THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Friday, April 11, 2025
మానసిక ఒత్తిడి (Stress) పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం.
Wednesday, April 9, 2025
మీ బైక్ కి జెల్ ప్యాడెడ్ సీటు ఉందా? దీని వల్ల ఉపయోగం ఏమిటీ?
లాంగ్ టైం బైక్ రైడింగ్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఎలా తగ్గుతుంది?
Scrotal Cooling Therapy అంటే
స్పెర్మ్ ఉత్పత్తికి తక్కువ ఉష్ణోగ్రత ఎందుకు అవసరం? దాన్ని ఎలా నిర్వహించాలో గురించి మీకోసం ఓ **డీటెయిల్డ్ గైడ్**
స్పెర్మ్ ఉత్పత్తికి తక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఇందుకు ఏం చేయాలి?
Male fertility మెరుగుపరచడానికి కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు
Tuesday, April 8, 2025
Daily Fertility Wellness Routine
సహజంగా (Natural way) గర్భం దాల్చాడానికి ఆహార నియమాలు, జీవన శైలి
మహిళల ఫెర్టిలిటీ (fertility) ని సహజంగా మెరుగుపరచడానికి. ఆహారం
స్త్రీల కోసం ఫెర్టిలిటీ మెరుగుపరిచే యోగా ఆసనాలు
8 అంకె వ్యాయామం (Eye Figure 8 Exercise) అనేది కళ్ల కదలికలను మెరుగుపరచడానికి, కళ్ల కండరాలను బలపరిచేందుకు ఉపయోగపడే అద్భుతమైన వ్యాయామం.
ఫోకస్ ఎక్సర్‌సైజ్ (Focus Exercise) అనేది కళ్ల దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే కళ్ల వ్యాయామం
పాల్‌మింగ్ (Palming) అనేది కళ్లకు విశ్రాంతి ఇవ్వడానికి ఉపయోగించే ఒక సరళమైన కళ్ల వ్యాయామం.
కళ్లద్దాలు లేకుండా దృష్టిని మెరుగుపరచడం కోసం కొన్ని సహజమైన మార్గాలు
కామదా ఏకాదశి.. సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవం
ప్రతి నెలలో వచ్చే ఏకాదశిలలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే కామదా ఏకాదశి కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
కామదా ఏకాదశినే దమన ఏకాదశి అని వ్యవహరిస్తారు. పాపాలు హరించడం ఈ ఏకాదశి ప్రత్యేకత.
కామద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు దూరమవుతాయి. ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి అని పురాణ వచనం.
సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కామదా ఏకాదశి వ్రతం ఆదరించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తుంటారు.
స్త్రీలు తమ సమస్త సంపదగా భావించుకునే సౌభాగ్యం చిరకాలం పచ్చగా ఉండటానికి చేసే విశిష్టమైన వ్రతాలలో కామదా ఏకాదశి వ్రతం ఒకటి.
ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీలక్ష్మీనారాయణులను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున వేకువనే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
ఈ రోజన ఉపవాసం, జాగరణ చేసి నియమనిష్టలతో నిబంధనలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం బాగుంటింది.
అంతేకాకుండా కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
కామదా ఏకాదశికి సంబంధించిన ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది, వరాహ పురాణంలో
శ్రీకృష్ణడు, యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు.
అలాగే వశిష్ట మహాముని దిలీప రాజుకు ఈ ఏకాదశి వ్రత కథను వివరించాడు.
పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆయన రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ రాజుకు వినోదం పంచేవారు. ఒక రోజు ఒక గంధర్వుడు సభలో కళా ప్రదర్శన సరిగ్గా ఇవ్వక, పరధ్యానంతో ఉండడం గమనించిన రాజు ఆగ్రహించి ఆ గంధర్వుడిని శపించాడు.
ఆ శాపం కారణంగా అతని అందం, సృజనాత్మకత, కళా అంత నాశనమైపోతుంది. రాక్షసుని ఆకారంలోకి మారిపోయాడు.
అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతగానో బాధపడి భర్తను తీసుకొని వింధ్యాచల అడువుల్లోకి పయణమయింది.
అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక ఆశ్రమం కనబడింది, అక్కడ ఉన్న శ్రింగి మహర్షిని కలిసి తనకు జరిగిన దురదృష్ట సంఘటన గురించి వెళ్లబోసుకుంది.
అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు.
ఆయన చెప్పిన ప్రకారం లలిత భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించి తన కోరిక తీరాలని మనసులో అనుకొని నమస్కరించుకుంది.
వెంటనే తన భర్త రాక్షస ఆకారం పోయి తన పూర్వ ఆకారాన్ని పొందాడు.
ఇంతటి మహత్తువున్న కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వలన తెలియక చేసే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి.
Sunday, April 6, 2025
రాముడికి అక్క ఉంది.. ఆమె ఎక్కడ పెరిగింది... పురాణాల్లో ఆమె గురించి ఏముంది..
రాముడు, సీత, లక్ష్మణుడు. ఆంజనేయుడు, రావణుడు.. ఇలా రామాయణంలోని ప్రతీ పాత్రల నేపథ్యం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, రాముడికి ఓ అక్క ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు.
ఆమె పేరు శాంత.
దశరథుడు-కౌసల్యకు పుత్రకామేష్టి యాగం కంటే ముందే జన్మించిన సంతానం ఆమె. అంగవైకల్యంతో పుట్టిన ఆ పాపకి 'శాంత' అని పేరు పెట్టి, మహర్షుల సలహా మేరకు అంగదేశ రాజైన రోమపాదుడికి దత్తత ఇచ్చాడు దశరథుడు. అక్కడ సరైన వైద్యంతో శాంత మామూలు స్థితికి వస్తుంది. శాంత చాలా అందగత్తె. వేదాలు, హస్తకళల్ని నేర్చింది. యుద్ధ విద్యల్లో -ఆరితేరింది.
ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో అంగదేశంలో భయంకరమైన కరువు సంభవించింది. అప్పుడు ఆమె రుష్యశృంగ మహర్షిని వివాహం చేసుకుంది. ఆయన నిర్వహించిన యజ్ఞంతోనే అంగదేశం కరువు కోరల్లోంచి బయటపడింది. వశిష్ఠ రామాయణం ఆదిపర్వంలో శాంతా దేవి గురించి ప్రస్తావించిరు వాల్మీకి మహర్షి. హిమాచల్ ప్రదేశ్ కులు దగ్గర బంజారా ప్రాంతంలో రిష్యశృంగుడి ఆలయం ఉంది. ఇందులో శాంతాదేవి విగ్రహం పూజలందుకుంటోంది
పంచ ప్రాణాలు అంటే ఏమిటి? వాటి పనులు ఏమిటి?
పంచ ప్రాణాలు అంటే మన శరీరంలో ఉండే ఐదు ముఖ్యమైన వాయువులు. అవి:
- ప్రాణం: శ్వాస ద్వారా లోపలికి తీసుకున్న గాలి, ఊపిరితిత్తుల నుండి హృదయానికి చేరుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
- అపానం: గుదము ద్వారా బయటికి వెళ్ళే వాయువు. మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
- సమానం: నాభి ప్రాంతంలో ఉండే వాయువు. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఉదానం: గొంతు ప్రాంతంలో ఉండే వాయువు. మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
- వ్యానం: శరీరమంతా వ్యాపించి ఉండే వాయువు. రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
ఈ పంచ ప్రాణాలు మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఈ వాయువులలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా, అది మన ఆరోగ్యానికి హానికరం. ఈ వాయువులను సమతుల్యంగా ఉంచడానికి యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పంచ ప్రాణాల పనులు:
- ప్రాణం: శరీరానికి శక్తిని అందిస్తుంది, శ్వాసక్రియను నియంత్రిస్తుంది.
- అపానం: మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
- సమానం: జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- ఉదానం: మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
- వ్యానం: రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
పంచ ప్రాణాలను ఆరోగ్యంగా ఉంచడానికి:
- యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయండి.
- పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోండి.
- ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- పుష్కలంగా నీరు త్రాగండి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ పంచ ప్రాణాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
ఇప్పుడు, కొంచెం వివరంగా వీటిని గురించి తెలుసుకుందాం:
1) ప్రాణము... ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించి ఉన్న శ్వాస కోశన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం (అనగా కదలిక క్రిందనుంచి మీదకి వుండుట) కల్గి ఉంటుందని తెలియజేయబడింది.
2) అపానము... నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం (అనగా కదలిక పై నుంచి క్రిందకి ఉండటం) కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.
3) సమానము... ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట.
4) ఉదానము... ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.
5) వ్యానము... ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు.
ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు అని చెప్పారు.