THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, April 9, 2025
Male fertility మెరుగుపరచడానికి కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు
Tuesday, April 8, 2025
Daily Fertility Wellness Routine
సహజంగా (Natural way) గర్భం దాల్చాడానికి ఆహార నియమాలు, జీవన శైలి
మహిళల ఫెర్టిలిటీ (fertility) ని సహజంగా మెరుగుపరచడానికి. ఆహారం
స్త్రీల కోసం ఫెర్టిలిటీ మెరుగుపరిచే యోగా ఆసనాలు
8 అంకె వ్యాయామం (Eye Figure 8 Exercise) అనేది కళ్ల కదలికలను మెరుగుపరచడానికి, కళ్ల కండరాలను బలపరిచేందుకు ఉపయోగపడే అద్భుతమైన వ్యాయామం.
ఫోకస్ ఎక్సర్‌సైజ్ (Focus Exercise) అనేది కళ్ల దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే కళ్ల వ్యాయామం
పాల్‌మింగ్ (Palming) అనేది కళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి ఉపయోగించే ఒక సరళమైన కళ్ల వ్యాయామం.
కళ్లద్దాలు లేకుండా దృష్టిని మెరుగుపరచడం కోసం కొన్ని సహజమైన మార్గాలు
కామదా ఏకాదశి.. సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం
ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత.
కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం.
సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు.
స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి.
ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది.
అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది, వరాహ పురాణంలో
శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు.
అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు.
పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు.
ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు.
అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది.
అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది, అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది.
అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు.
ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది.
వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు.
ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి.
Sunday, April 6, 2025
రాముడికి అక్క ఉంది.. ఆమె ఎక్కడ పెరిగింది... పురాణాల్లో ఆమె గురించి ఏముంది..
రాముడు, సీత, లక్ష్మణుడు. ఆంజనేయుడు, రావణుడు.. ఇలా రామాయణంలోని ప్రతీ పాత్రల నేపథ్యం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, రాముడికి ఓ అక్క ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు.
ఆమె పేరు శాంత.
దశరథుడు-కౌసల్యకు పుత్రకామేష్టి యాగం కంటే ముందే జన్మించిన సంతానం ఆమె. అంగవైకల్యంతో పుట్టిన ఆ పాపకి 'శాంత' అని పేరు పెట్టి, మహర్షుల సలహా మేరకు అంగదేశ రాజైన రోమపాదుడికి దత్తత ఇచ్చాడు దశరథుడు. అక్కడ సరైన వైద్యంతో శాంత మామూలు స్థితికి వస్తుంది. శాంత చాలా అందగత్తె. వేదాలు, హస్తకళల్ని నేర్చింది. యుద్ధ విద్యల్లో -ఆరితేరింది.
ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో అంగదేశంలో భయంకరమైన కరువు సంభవించింది. అప్పుడు ఆమె రుష్యశృంగ మహర్షిని వివాహం చేసుకుంది. ఆయన నిర్వహించిన యజ్ఞంతోనే అంగదేశం కరువు కోరల్లోంచి బయటపడింది. వశిష్ఠ రామాయణం ఆదిపర్వంలో శాంతా దేవి గురించి ప్రస్తావించిరు వాల్మీకి మహర్షి. హిమాచల్ ప్రదేశ్ కులు దగ్గర బంజారా ప్రాంతంలో రిష్యశృంగుడి ఆలయం ఉంది. ఇందులో శాంతాదేవి విగ్రహం పూజలందుకుంటోంది
పంచ ప్రాణాలు అంటే ఏమిటి? వాటి పనులు ఏమిటి?
పంచ ప్రాణాలు అంటే మన శరీరంలో ఉండే ఐదు ముఖ్యమైన వాయువులు. అవి:
- ప్రాణం: శ్వాస ద్వారా లోపలికి తీసుకున్న గాలి, ఊపిరితిత్తుల నుండి హృదయానికి చేరుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
- అపానం: గుదము ద్వారా బయటికి వెళ్ళే వాయువు. మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
- సమానం: నాభి ప్రాంతంలో ఉండే వాయువు. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఉదానం: గొంతు ప్రాంతంలో ఉండే వాయువు. మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
- వ్యానం: శరీరమంతా వ్యాపించి ఉండే వాయువు. రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
ఈ పంచ ప్రాణాలు మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఈ వాయువులలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా, అది మన ఆరోగ్యానికి హానికరం. ఈ వాయువులను సమతుల్యంగా ఉంచడానికి యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పంచ ప్రాణాల పనులు:
- ప్రాణం: శరీరానికి శక్తిని అందిస్తుంది, శ్వాసక్రియను నియంత్రిస్తుంది.
- అపానం: మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
- సమానం: జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఉదానం: మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
- వ్యానం: రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
పంచ ప్రాణాలను ఆరోగ్యంగా ఉంచడానికి:
- యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయండి.
- పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోండి.
- ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- పుష్కలంగా నీరు త్రాగండి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ పంచ ప్రాణాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
ఇప్పుడు, కొంచెం వివరంగా వీటిని గురించి తెలుసుకుందాం:
1) ప్రాణము... ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్న శ్వాస కోశన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం (అనగా కదలిక క్రిందనుంచి మీదకి వుండుట) కల్గి ఉంటుందని తెలియజేయబడింది.
2) అపానము... నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం (అనగా కదలిక పై నుంచి క్రిందకి ఉండటం) కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.
3) సమానము... ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట.
4) ఉదానము... ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.
5) వ్యానము... ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు.
ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు అని చెప్పారు.
మన దేశంలో అయితే పెళ్లికి జాతకాలు చూస్తారు.. మరి విదేశీయులు ఏం చేస్తారో తెలుసా..?
మన దేశమంటేనే అనేక సాంప్రదాయాలకు, ఆచారాలకు, వ్యవహారాలకు నెలవు. ఎన్నో భిన్నమైన మతాలు అనేక విభిన్నమైన పద్ధతులను పాటిస్తాయి. అయితే ఏ మతంలోనైనా వివాహం పట్ల అనేక ఆచారాలను, సాంప్రదాయాలను ఆయా వర్గాల వారు పాటిస్తారు.
ఇక హిందూ మతం విషయానికి వస్తే ముందు వధూవరుల జాతకాలు చూసి అవి పొంతన కుదిరాకే ముహూర్తాలు నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగానే నిశ్చితార్థం, పెళ్లి జరిపిస్తారు. ఇది సరే. ఈ తంతు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటీ అంటారా..? ఏమీ లేదండీ…
హిందువులైతే ముందుగా జాతకాలు చూసి పెళ్లి పెట్టుకుంటారు. కానీ మరి అమెరికా, లండన్, రష్యా వంటి విదేశాల్లోనైతే వారు వివాహానికి ముందు ఏం చేస్తారు..? వారు జతకాలు చూడరు. ముహూర్తాలు నిర్ణయించరు. అయినా పెళ్లి మాత్రం చేసుకుంటారు. మరి.. ఓ జంటకు వారు వివాహం ఎలా సెట్ చేస్తారు..? దేని ప్రకారం నూతన దంపతులు కలసి మెలసి ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని నిర్ణయిస్తారు..? అంటే.. అవును, అందుకు వారు ఓ మార్గం పాటిస్తారు. అదే డీఎన్ఏ టెస్ట్.
విదేశాల్లో పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఇద్దరు డీఎన్ఏ టెస్ట్ కచ్చితంగా చేయించుకంటారట. వ్యాధులు ఏమేం ఉన్నాయని నిర్దారించుకునేందుకు కాదు వారు టెస్టులు చేసేది. వారి ఇద్దరి డీఎన్ఏ ప్రకారం వారు కలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి పిల్లలు ఎలా ఉంటారు, వారికి ఏమేం వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుంటానికి వారు డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటారు. అలా చేశాక రిజల్ట్స్ అనుకూలంగా వస్తేనే వివాహం చేసుకుంటారట. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీన్ని బట్టి మనకు ఇప్పటికే ఒక విషయం మదిలోకి వస్తుంది. అదేమిటంటే… మన దేశంలో ఏ వర్గం వారైనా మేనరికం చేసుకోరు తెలుసు కదా. దాంతో పుట్టబోయే పిల్లలకు వ్యాధులు వస్తాయని పెద్దల నమ్మకం. అందుకే చాలా మంది మేనరికం చేసుకోరు. ఇది విదేశీయుల డీఎన్ఏ టెస్టుకు దగ్గరిగా ఉంది కదా. ఓ సారి ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ… కరెక్టే కదా. మరి ఆ మాత్రం దానికి డీఎన్ఏ టెస్ట్ దాకా ఎందుకు..! ఇప్పటికైనా తెలిసింది కదా, భారతీయుల తెలివి ఏంటో..!
(సేకరణ)
శ్రీరామ పట్టాభిషేకం కథ
Friday, April 4, 2025
ఏదైన పని వాయిదా వెయ్యడాన్ని ఎలా మానుకోవాలి?
పనులను వాయిదా వెయ్యడం (ప్రోక్రాస్టినేషన్) అనేది చాలా మందికి ఒక సాధారణ సమస్య. దీన్ని అధిగమించడానికి కొన్ని సాధ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
పని వాయిదా వెయ్యడాన్ని ఎలా మానుకోవాలి:
- పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించండి: ఒక పెద్ద పనిని చూసి భయపడకుండా, దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ప్రతి భాగాన్ని పూర్తి చేయడం మీకు సులభంగా అనిపిస్తుంది.మీ పనికి సంబంధించిన స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఎందుకు ఆ పని చేయాలి, దాని వల్ల ఏమి లాభాలు ఉంటాయి అని గుర్తుచేసుకోవడం సహాయపడుతుంది. ఈ లక్ష్యాలు SMART (Specific, Measurable, Achievable, Relevant, Time-bound) గా ఉండాలి.
- ఒక సమయంలో ఒక పని చేయండి: ఒకేసారి అనేక పనులు చేయాలని ప్రయత్నించడం వల్ల మీరు ఏ పనినీ పూర్తి చేయలేరు. ఒక పనిని పూర్తి చేసి, తర్వాత మరొక పని చేయండి.ఏ పనిని ముందు చేయాలి, ఏది తరువాత చేయాలి అనే విషయంలో స్పష్టత పొందండి. Eisenhower Matrix లాంటి పద్ధతులు సహాయపడవచ్చు (తక్షణ, ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం).
- సమయ పట్టికను తయారు చేసుకోండి: ప్రతిరోజు చేయాల్సిన పనులకు ఒక సమయ పట్టికను తయారు చేసుకోండి. ఆ సమయ పట్టికను పాటించడానికి ప్రయత్నించండి.ఒక పనికి ప్రత్యేకంగా సమయం కేటాయించండి. ఉదాహరణకు, "ఈ 30 నిమిషాలు కేవలం ఈ పని కోసం" అని నిర్ణయించుకోండి.
- విరామాలు తీసుకోండి: నిరంతరం పని చేయడం వల్ల మీరు అలసిపోతారు. కొంత సమయం తర్వాత విరామాలు తీసుకోండి.మీరు పని చేసే సమయంలో మిమ్మల్ని మీరు అంతరాయం కలిగించే వాటిని గుర్తించండి మరియు వాటిని తొలగించండి. సోషియల్ మీడియా, ఫోన్ నోటిఫికేషన్లు మొదలైన వాటిని ఆఫ్ చేయండి.
- ఒక ప్రత్యేకమైన పని ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి: పని చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ ప్రదేశంలో మీరు పని చేయడానికి అవసరమైన అన్ని వస్తువులు ఉండేలా చూసుకోండి.
- ఇతరులతో కలిసి పని చేయండి: మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పని చేయండి. వారితో కలిసి పని చేయడం వల్ల మీకు మరింత ప్రేరణ లభిస్తుంది.
- ప్రతిఫలాలను నిర్ణయించుకోండి: ప్రతి పనిని పూర్తి చేసిన తర్వాత మీకు మీరే ఒక చిన్న ప్రతిఫలాన్ని ఇవ్వండి. ఉదాహరణకు, ఒక పుస్తకం చదవడం, ఒక చిన్న నడకకు వెళ్లడం లేదా మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం.
వాయిదా వేయడానికి కారణాలు:
- భయం: కొత్త పనులు చేయడం లేదా విఫలమయ్యే భయం వల్ల కొందరు పనులను వాయిదా వేస్తారు.
- పని భారం ఎక్కువగా ఉండటం: చాలా పనులు చేయాల్సి ఉంటే, కొన్ని పనులను వాయిదా వేయడం సహజం.
- ఆసక్తి లేకపోవడం: చేయాల్సిన పని మీకు ఆసక్తికరం కాకపోతే, దాన్ని వాయిదా వేయడం సులభం.మనం ప్రతిసారీ ప్రేరణతో ఉండలేం. అలవాటుగా పని చేయడం ద్వారా మాత్రమే పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతాం.
- పరిపూర్ణత కోసం వెతకడం: ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనే కోరిక కూడా పనులను వాయిదా వేయడానికి కారణం కావచ్చు."అందంగా చేయలేకపోతే అసలు చేయనక్కర్లేదు" అనే ఆలోచన మానుకోండి. సర్వప్రధమంగా పని మొదలుపెట్టడం ముఖ్యమని గుర్తించండి.
ముఖ్యమైన విషయం:
పని వాయిదా వేయడం ఒక అలవాటు. ఈ అలవాటును మార్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మీరు నిరంతరం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.
రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనా?
డార్కు ఛాక్లెట్లు మంచి పోషక విలువలు కల్గియుండుట వలన ఆరోగ్యానికి చాలా మంచివని నిరూపించబడినాయి,
ఈ డార్కు ఛాక్లెట్ ఎంత సేపండి అలా చూస్తూనే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది , తీపిదనం కొద్దిగా ఉండే ఈ చాక్లెట్‌లో కొద్దిగా వగరు కూడా అనిపించవచ్చును సారు!
GODIVA masterpieces ' best dark chocolate (బెల్జియమ్ డార్కు ఛాక్లెట్‌లు)
బ్లడ్ ప్రెషర్ను :: తక్కువ ప్రెషర్‌ను, ఎక్కువ బ్లడ్‌ప్రెషర్‌ను కాకుండగా ఈ డార్కు ఛాక్లెట్లు నియంత్రణ చేస్తాయి,
మంచి కొలెస్ట్రాల్‌ను కూడ క్రమ పద్దతి లో యుంచి చెడు కొలెస్ట్రాల్‌ను లివర్‌కు పంపటంతో అది మన శరీరము నుండి బయటకు పంపించి వేస్తుంది,
బరువు తగ్గాలంటే పరగడుపున లేదా భోజనము చేయక ముందు లేదా చేసాక అరగంట తర్వత డార్కు ఛాక్లెట్లు తినండి,
కొన్ని విటమిన్‌లకు మన డార్కు ఛాక్లెట్‌లు ఉత్ప్రేరకాలుగా పనిచేయటమేగాక
బలమైన కారణాలుగా కూడా ఉండటము వలన
గుండెకు రక్త ప్రసరణ ను సాఫీగా ప్రవహింహచేయుటకు కారకములుగా మరియు
దాని వలన హృద్రోగ సమస్యలను చాలా వరకు కట్టడి చేస్తుంది లేదా నివారణ కు ఈ డార్కు ఛాక్లెట్టులు పని చేస్తాయి,
ఢార్కు ఛాక్లెట్లులు తింటే సూర్యరశ్మినుండి మన శరీరంపైని చర్మాన్ని సంరక్షిస్తుంది
అన్నింటి కన్న మిన్న అందఱికి తెలిసినదే డార్కు ఛాక్లెట్‌లు మన బుద్ది కుశలతను పెంపొందిస్తుంది
మేము కొన్ని సంవత్సరాలనుండి ప్రతీ రోజు మధ్యాహ్నపు భోజనం కాగానే మా ఆవిడ ఫ్రిజ్‌లో నుండి ఒక ఛాక్లట్టు తెచ్చి నా చేతులో పెడుతుంది !!
ఏదొ ఒక పూట తప్పని సరిగా డార్కు ఛాక్లెట్‌ను లేదా ఛాక్లెట్‌లను నోటిలో వేయాలిసిందే ….
ట్రఫస్ మేలైనవి ….COSTCO లో
హోల్‌సేల్‌గా కొని, బంధుమితృలతో పంచుకున్నవి …।
డార్కు చాక్లెట్టులు మధుర భావనల ప్రేరకాలు అని ఎక్కడో ఎప్పుడో చదివాను,
సరే ఎప్పుడు తినాలి , ఎన్ని తినాలి ::
సాధారణంగా మధ్యాహ్నం సుష్టుగా తిని ఆరామ్‌గా కూర్చొని ఒక డార్కు ఛాక్లెట్ నోటిలో వేసుకొని చప్పరించండి ,
పగటి భోజనం రాత్రి భోజనం మధ్యలో సాయంత్రం పూట చిఱుతిళ్లలాగా కూడా లాగించేయండీ కాని …రోజుకు ముప్ఫైనుండివఅరవై గ్రాముల వరకే … "అంతే " తినండి,
గమనిక::: ఇదంతా చదివి ఈ డార్కు ఛాక్లెట్లు ఆయా ఆరోగ్య సమస్యల నివారణకు ఇవ్వే మందులని నిర్ధారణకు రావద్దు,ఇవి కూడా ఆయా విషయాలలో మన ఆరోగ్యానికి తగు మాత్రంగా సహాయకారంగా ఉండునని చదువరులకు విన్నవించుకుంటున్నాను .
{ సర్వేజన సుఖినోభవంతు }
॥ ధన్యవాదాలు ॥
జీవితాంతం టాబ్లెట్లే అయితే… స్టంట్లు ఎందుకు?
స్త్రీలకు ఉన్నట్లే పురుషులకూ ధర్మ శాస్త్రంలో తమ విధులున్నాయా?
మనకందరికీ స్త్రీలు ఎలా ఉండాలని ధర్మ శాస్త్రాల్లో చెప్పారో తెలుసు.
"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ… "
పై శ్లోకానికర్ధం చాలా మందికి తెలుసు, అందుకే మళ్ళా వ్రాయడం లేదు.
ఇకపోతే పురుషులు ఎలా ఉండాలోనన్న విషయం కామందక నీతిశాస్త్రం లో చెప్పబడింది.
దానిగురించీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు.
కార్యేషు యోగ, కరణేషు దక్ష:
రూపేచ కృష్ణః క్షమయా తు రామః |
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః ||
(కామందక నీతిశాస్త్రం)
కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. ఇక్కడ రూపం అంటే... బాహ్య రూపం కాదు. మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః భార్య/ తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖదుఃఖ మిత్రం సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - (ఈ ఆరు పనులు) సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.