THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, March 19, 2025
Kurti pant set
Trending sparkle handwork look for festival
NEW BOLLYWOOD STYLE DRESS, NEW TREADING DRESS
పురుషుల్లో ఆండ్రోపాజ్ (Andropause) లక్షణాలు- జాగ్రత్తలు
మెనోపాజ్ లక్షణాలు, జాగ్రత్తలు
స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకొని చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కర్పూరం గురించి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. కర్పూరం కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
కర్పూరంలో దేవుడి పూజలో తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు.. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరం వెలిగించి చివరిగా హారతి ఇస్తూ ఉంటారు. ఈ కర్పూరంలో ప్రతిరోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించావు అని నమ్మకం. కర్పూరం వాసన కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది.
చాలా రకాల సమస్యలకు పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అయితే మామూలుగా కొంతమంది ప్రతిరోజూ స్నానం చేస్తే మరి కొందరు రోజు విడిచి రోజు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసిన తర్వాత ఒక గంటలోపే ఆ తాజాదనం మొత్తం పోతుంది. నెమ్మదిగా చెమట వాసన రావడం మొదలవుతుంది. ఈ వాసన రాకుండా ఉండడం కోసం చాలామంది పెర్ఫ్యూమ్ లు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పర్ఫ్యూమ్ లు కూడా కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ స్థానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉండవచ్చు అని చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందట. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారు ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉందట. అలాగే గోరు వెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట , బలహీనత తగ్గుతాయట. మీరు చురుకుగా కూడా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుందట. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెబుతున్నారు.
Tuesday, March 18, 2025
Tea: టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..
ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది.
అప్పటివరకు ఉన్న బద్ధకం తొలగిపోతుంది. కొందరు ఉదయాన్నే టీ తాగుతారు. మరికొందరు సాయంత్రం కూడా సేవిస్తూ ఉంటారు. అయితే టీ రుచికరంగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా వివిధ పద్ధతులు చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే.. మరికొందరు పాలు చిక్కగా ఉండాలని అంటూ ఉంటారు. అయితే టీ తయారు చేసే విధానంలో కూడా మార్పులు చేస్తే రుచికరంగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కామన్ గా కాకుండా ఈ రకంగా టీ చేయడం వల్ల కొత్త టీ ని చూస్తారని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ఎలా తయారు చేయాలంటే?
సాధారణంగా టీ తయారు చేసేటప్పుడు ముందుగా పాలు పోస్తూ ఉంటారు. ఆ తర్వాత టీ పౌడర్ వేసి మరి కోసేపటి తర్వాత తర్వాత పంచదార వేస్తారు. ఆ తర్వాత మొత్తం మరిగించి టీ ని తయారు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల టీ ఏ మాత్రం రుచికరంగా ఉండదని కొందరు ఉంటున్నారు. ఒకవేళ రుచికరంగా ఉన్న కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉండవని పేర్కొన్నారు. అయితే టీ ని ఇలా తయారు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. అది ఎలాగంటే?
ముందుగా స్టవ్ పై వేడి నీళ్లను మరిగించాలి. ఆ తర్వాత టీ పౌడర్ ను వేయాలి. ఈ రెండు మిశ్రమాన్ని కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత టీ పౌడర్ ముద్దలాగా అయిన తర్వాత వడగట్టాలి. అప్పుడు టీ పౌడర్ లోని చేదు వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ నీటినీ మరోసారి స్టవ్ పై ఉంచి మరిగిస్తూ అందులో పాలు పోయాలి. ఇలా కొద్దిసేపు మాత్రమే మొత్తం మిశ్రమాన్ని ఉంచాలి. ఈ రకంగా టీ తయారు చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందని కొందరు కుకింగ్ స్పెషలిస్టు చెబుతున్నారు.
పాలతో కలిపి టీ పౌడర్ ను మరిగించడం వల్ల టీ పౌడర్ లో ఉండే చేదు మొత్తం పాలతో కలిసిపోతుందని.. దీంతో టీ రుచి తేడా ఉంటుందని అంటున్నారు. అందువల్ల ముందుగా టీ పౌడర్ కలిపిన నీళ్లను మరిగించాలి. వీటిని వడగట్టిన తర్వాతనే పాలను కలపాలి. అప్పుడు టీ రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సందేహం చాలా మందికి ఇప్పటికే ఉంది. దీని కాసేటప్పుడు పాలు ముందుగా పోయాలా? లేదా చివరకు పోయాలా అనేది కొంతమంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల టీ రుచికరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో బ్రాండెడ్ టీ పౌడర్ తో పాటు మంచి పాలను కూడా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడే అనుకున్న విధానంలో టి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి టీ నీ బందువులు వచ్చినప్పుడు సరఫరా చేసి వారినిఆకట్టుకోవచ్చు.
మూడమిలో పెళ్ళిచూపులు జరిపించవచ్చా?
పూర్వకాలామృతం ప్రకారం ‘అదౌస్వేప్సిత దేవతాం గ్రహగణం సంపూజ్యకర్తుస్తదా - తారాచంద్ర బలాన్వితే శుభదినే లగ్నే శుభేవాసరే’ అని చెప్పారు.
దేవతలను గ్రహగణములను పూజించి తారాచంద్ర బలములతో కూడి శుభదిన శుభలగ్న శుభ వారములలో జ్యోతిశ్శాస్తవ్రేత్తలను సంప్రదించి వధూవరుల జాతక వివరాలు చూపి ప్రయత్నాలు ప్రారంభించమని చెప్పారు. మరి తారాబలం కూడిన శుభ దినంలోనే మాటలాడమని చెప్పారు కదా! ఇక ఆషాఢం, భాద్రపదం, పుష్యమాసాలు, మూఢమి దినములు శుభముకు పనికిరావు కదా. అందువలన ఈ మూఢమి వంటి రోజులలో పెండ్లి చూపులు చూడరాదు. దానికి ఒక పెద్ద కారణం ఉంది.
వధూవరులు ఇరువురు మొదట చూసుకున్న సమయం మంచిది కాకపోతే ఆ ప్రభావం జీవితాంతం వెంబడిస్తుంది. శాస్త్రంతో పనులు చేద్దాం అనుకుంటే శాస్త్రం చెప్పినవి అన్నీ చేయాలి. అలాగ చేయకపోతే సమస్యలు రాగలవు. సరే ఇక మనం యాంత్రిక జీవనంలో వున్నాం సమయం చాలా అరుదుగా కుదిరే సందర్భాలలో మూఢమి వంటివి వస్తే ఏమి చేయాలి అనే ప్రశ్న అందరినీ బాధిస్తుంది. అందుకే శాస్తజ్ఞ్రులయిన పెద్దలు అనుభవం మీద కొన్ని విశేషాలు తెలియజేశారు. అది ఏమిటి అంటే దేవాలయం దైవసన్నిధి.కి దోషం వుండదు కావున వధూవరులను మొట్టమొదట ఏదేని దేవాలయంలో చూసుకునేలాగ చేయుట అనంతరం వారి గృహమందు కలియుట ద్వారా మూఢమి దోషం ఉండదు అని చెబుతారు. ప్రతి విషయంలోనూ దైవ సన్నిధిలో చేయుటకు విశేషం అని వింటున్నాం కదా.
మనం ఏ కార్యం చేసినా గణపతిని ఆరాధించి పెద్దలు, వేద పండితుల ఆశీస్సులు తీసుకొని ప్రారంభించడం మన సంస్కృతి మనకు నేర్పిన పాఠం. రోజువారీ కార్యక్రమాల విషయంగా ఒక వేళ ఈ నియమం పాటింపక పోయినా ప్రతి విశేష కార్యములలోనూ పై నియమం పాటింపవలసినదే అనేది భారతీయ వాదన. విఘ్నములు పోగొట్టువాడు కావున గణపతిని అర్చించడం, పెద్దలు పూజ్యుల నుండి స్వస్తి మంగళ వాచకములు ఆశీఃపూర్వకంగా తీసుకొని ప్రారంభిస్తే అంతా శుభం కలుగుతుంది అనేది ఒక గట్టి నమ్మకం. మంచి పొందేవాడు పై మంచి పనులు తప్పక చేస్తాడు. అలాంటిది జీవితకాల బంధాలకు సంబంధ మైన వివాహం విషయంలో మంచి చూసి ప్రారంభించాలి. సంబంధం తెలిసి దాని ప్రయత్నంలో ప్రారంభంలో ఈ విధంగా గణపతిని పూజ్యులను పూజించి వెళ్లుట శ్రేయస్కరం.
అలా మంచి సమయం కుదరని వారు ఆషాఢంలోనే ఒక మంచిరోజు (ఉన్నంతలో) మంచి వారం తారాబలం కుదిరిన రోజున దైవసన్నిధిలో దేవాలయంలో పెళ్లిచూపులు చూసుకోవడం ద్వారా దుష్ఫలితాలు రావు అని పండితులు చెబుతారు. వధువు తరఫు పెద్దలు వరుని చూచుటకు, వరుని తరఫు పెద్దలు వధువును చూచుటకు ఆషాఢ, భాద్రపద, పుష్య, మూఢమి దోషాలు పట్టింపు కాదు. ఈ మధ్య చాలా అపహాస్యమైన పద్ధతి నడుచుచున్నది. అది ఏమనగా మంచి రోజులలో ఒక సంబంధం చూసేస్తే, తరువాత వాటికి మంచి రోజులతో పట్టింపు లేదు అని. అది తప్పుడు వాదన.
ప్రతి ప్రయత్నంలోనూ మంచి రోజులు చూసుకోవడం తప్పనిసరి. ఎన్ని సంబంధాలు చూసినా మంచి రోజులకే ప్రాధాన్యం ఇచ్చి శాస్త్ర వాక్యం పాటించిన వారు జీవితాంతం సుఖపడతారు. శాస్త్ర వాక్యములు వాటి పరమార్థం పూర్తిగా తెలుసుకోకుండా మనకు తోచిన మాటలు చెప్పడం సమంజసం కాదు. శాస్త్ర వాక్యాలు లేదా పెద్దల మాటలు తెలుసుకొని చర్చించుకోవడం ద్వారా శాస్త్ర గౌరవం కాపాడినవారవుతారు. తద్వారా ఆచరించిన వారు సుఖపడతారు.
శుక్రమూఢమి ప్రారంభం.. చేయాల్సినవి.. చేయకూడనివి
అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?❓
🪷 గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.
🪷 మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
✅👉 శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.
🪷 మౌఢ్యమిని *"మూఢమి"* గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నా... గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.
🪷 శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.
🪷 శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసారజీవితo సజావుగా సాగదు. ఇలాంటి వారు "ఇంద్రాణీదేవి స్తోత్రం"పారాయణం చేయండి.
❌ మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు:- ❌
❌👉 పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనo, గృహారంభo, గృహప్రవేశo, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానo, విగ్రహప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనము కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టువెoట్రుకలకు, వేదవిద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు, దేహశుద్ధి మొదలగునవి చేయరాదు.
✅👉 మౌఢ్యమిలో చేయదగిన పనులు :- ✅
🪷 ఆత్మశుద్ధి, జాతకర్మ , జాతకo వ్రాయించుకోవడo, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా, శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును♪.
🪷 గర్భిణి స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిథులలో అశ్వని, రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుoది♪.
Monday, March 17, 2025
పురాణాల్లో 56 రాజ్యాలు అని చెప్తారు. అవి ఏమిటి?
పాంచాల , కులిందా , కిన్నెర , కోసల , మత్స్య , నేప , హర హూణ , కాశ్మీర , మద్ర , కేకేయ, సింధు , కాంబోజ , కోసల (దక్షిణ ), కాశి , మత్త (north of మగధ ), కురు , కురు (పశ్చిమ ), వత్స (కురు భాగం ), మగధ , గయ ( లేక కికత )south of మగధ ),)విదేహ , అంగ (east of Magadh ), ప్రాగ్జ్యోతిష , వంగ , పౌండ్ర , కళింగ (ఒరిస్సా ), సూహ్మ , సోనిత , ఉత్కళ , సారస్వత , అభిర , సురసేన , అనార్త , ద్వారిక , ఛేది , కుంతి (నార్త్ అవంతి ), మాటవ , హేహేయ , దశార్ణ , పులింద , విదర్భ , అనుపా , శూరపాక , కొంకణ , దండక , వ్రజి , గాంధార (నార్త్ వెస్ట్ ), పల్లవ ,ఆంధ్ర /ఆంధ్రక , కిష్కింద , పాండ్య , కేరళ (చేర ), చోళ , తెలింగ (కాకతీయ ), గోమంత , గోకర్ణ , మహిశాఖ , మషిక , తులుంగ , టంక , సింహళ.
Source :నిత్యానందపీడియా.ఆర్గ్
Errors & Omissions Exempted.
నిజాం పాలన కంటే ముందు హైదరాబాద్‌ని పరిపాలించిన రాజు ఎవరు? ఏ ఏ ప్రాంతాలు పాలించారు?
1. కాకతీయ రాజ్యము (1163–1323 CE):
- మొదటగా ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలించారు.
- వారి రాజధాని ఒరుగల్లు (ఇప్పటి వరంగల్).
- గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి శక్తివంతమైన రాజులు కాకతీయ సామ్రాజ్యాన్ని బలంగా నిలిపారు.
- కానీ 1323లో ముహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసి కాకతీయ రాజ్యాన్ని కూల్చివేశాడు.
2. బహమనీ సుల్తానేట్ (1347–1518 CE):
- కాకతీయుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని బహమనీ సుల్తానులు పరిపాలించారు.
- 1347లో అలాఉద్దీన్ హసన్ బహమన్ షా ఈ రాజ్యాన్ని స్థాపించాడు.
- ఈ రాజ్యం నశించిన తర్వాత, దక్కన్ ప్రాంతం ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.
- అందులో ఒకటి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం.
3. గోల్కొండ కుతుబ్ షాహీలు (1518–1687 CE):
- సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518లో గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు.
- మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు.
- 1687లో ఔరంగజేబ్ గోల్కొండను జయించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
4. మొఘల్ పాలన (1687–1724 CE):
- గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయిన తర్వాత, మొఘల్ గవర్నర్లు ఇక్కడ పాలించారు.
- అయితే, 1724లో మిర్ కమరుద్దీన్ (అసఫ్ జాహ్-I) నిజాం రాజవంశాన్ని స్థాపించాడు.
- అప్పటి నుంచి నిజాం పాలన ప్రారంభమైంది.
హైదరాబాద్ మీద కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ కుతుబ్ షాహీలు, మొఘల్ గవర్నర్లు పాలన జరిపారు.
చివరకు 1724లో నిజాం రాజులు అధికారం చేపట్టారు.
(సేకరణ)
ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు.. కంటి చూపు వస్తుందట..!
సాధారణంగా ఈ ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని వింతలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆలయాల్లో జరిగే అద్భుతాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది.
ఈ క్రమంలోనే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో జరిగే వింతలు అంతుచిక్కనివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది.
కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో నంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంఠేశ్వర ఆలయం ఉన్నది. కంబిని నది తీరంలో గల శ్రీ కంఠేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయాన్ని నంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ గోపురం ఎత్తు - 120 అడుగులు. ఇక్కడ ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం.
అయితే టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే.. ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం. ఇక ఆలయ నిర్మాణశైలి ఆనాటి శిల్పకళా వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇవి 11వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియుచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి. ఈ స్వామిని దర్శించినవారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం.
Sunday, March 16, 2025
ఎమ్.ఎస్.సి (MSc) ఫిజిక్స్ తర్వాత పీహెచ్డీ (PhD)
ఎమ్.ఎస్.సి (MSc) ఫిజిక్స్ తర్వాత పీహెచ్డీ (PhD) చేయడం ఒక గొప్ప ఎంపిక, ముఖ్యంగా రీసెర్చ్, అకాడెమిక్ లేదా ఇండస్ట్రియల్ రంగాల్లో లోతైన జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి. పీహెచ్డీ గురించి సంపూర్ణ సమాచారం ఇక్కడ ఉంది:
1. పీహెచ్డీకి అర్హతలు
- బేస్ డిగ్రీ: ఎమ్.ఎస్.సి (ఫిజిక్స్) లేదా సంబంధిత రంగంలో సాధారణంగా 55–60% మార్కులు (యూనివర్సిటీ/కాలేజీపై ఆధారపడి ఉంటుంది).
- ఎంట్రన్స్ టెస్ట్: చాలా యూనివర్సిటీలు యుజిసి-నెట్ (UGC-NET), CSIR-NET, GATE, JEST (ఫిజిక్స్ స్పెషలైజేషన్ కోసం) లేదా స్వంత ఎంట్రన్స్ టెస్ట్లను నిర్వహిస్తాయి.
- ఇంటర్వ్యూ: ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత, రీసెర్చ్ ప్రపోజల్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్పై ఇంటర్వ్యూ ఉంటుంది.
2. పీహెచ్డీ ప్రక్రియ
- డ్యురేషన్: సాధారణంగా 3–5 సంవత్సరాలు (రీసెర్చ్ ప్రోగ్రెస్పై ఆధారపడి).
- కోర్స్ వర్క్: మొదటి సంవత్సరంలో కొన్ని కోర్సులు (ఫిజిక్స్లో అడ్వాన్స్డ్ టాపిక్స్) మరియు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ (Comprehensive Exam) ఉంటాయి.
- రీసెర్చ్ ప్రపోజల్: మీరు ఎంచుకున్న టాపిక్పై సూపర్వైజర్ మార్గదర్శకత్వంలో ప్రపోజల్ సమర్పించాలి.
- థీసిస్ సబ్మిషన్: రీసెర్చ్ పూర్తయిన తర్వాత, థీసిస్ను యూనివర్సిటీకి సమర్పించి, వివాద్ (Viva-Voce) లేదా ఓరల్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాలి.
3. ఫండింగ్ & ఫెలోషిప్లు
- యుజిసి-జేఆర్‌ఎఫ్ (UGC-JRF): NET ఉత్తీర్ణులకు నెలకు ₹31,000–35,000 స్టైపెండ్.
- CSIR ఫెలోషిప్: ఫిజిక్స్ రీసెర్చ్ కోసం ప్రత్యేక ఫండింగ్.
- ఇన్స్పైర్ ఫెలోషిప్ (INSPIRE): ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వ మద్దతు.
- యూనివర్సిటీ ఫెలోషిప్లు: IITs, IISc, TIFR వంటి సంస్థలు స్కాలర్షిప్లు అందిస్తాయి.
- ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు: ISRO, DRDO, BARC వంటి సంస్థలతో కలిసి రీసెర్చ్ చేసే అవకాశాలు.
4. రీసెర్చ్ ఏరియాస్ (ఫిజిక్స్లో)
- థియరెటికల్ ఫిజిక్స్: క్వాంటం మెకానిక్స్, స్ట్రింగ్ థియరీ, కాస్మాలజీ.
- ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్: న్యూక్లియర్ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్, న్యానోటెక్నాలజీ.
- అస్ట్రోఫిజిక్స్: బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, గెలాక్సీ ఫార్మేషన్.
- అప్లైడ్ ఫిజిక్స్: ఆప్టిక్స్, ప్లాస్మా ఫిజిక్స్, మెడికల్ ఫిజిక్స్.
5. టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా
- ఐఐఎస్‌సి (IISc) బెంగళూరు: ఫండమెంటల్ ఫిజిక్స్ కోసం ప్రపంచ స్థాయి రీసెర్చ్.
- ఐఐటీలు (IITs): IIT Bombay, IIT Madras, IIT Delhiలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లు.
- టిఐఎఫ్‌ఆర్ (TIFR): థియరెటికల్ మరియు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
- ఐఐఎస్టి (IIST): స్పేస్ సైన్స్ మరియు టెక్నాలజీ.
- ఎన్ఐయుఎ (NIUA): అస్ట్రోఫిజిక్స్ మరియు పార్టికల్ ఫిజిక్స్.
6. ఇంటర్నేషనల్ ఆప్షన్స్
- యునైటెడ్ స్టేట్స్: MIT, Caltech, Stanford వంటి విశ్వవిద్యాలయాలు.
- యూరప్: CERN (స్విట్జర్లాండ్), Max Planck ఇన్స్టిట్యూట్ (జర్మనీ).
- ఫెలోషిప్లు: Fullbright, DAAD, Erasmus Mundus.
7. కెరీర్ అవకాశాలు
- అకాడెమియా: ప్రొఫెసర్, రీసెర్చ్ స్కాలర్.
- రీసెర్చ్ ల్యాబ్స్: ISRO, BARC, DRDO, CSIR.
- ఇండస్ట్రీ: R&D సెక్టార్లో (ఉదా: సెమీకండక్టర్, ఎనర్జీ).
- డేటా సైన్స్/టెక్: క్వాంటమ్ కంప్యూటింగ్, AI.
- సైన్స్ కమ్యూనికేషన్: రైటర్, సైన్స్ అడ్వైజర్.
8. కీ స్కిల్స్ రిక్వయర్డ్
- స్ట్రాంగ్ మ్యాథమెటికల్ & అనాలిటికల్ స్కిల్స్.
- పరిశోధనలో సహనం & డెడికేషన్.
- ప్రయోగాలు/సిమ్యులేషన్లకు టెక్నికల్ స్కిల్స్ (Python, MATLAB వంటి టూల్స్).
- ఇంగ్లీష్లో రీసెర్చ్ పేపర్లు రాయడం & ప్రెజెంటేషన్ స్కిల్స్.
9. ప్రత్యేక సూచనలు
- మెంటర్ ఎంచుకోవడం: మీ రీసెర్చ్ ఇంటరెస్ట్కు సంబంధించిన ప్రొఫెసర్లను రిసర్చ్ గేట్/Google Scholarలో సెర్చ్ చేయండి.
- పబ్లికేషన్లు: PhD సమయంలో జర్నల్లలో కనీసం 2–3 పేపర్లు పబ్లిష్ చేయాలి.
- కాన్ఫరెన్స్లు: ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో పాల్గొని నెట్‌వర్కింగ్ చేయండి.
10. సవాళ్లు
- పీహెచ్డీ ఒక స్థిరమైన మానసిక సామర్థ్యాన్ని కోరుతుంది.
- రీసెర్చ్ టాపిక్‌లో ఫలితాలు రాకపోతే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది.
- అకాడెమిక్ ఫీల్డ్లో కాంపిటిషన్ ఎక్కువ.
ముగింపు: పీహెచ్డీ ఒక సవాలుగా ఉంటుంది, కానీ ఫిజిక్స్ పట్ల అభిరుచి ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముందుగా యుజిసి-నెట్/CSIR-NET కు ప్రిపేర్ అవ్వండి, మీ రీసెర్చ్ ఇంటరెస్ట్ను క్లియర్ చేసుకోండి మరియు మంచి మెంటర్ ఎంచుకోండి. ప్రపంచం మీద పని చేసే శాస్త్రవేత్తలతో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి!
రిసోర్సెస్:
- arXiv.org e-Print archive (రీసెర్చ్ పేపర్లు).
- ప్రయాగ్ (ఫిజిక్స్ టెస్ట్ సిరీస్).
- యూట్యూబ్ ఛానెల్స్: PBS Space Time, Veritasium.
AI ఉత్పత్తి కంటెంట్ ఉద్ధరణం: పై ఉన్న సమాధానం
రచయిత/సృష్టికర్త (AI మోడల్ [Grok-3,Claude, Qwen, Gemini,ChatGPT-4,Deepseek ): Deepseek
జనరేట్ చేయబడిన తేదీ: 2025 mar 15
మూలం [OpenAI, Google, Anthropic, Alibaba Cloud, xAI Team, Deepseek 2025]:Deepseek 2025
శీర్షిక పై ఉన్న- అనుభవం / అవగాహన : 5 ఏళ్లు / 20 ఏళ్లు
సవరించిన లేదా పూర్తిగా AI ఉత్పత్తి శాతం : AI 100% - మానవ కలాపం 0%
వెచ్చించిన సమయం : 10 నిమిషాలు
శివుడికి రుద్రాభిషేకం ఇంట్లో ఎలా చేయాలి?
శివ అంటే చాలు మంగళం, శుభం, సర్వకార్యజయం, సర్వపాపహరం అని వేదార్థాలు. మహాదేవున్ని శివుడని పరమశివుడని పలు పేర్లతో పిలుస్తారు. పండితుడు నుంచి పామరుడు వరకు, మహా చక్రవర్తి నుంచి కటిక పేదవాడి వరకు మనఃపూర్వకంగా ఒక్కసారి శివ అంటే చాలు కోరిన కోర్కిలు తీర్చే భోళాశంకరుడు ఆయన.శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. శివునికి నిత్యం అభిషేకం చేస్తే చాలు అన్ని ఉన్నట్లే.
శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. దేశం శాంతిగా ఉంటుందని వేదోక్తి. అయితే శివుడికి అభిషేకాలు చేస్తుంటాం.. అయితే అభిషేకాలు ఎన్నిరకాలు ఏ విధంగా శివాభిషేకాలు చేస్తారో తెలుసుకుందాం…శివాభిషేకాలు మంత్రపూర్వకంగా అంటే రుద్రభిషేకాలుగా వర్ణిస్తారు.
అదేవిధంగా చేసే ద్రవ్యాలను బట్టి అభిషేకాలకు పేర్లు ఉన్నాయి. కానీ శాస్త్రం ప్రకారం రుద్రాభిషేకాల రకాలనే పరిగణనలోకి తీసుకుంటాం. పదార్థాలు మన కామ్యాలు అంటే కోరికలు తీరడానికి ఆయా పదర్థాలతో, పుష్పాలతో చేస్తాం. రుద్రాభిషేకాలు 8 విధములు అవి.. రుద్రం అంటే నమకాలు -11, చమకాలు-11 అనువాకాలుగా (సింపుల్‌గా చెప్పాలంటే 11 స్టాన్జాలు అని ఇంగ్లిష్ మీడియం వారికి) సాధారణంగా రుద్రాభిషేకం అంటే 11 నమకాలను, 11/1 చమకాన్ని చెప్పితే ఒక అభిషేకంగా ఇంట్లో నిత్యం చేసుకునేవారు చేసే పద్ధతి. ఇక అసలు అభిషేక సంప్రదాయ పరిశీలిస్తే…
1. వారాభిషేకం- నమకం 11 అనువాకాలను చెప్పి చమకంలో ఒక్కొక్క అనువాకం చొప్పున చెప్పవలెను. ఆ విధంగా నమకం 11 సార్లు (11X11) చెప్పిన, చమకం 11 అనువాకాలకు పూర్తగును. (నమకం 11సార్లు, చమకం 1 సారి) దీన్ని వారాభిషేకం అంటారు. 2. ఆవృత్తి - నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు. 3. రుద్రం- నమకం 121 సార్లు, చమకం - 11 సార్లు, 4. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు, 5. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు, 6. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు, 7. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు, 8. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు, ఇలా 8 రకాలుగా రుద్రాభిషేకాలను చేస్తారు.
దివ్య ఔషధం చెరుకు రసం.. పుష్కలంగా పోషకాలు
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు.
ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం పల్లె, పట్టణం అని తేడా లేకుండా చెరుకు రసాన్ని విక్రయిస్తున్నారు. ధర కూడా అందుబాటులో ఉండి ఆరోగ్యానికి చెరుకు రసంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, మండుటెండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చెరుకు రసం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ పెరగడంతోపాటు ఎలాంటి వ్యాధులు దరి చేరవని, ప్రతి ఒక్కరు క్రమంగా చెరుకు రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
చెరుకు రసం వల్ల ఉపయోగాలు..
- చెరుకు రసంతో అలసట తీరడమే కాకుండా సమస్యలు నివారిస్తుంది.
- రక్తంలో చక్కర శాతం తగ్గి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు చెరుకు రసం తాగుతే ఉపశమనం పొందవచ్చు.
- ప్రతినిత్యం గ్లాసు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
- కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే జీర్ణశక్తి సులువుగా అవుతుంది.
- చెరుకు రసంలో ఉత్తమ రకం లోహం లభ్యమవుతుంది.
- చెరుకు రసంలో అల్లం కలిపి తాగితే గొంతు గరగర నుంచి ఉపశమనం పొందవచ్చు.
- పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులు రసం తాగితే ఎంతో మేలు కామెర్లను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది.
- విటమిన్ బి ఉన్నందున దీన్ని సర్వ శ్రేష్టమైన సరువు టానిక్ అని అంటారు.
- వాంతులు జరిగినప్పుడు దీని తాగితే సమస్యలు నివారిస్తుంది.
Menopause transition లక్షణాలు ఎలా వుంటాయి? 40 ఏళ్లు దాటిన మహిళలు జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి?
♂️ మెనోపాజ్ పరివర్తన లక్షణాలు
▫️అసమ రుతుచక్రాలు: నెలసరి ఎక్కువ/తక్కువ రోజులు రావడం, అసమానమైన అంతరాలతో రావడం
▫️వేడి దంచాలు: హఠాత్తుగా శరీరంలో వేడి పెరగడం, చెమట పట్టడం
- నిద్ర సమస్యలు: నిద్రలేమి, మధ్యరాత్రి మేల్కొనడం
- మూడ్ మార్పులు: చిరాకు, ఆందోళన, విషాదం
▫️యోని శుష్కత: యోని ఎండిపోవడం వలన అసౌకర్యం, సంభోగంలో నొప్పి
▫️చర్మం మరియు వెంట్రుకల మార్పులు: చర్మం పొడిబారడం, వెంట్రుకలు పలుచబడటం
▫️జ్ఞాపకశక్తి సమస్యలు: కొన్నిసార్లు మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది
- తలనొప్పి: హార్మోన్ మార్పుల కారణంగా తలనొప్పులు రావడం
▫️ఎముకల బలహీనత: కాల్షియం కోల్పోవడం వలన ఎముకలు బలహీనం కావడం
♂️ 40 ఏళ్లు దాటిన మహిళలకు జీవనశైలి మార్పులు
▫️కాల్షియం సమృద్ధమైన ఆహారం: పాలు, పెరుగు, చీజ్, చేపలు, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం
▫️విటమిన్ D: రోజూ కనీసం 15-20 నిమిషాలు సూర్యరశ్మికి గురి కావడం, గుడ్లు, పొడి పిట్టలు తినడం
▫️ఐసోఫ్లావోన్లు: సోయా ఉత్పత్తులు, చిక్కుడుకాయలు మొదలైనవి తీసుకోవడం
▫️ఫైబర్ ఆహారం: ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు
▫️నీటి సేవనం పెంచడం: రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం
▫️ఎముకల బలోపేతానికి: వెయిట్-బేరింగ్ ఎక్సర్సైజులు, నడక, జాగింగ్ చేయడం
▫️కండరాల బలం: రెసిస్టెన్స్ ట్రైనింగ్, యోగా చేయడం
▫️మెదడు ఆరోగ్యానికి: నియమితంగా వ్యాయామం చేయడం (రోజుకి 30 నిమిషాలు)
▫️ఒత్తిడి నిర్వహణ: ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా
▫️సామాజిక బంధాలు: స్నేహితులు, కుటుంబంతో సమయం గడపడం
- మెదడు చురుకుదనం: పజిల్స్, పఠనం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం
▫️నియమిత వైద్య పరీక్షలు: సంవత్సరానికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం
▫️హార్మోన్ థెరపీ: అవసరమైతే వైద్యుల సలహాతో హార్మోన్ చికిత్స తీసుకోవడం
▫️పొగ, మద్యం తగ్గించడం: పొగ త్రాగడం మానేయడం, మద్యపానం పరిమితం చేయడం
▫️పౌష్టికాహార నిపుణుని సలహా తీసుకోవడం: వ్యక్తిగత పోషక అవసరాలను అర్థం చేసుకోవడానికి
♂️ మెనోపాజ్ సహజమైన జీవ ప్రక్రియ, కాబట్టి సానుకూల దృక్పథంతో, సరైన జీవనశైలి మార్పులతో ఈ కాలాన్ని ఆరోగ్యకరంగా గడపవచ్చు.
పొన్నగంటికూరలోని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ?
ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఒక్కటి ఏంటి.. చాలా రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. చాలా మంది ఎక్కువగా పాల కూర, తోట కూర, గోంగూర తింటూ..
ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఒక్కటి ఏంటి.. చాలా రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. చాలా మంది ఎక్కువగా పాల కూర, తోట కూర, గోంగూర తింటూ ఉంటారు. పొన్న గంటి కూరను కూడా వారంలో ఒక్కసారి మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే.. ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కూర ఏడాది పొడవునా కూడా లభిస్తుంది. మరి పొన్నగంటి కూర తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వెయిట్ లాస్:
పొన్నగంటి కూర తింటే త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
రోగ నిరోధక శక్తి మెండు:
పొన్నగంటి కూర తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది మెండుగా లభిస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ లభిస్తాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో త్వరగా రోగాల బారిన పడకుంటా ఉంటారు. వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
రక్త హీనత తగ్గుతుంది:
పొన్నగంటి కూరలో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా లభిస్తుంది. కాబట్టి ఈ కూర తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్తం లేని వారు ఈ ఆకు కూరతో తయారు చేసే ఆహారాలు తింటే మంచి రిజల్ట్ ఉంటుంది.
డయాబెటీస్‌ను కంట్రోల్ చేస్తుంది:
షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నీ తినలేరు. కానీ పొన్నగంటి కూరను తినవచ్చు. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తింటే షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతాయి.
చర్మానికి మేలు:
పొన్నగంటి కూరలో విటమిన్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది తింటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పొన్నగంటి కూర సహాయ పడుతుంది.
క్యాన్సర్ వ్యాధిని నియంత్రిస్తుంది:
పొన్నగంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ ఆకు కూర తింటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు.
మీకు చాలా కోపం వస్తుందా?.. అయితే ఇది చదవండి..!!
మీకు చాలా కోపం వస్తే చదవండి. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు చాలా విషయాలు ఆచరించాలి మరియు మితంగా జీవించడం నేర్చుకోవాలి.
కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలిసినా తెలియకపోయినా, కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవాలి.
ఎందుకంటే కోపం స్నేహాన్ని విచ్ఛిన్నం చేసినట్లే, స్నేహాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది.
అదేవిధంగా, శరీరంలోని ప్రాణం కొన్నిసార్లు విచ్ఛిన్నం కావచ్చు.
కోపం ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆ కోపం అతిగా మారితే, అది శరీరానికి అనేక హాని కలిగిస్తుంది. ఉదాహరణకు, ఒత్తిడి, గుండె జబ్బులు, రక్తపోటు, తలనొప్పి, తగినంత నిద్ర లేకపోవడం మొదలైనవి. శరీరంలో ఇలాంటి సమస్యలు వస్తే, శారీరక పరిస్థితి బాగా క్షీణించి మరణం సంభవించవచ్చు. కాబట్టి కోపం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో మనం జాబితా చేసాము. దాన్ని చదివి, ఇకపై కోపం తెచ్చుకోవాలో లేదో నిర్ణయించుకోండి.
కోపం ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అధిక ఒత్తిడి మధుమేహం, ఆటిజం మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలకు కారణమవుతుంది.
కోపం వల్ల కలిగే దడ మరియు అధిక హృదయ స్పందన రేటు గుండెకు గొప్ప నష్టాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు అవి గుండెపై చాలా ప్రమాదకరమైన ప్రభావాన్ని కూడా చూపుతాయి.
మనం కోపంగా ఉన్నప్పుడు, మన శరీరంలోని హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఇంకా, శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించకపోతే, అది సులభంగా వ్యాధులకు గురవుతుంది. కొన్నిసార్లు నిద్ర లేకపోవడం ఎవరినైనా పిచ్చివాడిని చేస్తుంది.
అధిక రక్తపోటు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, కానీ కోపం వాటిలో ఒకటి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు, శరీరంలో రక్తపోటు వెంటనే అధిక స్థాయికి పెరుగుతుంది. ఇది అకస్మాత్తుగా పెరిగినప్పుడు, గుండె బాగా ప్రభావితమవుతుంది.
శ్వాసకోశ రుగ్మత అయిన ఆస్తమాతో బాధపడేవారు కోపం వచ్చినప్పుడు సరిగ్గా శ్వాస తీసుకోలేరు. కాబట్టి ఆస్తమా ఉన్నవారు, ఎక్కువ కోపం తెచ్చుకోకండి. లేకపోతే, అది ఊపిరాడకుండా చేసి ప్రాణాపాయం కలిగించవచ్చు.
కోపం వచ్చినప్పుడు, రక్తపోటు పెరుగుతుంది మరియు మెదడుకు దారితీసే రక్త నాళాలు మెదడుకు ఎక్కువ రక్తాన్ని వేగంగా పంప్ చేస్తాయి, దీనివల్ల మెదడులో ఒత్తిడి ఏర్పడుతుంది, దీని వలన తలనొప్పి వస్తుంది. కాబట్టి కోపంతో వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి, వెంటనే శాంతించడం మంచిది.
గుండెపోటు సాధారణంగా అధిక భావోద్వేగ ప్రకోపాలు, ఆశ్చర్యం లేదా కోపం వల్ల వస్తుంది. వీరిలో చాలా మందికి కోపం వల్ల గుండెపోటు వచ్చింది. అందుకే వైద్యులు గుండె రోగులకు అతిగా సంతోషించే లేదా కోపం తెప్పించే ఏదైనా చెప్పవద్దని చెబుతారు.
మెదడులోని రక్త నాళాలు పగిలిపోవడం వల్ల సెరిబ్రల్ పాల్సీ వస్తుంది. ఈ రకమైన రక్తనాళాలు పగిలిపోవడానికి కోపం ప్రధాన కారణం. కోపం వల్ల అధిక రక్తపోటు వస్తుంది కాబట్టి, కొన్నిసార్లు రక్త నాళాలు పగిలి ప్రాణం పోతుంది. కాబట్టి, ఎప్పుడూ ఎక్కువ కోపం తెచ్చుకోకండి…
సాధారణంగా ఒత్తిడిని ఎదుర్కోడానికి మంచి మార్గాలు ఏమిటి?
ఒత్తిడి ఎదుర్కోవడానికి ప్రధాన ఆయుధం సమస్యల పట్ల సానుకూలమైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం మనోనిగ్రహం కలిగి ఉండడం.
- యోగ సూత్రం 2.33 సిఫార్సు చేస్తోంది: ప్రతికూల ఆలోచనల వల్ల కలవరపడినప్పుడు, వ్యతిరేక మానసిక వైఖరిని పెంపొందించుకోండి ( వితర్క-బాధనే ప్రతిపక్ష-భవనమ్)
ఉదాహరణకు, విభిన్న వ్యక్తులు ప్రపంచాన్ని ఎలా చూస్తారో వివరించడానికి మేము గాజు సగం నిండిన లేదా సగం ఖాళీగా ఉన్న చిత్రాన్ని ఉపయోగిస్తాము. సామెత గాజు ఒకటే, కానీ ఒక ఆశావాది సమృద్ధి మరియు అవకాశాన్ని చూసే చోట, నిరాశావాది నిరాశకు కారణం చూస్తాడు.
2. అసలు ఒత్తిడి గల కారణాలను గుర్తించండి.
3. బాగా స్ట్రెస్ కు గురి అయినప్పుడు నిటారుగా కూర్చుని, తలను వెనుకకు వాల్సి కళ్ళు మూసుకోండి. మూడుసార్లు దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి.
4. గొప్ప గొప్ప లక్ష్యాలకు బదులుగా అందుకోగలిగిన వాటినే లక్ష్యాలుగా పెట్టుకోండి
5. ఆనందాన్ని ఎక్కడో వెతకాలని వెంపర్లాడటం కన్నా , నీలోనే ఉన్న ఆనందాన్ని వెతుక్కోండి.
6. శరీరము, మనసు సహకరించకపోతే ఒక అంశం పట్ల ముందే "వద్దు" అని నిర్ణయానికి రండి. సామర్థ్యానికి మించి పని చేయడం కూడా ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది
7. పనులను వాయిదా వేసే పద్ధతిని మానుకోండి. ఎప్పటి పనిని అప్పుడు చేయడం ఒత్తిడి కాకుండా ఆపటానికి సహకరిస్తుంది.
8.దిగులు పడుతూ కూర్చోకండి గతకాలం గడిచిపోయింది. కనుక దానిని గురించి దీర్ఘంగా ఆలోచించడం కూడా ఒక కారణం అవుతుంది.
9.తేలీక పాటి వ్యాయామాలు అలవర్చుకోవడం వల్ల వ్యాయామము ఒత్తిడిని దూరం చేస్తుంది
10.మీలో సహజంగా కలిగి ఉద్వేగాలు, కోపం, బాధ లాంటి భావోద్వేగాలను అణచివేసి ఉంచకండి. అవసరమైన అంతవరకు దానిని వ్యక్తం చేయడం మంచిది . అణచివేత ఒత్తిడిని రెట్టింపు చేస్తుంది
మీరు పీల్చే గాలిపై సర్గ పెట్టండి దీర్ఘముగా శ్వాస తీసుకోవడం మరిచిపోవద్దు
11.అప్పుడప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం, వంట చేయడం, గదినీ శుభ్రపరచుకోవటం లాంటి పనులలో నీమగ్నం కండి.
12.ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఎవరూ చూడని విధంగా మీరు ఒకరే డాన్స్ చేయండి.
13.ఎక్కువగా ఆశించటం! మరిన్ని బాధలకు కారణం అవుతుంది. ఉన్నదానితో తృప్తి పడడం లాంటి తత్వం మిమల్ని తక్కువ ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.
13.అనవసరంగా డాంబికాలకు పోవటం, అన్ని తెచ్చి మీద పెట్టుకోవటం, అదే గాలికి పోయే కంప ను తెచ్చి తగిలించు కోవటం వల్ల లేని కష్టాలు మూట కట్టు కోవటం అవుతుంది.
14. వైఫల్యాలు జీవితంలో సహజమే వాటిని మరిచిపోండి.
15.మా అమ్మ చెప్పినట్లు ఒత్తిడిగా, బాధ గా అనిపించిన వెంటనే తల స్నానం చేస్తే కూడా ప్రశాంతితో వస్తుంది.
16.కళ్ళు మూసుకొని శాంతంగా నిద్రపోండి. నిద్ర కూడా తగ్గించే కారకమని మర్చిపోవద్దు.
కొన్నిసార్లు ఒత్తిడి కూడా వరమని గ్రహించండి. ఒత్తిడి వల్లే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ✍️
(వివిధ పుస్తకాలు చదివి జీవితంలో సాధించిన అనుభవాల వల్ల రాయడం జరిగింది)
దీనిలోని బొమ్మ గూగుల్ లో నుంచి పెట్టుకోవడం జరిగింది.
Mary A Knotts Memorial Girls High School, Vikarabad స్థాపితం 1902
Mary A Knotts Memorial Girls High School, Vikarabad.
స్థాపితం : 1902.
భవన నిర్మాణం పూర్తి అయిన సంవత్సరం - 1907.
(సేకరణ కోరా నుంచి)