THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, April 28, 2025
అలవాట్లు మారాలంటే పరిసరాలు మార్చు!
Saturday, April 26, 2025
"మనసు చెప్పిన మార్గం"
Thursday, April 24, 2025
"సారీ అన్నాను కదా!"
Sunday, April 20, 2025
సుభాషితం
Wednesday, April 16, 2025
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
ఓం శ్రీ మాత్రే నమః
నామ విశేషాలు :....!🙏!*
🌿మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.
🌸1. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి "పొలిమేరమ్మ" క్రమముగా "పోలేరమ్మ" అయింది.
🌿2. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము. అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
🌸3. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, 'పోచమ్మ' పోషణ కలిగిస్తుంది.
🌿4. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ - కాలక్రమములో "కట్టమైసమ్మ" అయింది.
🌸5. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి "అచ్చమ్మ" గా అయ్యింది.
🌿6. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను "మావూళ్ళమ్మ" అని పిలుస్తూంటే క్రమముగా అది "మావుళ్ళమ్మ" అయింది.
🌸7. ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కె ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి "తలుపులమ్మ". 'తలపు' అంటే ఆలోచన. ఆ తలపులను తీర్చే తల్లి "తలపులమ్మ" క్రమముగా ఈమె "తలుపులమ్మ" గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
🌿8. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా "అంకగళమ్మ", "అంకాళమ్మ" గా మారిపోయింది.
🌸9. పొలిమేరలో వుండే మరొక తల్లి "శీతలాంబ". ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
🌿10. పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి "పుట్టమ్మ". ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు.
🌸ఈ తల్లికే "నాగేశ్వరమ్మ" అని కూడా అంటారు. పాప (అంటే పాము)+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి "పాపమ్మ" అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే "సుబ్బ+అమ్మ= "సుబ్బమ్మ" కూడా దైవముగా ఉంది.
🌿11. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలనూ ఇచ్చే తల్లి "బతుకమ్మ".
🌸12. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ "కన్నమ్మ"గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= "సత్తెమ్మ".
🌿13. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ "పుల్లమ్మ". ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
🌸14. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = "అర్పణలమ్మ" క్రమముగా "అప్పలమ్మ" అయినది.
🌿15. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= "అప్పలమ్మ" అన్నారు.
🌸16. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= "పెంటమ్మ".
🌿17. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ= "బోనాలమ్మ".
🌸18. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను "అయ్యమ్మ" ని కొన్ని చోట్ల పిలుస్తారు.
🌿19. లలితాంబ భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= "గుర్రాలమ్మ" అయినది.
🌸20. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ="సోమపోలమాంబ" అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
🌿21. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి
🌸తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న "పళ్ళాలమ్మ" "పళ్లమాంబిక". ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు.
🌿 ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం... 🙏🏻
Source:Whatsapp
Tuesday, April 15, 2025
ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి.. బరువుతగ్గుతారు!
బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి, రోజూ పది నిమిషాలు చాలు
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.
అయితే బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తున్నారు. రోజూ కనీసం 10 నిమిషాల పాటు రెట్రో వాకింగ్ చేస్తే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అసలు ఇంతకీ రెట్రో వాకింగ్ అంటే అంటి? రోజూ ఇది ట్రై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రెట్రో వాకింగ్ అంటే ఏంటి?
రెట్రో వాకింగ్ అనేది ఒక వ్యాయామం. సాధారణంగా మనం వాకింగ్ చేసేటప్పుడు ముందుకు నడుస్తుంటాం. అదే రెట్రో వాకింగ్‌లో వెనుకకు నడుస్తుంటాం. అంటే వెనుకకి నడవడాన్నే రెట్రో వాకింగ్ అంటారు. ఇది కండరాలు, మనస్సు, శరీర అనుసంధానికి చాలా మంచి ఆప్షన్. ఇందులో మీరు నిటారుగా నిలబడి వెనుకకు నడవాలి. కేవలం 10 నుంచి 20 నిమిషాల రెట్రో వాకింగ్ ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రెట్రో వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం.
శరీరం, మెదడు అనుసంధానం
మనం ప్రతిరోజూ నడుస్తాం. దాదాపు అందరూ ముందుకు నడుస్తుంటారు. కాళ్ళు, కండరాలు, మెదడు దానికి అలవాటు పడ్డాయి. ఇలా చేస్తున్నప్పుడు, మన మెదడు పూర్తిగా పనిచేయదు. కానీ మనకు స్వల్ప సంకేతం అందిన వెంటనే కండరాల జ్ఞాపకశక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మనసుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం సడలింది. మనం అలవాటు లేని తప్పు దిశలో నడిచినప్పుడు, మెదడు కండరాలకు సరైన సంకేతాలను ఇవ్వాలి. దీంతో శరీరానికి, మెదడుకి అనుసంధానం పెరిగింది. అంటే మీకు చాలా కాన్స్ట్రేషన్ పెరుగుతుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం
వయసు పెరిగే కొద్దీ కీళ్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లోపల దృఢత్వం, వాపు ఉంటుంది. దీని వలన నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది. ఒక పరిశోధన (ref.) ప్రకారం , రెట్రో వాకింగ్ ఈ సమస్య ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్. రెట్రో వాకింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్
బరువు తగ్గడానికి వాకింగ్ మంచి ఆప్షన్ అని మనకు తెలుసు. అయితే, వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం చాలా ఆలస్యం అవుతుంది. సాధారణ నడక కంటే వెనుకకు నడవడానికి ఎక్కువ శ్రమ అవసరం. దీని కారణంగా, బర్న్ చేసే కేలరీల పరిమాణం కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఇది సాధారణ నడక కంటే మంచిది. బరువు తగ్గే ఫలితాల్ని త్వరగా చూపుతుంది. అందుకే బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.
మానసిక ప్రశాంతత
రెట్రో వాకింగ్ శరీర అవగాహనను పెంచుతుంది. నిద్ర చక్రం మెరుగుపడుతుంది. మీ ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది. మీరు ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించండి. రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు రెట్రో వాకింగ్ నేర్చుకున్న తర్వాత, దానికి కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫలితాలను పెంచుకోవడానికి, ప్రతిరోజూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. క్రమంగా వేగంగా వెనుకకు నడవడానికి ప్రయత్నించండి. ఆ తరువాత వెనుకకు జాగింగ్ చేయండి.
కండరాలు బలంగా
బ్యాక్వర్డ్ వాకింగ్ అనేది శరీరంలోని కండరాలు, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ వంటివి నిమగ్నం చేసే ఒక చర్య. ఇవి సాధారణ నడకలో తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. రెట్రో వాకింగ్ కండరాలన్నింటినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రెగ్యులర్‌గా రెట్రో వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారతాయి.
అపార్టుమెంట్ల ఫ్లోర్ స్పేసుని ఎలా కొలుస్తారు? వారు చెప్పేంత ఫ్లోర్ స్పేసు వాటి లోపల ఉన్నట్లు కనిపింౘదు. కనీసం 25% తేడా ఉన్నట్లు తోస్తుంది. ఎందుకలా?
అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లలోని ఫ్లాట్ ఏరియా వర్ణనకి సంబంధించి 4 terms వాడుకలో వున్నాయి.
- Capet area: ఇది flat లోపలి అన్ని గదుల నేల (floor) వైశాల్యాల మొత్తాన్ని సూచించే అంకె. హాల్, బెడ్ రూమ్స్, కిచెన్, బాత్ రూమ్స్ , స్టోర్ రూమ్స్, బాల్కనీలు మొదలైన వాటన్నిటి floor వైశాల్యాలు కూడితే వచ్చే అంకె ఇది. ఇది మీ ఫ్లాట్ లో మీరు వాస్తవంగా వాడుకోగలిగిన exclusive స్థలం. మన తెలుగు రాష్ట్రాలలో, బిల్డర్లు సాధారణంగా ఈ figure ని చెప్పరు. మహారాష్ట్రలో మాత్రం, ప్రస్తుత చట్టం ప్రకారం ఈ figure ని తప్పనిసరిగా బ్రోచర్ లో ప్రకటించాలి. అంతేగాక flat అమ్మకం, Rate in Rs / sq ft of carpet area ప్రతిపదన మీదే జరగాలి.
- Built up area (కట్టుబడి వైశాల్యం): కార్పెట్ ఏరియాకి, ఫ్లాట్ బౌండరీ గోడల, లోపలి గోడల & స్తంభాల foot prints వైశాల్యాలు కలిపితే వచ్చే ఏరియా. దీన్నికూడా సాధారణం గా బిల్డర్ చెప్పడు. ఇది గోడలతో సహా మీ ఫ్లాట్ యొక్క total foot print (ఆక్రమించిన స్థలం). ఫ్లాట్ లోపలి గోడల సంఖ్య మీద ఆధారపడుంటుంది. Carpet area + (6 to 10) % ఉండచ్చు.
- Super built up area: టవర్ లోని common areas ( వరాండా, staircase, లిఫ్ట్ lobby మొ,,) వైశాల్యాలలో కొంత భాగాన్ని ఫ్లాట్ల ఏరియాల నిష్పత్తి లో మీ ఫ్లాట్ built up ఏరియా కి కలిపితే వచ్చే సంఖ్య. బిల్డర్ సాధారణం చెప్పే సంఖ్య ఇది. ఇది carpet area + (20 to 30) % దాకా ఉంటుంది.
4) undivided land share: అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టిన భూమి వైశాల్యాన్ని, ఫ్లాట్ area నిష్పత్తిలో, మీ flat కి కేటాయించిన భూమి. ఈ figure ఎక్కువుండడం, బిల్డింగ్ చుట్టూ వున్న గ్రీనరీ, క్రీడా సౌకర్యాలు ఎక్కువుండడానికి index. ఇది నిర్దిష్ట (specified) హద్దులు లేని భూవాటా. అపార్మెంట్స్ పాతబడిన తర్వాత, re-development కి ఇచ్చేటప్పుడు, కొత్త వాటిలో మీకొచ్చే వాటాని సూచిస్తుంది.
స్వయంపాకం అంటే ఏమిటి? అది ఎవరికి ఇవ్వాలి?
*స్వంతంగా వండుకొని, తినడానికి కావలసిన సామగ్రిని ఇవ్వడమే స్వయంపాకం.*
*అందులో బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, చింతపండు, బెల్లం, నెయ్యి, నూనె మొదలైనవి ఇవ్వాలి.*
*విశిష్ట మాసాలలో, పర్వదినాలలో, అమావాస్య నాడు, సంక్రమణ సమయంలో, ఏకాదశి తెల్లవారి ద్వాదశి నాడు, తల్లిదండ్రుల తిథినాడు, గ్రహణం రోజు ఈ వస్తువులను కనీసం ఒక్కపూట వంటకు సరిపడేలా సమకూర్చి ఒక అరటి ఆకు లేదా విస్తరిలో పెట్టి పురోహితునికి దానం చేయాలి.*
*తిథి రోజు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయంపాకం దానం, దక్షిణ తాంబూలాదులతో సమర్పించాలి. తోటకూర, గుమ్మడిపండు యథాశక్తి ఇవ్వవచ్చు.*
*మన ఇంట్లో భోజనం చేయని సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారికి ఈ విధమైన స్వయంపాక దానం ఇస్తారు. నిత్యాగ్ని హోత్రులైన కొందరు స్వయంగా వండుకొని, భగవంతునికి నైవేద్యం సమర్పించి, తదనంతరం భోజనం చేస్తారు.*
ముద్దు ఎక్కడ పుట్టింది..4500 ఏళ్ల క్రితమే లిప్-లాక్ ట్రెండ్!
ప్రేమించే ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని తప్పకుండా ముద్దు పెట్టుకుంటారు. అయితే ప్రపంచంలో మొదటి ముద్దు ఎవరు పెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమికులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.ప్రేమ కూడా పెరుగుతుంది.
మొదటిసారి ముద్దు ఎవరు పెట్టారు. అది ఎప్పుడు ప్రారంభమైందో చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం.
శృం*గారభరితమైన ముద్దు పాటలు, కవితలు, కథల్లో చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కళ, సినిమాల్లో కూడా దీనిని చూపిస్తారు. అయితే మొదటిసారి ముద్దు ఎప్పుడు, ఎవరు పెట్టారో ఖచ్చితమైన సమాచారం లేదు. పత్రాల ప్రకారం ముద్దు చరిత్ర 1000 సంవత్సరాల క్రితం నాటిది, అయితే పరిశోధకుల ప్రకారం ప్రాచీన మధ్యప్రాచ్యంలో 4500 సంవత్సరాల క్రితమే పెదవుల ముద్దు సాధారణంగా ఉండేదని చెబుతున్నారు.
మొదటి ముద్దు గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం దీని ప్రారంభం చాలా కాలం క్రితం మెసొపొటేమియాలో జరిగింది. మెసొపొటేమియా నుండి లభించిన వేలాది మట్టి పలకలు నేటికీ ఉన్నాయి. వీటిలో ముద్దు ప్రస్తావనతో ప్రాచీన ప్రపంచంలో శృంగారభరితమైన సాన్నిహిత్యం చూపబడింది.
శాస్త్రవేత్తలు ముద్దు సంబంధాన్ని మెసొపొటేమియాతో ముడిపెట్టి ఉండవచ్చు. అయితే భారతదేశంలో 3500 సంవత్సరాల నాటి చేతివ్రాతల ప్రకారం పెదవుల ముద్దు ప్రారంభం ప్రాచీన మధ్యప్రాచ్యం, భారతదేశంలో జరిగింది. భారతదేశంలో పూర్వం భాగస్వామికి ప్రపోజ్ చేయడానికి ముద్దు ఉపయోగించేవారని వీటి ద్వారా తెలుస్తుంది. తరువాత దీనిని ఆచారాలతో ముడిపెట్టారు. అయితే మెసొపొటేమియాలో లభించిన ఆధారాలు ఈ విషయాన్ని సమర్థించవు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ముద్దు పుట్టిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది మొదట ఎక్కడ ప్రారంభమైందో ఖచ్చితంగా చెప్పడం కష్టం.
డ్రమ్‌లు నీలం రంగుల్లో ఎందుకు ఉంటాయి? ఈ రంగు ప్రత్యేకత ఏమిటి?
భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే దాని డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు.
అటువంటి పరిస్థితిలో ఈ డ్రమ్ములను ఎలా తయారు చేస్తారు? వాటిలో ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తారు? వీటిని ఏ కంపెనీలు తయారు చేస్తాయి? వాటి ధర ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ డ్రమ్ దేనితో తయారు చేస్తారు?
ITP ప్యాకేజింగ్ ప్రకారం.. ఈ డ్రమ్ములను HDPE (హై-డెన్సిటీ పాలిథిలిన్) అనే ప్రత్యేక ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. HDPE అనేది బలమైన, మన్నికైన, రసాయనికంగా స్థిరమైన ప్లాస్టిక్. ఇది చాలా పదార్థాలతో చర్య జరపదు. ఇది ఆహారం, మందులు, రసాయనాలు, ప్రమాదకరమైన వ్యర్థాలను నిల్వ చేయడానికి అనువైనదిగా చేస్తుంది. HDPE డ్రమ్స్ ప్రత్యేక అచ్చు యంత్రాల సహాయంతో తయారు చేస్తారు. దీనితో వాటిని ఏకరీతి, గుండ్రని ఆకారాలలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ వల్ల వాటి ఖర్చు కూడా తగ్గుతుంది.
రంగు ఎప్పుడూ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది?
ఈ డ్రమ్స్ రంగు నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే ఈ రంగు ఇతర రంగుల కంటే సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావాల నుండి బాగా రక్షిస్తుంది. నీలం రంగు ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ డ్రమ్స్ దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటాయి. ఈ డ్రమ్‌లో పర్యావరణానికి తక్కువ హానికరం కలిగిస్తాయి.
ఇది ఎక్కడ ఉపయోగించబడుతుంది?
ఈ డ్రమ్ములను ఎక్కువగా కర్మాగారాలు, గిడ్డంగులు, రసాయన కర్మాగారాలు, ఫార్మా కంపెనీలలో ఉపయోగిస్తారు. వీటిని ద్రవాలు, నూనెలు, రసాయనాలు, ఆహార పదార్థాలు, వ్యర్థాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని డ్రమ్‌లు మూతలు, నాజిల్లు, లైనర్లు వంటి అటాచ్మెంట్లతో కూడా వస్తాయి. వాటిని ఉపయోగించడం మరింత సులభతరం చేస్తుంది.
ధర ఎంత?
భారతదేశంలోని చాలా కంపెనీలు ఇటువంటి డ్రమ్‌లను తయారు చేస్తాయి. కానీ వాటి తయారీదారులలో ఎక్కువ మంది MSME వర్గంలోకి వస్తారు. అందుకే ధరలు, నాణ్యత కంపెనీ నుండి కంపెనీకి మారవచ్చు. ఉదాహరణకు.. పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ అనే కంపెనీ 50 లీటర్ల సామర్థ్యం గల నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లను పెద్ద పరిమాణంలో తయారు చేస్తుంది. వాటి ధర డ్రమ్ముకు దాదాపు రూ.250. కానీ కనీసం 100 డ్రమ్స్ ఆర్డర్ చేయాలి. అదే సమయంలో 200 నుండి 250 లీటర్ల సామర్థ్యం కలిగిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములు IndiaMART వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ధర డ్రమ్ముకు దాదాపు రూ.600.
బీజాక్షరాలు ఎన్ని? వాటి ఆంతర్యం ఏమిటి?
- శరీరమునందు నాదం, అక్షరాలు ఉన్నవని యోగమతము. కనుక ఈ బీజోపాసన వలన ఆయా శరీరావయవములందు మంత్రోద్దారము చేయవచ్చును. ఆయా మంత్రస్థానములను చైతన్యభరితం చేయవచ్చును.
- కవులు తమ తమతమ ఇష్టదేవతామంత్రాలను ముద్రాలంకారంగా బంధించేందుకు ఈ బీజాక్షరాలను వాడతారు.
- మంత్రాకారాలను వీజరూపాలను మంత్రవేత్తలు మామూలు భాషలో ప్రత్యక్షముగాచెప్పరు. మంత్ర దేవతలు పరోక్ష ప్రియలు కనుక మంత్రము లున్న స్వమాతృజార తుల్యముగా గోప్యములు.
- తాంత్రికమయిన బీజాక్షర మంత్రములలో అర్థం తెలియని శ్రీం, అం, శం లాంటి వర్ణములే ఉందును. దానిమ్మపండులో గింజలవలె ఉండే ఈ అక్షర రత్నాలు పరస్పరం బంధం లేనట్లు వెలుగుచుండును. అట్లని నిరర్ధ్థకములు అనరాదు. నిరర్థక్షమయిన మంత్రములు ఏ దేవతలను తృప్తి పజిచును? మంత్రం అంటే ఒక స్తుతి. ఒక ప్రార్థన. అర్థమున్నపుడు ఆ “గుణం” సాధ్యం అవుతుంది. కనుక బీజాక్షర మంత్రాలకు అర్థాలు తప్పనిసరి. వాక్యానికి అర్థం ఉన్నపుడు వాక్యగతమయిన పదాలకు గూడా ఆ అర్థభాగాలు పంచాలి. అలాగే మంత్రం మొత్తం మహావాక్యం అయితే మంత్రగత బీజాలకు అర్థం తప్పక ఉండాలి. కనుక వీజాక్షరాలకు అర్థం తప్పదు.
ఈ క్రింది పట్టికలో వివిధ బీజాక్షరాల అర్థాలను గమనించవచ్చును.
పైన చూపిన బీజాక్షర అర్థములకు ఆధారమైన ప్రమాణ గ్రంథములు :
1) శ్రీ తంత్రాభిధానం
2) మంత్రాభిధానం - 1
3) మంత్రాభిధానం - 2
4) ఏకాక్షర కోశము - (పురుషోత్తమదేవరచితం)
5) భూత యక్ష డామర తంత్రాంతర్గత బీజనిఘంటువు
6) మాతృకా నిఘంటువు - 1 (మహీదాసవిరచితం)
7) మాతృకా నిఘంటువు - 2 (మధ్వాచార్యరచితం)
8) మాతృకా నిఘంటువు - 3
9) వర్ణ నిఘంటువు - రుద్రయామలతంత్రం
10) బీజాభిధానం - భూతడామరతంత్రం
11) మంత్రార్థాభిధానం - వరదాతంత్రం
12) ముద్రానిఘంటువు - వామకేశ్వర తంత్రం
13) బీజాక్షర నిఘంటువు