపోతాయి. ఆ విభూతికి అంత శక్తి ఉంటుంది. ఈ విషయమును శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగంలో చెప్పారు. సుబ్రహ్మణ్యుడి విభూతి ఇంట్లో ఉంటే పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష. పిల్లలకీ చక్కగా నుదుటిపై మూడు విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే ఆ పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వంశమునకు కీర్తి తీసుకువస్తారు. వంశవృద్ధి కారకాయై నమః అనే నామం స్వామికి కలిగి వుంది. ఆ విభూతి అంత గొప్పది.

సూర్య నారాయణ దండకం Surya Narayana Dandakam

సూర్య నారాయణ దండకం

శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ||
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ||

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ||

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ||

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ||

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ||

Saturday, March 9, 2024

శ్రీ ఛిన్నమస్తాదేవి ఆలయం, ఝార్ఖండ్ : రాంచి Sri Chinnamastadevi Temple, Jharkhand : Ranchi

 శ్రీ ఛిన్నమస్తాదేవి ఆలయం, ఝార్ఖండ్  : రాంచి

 నవరాత్రులలో పది మంది విద్యా మహాదేవతలు పూజిస్తారు.
ఈ పదిమంది మహాదేవిలు ...
మా తార,
మా త్రిపుర సుందరి,
మా భువనేశ్వరి,
మా చిన్నమస్తా,
మా కాళి,
మా త్రిపుర భైరవి,
మా ధూమావతి,
మా బగ్లాముఖి,
మా మాతంగి,
మా కమల, వీరిలో నాల్గవ దేవత మా ఛిన్నమస్తిక, రాంచీలో ఆలయం ఉంది.

 ఇక్కడ ఉన్న చిన్నమస్త (చిన్నమస్తిక అని కూడా పిలుస్తారు) ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ చిన్నమస్తా దేవత యొక్క తల లేని దేవత విగ్రహం. చిన్నమస్త దేవాలయం తాంత్రిక నిర్మాణ శైలికి చాలా ప్రసిద్ధి చెందింది.

ఛిన్నమస్తిక దేవి యొక్క ఈ ప్రదేశం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయంలో తల లేని మాతృమూర్తిని పూజిస్తారని చెబుతారు.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఉంటుంది.
ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారు అన్ని కోరికలను తీరుస్తుందని నమ్ముతారు.
ఈ ఆలయం 6000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు.
అదే సమయంలో, చాలా మంది దీనిని మహాభారత కాలం నాటి ఆలయం అని పిలుస్తారు. నవరాత్రులలో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో సాధువులు, మహాత్ములు మరియు భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

అస్సాంలో ఉన్న మా కామాఖ్య ఆలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిపీఠంగా పిలుస్తారు, అయితే ప్రపంచంలోని రెండవ అతిపెద్ద శక్తిపీఠం రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో రాజ్రప్పలో ఉన్న రాజ్రప్పలో ఉన్న మా యొక్క చిన్నమాస్తిక ఆలయం.

ఆలయం లోపల, కాళీ దేవి యొక్క విగ్రహం ఉంది, ఆమె తన కుడి చేతిలో కత్తి మరియు ఆమె ఎడమ చేతిలో  తలను పట్టుకుంది.
తల్లికి మూడు కళ్ళు ఉన్నాయి.
ఆమె  చాచిన తామర పువ్వు మీద నిలబడి ఉంది.
పాదాల క్రింద, కామదేవుడు  రతి భంగిమలో  రతి దేవితో నిద్రిస్తున్న స్థితిలో ఉంది.
మా చిన్నమస్తికే మెడలో పాము హారము మరియు ముండమాలు అలంకరించబడి ఉంటుంది. విరబూసిన జుట్టుతో , ఆభరణాలతో అలంకరించారు.
ఆమె పక్కన డాకిని మరియు షాకిని నిలబడి ఉన్నారు (పురాణాలలో వారిని జయ మరియు విజయ అని వర్ణించారు), వారికి ఆమె రక్తం తాగిస్తుంది.
ఆమె మెడ నుండి మూడు రక్తపు ధారలు కారుతున్నాయి. 

మాతృదేవత శిరచ్ఛేదం వెనుక ఒక పురాణ కథ ఉంది,  దాని ప్రకారం, ఒకప్పుడు, భగవతి మాత మందకని నదిలో తన సహచరులైన జయ మరియు విజయతో కలిసి స్నానం చేసి ధ్యానం చేస్తోంది. అదే సమయంలో, తల్లి సహచరులు చాలా ఆకలితో ఉన్నారు.
అనేక విధ్వంసం కలిగించే రాక్షసులను చంపిన తర్వాత దేవత తన ఉగ్ర కోపాన్ని శాంతపరచడానికి ఆమె తలను కత్తిరించింది. ఈ విధంగా దేవత  చెడును జయించడంతోపాటు అనేకుల మేలు కోసం తనను తాను త్యాగం చేసే పవిత్ర కార్యానికి ప్రతీక.

ఇతర పురాణాల ప్రకారం, రాక్షసులందరినీ చంపిన తర్వాత, దేవత యొక్క పరిచారకులు లేదా సహ్యగోనిలు సంతృప్తి చెందలేదు మరియు మరింత రక్తాన్ని కోరుకున్నారు- కాబట్టి, దేవత తన పరిచారకుల దాహాన్ని తీర్చడానికి ఆమె తలను నరికివేసింది.

మరొక పురాణం ప్రకారం, శివుడు, తన భార్య సతీదేవి కాలిపోయిన శరీరాన్ని మోస్తూ, తన రుద్ర తాండవ లేదా విధ్వంసక నృత్యం చేసాడు. 
శివుడు తన విధ్వంసక నృత్యంతో విశ్వాన్ని నాశనం చేయకుండా ఆపడానికి, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 52 భాగాలుగా చేసాడు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో పడిపోయిన ఆ భాగాలతో- దేవత గౌరవార్థం శక్తి ఆలయాలు నిర్మించబడ్డాయి. 
ఈరోజు రాజ్రప్ప దేవాలయం ఉన్న ప్రదేశంలో సతీదేవి తల పడిపోయిందని చెబుతారు.

 ఇక్కడ కాళీ దేవిని ప్రచండ చండీ అని కూడా అంటారు. రాజారప్పలో చిన్నమస్తా ఆలయంతో పాటు దక్షిణ కాళి మరియు అష్టమాత్రిక వంటి దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి.

 రాంచీలోని రాజారప్ప మందిరం దామోదర్ మరియు భైరబీ లేదా భేరా అనే రెండు నదుల సంగమం వద్ద ఉంది.  చిన్నమస్తా ఆలయం 51 పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఈ ఆలయం సందర్శకులు వాస్తుశిల్పాన్ని ఆస్వాదించడానికి మరియు దేవత యొక్క ఆశీర్వాదాలను పొందేందుకు మాత్రమే కాకుండా, అనేక ఇతర పవిత్ర పూజలకు కూడా ఒక ప్రదేశం.
వాహన పూజలు, వివాహాలు మరియు పిల్లలకు రెండేళ్లలోపు బట్టతల చేయించడం ఒక ఆచారం;
ఈ అభ్యాసాన్ని ముండన్ అని పిలుస్తారు మరియు చాలా కుటుంబాలు తమ పిల్లల ముండన్ దేవాలయంలో చేయాలని ఎంచుకుంటారు.

 భారతదేశంలో ఇప్పటికీ జంతుబలి ఆచరించే కొన్ని దేవాలయాలలో ఇది కూడా ఒకటి- ప్రతి మంగళవారం మరియు శనివారం అలాగే కాళీ పూజ సమయంలో జంతువులను బలి ఇస్తారు. 

రాజ్రప్ప మహోత్సవ్, ఇది ఆలయ వేడుకగా మరియు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
ఈ పండుగ పర్యాటకులకు అయస్కాంతంలా పనిచేస్తుంది మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది వారి జీవనోపాధి కోసం ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడుతుంది.

ఆలయ నిర్మాణం 

రాజ్రప్ప మందిర్‌లో , గోడలపై చెక్కిన విగ్రహాలకు తాంత్రిక శిల్పకళ ప్రత్యేకంగా ఉంటుంది.
జార్ఖండ్‌లో, రామ్‌ఘర్ నుండి 28కిమీ దూరంలో ఉంది.

పంచభూత లింగాలు. Panchabhuta Lingas

పంచభూత లింగాలు

పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే....

కంచి (పృథ్వి లింగం)

శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వందల సంవత్సరాలుగా కంచి ఓ ధార్మిక రాజధాని స్థాయిని అందుకొంది. అలాంటి కంచిలో సాక్షాత్తూ పార్వతీదేవి మట్టితో రూపొందించి పూజించుకున్న లింగమే పృథ్వి లింగం. ఒకానొక సమయంలో గంగమ్మతల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుకులుపరుగులు దీస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దానిని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా అక్కడి లింగం మీద అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయనీ చెబుతారు.

చిదంబరం (ఆకాశ లింగం)

చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసమూ, సౌలభ్యం కోసమూ భగవంతుని ఒకో రూపంలో పూజించుకుంటామే కానీ... అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం కదా! అందుకనే ఇక్కడ ఆ పరమేశ్వరుని మూలవిగ్రహం ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. ఆ చిదంబర రహస్యాన్ని భక్తులు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు నిరాకారునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలోనే ఆయన ఆనందతాండవం చేసే నటరాజస్వామిగా కొలువై ఉంటడం విశేషం.

అరుణాచలం (అగ్ని)

కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై). ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పవిత్రమైన ఆ అణ్ణామలై ఉన్న క్షేత్రమే తిరువణ్ణామలై! బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న సంవాదాన్ని తీర్చేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి (అరుణము) రంగులో కనిపిస్తుంది. ఆ కొండనే పరమేశ్వరునిగా భావించి దాని చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తారు భక్తులు. ఇక కొండ దిగువున ఉన్న అణ్ణామలై ఆలయం దేశంలోని ఎత్తైన గోపురాలలో మూడవది. ఆ ఆలయానికి కూతవేటు దూరంలో రమణమహర్షి జీవనంతో పావనం అయిన రమణాశ్రమం గురించి చెప్పేదేముంది.

జంబుకేశ్వరం (నీరు)

తమిళనాట తిరుచ్చి పట్నానికి సమీపంలో ఈ జంబుకేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు (నేరేడు చెట్లు) ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అన్న పేరు వచ్చిందట. మరో ఐతిహ్యం ప్రకారం శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ... ఆయన ఎదురుగా శంభుడు, జంబూ వృక్షంగా నిలిచి కలకాలం శివుని చూస్తూ ఉండిపోయే వరాన్ని పొందాడని చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం అనేందుకు తిరుగులేని సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది.

కాళహస్తి (వాయువు)

తెలుగువారి అదృష్టవశాన మన గడ్డ మీద వెలసిన పరమేశ్వరుడు ఆ శ్రీకాళహస్తశ్వరుడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. పూర్వం ఈ మూడు జీవాలూ ఆ పరమేశ్వరుని ఆరాధనలో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందంటారు. ఇక ఇక్కడి స్వామి కోసం తన రెండు కళ్లనూ పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. దక్షిణకాశిగా పేరొందిన ఈ క్షేత్రంలో రాహుకేతువులకు సంబంధించిన ఎలాంటి దోషమైనా పరిహారం అయిపోతుందని నమ్మకం. ఇక్కడి స్వామివారు వాయులింగం అనేందుకు నిదర్శనంగా, గర్భగుడిలో లింగం ముందర నిలిపిన జ్యోతి రెపరెపలాడుతూ కనిపిస్తుంది.