Adsense

Tuesday, January 14, 2025

"హైదరాబాద్ భారతదేశపు అమెరికా" అని అప్పుడెప్పుడో 1941 లోనే గుర్తింపు పొందింది..


ఎక్కెటోళ్లు ఎక్కువ మంది లేకున్నా

మెరుగైన రవాణా సౌకర్యం కోసం

నిజాం రాజు ఏర్పాటు చేసిన రైల్వే వ్యవస్థ కూడా

అప్పుడే విజయవంతంగా నిర్వహింపబడింది.

ఇలాంటివన్నీ మర్చిపోయి,

అభివృద్ధి చెందిన హైదరాబాదులో

అవసరం కోసం ఓ రోడ్డు, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టి

హైదరాబాద్‌ను  మేమే అభివృద్ధి చేసినం అంటున్నారు.

కోడిపుంజు ఉదయాన్నే ఎందుకు కూత వేస్తుంది.. ఇదీ అసలు రహస్యం..

సాధారణంగా ఉదయాన్నే అంటే సూర్యోదయం సమయంలో కోడి కూస్తుంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు కోడి కూతతోనే నిద్ర మేల్కొంటారు.

మరి కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది. అసలు సూర్యోదయం అయినట్లు కోళ్లకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు.. కోడిపుంజు సూర్యోదయాన్ని ఎలా పసిగడతాయి.. మనుషుల కంటే ముందే అవి మేల్కోవడం వెనక సైంటిఫిక్ కారణం ఉందా.. అంటే అవుననే అంటున్నారు నిపుణులు. సూర్యోదయం సమయంలో కోడిపుంజు కూత వేయడానికి దాని శరీర నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతే కారణమని చెబుతున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉదయాన్నే కోడి కూస్తుందని మనందరికీ తెలుసు. అయితే, కోడి పుంజులు మాత్రమే కూస్తాయని నిపుణులు అంటున్నారు. కోడిపుంజుల మెదళ్లు సున్నితమైన కాంతిని సైతం గ్రహిస్తాయట. కోళ్లు చాలా సున్నితమైనవని.. వీటిలో గ్రహణ శక్తి అధికంగా ఉంటుందట. ముఖ్యంగా కాంతిని త్వరగా గ్రహిస్తాయట.

తెల్లారితే కోడి పుంజులు ఎందుకు అరుస్తాయి..

వాస్తవానికి కోడిపుంజుల కూతలు కాలానికి సంకేతంగా పేర్కొంటారు. కోడి కూతతోనే రోజు ప్రారంభమవుతుంది. పల్లెటూర్లలో చాలా మంది కోడి ఆధారంగానే నిద్ర లేచి తమ తమ పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయం చేసే రైతులు.. కోడి కూతతో నిద్రలేచి వ్యవసాయ క్షేత్రాలకు వెళతారు.

నిపుణుల ప్రకారం.. కోడిపుంజుల్లో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అని కూడా అంటారు. ఇది కోళ్ల శరీరాన్ని 24 గంటల సైకిల్ ప్రాతిపదికన పని చేసేలా చేస్తుంది. సిర్కాడియన్ రిథమ్‌లు ఒక రోజులోని 24 గంటల చక్రంలో ఒక జీవి అనుభవించే శారీరక, మానసిక ప్రవర్తనా మార్పులు. సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు కారణంగా.. కోళ్లలోని సిర్కాడియన్ రిథమ్ సక్రియం అవుతుంది. ఇది కోళ్లకు సిగ్నల్ ఇస్తుంది. అలాగే కోడిపుంజు కళ్లు చాలా సున్నితమైనవి. కాంతిని చాలా

త్వరగా గుర్తిస్తాయి. అందుకే.. సూర్యోదయం సమయంలో వాటి కాళ్లు వెంటనే కాంతిలో మార్పును పసిగడుతాయి. అలా వాటి మెదడుకు సంకేతం చేరుతుంది. తరువాత కోడి కూత పెడుతుంది.

కోళ్ల సమూహాన్ని మేల్కొలపడానికి..

సూర్యోదయాన్ని పసిగట్టే కోడిపుంజు.. తమ సమూహాన్ని మేల్కొలపడానికి అరుస్తుంది. తద్వారా రోజు ప్రారంభమైందని తమ సహచర కోళ్లకు సంకేతం ఇస్తుంది. అంతేకాదు.. ఒక్కోసారి హెచ్చరికలు చేసేందుకు కూడా కోడి పుంజులు కూత వేస్తాయట. మరికొన్నిసార్లు కోడిపెట్టలను ఆకర్షించేందుకు కూడా కూస్తాయట.

5వ అంతస్తులో ఫ్లాట్ తీసుకుంటే ఉన్న లాభనష్టాలు ఏమిటి?

లాభాలేవింటంటే:

1. మీ ఫ్లాట్ లోనికి గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, మీకు అడ్డుగా మరొక అపార్ట్మెంట్ ఉంటే తప్పితే.

2. మీరు ఇష్టపడే ఏరియాలో మీరు ఫ్లాట్ తీసుకో గలుగు తున్నారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే సాధ్యమైనంతవరకు ఎవరైనా బలీయమైన కారణం ఉంటే తప్పTop Floor కి వెళ్ళరు. నేను తప్పు కావచ్చును.

ఇక ఇబ్బందుల విషయానికొస్తే:

1. మీరు వేసవికాలంలో ఫాల్స్ సీలింగ్ చేయించినప్పటికీ కొంత వేడి ఎక్కువగా మీ ఫ్లాట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే చలికాలంలో చలి.

2. ఒక్కో సందర్భంలో కరెంటు లేనప్పుడు జనరేటర్ కూడా మొరాయించవచ్చు. అప్పుడు మీరు లిఫ్ట్ వాడడానికి అవకాశం లేక 5వ అంతస్తులోని మీ ఫ్లాట్ కి చేరుకోవడానికి ఇబ్బంది పడతారు. పెద్దవారికి అయితే ఇంకా కష్టం.

3. మరో విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇలా జరిగినవి నాకు తెలుసు. ఒక్కొక్కసారి,అన్నిచోట్ల కాకపోయినా కొన్ని పట్టణాలు, మహానగరాల్లో అనుమతి వచ్చింది నాలుగు అంతస్తులకైతే, 5వ అంతస్తు అనధికారికంగా కట్టేసి అమ్ముతారు. అటువంటి బాపతు కాదు అని అనుమతులన్నీ బాగా పరిశీలించి ధృవీకరించుకోండి. అది చాలా గిరాకీ ఉన్న ప్రాంతం అయినప్పుడు, ఇటువంటివి జరుగుతాయి. తర్వాతి కాలంలో అపరాధరుసుం కట్టించుకుని క్రమబథ్థీకరిస్తారులే లేదా మనం చేయించుకోగలంలే అనే ధీమాతో కొందరు కొంటారు.

నాకు తెలిసి వ్యాపార కూడలి చెన్నై టీనగర్ లోని పాండీబజారులో బిగ్ బజార్ ఉన్న బిల్డింగ్ మొదటి మూడు నాలుగు అంతస్తులు మాత్రమే వాడుతున్నారు. పైన కట్టిన మరో మూడు నాలుగు అంతస్తులు ఖాళీగానే ఉన్నాయి గత 15-20 ఏళ్ళుగా. కార్పొరేషన్ వారు ధ్వంసం చేయరు; యజమానులు అద్దెకు ఇవ్వలేరు. కోర్టులో వుందేమో……. "మృత మూలధనం". డెడ్ క్యాపిటల్...


L I C కట్టడం మంచిదా లేక S I P చేయడం మంచిదా?

మీరు రెండు ఒకదాని కొకటి పెద్దగా సంబంధంలేని అంశాలను గురించి అడుగుతున్నారు.


ఒకటి జీవిత బీమాకు సంబంధించినది LIC ; మరొకటి పెట్టుబడుల పై అధిక ఆదాయం పొందడానికి మ్యూచువల్ ఫండ్స్ లోని SIP - Structured Investment Plan కి సంబంధించినది.

అయితే LIC ఎండోమెంట్స్ పాలసీ లో కూడా ఆదాయం వస్తుంది కానీ, SIP లో ఆదాయం 12–15 శాతం వుండే అవకాశం ఉంటుంది. (కానీ జీవిత బీమా వుండదు)

ఒకరికి ఆదాయం కంటే బీమా పై చాలా ఆసక్తి ఉండవచ్చును…. జీవిత బీమాకే వెళ్తారు.

నేను ఇంతవరకు జీవితబీమా పాలసీ తీసుకోలేదు. (తొలినాళ్లలో తీసుకుని తర్వాత రద్దు చేసుకున్నాను.)

మరికొందరు బీమా అవసరం కంటే ఆదాయం ఎక్కువ కావాలనుకున్నవారు ఉంటారు వారు SIP కే వెళ్తారు.

అందుచేత ఇది మీ అభిరుచి పై ఆధారపడి ఉంటుంది.

ధన్యవాదాలు.

(సేకరణ)


Monday, January 13, 2025

What is the 8-4-3 rule in SIP?

when you invest money in mutual funds you get two options in every scheme. Growth or Dividend.

If you opt for growth option it means that whatever returns you generate on these units will be reinvested and your next return would be on the increased principle.

This is called COMPOUNDING. Compounding essentially means earning returns not just on the initial investment but also on the accumulated returns from previous periods. This compounding effect has a great impact, especially when investments are allowed to grow over an extended period.

The 8–4–3 rule shows the speed of compounding

In the initial 8 years, the compounding effect shows good results, but its speed increases in the next 4 years and super-exponentially in the following 3 years.

Example

SIP monthly amount 20000

Assume ROI 10%

After 8 years

After 12 years

after 15 years

See the amount invested and see the exponential growth in returns !

THUS START AS EARLY AS YOU CAN

వేంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కదా! ఒకరు పద్మావతి అమ్మవారు ఇంకొకరు అలివేలు మంగమ్మ అమ్మవారు. మరి గోదా దేవి అంటే ఎవరు?

కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు , అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే , అందులో మునిగి , అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి , ఇంత ఉంది సుమా ! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం. ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు , కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తో పాటు ఆయన శిష్యుడైన మధుర కవి , ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి , ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.


*కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |*

*పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||*

*నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం*

*పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ*

*స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా* *బలాత్కృత్య భూంక్తే*

*గోదా తస్యై నమ ఇద* *మిదం భూయ ఏవాస్తు భూయః*

************************

విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి , భగవంతుని అనుగ్రహంచే , తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. ఆ పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు ఆ రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం , ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి , తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో , ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు , ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి , అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే , వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా , తన చుట్టూ వారినే గోపికలవలె , ఆ వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించింది. ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు , సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది. అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి , తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని , శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. అమె స్వామి సన్నిదానంలో చేరిపోయింది. తండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే , భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు ఆ విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి , నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.

**************************

విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్ , అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే , కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక , గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది. ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా . ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో , అలా గోదాదేవి తిరుప్పావై , నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి ఈ జీవరాశినంతా పోశిస్తుంది.

*************************

రామచంద్రుడిని వివాహమాడిన సీతాదేవి లాగే గోదాదేవే అని అంటుంటారు. ఇద్దరూ అయోనిజలే , భూమిలో లభించినవారు. యజ్ఞానికి అని మామూలు క్షేత్రాన్ని దున్నుతుంటే సీతమ్మ లభించింది, పరమాత్మకు అర్పించదగిన పరిశుద్దమైన తులసివనంలో మన అమ్మ గోదా లభించినది. తులసికి వేరు మొదలుకొని చివరిదాకా అణువణువునా పరిమళం నిండి ఉన్నట్టుగానే గోదాదేవి తనలో ఉండే ప్రతి ప్రవృత్తిలో కూడా శ్రీకృష్ణ ప్రేమ పరిమళం నిండి ఉంది. ఇక పెంచినవాడిని చూస్తే, జనక చక్రవర్తి కర్మ యోగి , పరిపాలకుడు. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తులు భక్త శిఖామణి , పరమ వైదికోత్తముడు.ఇక చేపట్టిన వాడిని చూద్దామా అంటే ఆయన రాముడు , మరి గోదా చేపట్టిన ఆయన రంగనాథుడు , శ్రీరాముని ఇలవేల్పు. అంటే గోదాదేవి సీతారాములకే ఆరాధ్య స్థానాన్ని పొందింది. గోదా దేవి మనకు ఎన్నో నియమాలు , ధర్మాలు నేర్పింది. , ఆండాళ్ తల్లి *"ఉన్నై అరిత్తిత్తు వందోం"* మెం నిన్ను కోరివచ్చాం , *"పఱై తరుతియాగిల్"* నీవు ఇచ్చేవి కోరి రాలేదు అని చెప్పింది. దొంగని కాదు దండించేది , దొంగలోని దొంగ అనే ప్రవృత్తిని దండించాలి అని ఈనాడు పెద్ద పెద్ద దేశాలు చెబుతున్నారే ఆమాటలు గోదా మనకు ఎప్పుడో చెప్పింది. *"మత్తారై మాత్త్-అఱిక్క వల్లాన్"* శత్రువులలోని శత్రుత్వాన్ని దండించి తొలగించ గలిగేవాడు మా స్వామి అని ఎన్నో గొప్ప గొప్ప మాటల్ని తెలిపింది అమ్మ గోదా. ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది అమ్మ గోదా. శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాల్ని అందమైన పాటలుగా అందించింది గోదా. , ఆమెకు సాటి ఎవ్వరులేరు. ఆమె పేరు పెట్టుకున్నందుకు గోదావరి నది పవిత్రం అయ్యింది. ఆమె శ్రీరంగంలో రంగనాథుడిని చేరినందువల్ల కావేరీ నది పవిత్రం అయ్యింది. తను స్వామి సన్నిదానం చేరే ముందు మనల్ని అందరిని భాగుచేస్తానని వాగ్దానం చేసింది. మరి స్వామి ఫలింప చేస్తాడా అంటే , ఆమెను పాణిగ్రహణం చేసాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా. ఆ మార్గాన్ని మనం ఆశ్రయిస్తే చాలు మనం పరమాత్మను తప్పక అందుకోగలం. గోదాదేవి ధరించి విడచిన మాలని కదా స్వామి ధరించాడు. అందుకే ఈనాటికి శ్రీవెంకటేశుడు బ్రహ్మోత్సవాల్లో శ్రీవిల్లి పుత్తూర్ నుండి గోదా ధరించిన మాలనే తెప్పించుకొని ధరించి , గోదా చేపట్టిని చిలుకనీ తాను చేత ధరించి , పొంగిపోతూ ఊరేగుతాడు. భగవంతుడికి గోదా ధరించిన మాల అంటే అంత ప్రేమ. ఆమె పాటలని మనం పాడుకోగల్గితే తరించిపోతాం. **************************

ఇల్లు కొనడం లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడంలలో ఏది మంచిది?

ఇల్లు కొనడం లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం అంటే రెండు విభిన్న ఆర్థిక వ్యూహాలు. మీకు ఏది మంచిదో నిర్ణయించడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణించాలి:

ఇల్లు కొనడం:

లాభాలు:

1. **స్వంతత్వం**: మీరు మీ స్వంత ఇల్లు కొనడం ద్వారా, మీరు అద్దె కోసం ఖర్చు చేయకపోతారు మరియు దాని విలువ పెరుగుతుంది.

2. **స్థిరత**: ఇల్లు మీకు స్థిరతను ఇస్తుంది, మీరు అడ్రస్ మారాల్సిన అవసరం లేకుండా నివసించవచ్చు.

3. **పన్ను ప్రయోజనాలు**: ఇల్లు కొనడం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు, ఉదాహరణకు గృహ రుణం పై వడ్డీపై పన్ను లాభాలు.

**నష్టాలు:**

1. **అధిక ముప్పు**: ఇల్లు కొనడం అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం, మరియు ఇది నికర ప్రదర్శన కోసం సమయం పడవచ్చు.

2. **అంతరాయం**: ఇల్లు కొనడం ద్వారా మీరు ఫ్లెక్సిబిలిటీని కోల్పోతారు. ఇల్లు అమ్మడం కష్టం కావచ్చు, మరియు మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం సబ్యంగా ఉంటుంది.


మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి:

**లాభాలు:**

1. **ప్రమాణిక పెట్టుబడి**: మ్యూచువల్ ఫండ్లు విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ ను వడపోతుగా చేస్తాయి.

2. **లిక్విడిటీ**: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సులభంగా మరియు వేగంగా మీ పెట్టుబడులను నిపుణుల సహాయంతో పొందవచ్చు.

3. **వివిధ అవకాశాలు**: వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి, మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిధులను ఎంపిక చేసుకోవచ్చు.

**నష్టాలు:**

1. **మార్పిడి లాభాలు**: మార్కెట్ యొక్క ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది, మరియు క్రమంగా పెరిగే లాభాలను చూడటం కొంత సమయం పట్టవచ్చు.

2. **వ్యవహార రుసుం**: మ్యూచువల్ ఫండ్ల నిర్వహణ రుసుం (ఫీజులు) కావచ్చు, ఇది లాభాలను కొంచెం తగ్గించవచ్చు.

### నిశ్చయంగా:

- **ఇల్లు కొనడం**: దీన్ని పరిగణించండి, మీకు స్థిరమైన నివాసం అవసరం, మీరు దీని పై పెట్టుబడి పెడుతూ ఎక్కువ కాలం పాటు నివసించాలని అనుకుంటున్నప్పుడు.

- **మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి**: దీన్ని పరిగణించండి, మీరు పెరిగే పెట్టుబడిని లేదా మీరు శ్రద్ధ పెట్టకుండా పెట్టుబడులను నిర్వహించదలిచినప్పుడు.

మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సహనత మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి ఏది సరైనదో నిర్ణయించుకోవడం ఉత్తమం.


Sunday, January 12, 2025

ఇంటి నిర్మాణానికి బిల్డర్ తో అగ్రిమెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

ఇంటి నిర్మాణం కోసం బిల్డర్ తో అగ్రిమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు :

1. ప్రాజెక్టు వివరాలు:

- స్థల వివరాలు, నిర్మాణం కొలతలు, డిజైన్‌లు మరియు ప్లాన్ల వివరాలు స్పష్టంగా పొందండి.

- బిల్డింగ్ యొక్క మొత్తం స్థలం, ప్రతి ఫ్లోర్ ప్లాన్ వివరాలు మరియు యాక్సెసరీల లిస్టు పొందండి.

2. కాంట్రాక్ట్ రకాలు:

- నిర్మాణం చేయబడే పనుల రకం మరియు కాంట్రాక్ట్ రకం (లంప్ సమ్, కోస్ట్ ప్లస్, టైం మరియు మెటీరియల్) ఎంచుకోండి.

- ఈ కాంట్రాక్ట్‌లో చేర్చబడిన మరియు చేర్చబడని పనుల వివరాలు క్లియర్ గా ఉండాలి.

3. పూర్తి చేయడానికి సమయం:

- ప్రారంభ తేదీ మరియు నిర్మాణం పూర్తి చేయడానికి అంచనా సమయం స్పష్టంగా అగ్రిమెంట్‌లో చేర్చాలి.

- ఆలస్యం జరిగినట్లయితే జరిమానా మరియు పరిహారం వివరాలు ముందుగానే నిర్ణయించుకోవాలి.

4. మొత్తం ఖర్చు:

- నిర్మాణానికి అవసరమైన మొత్తం ఖర్చు, చెల్లింపు షెడ్యూలు మరియు మైలిస్టోన్‌లు స్పష్టంగా ఉండాలి.

- అదనపు ఖర్చులు మరియు అవి ఎప్పుడు చెల్లించబడతాయో గూర్చి ముందుగానే ఒప్పందం చేసుకోవాలి.

5. క్యాంసిలేషన్ మరియు టెర్మినేషన్ క్లాజ్:

- ఏవైనా కారణాల వల్ల ప్రాజెక్టు క్యాన్సిల్ లేదా టెర్మినేట్ అయినప్పుడు ఏవిధంగా పరిహారం చేయబడుతుందో స్పష్టంగా కాంట్రాక్ట్‌లో పొందుపర్చాలి.

6. నాణ్యత ప్రమాణాలు:

- వాడే మెటీరియల్స్ మరియు వాటి నాణ్యత ప్రమాణాలు వివరించండి.

- వాడే బ్రాండ్స్, సర్టిఫికేషన్ మరియు ప్రమాణాల గురించి వివరాలు పొందుపర్చాలి.

7. వారంటీ మరియు మెయింటెనెన్స్:

- నిర్మాణం పూర్తి తరువాత బిల్డర్ అందించే వారంటీ, మెయింటెనెన్స్ మరియు సర్వీస్ వివరాలు పొందుపర్చాలి.

- డిఫెక్ట్ లైయబిలిటీ పీరియడ్ (DLP) గురించి వివరాలు చేర్చండి.

8. ఇన్సూరెన్స్:

- ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బిల్డర్, సైట్ మరియు వర్కర్స్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ వివరాలు పొందుపర్చాలి.

9. లైసెన్స్ మరియు అనుమతులు:

- నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్లు బిల్డర్ వద్ద ఉన్నాయో లేదా బిల్డర్ అందిస్తాడో లేదో నిర్ధారించుకోవాలి.

10. లీగల్ కాంప్లైయెన్స్:

- కాంట్రాక్ట్ లీగల్ పాయింట్స్ పరిశీలించడానికి మరియు వాటిని సమర్థంగా తియ్యడానికి లీగల్ కన్సల్టెంట్ లేదా అడ్వకేట్ సాయం తీసుకోవడం మంచిది.

ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు బిల్డర్ తో మంచి అగ్రిమెంట్ చేసుకోవచ్చు మరియు భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.


ఆంధ్రప్రదేశ్ లో 4 సెంట్లలో 3 బీహెచ్‌కే ఇల్లు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది?

ప్రాక్టికల్ గా చెప్పాలంటే మీరు కట్టే ఇంటి యొక్క శ్లాబ్ ఏరియా బు బట్టి మనం ఖర్చును ముందే అంచనా వెయ్య వచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో శ్లాబ్ ఏరియా 1 చ.ఆ. కు రు.1500 ఖర్చు వస్తుంది.

అంటే మీరు మీ 3 bhk ఇంటిని 30 x 30 చ.ఆ. లో కడితో మొత్తం 900 చ.ఆ. శ్లాబ్ ఏరియా వస్తుంది

అంటే 900 x 1500 = 13,50,000 రూపాయలు (construction మేస్త్రీ కూలీలతో కూడా కలిపి) ఇక మీరు వేసుకునే ఫ్లూరింగ్, రంగులు అదనం,

మొత్తానికి 15,00,000 ల్లో ఎంచక్కా 3 bhk ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చెయ్యవచ్చు. అయితే మీరు మేస్త్రీల మాట విని వారు చెప్పిన రీతిలో పొడిగింపులు చేసుకుంటూ పోతే వారీ కూలీలు పెరిగిపోతాయి, మీ మెటీరీయల్ ఖర్చూ పెరిగిపోయి మీకు తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి ప్రతి అంశాల్ జాగ్రత్తగా లెక్కలు వేసుకొని కట్టుకుంతీ నేను పైన చెప్పిన ఖర్త్చుతో అందమైన ఇల్లు కట్టుకోవచ్చు.

నేను ఒక ఛ..ఆ కు 1200 రూపాయల ఖర్చుతో (POP కూడా కలిపి) అందమైన ఇల్లు కట్టుకున్నాను. నా ప్లాను, నా ఆలోచన ... ఎవరేం చెప్పినా పట్టించుకునే ప్రశక్తే లేదు. ఖచ్చితమైన కొలతలు. మేస్త్రీని నోరు మెదపనివ్వలేదు, పక్కవాళ్ళ, స్నేహితుల ఉచిత సలహాలు పట్టించుకోలేదు


ఇక్కడ మనం ఒక్కటే సిద్ధాంతం పాటించాలి: 1. ఇల్లు మీది, జీవితాంతం ఆ ఇంటిలో నివసించేది మీరు

2. ఆ ఇంటిపైన ఖర్చు పెడుతున్న డబ్బు మీది

3. ఆ ఇంటికి యజమాని మీరు (మేస్త్రీ అంటే కేవలం ఇల్లు కట్టేవాడు మాత్రమే, కాబట్టి అతడి పని మీరు చెప్పినట్లు ఇల్లు కట్టడమే. ఉచిత సలహాలు ఇవ్వడానికి అతను కానీ, మీరు ఇల్లు కడుతున్నపుడు చూడడానికి వచ్చే వ్యక్తులు గానీ కన్సల్టెంట్లు కాదు, నిపుణులు కాదు.)

కాబట్టి అది మీకు నచ్చినట్లు ఉండాలి. వేరేవాళ్ళ సలహాలు అవసరం లేదు. ఇది నేను ఖచ్చితంగా పాటించి ఇల్లు కట్టాను. నా చుట్టుపక్కల కమ్యూనిటీలో నాదే అందమైన ఇల్లు, కానీ వారందరికంటీ తక్కువ ఖర్చు తో పూర్తి చేసుకున్న ఇల్లు నాదే.

సేకరణ

Hyderabad లో పాత అపార్ట్మెంట్ మంచిదా ? కొత్త అపార్ట్మెంట్ మంచిదా ? బడ్జెట్ పరంగా..

హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలి అంటే, బ్రాండెడ్ అపార్ట్మెంట్స్ అయితే కొత్తవి కొనవచ్చు, లేదా పేరు లేని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో చీప్ గా ఫ్లాట్ కొనాలి అనుకుంటే ఆ బిల్డింగ్ కట్టిన అయిదేళ్లకు కొనండి. ఈ అయిదేళ్లలో కన్ స్ట్రక్షన్ క్వాలిటీ తెలిసిపోతుంది, ఇల్లీగల్ దందాలు ఏమన్నా ఉంటే బయటపడుతుంది.

వాటర్ problem, ప్లంబింగ్ ప్రాబ్లమ్, కరెంట్ ప్రాబ్లమ్, గోడల్లో క్రాక్స్, తలుపు కిటికీలలో చెక్క క్వాలిటీ, పిల్లర్స్ and స్లాబ్ క్వాలిటీ అన్నీ తెలుస్తాయి. లేదా HMDA అప్రూవ్ చేసిందా లేదా, ఏమన్నా నాలాలని కబ్జా చేసి కట్టారా, ఎవరి లాండ్ నో కబ్జా చేసి కట్టి, కోర్ట్ కేసుల్లో ఫ్లాట్ ఓనర్స్ ని ఇరికించారా అని అన్నీ తెలుస్తాయి.


(సేకరణ)

రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంబించాలంటే, కనీస పెట్టుబడిగా ఎంత భూమి ఉండాలి?

రియల్ ఎస్టేట్ అంటే మీరనేది?

రియల్ ఎస్టేట్ లో రక రకాలు ఉన్నాయి.

(1) భూమిని స్థలాలుగా విభజించి అమ్మడం

(2) విడి ఇళ్ళు (independent houses) కట్టించి అమ్మడం

(3) అపార్టుమెంట్లు కట్టించి అమ్మడం

సొంతంగా ఏమీ చెయ్యకుండా ఒకఱి మోచేతి నీళ్ళు త్రాఁగుతూ బ్రతికే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు :

(4) ఎవఱో కట్టినవాటికి కమిషన్ తీసుకుని మనం మార్కెటింగ్ లాంటివి చేయడం మొ॥

(5) సెకండ్స్ సేల్ ఇన్వెస్టుమెంట్ : అంటే - ఒక Housing venture లో ముందే కొన్ని ఇళ్ళు బుక్ చేసేసుకుని ఆ వెంచర్ కట్టడం పూర్తయ్యాక 50% - 100% లాభానికి ఆ ఇళ్ళని అమ్మేయడం. ఇందుకు కొద్ది సంవత్సరాలు (3 - 6 ఏళ్ళు) పట్టుతుందనుకోండి. అంటే మొదటే కొన్న ఆ మదుపరి (investor) తాను కొన్న ఆ ఇళ్ళలో కనీసం పాలు కూడా పొంగింౘఁడు. అక్కడ కాఁపరం ఉండఁడు. కేవలం కొనడం, అమ్మడం, అంతే. కోట్లాది రూపాయల నగదు (cash) ఉండి- ఓర్పుగా ఎదురుచూడఁగల - బహు బలిసిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి వ్యాపారం చేయఁగలరు. మామూలువాళ్ళ వల్ల కాదు.


మీరంటున్నది మొదటి రకం గుఱించి అయితే - కనీసం 5 - 6 ఎకరాల భూమి కావాలి.

ఎకరం అంటే 4840 గజాలు (లేక 100 సెంట్లు)…

(గజం = 3' × 3' = 9 ౘదరపు అడుగులు)

ఒక ఎకరంలో 150 గజాల (36' × 36') ప్లాట్లు 20 వస్తాయి. 150 గజాలంటే 3 సెంట్ల మీఁద ఒక పిసరుంటుంది. అలాంటి 20 ప్లాట్లు 3,000 గజాల్లో ఇముడుతాయి. మిగితా స్థలాన్ని (సగటున ఎకరానికి - 1480 గజాలు) ప్రభుత్వ నిబంధనల మేరకు తూపరాణ (డ్రెయినేజి), విద్యుత్ స్తంభాలూ, రోడ్లూ, పేవుమెంట్లూ, పచ్చదనం కోసం వదిలేయాల్సి వస్తుంది.

ఇలా 5 ఎకరాల్లో 100 ఇళ్ళ స్థలాలు ఏర్పాటు చేయవచ్చు. ఇంకో ఎకరం ప్రభుత్వ నిబంధనల మేరకు వేఱే అవసరాల కోసం వదలాలి.

కనుక మీ దగ్గర 6 ఎకరాలు ఉన్నా కూడా అందులో మీరు అమ్ముకుని సొమ్ము చేసుకోఁగల భాగం దాదాఁపు 4 ఎకరాలు మాత్రమే. నష్టదాయకమైన ఈ అంశాన్నీ మఱియూ మీకైన ఖర్చుల్నీ, ప్రభుత్వ పన్నుల్నీ దృష్టిలో ఉంచుకుని మీరు ఒక్కో గజం వెల, ఒక్కో ప్లాటు వెల నిర్ణయించాలి.

_______________

ఒకవేళ మీ దగ్గర సొంతంగా అంత భూమి లేకపోయినా, లేక అంత భూమిని మీరు డబ్బిచ్చి కొనలేకపోయినా - రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఇంకో మార్గం ఉంది.

భూమిని లాభసాటిగా అమ్ముకోవాలనుకునే రైతులుంటారు. కాని ఎవఱికి ఎలా అమ్ముకోవాలో వారికి తెలీదు. అలాంటివారి దగ్గర "నేను అమ్మిపెడతా"నని పవర్ పట్టా తీసుకోండి. ఆ తరవాత ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మండి. అమ్మఁగా వచ్చిన దాంట్లో కొంత మీరూ, కొంత ఆ రైతులూ పంచుకోండి.

ఇలా చేయాలంటే కొన్ని ముందస్తు జాగ్రత్తలూ, నిబంధనలూ పాటించాలి. మీరొక కంపెనీగా రిజిస్టర్ అయితే మంచిది. కాకపోయినా ఈ వ్యాపారం చేయొచ్చు.

(1) మీ అమ్మకం పద్ధతీ, ఉద్దేశాలూ కల్లా కపటం లేకుండా ఆ రైతులతో పంచుకోండి. కస్టమర్లతో ఒక వెల, రైతులతో ఇంకో వెల చెప్పొద్దు. నిఖారసుగా నిజాయితీగా ఉండండి. వాళ్ళలో ఒక్కడికి మండినా సరే, మర్నాడు మీ వ్యాపారం కోర్టులో… మీరు జైల్లో… !!

(2) మీరు ఆ రైతులతో ఒక లిఖిత ఒప్పందం (written agreement) చేసుకోండి. అందులో "ఎవఱికెంత, చెల్లింపులు ఎప్పుడు ఏ రూపంలో?" అనేవి స్పష్టంగా వ్రాసుకోండి. ఆ ఒప్పంద పత్రాన్ని వెంటనే రిజిస్టర్ చేయింౘండి.

(3) సాధారణంగా మనకు దొరికేవన్నీ సాఁగుభూములే కనుక Land conversion చేయింౘండి. అంటే వ్యవసాయ భూమిని ఆవాస భూమి (residential land) గా ప్రభుత్వ రికార్డుల్లో మార్పు చేయింౘండి. ఇది చెయ్యకపోతే మీ వ్యాపారం ౘట్ట విరుద్ధమవుతుంది. మీరు దాని మీఁద సంపాదించిన దాన్ని ప్రభుత్వంవారు అక్రమ సంపాదనగా పరిగణిస్తారు.

(4) మీరు విభజించిన ప్లాట్లకు ఒక స్థలనామం పెట్టండి. సూర్యానగర్, చంద్రానగర్, తారానగర్ ఇలా ఏదో ఒకటి.

(5) ఒక లేయౌట్ తయారు చేయించి దానికి మునిసిపల్, ఉడా లేక DTCP అప్రూవల్స్ తీసుకోండి. ఇది చేయకపోతే కూడా మీ వ్యాపారం అక్రమం అవుతుంది.

(6) ప్లాట్లని అమ్మకానికి పెట్టే ముందే మీ వెంచర్ లో రోడ్లూ విద్యుత్ కనెక్షనూ, నీళ్ళ కనెక్షనూ, డ్రెయినేజి కాలవలూ ఏర్పాటు చేయండి. లేకపోతే ఈ రోజుల్లో మీ ప్లాట్లు ఎవఱూ కొనరు.

________________

లేదూ, మీరు ఇళ్ళు కట్టించి అమ్మాలనుకున్నారు. మీ దగ్గర భూమి మాత్రమే ఉందనుకోండి. అందులో ఇళ్ళు కట్టింౘడానికి మటుకూ డబ్బు లేదనుకోండి. అప్పుడు కూడా మీరు Housing వ్యాపారం చేయడానికి అడ్డంకి ఏమీ లేదు.

(1) ముందు అన్ని ప్రభుత్వ అనుమతులూ సంపాదింౘండి.

(2) స్థానిక పత్రికల్లో మీ గృహనిర్మాణ వెంచర్ గుఱించి Pre-launch offer ప్రకటనలు వేయండి. మీరు కట్టదల్చుకున్న ఇళ్ళ ప్లాన్ కూడా వాటిల్లో ప్రచురింౘండి. వెంచర్ వివరాలతో ఒక రంగురంగుల బ్రోషూర్ అచ్చువేయించి పంౘండి. మీ కార్యాలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కఱి చేతిలోనూ అది పెట్టండి. దానికి ఆకర్షితులైన వారి నుంచి మొత్తం వెంచర్ ఖర్చులో 10% డబ్బు సంపాదింౘండి.

(3) ఆ డబ్బుతో మీ భూమిలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. కొన్ని ఇళ్ళకైనా పునాదులు కట్టండి. ఒక మోడల్ హౌస్ పూర్తిగా కట్టండి (బ్యాంకువాళ్ళకూ, భావి కస్టమర్లకూ చూపడం కోసం).

(4) ఇవన్నీ చూపించి బ్యాంకు ఋణం పొందండి.

(5) ఆ ఋణంతో మీ Housing వెంచర్ కట్టడం సాధ్యమైనంత తొందఱగా పూర్తి చేయండి.

Saturday, January 11, 2025

భోజనం చేయగానే ఏదైనా తీపి తినాలి అని ఎందుకు అనిపిస్తుంది?

భోజనము చేయగానే స్వీట్సు తినాలనిపించడము సహజము, సాధారణముగా అందఱి సాంప్రదాయక భోజనాల చివర్న ఒక తీపి పదార్థము వడ్డించడం సర్వ సాధారణము,

మొన్ననే తెచ్చుకున్న మిఠాయిలు ….

భోజనము తర్వాత మిఠాయిలు ఎందుకు తినాలనిపిస్తుంది అంటే మన మెదడు లోని కణజాలము మరియు మనకు మంచి భావనను నరాల ద్వారా సంకేతాలను పంపిస్తుంది,

ఇది మనలో ఉండేSerotonin హార్మోన్ల ప్రభావము,

సెరిటోనిన్‌ అనునది మనలో సంతోషపు ఆలోచనలను, మన భావనలను నియంత్రణలో ఉంచు ఒక హార్మోను,

ఈ హార్మోన్ల ద్వారా మన శరీరమంత సంతోషాన్ని కల్గించునట్టి జరిగే ఒక రసాయనకక్రియ మెదడుకు పంపే సంకేతల వలన మిఠాయిలు తినాలనిపిస్తుంది,

, స్వీట్సు, ఛాక్లేట్లు తింటే మన మెదడు లో ఒక కమ్మటి భావన కల్గించుతుంది , మన మనస్సును ఆనందంలో ముంచి, ఒక విధమైన మధురమైన భావనను కలిగించి, మన జీర్ణక్రియకు మరియు హాయిగొలిపి చక్కటి నిద్రకు దోహద పడుతుంది!!

ప్రతి రకమైన భోజనానికి తోడుగా ఇంకా ప్రత్యేకమైన విందులకు ప్రత్యేకమైన తీపి పదార్థలు కాంబినేషన్‌లు ఉంటాయి,

ఇంట్లో దావత్‌లలో::బిర్యానీకి ఖద్ధూకాఖీర్‌, డబల్‌కామీఠా, ఖుర్బానీకామీఠా లాంటివి,

ఇంటిలో పూజలకు నైవేద్యాలు :: పులిహోరా, ధధ్యోౙనం, చక్కెర పొంగలి ,పూరీ - ఖీర్‌ లేదా రవ్వ హల్వా( రవ్వ కేసరి)

చక్కెర చల్లిన బిస్కట్ లు

మనఇళ్లలో పిండివంటలతో పాటు, తీపివి అరిసెలు, భక్ష్యాలు, కోవా గర్జెలు, బెల్లపు గవ్వలు, రోజ్‌పూవులు,

మా ఇంట్లో కూడా మధ్యాహ్నపు భోజనం అవగానే , కేకులో

డార్కు ఛాక్లట్టో, ఏదైన మిఠాయో తప్పకుండా ఉంటుంది, అప్పుడప్పుడు ఐస్‌క్రీమ్‌ కూడా ఉండొచ్చు!

ధన్యవాదాలు

(సేకరణ)

సులేమాని చాయ్ అంటే ఏమిటి? దాని తయారీ, రుచి ఎలా ఉంటుంది?

సులేమాని చాయ్…

సుగంధ భరితమైన అనుభూతి.

అద్భుతమయిన రుచి.

వర్షం పడుతున్నప్పుడు , కబుర్లు చెప్పుకుంటూ ఒక గ్లాస్ సులెమానీ టీ తాగితే వేడి వేడి గా…, అదొక అందమైన దృశ్యం.

యాలక్కాయాలు 5

సొన్ఫ్ 2 స్పూన్లు

దాల్చిన చెక్క 2 స్పూన్లు

తేయాకు,2స్పూన్లు

కుంకుమ పువ్వు కొద్దిగా

కొద్దిగా పంచదార ఇష్టమైతే

సున్నం నీరు కొద్దిగా. ఇష్టమైతే

యాలక్కాయలూ, సోన్ఫ్, దాల్చిన చెక్క పొడి చేసుకొని,

ఒక గ్లాసెడు నీళ్లకు ఒక స్పూను ఈ పొడి వేసుకుని,తేయాకు రెండు స్పూన్లు వేసి, బాగా కాగాక, కుంకమపువ్వు వెయ్యండి.

వేడి వేడిగా త్రాగండి.

Thursday, January 9, 2025

Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!


"మైసూర్ పాక్ " ఇష్టపడని వాళ్ళు , రుచి చూడని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరేమో. ఊరి పేరుతో పాపులర్ అయిన అతికొద్ది స్వీట్లలో మైసూర్ పాక్ ముఖ్యమైనది.

హిస్టారికల్ సిటీ మైసూర్ లో పుట్టిన మైసూర్ పాక్ ప్రజలందరికీ చేరువైన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పటికీ దీనిని కనిపెట్టిన చెఫ్ కుటుంబీకుల 5వ తరం మైసూర్ పాక్ తయారీ బిజినెస్ లోనే ఉండడం విశేషం.

మైసూర్ రాజుల అంతఃపురంలో పుట్టిన మైసూర్ పాక్

మైసూర్ పాక్ పాపులారీటీ చూసి ఇదేదో పురాతనమైన వంటకం అనుకుంటే పొరబాటే. గట్టిగా మాట్లాడితే ఈ స్వీట్ పుట్టి వందేళ్లు కూడా కాలేదు. మైసూర్ ను 1902 నుండి 1940 వరకూ పరిపాలించిన 24వ మహారాజు 4వ కృష్ణారాజ వడయార్ మంచి భోజన ప్రియుడు. ఆయన భోజనానికి కూర్చుంటే బోలెడన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన ముందు ఉండాల్సిందే. రాజ కుటుంబ అంతఃపురానికి "కాకాసుర మడప్ప " ప్రధాన వంటగాడు. ఒకసారి ఆయన తన మహారాజుకు ఒక కొత్త వంటకం రుచి చూపిద్దామని వంట గదిలోని అతి తక్కువ పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేసారు. దాని రుచి మహారాజుకు బాగా నచ్చడంతో దీని పేరు ఏంటని అడిగాడు. మడప్పకు ఏం చెప్పాలో తెలియక పంచదార "పాకం"లో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దానితో పాటే తమ రాజ్యం మైసూరు కలిసి వచ్చేలా "మైసూరు పాక" చెప్పాడు. అదే తర్వాతి కాలంలో " "మైసూర్ పాక్" గా మారింది.

మహారాజు కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట " ప్యాలెస్ కు సమీపంలో " ఒక దుకాణం ఏర్పాటు చేయమని మడప్పకు సూచించారు. అలా రాజకుటుంబ ప్రధాన చెఫ్ మడప్ప 1935లో మొదలుపెట్టిన షాపే ఫేమస్ " గురు స్వీట్స్ ". వాడయార్లు ఈ స్వీట్ ను బ్రిటిషర్లకు గిఫ్ట్ గా పంపడం , వాళ్లకూ ఇది నచ్చడంతో మైసూర్ పాక్కు మరింత పాపులర్ కి వచ్చింది. మైసూర్ పాక్ స్వీట్ జనంలో ఎంతలా పాపులర్ అయిందంటే ఇండియా మొత్తం మీద ఈ స్వీట్ అమ్మని ఊరే కనపడదు.

అతి తక్కువ పదార్థాలతో అదిరిపోయే టేస్ట్

మైసూర్ పాక్ తయారీకి పదార్థాలు చాలా తక్కువ. పంచదార, నీళ్లు సమాన మోతాదు లో కలిపి పాకంలా తయారయ్యేంతవరకు వేడి చేస్తారు. పాకం సరైన స్థితికి చేరుకున్నాక దానిలో శనగపిండి కలిపి, పైన యాలకుల పొడి వేసి నెయ్యి రాసిన ప్లేట్లో పోసి కావలసిన షేప్ లో ముక్కలుగా కట్ చేస్తారు. అంతే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఈ మధ్య కాలంలో మైసూర్ పాక్ లో తమ తమ టేస్ట్ కు తగ్గట్టుగా రకరకాల ఫ్లేవర్లు కలుపుతున్నారు.

5 తరాలుగా మైసూర్ పాక్ బిజినెస్ లోనే "మడప్ప " వంశీకులు

మైసూర్ మహారాజు సూచనతో 90 ఏళ్ల క్రితం కాకాసుర మడప్ప ప్రారంభించిన "గురు స్వీట్స్" ఇప్పటికీ నడుస్తోంది. ఆయన కుటుంబంలోని ఐదవ తరం వారసులు ఈ షాపును నడుపుతున్నారు. వీరికి శివానంద, కుమార్ లు కుటుంబ పెద్దలుగా ఉన్నారు. ఈ 90 ఏళ్లలో మైసూర్ పాక్ లో చాలా వెరైటీలు వచ్చి చేరాయి. ప్రస్తుతం మడప్ప తయారుచేసిన ఒరిజినల్ మైసూర్ పాక్ తో పాటు మరో ఏడు ఫ్లేవర్ లలో ఈ స్వీట్ ను తయారు చేస్తున్నారు.

మైసూర్ ప్యాలెస్ దగ్గర్లోని దేవరాజ మార్కెట్లో సయ్యాజి రావు రోడ్ లో ఈ గురు స్వీట్ షావు ఉంటుంది. ఉదయం నుండి రాత్రి 10 వరకూ తెరిచి ఉంచే ఈ షాప్ ముందు కస్టమర్ల తో పెద్ద క్యూలైనే ఉంటుంది. అలాగే మైసూర్ కు వచ్చే టూరిస్టులు మైసూర్ ప్యాలెస్ తో పాటు గురు స్వీట్స్ షాప్ ను కూడా సందర్శించి మైసూర్ పాక్ ను కొనుక్కుని వెళుతూ ఉంటారు. "మైసూర్ పాక్ లో మైసూర్ ఉంటుందా " అనే ఓ సరదా సినిమా డైలాగ్ బాగా పాపులర్. అది నిజమే కానీ " మైసూర్ పాక్ మాత్రం మైసూర్ లోనే పుట్టిందనేది "అసలు వాస్తవం.

Wednesday, January 8, 2025

మన దేశంలో ఇదో వింత గ్రామం.. ఇక్కడ ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా..

సహజంగా మనిషిని మరొక మనిషి పేరుపెట్టి పిలుస్తారు. పేరు వ్యక్తికి ఒక ఐడెంటిటీని ఇస్తుంది. పిల్లలు పుట్టిన వెంటనే చిన్న, కన్న అంటూ రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తారు కూడా.. అయితే మన దేశంలో ఒక వింత గ్రామం ఉంది. ఈ గ్రామంలో నివసించే వారిలో ఎవరికీ సొంత పేరు లేదు. పేరు పెట్టి పిలవడానికి బదులుగా ఒక ప్రత్యేక పాట ద్వారా పిలుస్తారు. అయితే ఈ గ్రామం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటి ఈ రోజు తెలుసుకుందాం..

Whistling Village

మన భారతదేశంలో అసలు పేర్లంటూ లేని ప్రజలున్న గ్రామం ఒకటి ఉందని చెబితే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామస్తులు ఒకరినొకరు పేర్లకు బదులుగా పాటలు పాడుతూ పిలుచుకుంటారు. అవును ఇది వాస్తవం. ఈ గ్రామంలో పిల్ల పుట్టిన వెంటనే అమ్మ ఒక రాగం వాయిస్తుంటుంది. ఆ రాగమే ఆ పిల్ల పేరు. మన దేశంలో ఈ ప్రత్యేకమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామం పేరు కొంగ్‌థాంగ్ గ్రామం. కొంగ్‌థాంగ్ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు తమ పేర్లతో కాకుండా వేరే రాగం లేదా ప్రత్యేక రాగంతో పిలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘విజిల్ విలేజ్’ అని కూడా పిలుస్తారు. కోంగ్‌థాంగ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి 60 కి.మీ దూరంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది.

ఈ గ్రామ ప్రజలు తమ తోటి గ్రామస్తులకు తమ సందేశాన్ని తెలియజేయడానికి కూడా ఈలలు వేస్తారు. కొంగ్‌థాంగ్ గ్రామస్తులు ఈ ట్యూన్‌ని ‘జింగార్‌వై లవ్బీ’ అని పిలుస్తారు. అంటే తల్లి ప్రేమ గీతం. గ్రామస్తులకు రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి సాధారణ పేరు.. మరొకటి పాట పేరు. పాటల పేర్లకు రెండు వెర్షన్లు ఉన్నాయి.. పొడవైన పాట.. చిన్న పాట. సాధారణంగా చిన్న పాటలను ఇంట్లో.. పొడవైన పాటలను బయట వ్యక్తులు ఉపయోగిస్తారు.

700 విభిన్న రాగాలు

కొంగ్‌థాంగ్‌లో సుమారు 700 మంది గ్రామస్తులు ఉన్నారు.. పేరు ప్రకారం చూస్తే ఆ గ్రామంలో 700 విభిన్న రాగాలు ఉన్నాయి. ఫైవ్‌స్టార్ ఖోంగ్‌సిట్, ఖాసీ తెగకు చెందిన వారు కొంగ్‌థాంగ్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులను పిలవడానికి ఉపయోగించే ‘ట్యూన్’ బిడ్డ పుట్టిన తర్వాత తల్లులు తయారు చేస్తారు. అయితే ఎవరైనా గ్రామస్థుడు మరణిస్తే .. అతనితో పాటు ఆ వ్యక్తి రాగం కూడా మరణిస్తుంది. ఈ గ్రామస్తులకు సొంత ట్యూన్లు ఉన్నాయి. పిల్లలు పుట్టిన వెంటనే అమ్మ ఈ రాగాలను సృష్టిస్తుంది.

‘మా అమ్మ ట్యూన్ కంపోజ్ చేసింది’

మా ఊరిలో లేదా ఇంట్లో పిల్లల్ని పిలవాలంటే చిన్న రాగం వాడతారని గ్రామస్థుడు చెప్పాడు. తన పేరుని అమ్మ ట్యూన్ కంపోజ్ చేసిందని అదే పేరు జీవితాంతం కొనసాగుతుందని చెప్పారు. తరతరాలుగా తమ గ్రామంలో ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే ఎప్పుడు ఎలా మొదలైందో మాకు తెలియదని అంటున్నారు. తమ పేరుని ఇలా రాగంతో పిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?

సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99% మంది చెప్పలేకపోయారు... మీరు ట్రై చేస్తారా..?

చల్లని సాయంత్రం వేడివేడిగా ఏదయినా తింటుంటే ఆ మజాయే వేరు... ఈ తినేది రుచికరమైన సమోసా అయితే ఆ అనుభూతి వేరే లెవెల్. భారతీయుల స్నాక్స్ లిస్ట్ సమోసాతోనే ప్రారంభం అవుతుందని అనడంలో సందేహం లేదు... అలాంటి సమోసాను ఇంగ్లీష్ లో ఏమంటారో మీకు తెలుసా..?

Samosa

చాలామందికి సాయంత్రం వేళ చిరుతిళ్లు (స్నాక్స్) తినే అలవాటు వుంటుంది. ఒక కప్పు టీతో పాటు ఏదోఒకటి లేకుంటే ఆ సాయంత్రం గడవదు. ఇలా ఎక్కువమంది ఇండియన్స్ తీసుకునే స్నాక్స్ ఏదో తెలుసా... సమోసా. చల్లని వేళ వేడివేడి సమోాసాలను తినడాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి.

ఫుడ్ లవర్స్ సమోసా అంటే పడిచస్తుంటారు. భోజనం చేయకున్నా సమోసాతో కడుపు నింపుకునేవారు చాలామంది వుంటారు. అందువల్లే సమోసాను స్నాక్స్ లో రారాజుగా పేర్కొనడంలో అతిశయోక్తి లేదు.

భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా సమోసాలు దొరకుతాయి. తయారుచేసే పద్దతిలో, రుచిలో తేడా వుండొచ్చు... కానీ ప్రతిచోటా దానిపేరు సమోసానే. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఉర్దూ... అన్ని బాషల్లోనూ సమోసానే.

కేవలం మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో సమోసాలు లభిస్తాయి. ఆ దేశాల్లోనూ రుచికరమైన ఆహారంగా గుర్తింపుపొందింది, దీంతో విదేశాల్లోని భారతీయులు సమోసా రుచిని మర్చిపోవడంలేదు. అంటే సమోసా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్నాక్స్.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది సమోసా భారతీయ వంటకం అనుకుంటారు. కానీ సమోసా ఇరానియన్ వంటకం. అక్కడ సమోసాను సాంబోసా అని పిలుస్తారు. మొఘలుల ద్వారా ఈ ఆహారం భారతదేశానికి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సమోసాలో బంగాళాదుంపలతో పాటు పల్లీలు కనిపిస్తాయి. గతంలో సమోసాలో మాంసం కీమా నింపేవారు. కాలక్రమేణ తయారీ విధానంలో మాార్పులు జరిగాయి.

రుచికరమైన ఆహారంగా సమోసా ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, ఈ సమోసా కోసం మొత్తం రోజునే కేటాయించారంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రపంచ సమోసా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

  • భారతీయ బాషలన్నింటిలో సమోసా అని పిలువబడే అందరికీ ఇష్టమైన ఆహారాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన ఆహారం సమోసాను ఆంగ్లంలో రిస్సోల్ అని పిలుస్తారు.

రోడ్ల మీద ఉండే మైలు రాళ్లకు ఇన్ని రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక కహానీ ఏంటంటే?

సాధారణంగా మనం రోడ్ల మీద వెళ్తుంటే మైలు రాళ్లు కనిపిస్తాయి. ముందుగున్న నగరాలు, పట్టాణాలు, గ్రామాలకు సంబంధించి ఇంకా ఎంతదూరం వెళ్లాలో ఆ మైలు రాళ్లు సూచిస్తాయి. వాటి ఆధారంగా చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వాళ్లు సైతం మైలు రాళ్లు, సైన్ బోర్డులు చూసి ఎలా వెళ్లాలో తెలుసుకుంటారు. అయితే, రోడ్ల మీద వెళ్లే సమయంలో మైలు రాళ్లకు రకరకాల రంగులు ఉంటాయి. ఒక్కో రంగు వెనుక ఒక్కో కథ ఉంటుంది. ఇంతకీ ఏ రంగు రాయి వెనుక, ఏ కథ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

పలు రంగుల్లో మైల్ స్టోన్స్

రోడ్ల మీద కనిపించే మైల్ స్టోన్లలో కొన్ని పసుపు రంగులో ఉంటాయి. మరికొన్ని ఆరెంజ్ కలర్, ఇంకొన్ని నలుపు, ఆకుపచ్చ, నీలం రంగులో ఉంటాయి. అసలు ఎందుకు ఇన్ని కలర్స్ అని చాలా మందిలో అనుమానం కలుగుతుంది. కానీ, ఎవరు పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ, ఒక్కో రంగు మైల్ స్టోన్ వెనుక ఒక్కో కథ ఉంటుంది.

⦿ పసుపు రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయి కింద తెలుపు రంగులో ఉండి, పైన పసుపు రంగులో ఉంటే మనం నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించే రోడ్ల మీద మాత్రమే ఈ రకమైన మైలు రాళ్లు ఉంటాయి. ఆ ఎల్లో కలర్ మీద నేషనల్ హైవే నెంబర్ కూడా ఉంటుంది. ఈ రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది.

⦿ ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయికి కింద తెలుపు రంగు ఉండి, పైన గ్రీన్ కలర్ ఉంటే అది స్టేట్ హైవే అని తెలుసుకోవాలి. గ్రీన్ పార్ట్ మీద స్టేట్ హైవే నెంబర్ కూడా ఉంటుంది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి.

⦿ నీలం రంగు మైల్ స్టోన్

ఒక మైలు రాయికి కింద తెలుగు రంగు ఉండి, పైన నీలం రంగు ఉంటే మనం డిస్ట్రిక్ రోడ్డు మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాలు చూసుకుంటాయి.

⦿ నలుపు రంగు మైల్ స్టోన్

ఇక మైల్ స్టోన్ లో కింద తెలుపు ఉండి, పైన నలుపు రంగు ఉంటే నగరంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. నగరాల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ కనిపిస్తాయి.

⦿ ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్

మైలు రాయికి కింద తెలుపు రంగు, పైన ఆరెంజ్ కలర్ ఉంటే, అవి గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లుగా గుర్తించాలి.

⦿ పూర్తి ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్

ఇక ఒక మైల్ స్టోన్ కు కింద అంతా ఆకుపచ్చ రంగు ఉండి, పైన తెలుపు రంగు ఉంటే ఫారెస్ట్ రోడ్డులో ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. అడవుల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయి.


Tuesday, January 7, 2025

భారతదేశంలో కొన్ని సుందర రైలు మార్గాలు

రైలు పయనము ఎల్లప్పుడూ గుర్తుండిపోయే అనుభవము, రైలులోన ఉన్నంతవరకు వేరే లోకములో ఉన్నటుండును. ఎవరైనా సరే కిటికి ప్రక్కకే కూర్చోవలెను అని కోరుకుందురు. ఇంత మంచి రైలు పయనము ఆకర్షించే ప్రకృతి చోటుల మద్య వెళితే ఎంత అబ్బురముగా ఉండును కదా. అటువంటి తప్పక చూడదగిన రైలు మార్గముల గురించి వ్రాయబోదును.

  • అరకు లోయ రైలు మార్గము (విశాఖపట్టణము నుండి అరకు వరకు) - అబ్బురపరిచే తేయాకు (టీ) తోటలు, జలపాతాలు, లోయలు, గుహలు కనులకు కనువిందు చేయును.
  • గోదావరి వారధి రైలు మార్గము (రాజమండ్రి నుండి వెళ్ళును) - గోదావరి నది సూర్యోదయము, సుర్యాస్తమయము వేళ అబ్బురముగా ఉండును.
  • హిమాలయ రైలు మార్గము (కాల్కా నుండి షిమ్లా వరకు) - ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కొండలు, దేవదారు చెట్టు అడవులు, కనువిందు చేయును.
  • డార్జిలింగ్ హిమాలయ రైలు మార్గము (జలపైగురి నుండి డార్జిలింగ్ వరకు) - ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. కంచెనజంగా పర్వతము, చిన్ని అడవులు, నగరాలు, తోటల దృశ్యాలు అబ్బురముగా ఉండును.
  • నీలగిరి రైలు మార్గము (మేట్టుపాలయం నుండి ఊటి వరకు) - ఇది కూడా ప్రపంచ సహజ వారసత్వ ప్రదేశాలలో ఒక్కటయినది. పచ్చని ప్రకృతి దృశ్యాలు, అడవి కొండలు, తేయాకు (టీ) తోటలు, జలపాతాలు అబ్బురపరుచును.
  • మండోవి రైలు మార్గము (ముంబయి నుండి గోవా వరకు) - అందమైన పశ్చిమ కనుమలు (Western Ghats), అరేబియా సముద్రము కనిపించును.
  • వాస్కో డ గామా నుండి లొండా వరకు - అందాల గోవా ఊళ్ళు, పశ్చిమ కనుమల (Western Ghats) జలపాతాలు, పచ్చని కొండలు కనిపించును.
  • పాంబన్ వారధి రైలు మార్గము ( పాంబన్ నుండి రామేశ్వరము వరకు) - ఇది భారత దేశములోనే రెండవ అతి పొడవైన వారధి. బంగాళాఖాత సముద్రము మద్య నుండి పోవును.
  • ఎడారి రైలు మార్గము (జోధ్పూర్ నుండి జైసల్మేర్ వరకు) - ఎడారిలోని రంగుల మట్టి గుడిసెలు, ఒంటెలు, సూర్యోదయం ఆకట్టుకుండును.
  • చిల్కా రైలు మార్గము (భువనేశ్వర్ నుండి బ్రహ్మాపూర్ వరకు) - తూర్పు కనుమలు (Eastern Ghats), చిల్కా ఏరులోని వలస పక్షులు అబ్బురపరుచును.
  • కన్యాకుమారి - తిరువనంతపురం - తమిళనాడు కేరళ వాస్తుశిల్పకళ గుడులు, కొబ్బరి తోటలు కనువిందు చేయును.
  • కేరళా రైలు మార్గము (ఎర్నాకులం - కొల్లం - తిరువనంతపురం) - వృష్టజలాలు (Backwaters), కొబ్బరి తోటలు, పచ్చని పంటలు వాన పడుతున్నప్పుడు చూచినచో ముగ్ధులవుదురు.
  • కాశ్మీర్ రైలు మార్గము ( జమ్మూ నుండి ఉదంపూర్ వరకు), (కాజిగండ్ - శ్రీనగర్ - బారాముల్లా) - అబ్బురపరిచే మంచు కొండలు, లోయలు, నదులు, అడవులు కనిపించును.
  • అసోం రైలు మార్గము (గువాహతి - లుమ్డింగ్ - సిల్చూర్) - అందమైన కొండలు, తేయాకు (టీ) తోటలు కనిపించును. తేయాకు తోటల దృశ్యాలు మాత్రముయే కాదు దాని పరిమళము కూడా వెదజల్లును.

అన్వేషకులు (Explorers), ఛాయాచిత్రకారులు (Photographers), పయనాల మీద అభిరుచి ఉన్నవాళ్లు ఈ రైలు మార్గములలో పయనించవలె. చాలా సంతోషంగా, జాగ్రత్తగా ఈ ప్రదేశములను చూచి ముగ్ధులవ్వుము.

(సేకరణ)

హైదరాబాద్ లో లోను పెట్టి అపార్ట్ మెంట్ కొనడం మంచిదా? లేక ఇల్లు కి కావాల్సిన డబ్బు సంపాదించి కొనడం మంచిదా? లేక Rent కి ఉండం మంచిదా?

హైదరాబాదు నా సొంత ఊరు కాదు, పని కోసమే ఉంటున్నా అనుకుంటే, నాకు తెలిసి ఒక రెండు బెడ్రూం ల ఇల్లు కొనాలి అంటే తక్కువలో తక్కువ 80లక్షలు, అది కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మాత్రమే, అంటే మనకు మిగిలే లాండ్ షేర్ మహా అయితే 200–300చదరపు అడుగులు ఉండొచ్చు, ఆ చిన్న లాండ్ విలువ 15లక్షలు ఉండొచ్చు, మిగిలిన 65లక్షలు కట్టుబడి, టాక్స్, మరియు బిల్డర్ ఆదాయం అనాలి.


ఇపుడు ఇదే 80లక్షల విలువ చేసే ఇల్లు బాడుగకు 20–25వేలు ఉంటుంది, 80లక్షలు మన దగ్గర లేకుండా loan లొ ఇల్లు కొనాలి అంటే పూర్తిగా ఆలోచన మానుకుంటా, ఒకవేళ న దగ్గర పూర్తి డబ్బు ఉంటే ఆ 80లక్షలు బ్యాంకు లో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే, కనీసం 6 శాతం వడ్డీ(ఇప్పుడు 7.1శాతం ఇస్తున్నాయి)

6 శాతం సంవత్సరానికి అంటే, లక్ష కి 6వేలు, 80లక్షలకు 80*6 = 480 వేలు, అంటే 4.8లక్షలు వస్తుంది ఒక సంవత్సరానికి.

మరి నెలకి పంచితే 480/12 = 40వేలు

ఇందులో 20వేలు ఇంటి బాడుగ కట్టేసి, మిగతా 20వెలతో ఏదైనా SIP Leda mutual fund investing plan, adi kooda కాదంటే బంగారు కొనిపెట్టుకుంటా.

ఒక 10సంవత్సరాలు దాటితే

ఇల్లు గనక కొని ఉంటే అందులో కట్టుబడి విలువ ప్రతి ఏడు తగ్గటమే, మీకిచ్చిన 200–300చదరపు అడుగుల విలువ పెరిగితే పెరగొచ్చు కానీ అది చాలా తక్కువ విస్తీర్ణం కనుక రెండింతలు అయినా కూడా మీ కట్టుబడి తరుగుదల సమం చెయ్యలేదు, సరే చేసింది పదేళ్ల తర్వాత మీ అపార్ట్మెంట్ నీ 80లక్షలకు కొనే విలువ ఉంది అనుకుందాం, మీకు ఎం మిగిలింది? మీ డబ్బు మీకు మిగిలింది మహా అయితే, లేదా ఈ మధ్యలో సొంత ఇల్లు కాబట్టి remodelling రెనివేషన్ అంటూ అదనపు ఖర్చు కూడా అయుందొచు.

అదే 80లక్షలు FD చేసి, వచ్చిన వడ్డీతో బాడుగకు ఉంటూ, మిగిలిన 20వెలు దాచి ఉంచితే, మీ 80లక్షల ప్రిన్సిపల్ amount అలాగే వుంటుంది

20,000* 120నెలలు = 2400,000 మీకు అదనపు మిగులు

ఒకవేళ మీరు ఈ మిగులు ను బంగారు మీద పెట్టుబడి పెడితే ఖచ్చితం గా పదేళ్లలో రెండింతలు అవుతుంది(ఇంకా ఎక్కువే కావొచ్చు) అంటే మీ ఆదాయం 48లక్షలు.

పైన చెప్పింది కేవలం పది సంవత్సరాలకే, గుర్తుంచుకోండి.

ఇపుడు బిల్డర్ ల అసలు టార్గెట్ మధ్య తరగతి ఆలోచన గమనిద్దాం, సగం లేదా అంతకంటే తక్కువ డబ్బు, ఉదాహరణకి 30–40లక్షలు డబ్బు ఉండీ, మిగతా లోన్ పెట్టుకుని ఎలాగైనా సొంత ఇంట్లో ఉండాలి అనే మనలాంటి చాలా మంది మధ్య తరగతి వాళ్ళ ఆలోచనే ఈ వ్యాపారానికి ఆధారం.

సగం, అంటే 40లక్షలు ఉంది అనుకుందాం, మిగిలిన 40లక్షలు లోన్ అనుకుందాం.

ఉన్న నలభై లక్షలు కట్టేసి, ఇంకో 40లక్షల లోన్ తీస్కుని ప్రతి నెల సులువుగా కట్టేయ్యోచు అనుకుంటాం, ప్రతినెలా సులువుగా కట్టాలంటే ప్రతినెలా 25ఏళ్ల పాటు ఉద్యోగం చెయ్యాలి కష్టం అయినా అనేది మర్చిపోతాం.

సరే, కొన్నాం, నెలకి బ్యాంక్ కి ఎంతకట్టాలో చూద్దాం, 25సంవత్సరాలు లోన్, 40లక్షలు, 8.5%వడ్డీ అంటే నెలకు 32వేలు కటాలి, నలభై లక్షలు మీ dabbu ఇచ్ినప్పటికీ meeru 32వేలు కడుతారు 25ఏళ్ల పాటు.

మరి 25ఏళ్ల తర్వాత మీ అపార్ట్మెంట్ విలువ ఏమిటి? కూలదోసే ఖర్చులు మీరే పెట్టుకోవాలి.

ఇపుడు అదే 25ఏళ్ళకి, వేరే ఆలోచన చేద్దాం.

మీ దగ్గరున్న 40లక్షలు బ్యాంక్ లో FD chesi,6శాతం వడ్డీ తో, ఆ వడ్డీ నీ మీరు వాడుకోకుందా తిరిగి ప్రిన్సిపల్ లో కలిపితే

నెల 1: 4000000 * 1.005 = 4020000

నెల 2: 4020000 * 1.005 = 4040100

నెల 3: 4040100 * 1.005 = 4060300

……

నెల 300(25 సంవత్సరాలు): 1,25,20,104 - 1 కోటి 25 లక్షలు మీ మిగులు

మరి ఇంటి బాడుగ అంటారా, మీరు లోను తీసుకుంటే 32వేలు కట్టాలి గ, అదే 20బాడుగకు కట్టండి సరిపోతుంది.

ఇక మీరు కడుతూ వచ్చిన బ్యాంక్ లోను 32 వేల సంగతి చూద్దాం, ఈ రోజు ఇల్లు 20వేలకు దొరకవచ్చు, పోను పోను బాడుగలు పెరుగుతాయి కాబట్టి తొలుత లో 12 వెలు మిగిలినా చివరికి అది సరిపోతుంది 45వేళ బాడుగ వరకు. తెలివిగా చేస్తే వచ్చిన ఆ 12వేల మిగులు ను పెంచవచ్చు కానీ బాడుగకు సరిపేట్టేసుకుందాం

ఒకవేళ మీరు FD కాకుండా వేరే పెట్టుబడులతో ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు, FD అయితే నమ్మకమైన ఆదాయం.

చివరగా ఒక మాట

మీరు లోన్ లో ఇల్లు కొంటున్నారు అంటే, మీరు govt ki ఆదాయం(రిజిస్ట్రేషన్ టాక్స్, మున్సిపాలిటీ టాక్స్ సుమారుగా 6–8 లక్షలు) చేకూరుస్తున్నారు, ఆ బిల్డర్ కి పెద్ద మొత్తం లో(15+ లక్షలు) ఆదాయం ఇస్తున్నారు, 25ఏళ్ల పాటు బ్యాంక్ కి ఉచిత ఆదాయం( 50+ లక్షలు) ఇవ్వబోతున్నారు, ఎవరి డబ్బు ఇది? ఇంతమందికి మీ కష్టార్జితం ఇవ్వటం అవసరమా? వీటి కోసం మీ 25 సంవత్సరాల జీవితం(విలువ అనంతం) ఉద్యోగాలకి అంకితం చేయబోతున్నారు, సొంత ఊరిలో కుటుంబం అంతా ఉండటానికి కొనుక్కుంటే సరే, పని మీద వెళ్ళిన ఊరిలో ఇంత అవసరమా? పైగా, ఆ డబ్బుని మీ వూరిలో పెట్టుబడి పెడితే మీ ఊరు కూడా పెరుగుతుంది కదా, భూములు కొనండి, ఇల్లు కట్టండి మీ ఊరిలోనే, అమ్మ అక్క చెల్లి ఉంటే వారికి బంగారు కొనండి. మీ కష్టం మీ విలువ పెంచాలి, వేరే వాళ్ళ ఆదాయం పెంచటానికి మాత్రమే కాకూడదు.

Sleeping paralysis అంటే?

స్లీపింగ్ పారాలిసిస్ (Sleeping Paralysis) అనేది ఒక రకమైన నిద్రలో సంభవించే అనుభవం. ఇది సాధారణంగా నిద్రలోకి వెళ్లేటప్పుడు లేదా నిద్ర నుండి మేల్కొనేటప్పుడు సంభవిస్తుంది. ఈ స్థితిలో వ్యక్తి తన శరీరాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు, మాట్లాడలేని స్థితిలో ఉంటాడు, కానీ అతను పూర్తిగా మేల్కొని ఉంటాడు. ఈ స్థితి కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు.

స్లీపింగ్ పారాలిసిస్ యొక్క లక్షణాలు:

  1. శరీరాన్ని కదిలించలేకపోవడం: వ్యక్తి తన శరీరాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు.
  2. మాట్లాడలేకపోవడం: వ్యక్తి మాట్లాడాలనుకున్నా మాట్లాడలేని స్థితిలో ఉంటాడు.
  3. భయం లేదా ఆతంకం: ఈ స్థితిలో వ్యక్తికి తనపై ఎవరో ఒత్తిడి చేస్తున్నట్లు లేదా ఏదో భయంకరమైన దృశ్యాలు కనిపించే అనుభవాలు ఉండవచ్చు.
  4. శ్వాస కష్టం: కొందరికి శ్వాస తీసుకోవడంలో కష్టం అనిపించవచ్చు.

స్లీపింగ్ పారాలిసిస్ ఎందుకు సంభవిస్తుంది?

స్లీపింగ్ పారాలిసిస్ సాధారణంగా REM (Rapid Eye Movement) నిద్ర దశలో సంభవిస్తుంది. REM నిద్రలో మన మెదడు చురుకుగా ఉంటుంది మరియు స్వప్నాలు కనిపిస్తాయి, కానీ శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో మెదడు శరీరాన్ని తాత్కాలికంగా పక్షవాతం (Paralysis) స్థితిలో ఉంచుతుంది, తద్వారా మనం స్వప్నాలలో చేసే చర్యలను నిజంగా చేయకుండా ఉంటాం. కొన్ని సందర్భాల్లో, మనసు మేల్కొని ఉండగా శరీరం ఇంకా పక్షవాతం స్థితిలో ఉంటే, స్లీపింగ్ పారాలిసిస్ అనుభవం సంభవిస్తుంది.

స్లీపింగ్ పారాలిసిస్ ని ఎలా నివారించాలి?

  1. మంచి నిద్ర పద్ధతులు: రోజువారీ నిద్ర పద్ధతులను పాటించడం, తగినంత నిద్ర పొందడం.
  2. ఒత్తిడి నిర్వహణ: ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులు అనుసరించడం.
  3. నిద్రలేపు సమయాలు: నిద్రలేపు సమయాలు స్థిరంగా ఉండేలా చూసుకోవడం.
  4. వైద్య సలహా: ఈ సమస్య తరచుగా సంభవిస్తే, వైద్యుడిని సంప్రదించడం.

స్లీపింగ్ పారాలిసిస్ అనేది సాధారణంగా హానికరం కాదు, కానీ ఇది భయంకరమైన అనుభవం కావచ్చు. ఈ సమస్య తరచుగా సంభవిస్తే, వైద్య సలహా తీసుకోవడం మంచిది.