Adsense

Friday, December 20, 2024

తామర గింజలు ఉపయోగాలు Tamara Ginjalu

చెరువులు, కొలనులలో కనువిందు చేసే తామర పువ్వులు ఫలదీకరణం చెంది కాయలుగా మారతాయి. ఈ కాయలలో గింజలు బలవర్థకమైన ఆహారంగా, ఔషధాలు గా వాడుతారు. చిత్రంలో కనబడే కాయల నుండి ఆకుపచ్చ మందమైన పైపొరతో ఒక్కొక్క కాయ నుండి 6 నుండి 10 ఆపైన గింజలు వస్తాయి. పై పొరను ఒలిచిన తర్వాత తెల్లని గింజల పప్పు తీస్తారు. ఈ పప్పును పచ్చిగా గాని, వండుకొని గాని తింటారు. బాగా ముదిరి, ఎండిపోయిన కాయల నుండి నల్లని ఎండు గింజలు వస్తాయి. వాటిని వేయించి పైపొర తీసేస్తే తామర గింజల పేలాలు (Phool Makhana) తయారవుతాయి. ఇవి బజార్లో మనకు విరివిగా దొరుకుతున్నాయి.

ఇక తామర గింజలు ఏ రూపంలో వున్నా పూర్తిగా పోషకాలతో నిండి వుంటాయి. రక్తశుద్ధికి, రక్తపోటు తగ్గడానికి, జీర్ణ శక్తి పెంపొందించడానికి, కండరాల పుష్టికి ఇవి దోహదపడతాయి.

(చిత్ర రచన గూగుల్ సహకారంతో) (సేకరణ)

ముక్తి నాగ క్షేత్రము mukti naga temple

ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగ ఏకశిలా విగ్రహం.సుమారు 16 అడుగుల పొడవు మరియు 36 టన్నుల బరువు తో బెంగుళూర్ నగరం శివార్లలో రామోహళ్లి గ్రామం వద్ద నిష్కల్మషమైన వాతావరణంలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి ని నాల్గు దశ లలో చూడ వచ్చు మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కే సుబ్రహ్మణ్య వద్ద , రెండవ దశ యవ్వనంలో ఘటి సుబ్రహ్మణ్య వద్ద మూడవ దశ తన వైవాహికం పళని వద్ద మరియు తిరువన్నమలై వద్ద 'సుబ్రహ్మణ్య స్వామి, యొక్క నాలుగో రూపం ముక్తి నాగ క్షేత్రము వద్ద ఉంది ఈ స్థలం ను సందర్శించే భక్తులు, పాము ఉంటున్నప్రాంతం చుట్టూ తొమ్మిది ప్రదిక్షనలు తిరగాలి ముక్తి నాగ ఆలయం వద్ద చూడ వలసిన ఆలయాలు 

1. శ్రీ కార్య సిద్ధి వినాయక ఆలయం

2. శ్రీ ఆది-ముక్తి నాగ ఆలయం

3. శ్రీ ముక్తి నాగఆలయం

4. శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్

5. శ్రీ పాతల్లమ్మ దేవి

6. శ్రీ కాలభైరవ దేవాలయం

7. శ్రీ నగాబన

ముక్తి నాగ క్షేత్రము మైసూర్ రోడ్లో ఉన్న రామోహళ్లి గ్రామం నుండి ఒక కిలోమీటరు దూరంలో, మరియు బెంగుళూర్ బస్సు స్టాండ్ నుండి 18 కిలోమీటర్ల.దూరం లో ఉంది.

Source:Facebook

Thursday, December 19, 2024

తంగలాన్ సినిమా రివ్యూ

PA రంజిత్ సినిమాలు ఆలోచన రేకెత్తించేవిగా వుంటాయి.. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంగా బ్రిటిష్ కాలం నాటి కథగా చూపించాడు..

ఈ దేశ సంపదకి వారసులైన వాళ్ళు, పరపీడన వల్ల బానిసలుగా మారి చివరికి కడు పేదరికం కట్టు బానిసత్వం నుండి బయటపడే ప్రయత్నంలో ఆ సంపదని కొల్లగొట్టాలనుకునే ఆక్రమణ దారులకు సహకరించడం… ఆ తరువాతే సంపద కాపాడాల్సిన జాతి నుండే తాము విడిపోయి దూరంగా బానిసలయ్యామనే విషయం గ్రహించడం…..

ఈ దేశ మూలవాసులు, ఆక్రమణ దారుల వల్ల ఎలా తొక్కివెయ్యబద్దారనే విషయo అంతర్లీనంగా చెప్పడం డైరెక్టర్ వుద్దేశ్యం..

మాములుగా Pa రంజిత్ కథ కథనం దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది యధావిధిగా..తంగాలాన్ కూడా ఆ కోవలోకే వస్తుంది..

ఇలాంటి పాత్రని అందరూ హీరోలు ఒప్పుకోరు.. అద్భుతంగా వుంది విక్రమ్ పాత్ర,.. నటన

#Netflix

Saturday, December 14, 2024

శ్రీదత్తాత్రేయ జయంతి

త్రిమూర్తి స్వరూపంగా భావించి, పూజించే దత్తాత్రేయుని- ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి? దత్త జయంతి విశిష్టత ఏమిటి? అనే అంశాలు తెలుసుకుందాం.

దత్తజయంతి_ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతీ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 4:19 గంటలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:37 గంటల వరకు ఉంది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య పండుగలకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ 14 వ శనివారం తేదీనే దత్త జయంతి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పూజకు శుభసమయం.

దత్తజయంతి_విశిష్టత
వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం- దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. అత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు.
మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే- ఒకేమారు త్రిమూర్తులను ఆరాధించేనట్టే!
దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు.

దత్తజయంతి_పూజావిధానం
దత్తాత్రేయ స్వామి, ప్రదోషకాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున, దత్తుని సాయంత్రంవేళలలో పూజించడం సంప్రదాయం. దత్తజయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి, శుచియై- పూజామందిరము, ఇల్లు, శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. పూజా మందిరములో రంగవల్లికలు తీర్చిదిద్దాలి.             ఈ రోజు పూజ చేసుకునేవారు పసుపురంగు వస్త్రాలను ధరించడం శుభకరం.

శ్రీగురుదత్త_స్తోత్రాలు
దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న, చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ- గంధం, పసుపురంగు పుష్పాలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేసుకొని, ముందుగా గణపతిని పూజించి, దత్తునిపూజ మొదలు పెట్టాలి.
దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తిశ్రద్ధలతో పఠించాలి.
పసుపురంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, కేసరి బాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి.
ఈ రోజు గురు చరిత్ర (అంటే దత్తాత్రేయుని చరిత్ర మాత్రమే! ఏదిపడితే అదికాదు) పారాయణం చేయడం శుభప్రదం.

ఇంట్లో పూజ పూర్తయ్యాక, సమీపంలోని దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు దేవాలయాలలో అన్నదానం చేయడంవలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయస్వామి వెంట ఎల్లప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఈ నాలుగు కుక్కలూ- నాలుగు వేదాలకు చిహ్నము. అందుకే దత్త జయంతిరోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే,  శని బాధలు, అనారోగ్య సమస్యలు ,తొలగిపోతాయి. అలాగే ఈ రోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది. విశేషించి, ఈ రోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా, విన్నా శుభం జరుగుతుంది.
భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరంలేదు. మనకున్నది నలుగురితో పంచుకుని, సంతోషంగా ఉండడమే దత్తాత్రేయస్వామి మానవాళికి ఇచ్చే సందేశం. అందుకే, దత్తాత్రేయుని గురువుగా భావించి, పూజించి- అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వలన- పితృదేవతల అనుగ్రహంతో పాటూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.
రేపటి దత్తజయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం... సకల శుభాలను పొందుదాం...   ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః 
శ్రీగురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు
సర్వేసుజనాఃసుఖినోభవంతు.

Friday, December 13, 2024

సింగాడాలు (Water Chestnuts)

సింగాడాలు (Water Chestnuts) దుంపజాతిలా కనిపించే కాయలు. ఈ కాయలు నీటిలో కాస్తాయి. నలుపుగా వుండి చూడటానికి చిన్న చిన్న గబ్బిలాలులా కనిపిస్తాయి. ఒక్కొక్క కాయ చిన్న సమోసా పరిమాణంలో వుంటుంది. వీటిని పచ్చిగా కాని, ఉడకబెట్టుకొని లేదా కూర వండుకొని గాని తింటారు. పైన నల్లని మందమైన పొరను తీసి దుంప వంటి భాగాన్ని తింటారు. పోషకాలు, ఖనిజలవణాలు పుష్కలంగా లభ్యమయ్యే వీటివలన శరీరానికి చలువ చేస్తుంది. శరీర పుష్టికి ,బీపీ,ఎసిడిటీ వంటి రుగ్మతలకు మందుగా పనిచేస్తుంది. ఉత్తర భారతదేశంలో విరివిగా శీతకాలం ప్రారంభం నుండి ఇవి దొరుకుతాయి. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలలో వీటి వాడకం ఎక్కువ.

చిత్రాలలో సింగాడా ఆకారాన్ని చూడవచ్చు.

శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం

బెంగళూరు నగరంలో దాదాపు వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది. భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి. బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నంది తీర్ధ, నందీశ్వర తీర్ధ, బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు.

ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఉంటుంది. ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది. ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది.

1997లో బెంగళూరు నగరంలోని కాడు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు. ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెబుతారు. భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న కొలను, గ్రానైట్ మెట్ల నిర్మాణాలను, మండప స్తంభాలను కనుగొన్నారు.

ఆలయంలో ప్రత్యేకమైన నంది విగ్రహాన్ని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించారు. నంది నోటి నుంచి నిరాటంకంగా జలం రావడాన్ని గుర్తించారు. ఈ నీరంతా ఆలయం మధ్య భాగంలో ఉన్న కళ్యాణి అనే ప్రదేశానికి వెళ్లి శివలింగంపై పడుతున్నట్లు నిర్ధారించారు. అయితే నంది నోట్లో నుంచి వస్తున్న నీరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో పరిశోధకులు కనుగొనలేకపోయారు. వృషభావతి నదికి దీనిని జన్మ స్థానంగా భావిస్తారు.

చరిత్రలో నంది తీర్ధ ఆలయం చాలా కాలం వినియోగంలో లేకుండా క్రమంగా భూ గర్భంలో కలిసినట్లు చెబుతారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సాధారణ భూస్థాయి కంటే ఈ ఆలయం తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి తోడు ఆలయంపై గోపుర శిఖరం కూడా లేకపోవడంతో ఇది కాల క్రమంలో ప్రజల దృష్టి నుంచి దూరమైనట్లు శాస్త్రవేత్తల అభిప్రాయం.

శివాలయం కావడంతో ఇక్కడ శివుడికి సంబంధించిన ప్రతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం, మహా శివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరు ప్రధాన నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాచుర్యం, ప్రత్యేకతలు రోజురోజుకూ విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.

(సేకరణ)

గుడి చుట్టూ ప్రదక్షణ కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు?

గుడిలో ప్రదక్షిణం సాధారణంగా "మూలవిరాట్టు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు" చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది. దీన్నే క్లాక్-వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా. ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమనీ, మూలవిరాట్టు వ్యక్తి ఎడమవైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడం అనీ అంటారు.

ఇలా ఎందుకు నడుస్తారంటే - నడిచేప్పుడు భక్తులకు కుడిచేతివైపు భగవంతుడు ఉంటాడు. ఇలా ఉండడమే విధాయకం. భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ, వివాహ క్రతువులోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడమవేపున నిలబడాలి అంటారు. ఈ రెంటికి ఒకటే సూత్రం. (భర్త దేవుడిలాంటివాడు అన్నది కాదండీ, బాబోయ్) చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి.

ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటూండగా ఈ విషయం ప్రస్తావన వచ్చి - ఏదైనా వేదిక మీదనో, వైదిక క్రతువుల్లోనో వయసులో పెద్దవారు, మన్నించదగ్గవారు ఉంటే ప్రయత్నపూర్వకంగా వారు మన కుడిపక్కన ఉండేటట్టుగా నిలబడాలి తప్పించి, వారు మనకు ఎడమపక్కన ఉండేట్టుగా నిలబడకూడదు అని. వయస్సులో పెద్దవారికే ఇది వర్తించేట్టు అయితే సాక్షాత్తూ భగవంతునికి తప్పకుండా వర్తిస్తుంది కదా. అందుకే ప్రదక్షిణం అన్నది మూలవిరాట్టు మ్న కుడివైపున ఉండేలా ఉంటుందని నా అనుకోలు.


పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు. శివాలయాల్లో మాత్రం వచ్చినవారు ఏ ఆశ్రమంలో ఉన్నారు (బ్రహ్మచర్యం, గృహస్థు, సన్యాసి) అన్నదాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుదంది.

  • గృహస్థు: శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు. గుడిలోంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులోంచి అభిషేక జలం వదులుతారు చూశారా, అది సోమసూత్రం. గృహస్థు దాన్ని దాటకూడదట. ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా (శివుడు కుడిన ఉండేలా) ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకూ వచ్చి, ఆగిపోయి వెనుదిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకూ వెళ్లి, ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడచి - ఇలా చేయాలట. ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట. ఐతే, ఇలా చేసేప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం, తద్వారా శివుడు భక్తుని ఎడమపక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి.

గృహస్థు శివాలయంలో ప్రదక్షిణ చేయాల్సిన పద్ధతి; సోర్స్: What Is The Right Way To Do The Pradakshina For Shivalayam | Pradakshina, Hindu Temples Guide

  • బ్రహ్మచారి: బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు. (ఎందుకన్నది తెలియదు నాకు) కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు.
  • సన్యాసి: సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా (అంటే మూలవిరాట్టు ఎడమపక్క ఉండేలా) తిరగాలి ఆలయం చుట్టూ.

ఇది కూడా చాగంటి వారు చెప్పిందే. శైవాగమం ప్రకారం చేసే ఈ పద్ధతి లింగ పురాణంలో సవివరంగా ఉందట.

వల్లెవాటు అంటే

వల్లెవాటు అంటే కొన్ని కోస్తా జిల్లాలలో, హిందూ పెళ్ళికూతురు మధుపర్కంతో పాటు విడిగా వేసుకొనే ఒక ఉత్తరీయం. వల్లెవాటును ఎడమ భుజం పైనుంచి కాక రెండు భుజాలపైనుంచి తీసి, ముందు X ఆకారం వచ్చేలాగ వేసుకొంటారు. ఈ సంప్రదాయం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువ కనబడుతుంది. సాధారణంగా వల్లెవాటు మధుపర్కం చీరలాగే ఎర్రటి అంచుతో ఉండే తెల్లటి వస్త్రం. పెళ్ళిబట్టలు అమ్మే దుకాణాలలో వల్లెవాటును మధుపర్కంతో పాటు కలిపి అమ్ముతారు. కొన్ని కుటుంబాలలో పెళ్ళికూతురు తల్లికూడా కన్యాదాన సమయంలో వల్లెవాటు వేసుకొంటుంది.

వల్లెవాటు, మధుపర్కాలలో గాయని గీతామాధురి. © Sumuhurtham Photography

ప్రపంచం చిన్నదయిపోయి, రకరకాల సంస్కృతుల సమ్మేళనం ఎప్పుడూ ఊహించనంత త్వరగా జరిగిపోతున్న ఈరోజుల్లో, పదేళ్ళక్రితం లేని ఎన్నో సంప్రదాయాలు పెళ్ళితంతులో వచ్చి చేరుతున్నాయి, కొన్ని పెళ్ళితంతులోంచి తొలగిపోతున్నాయి. ఇప్పుడు అన్ని తెలుగు పెళ్ళిళ్ళలోనూ సంగీత్, మెహందీ పేరుతో పెళ్ళికి ముందురోజు ఒక వేడుక జరుగుతోంది.

"పెళ్ళి, దాని పుట్టు పూర్వోత్తరాలు" పుస్తకం ముందుమాటలో తాపీ ధర్మారావుగారు అన్నట్లు దేశకాల పరిస్థితులని బట్టి ఇరుగుపొరుగు జాతులవారి ఆచారాలు అనుకరించడం, అవలంబించడం అన్ని సమాజాల్లో జరుగుతుంది. పెళ్ళికి సంబంధించిన అనేక ఆచారాలు అంచెలంచెలుగా (తరతరాలుగా) పరిణామం చెందుతూ వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో కింద అంచెలలో (పాత తరాలలో) చాలా ప్రధానంగా ఉన్న అలవాట్లు, ఆచారాలు పై అంచెలలో కూడా జరిపినా, అవి క్రమంగా వాటి ప్రాధాన్యతను పోగొట్టుకొని, అర్థరహితమైన లాంఛనాలుగా మిగిలిపోతాయి. మంగళసూత్రం ధరించే ఆచారం కూడా ఆవులను బంధిచడానికి వాడే గళసూత్రం అవశేషమే అని తాపీ ధర్మారావుగారు అంటారు. తెలుగువారిలో కొందరి వివాహ సంప్రదాయంలో పెళ్ళికూతురు నడుముకు పలుపుతాడువంటి తాడు కడతారు. "వల్లె" అన్న పదానికి అర్థం "పశువులను బంధించే తాడు", "వాటు" అంటే "విధం". వల్లెవాటు ఆచారానికి మూలం సుస్పష్టమే కదా!

శివుడే స్వయంగా ప్రతిష్టించిన శివ లింగం

ప్రపంచంలో ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనది. అదే తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం.

ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు.సంతానం కోసం

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.

తిరువిడై మరుదూర్ కు కేవలం 9కిలోమీటర్ల దూరంలో కుంబకోనం రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడి నుండి లోకల్ బస్స్ సర్వీలు ఉన్నాయి.ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు.ఇక్కడిశివ లింగం స్వయంభు.

(సేకరణ)

జంబుకేశ్వరాలయం

పంచ భూత లింగాలలో లింగం జల లింగం తిరువానైకావల్ (జంబుకేశ్వర ఆలయం)లో ఉంది. ఈ ఆలయం తమిళనాడులోని త్రిచి (తిరుచిరాపల్లి) జిల్లాలో ఉంది.

ఈ ఆలయం లో స్వామి వారు జంబుకేశ్వరుడు

గా ఉన్నారు. ఇక్కడ స్వామి వారు జలం నకు ప్రతీక స్వరూపం గా ఉన్నారు. స్వామి వారు జంబు చెట్టు క్రింద కూర్చునట్లు ఉంటారు.ఇక్కడ వర్ష కాలం లో నీరు స్వామి వారిని చుట్టుముట్టి ప్రవాహం లా పెరుగుతుంది.

ఈ ఆలయం లో పార్వతమ్మ వారు అఖిలాండేశ్వరిదేవి గా కొలువై ఉన్నారు.

స్థల పురాణం:

1. నారదుడి శాపం: బ్రహ్మ పుత్రుడు నారదుడు రుద్రులకు అహంకారంతో సమీపించగా, నారదుడికి శాపం వస్తుంది. శాపాన్ని తొలగించడానికి జంబు చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి ఆరాధన చేసాడు.

2. అమ్మవారు తపస్సు: అక్హిలాండేశ్వరి అమ్మవారు ఇక్కడ శివుని పూజించి జ్ఞానం పొందారని స్థల పురాణం చెబుతుంది.

3. జల లింగం: ఈ ఆలయంలో లింగం క్రింద నీరు ఎప్పుడూ ఉట్టి వస్తుంటుంది.

ప్రాముఖ్యత:

1. పంచ భూత లింగ క్షేత్రాలలో ఒకటి: ఈ ఆలయం నీటి (జలం) మూలమైన శివత్వానికి ప్రతీక.

2. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: జంబుకేశ్వరుడిని పూజించడం ద్వారా శక్తి, సంతోషం, శాంతి లభిస్తాయని నమ్మకం.

3. వాస్తు దృష్టి: ఈ ఆలయం "మద" (ఆనందం) ప్రాతిపదికగా నిర్మించబడింది.

స్వామి వారి మహత్యం:

జంబుకేశ్వరుని పూజ చేస్తే జీవితంలో తపాలు తొలగిపోతాయని, నీరుగా నడిచే జీవితం క్రమబద్ధంగా ప్రవహిస్తుందని విశ్వాసం.

అమ్మవారు అఖిలాండేశ్వరీ రూపంలో భక్తుల శ్రేయస్సు కోసం తపస్సు చేసి, దైవ అనుగ్రహం ప్రసాదిస్తారు.

ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పంచ భూతాల సమతుల్యం కలుగుతుందని చెబుతారు.

ఇది అత్యంత ప్రాచీనమైన శివాలయాలలో ఒకటి.

(సేకరణ)

ధనుర్మాసం ప్రారంభం , ధనుర్మాసం విశిష్టత

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.  విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.

*☘భోగితో ముగుస్తుంది:☘*

సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) *మార్గళి వ్రతం*  పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

*☘ఎంతో పునీత మాసం:☘*

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు , ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

*☘బ్రహ్మముహూర్తంలో పారాయణం:☘*

ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్త్రవచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , పావై అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

*☘శ్రీకృష్ణుడికి తులసిమాల:☘*

ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులు చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజు అయినా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.

*శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*
*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:*

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం.

*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?*

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.

*కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:*

వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

*ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:*

రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.

*గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?*

ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

   *కాత్యాయనీ వ్రతం:*

    *పూజా విధానం:*

రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం , గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.

*పాశురములు* చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి.
చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.

*నైవేద్యం* సమర్పంచాలి(రోజు పొంగలి , దద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే  నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం.

*హరే క్రిష్ణ గోదా క్రిష్ణ*

Thursday, December 12, 2024

కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?

. గ్యాస్ట్రిక్ నొప్పి మరియు గుండెనొప్పి రెండూ ఛాతీలో నొప్పిని కలిగిస్తూ ఒకేలా అనిపిస్తాయి. కానీ ఈ రెండు రకాల నొప్పుల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలను బట్టి తెలుసుకోవచ్చు.

 నొప్పి యొక్క స్థానం…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా ఎగువ కడుపులో లేదా ఛాతీ మధ్యలో అనిపిస్తుంది. గుండెనొప్పి సాధారణంగా ఛాతీ ఎడమ వైపున, భుజం, మెడ, దవడ లేదా చేతిలో అనిపిస్తుంది.

నొప్పి యొక్క స్వభావం….గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా తీవ్రంగా ఉంటుంది, కడుపు ఉబ్బరం, మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలతో కూడి ఉంటుంది. గుండెనొప్పి సాధారణంగా ఒత్తిడి, బిగుతు, చిక్కుకున్న భావన వంటి లక్షణాలతో కూడి ఉంటుంది.

 నొప్పి యొక్క వ్యవధి…… గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా కొన్ని నిమిషాల నుండి గంటల వరకు ఉంటుంది. గుండెనొప్పి సాధారణంగా కొన్ని నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఉంటుంది.

 నొప్పిని ప్రేరేపించే అంశాలు…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా కారంగా ఉండే ఆహారం, కెఫిన్, ఆల్కహాల్, పొగత్రాగడం వంటి కారకాల వల్ల ప్రేరేపించబడుతుంది. గుండెనొప్పి సాధారణంగా శారీరక శ్రమ, ఒత్తిడి, చలి వంటి కారకాల వల్ల ప్రేరేపించబడుతుంది.

నొప్పిని తగ్గించే ప్రధమ చికిత్స…..గ్యాస్ట్రిక్ నొప్పి సాధారణంగా యాంటాసిడ్స్, డైజెస్టివ్ ఎంజైములు, కడుపు ఖాళీగా ఉంచడం వంటి చికిత్సలతో తగ్గుతుంది. గుండెనొప్పి సాధారణంగా నైట్రోగ్లిజరిన్, ఆస్పిరిన్, విశ్రాంతి వంటి చికిత్సలతో తగ్గుతుంది.

 ఏ నొప్పి అని నిర్ధారించే 'కొన్ని చిట్కాలు…….

🔹. మీ నొప్పి ఎక్కడ ఉందో గమనించండి.

🔹. మీ నొప్పి ఎలా ఉందో గమనించండి.

🔹. మీ నొప్పి ఎంతసేపు ఉంటుందో గమనించండి.

🔹 మీ నొప్పిని ఏది ప్రేరేపిస్తుందో గమనించండి.

🔹. మీ నొప్పిని ఏది తగ్గిస్తుందో గమనించండి.

(సేకరణ)

శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం

శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం.

( కర్నాటక దొడ్డబల్లాపూర్ )

శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం

 శ్రీ సుబ్రహ్మణ్య భగవానుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పూజించబడతాడు.

శివుని కుమారునిగా పరిగణించబడే సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతల సైన్యానికి అధిపతి. అతన్ని షణ్ముఖ, కార్తికేయ, శరవణభవ మరియు స్కంద మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

గుహ అనేది సుబ్రహ్మణ్య స్వామి మరొక పేరు, అతను గుహలలో నివసించేవాడు మరియు సుబ్రహ్మణ్య స్వామి నివాసంగా పర్వతాలు మరియు గుహలు మనకు ఎల్లప్పుడూ కనిపిస్తాయి.

 సుబ్రహ్మణ్య స్వామికి అనేక దేవాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మరియు వాటిలో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన యాత్రా కేంద్రాలు. అటువంటి అరుదైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయం బెంగుళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలోని ఘాటి వద్ద ఉంది.

 ఘటి అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. కుండ అని అర్థం. ఇక్కడ పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది.

 స్థల పురాణం ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ముందు సుబ్రహ్మణ్య భగవానుడు ఈ ప్రాంతంలోని పర్వత శ్రేణులలోని గుహలలో సర్ప వేషంలో తపస్సు చేసిన ప్రదేశం.

 ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య భగవానుడు పాము రూపంలో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు.

నాగుల కుటుంబాన్ని విష్ణువు వాహనం అయిన గరుడుని నుండి రక్షణ అందించమని సుబ్రహ్మణ్యస్వామి నరసింహుడిని ప్రార్థించాడు.

ఘాటి వద్ద ఉన్న దేవాలయం అరుదైన కలయికలో సుబ్రహ్మణ్య భగవానుడు మరియు లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది.

ఈ ఆలయం యొక్క అరుదైన విషయం ఏమిటంటే, రెండు దేవతలు ఒకే స్వయంభూ. విగ్రహంపై ఏడు తలల నాగుపాము ఉన్న కార్తికేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది.

ఇది తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది. గర్భగుడి లోపల వ్యూహాత్మకంగా ఉంచిన అద్దం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామిని వీక్షించవచ్చు.

ఘట అనేది సంస్కృత పదానికి అర్థం కుండ. ఒక పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది మరియు ఘటి అనేది సుబ్రహ్మణ్య భగవానుడు ఘట సర్ప రూపంలో నివసించిన ప్రదేశం.

 హిందీలో ఘాట్ అంటే పర్వత శ్రేణి మరియు ఈ సుబ్రహ్మణ్య దేవాలయం పర్వత శ్రేణులలో ఉంది.

సుబ్రహ్మణ్య భగవానుడు ఘటికాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశంగా ఘటి భావిస్తారు.

ఆలయ రికార్డుల ప్రకారం ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది మరియు దీనిని సండూర్ రాజవంశానికి చెందిన పూర్వపు పాలకులు ఘోర్పడే నిర్మించారు.

 సుబ్రహ్మణ్య భగవానుడు స్వయంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం (కల) స్థానిక పౌరుల సహాయంతో ఈ అరుదైన మరియు స్వయంగా వ్యక్తీకరించబడిన విగ్రహాన్ని రాజు వెలికితీశారు.

 ఘాటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన యాత్రా కేంద్రాలలో ఒకటిగా మారింది మరియు సుబ్రహ్మణ్య భగవానుని సర్పరూపం కారణంగా ఈ ప్రదేశం నాగ క్షేత్రంగా కూడా గౌరవించబడుతుంది.

సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కోసం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సంప్రదిస్తారు.

కుజ (అంగారక) ముఖ్యంగా కుజ (అంగారక) దోషం, వైవాహిక సంబంధిత సమస్యలు మరియు శ్రేయస్సు, రాహు, సర్ప/నాగ దోషాల నుండి వచ్చే దుష్ప్రభావాలకు నివారణగా, సంతానం పొందడం కోసం;

ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కుష్టువ్యాధి, ల్యూకోడెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నివారణగా, శత్రువుల నుండి ఉపశమనం (అంతర్గత మరియు బాహ్య రెండూ), కాకుండా అప్పుల నుండి ఉపశమనం లాంటి సమస్యలు కోసం ఇక్కడ పూజలు చేస్తారు.

ఆలయ రథోత్సవం ప్రతి సంవత్సరం 6వ చాంద్రమానం (శుక్ల షష్ఠి) నాడు పుష్య మాసంలో మాత్రమే కాకుండా, ఇతర ముఖ్యమైన సందర్భాలలో సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించడం కోసం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.. స్వస్తి 

(సేకరణ)

మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ

*నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!!*

*భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నారు . ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు.*

*ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...*

*పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.*

*దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వమణచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు.*

*ఆక్రమంలోనే అగస్త్యమహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు.*

*ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు.*

*విషయం తెలుసుకొన్న దేవతలందరూ ఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.*

*శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి వారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది.*

*నాగుల చవితి సందర్భంగా అపురూపమైన సర్ప గాయత్రి*

*ఓం మహా సర్పాయ విద్మహే*

*బహు రక్షాయ ధీమహి*

*తన్నో పితృ ప్రచోదయాత్ ||*

*అలాగే నిత్యం పఠించవలసిన సర్పశ్లోకం.*

*అనంతం వాసుకిమ్ శేషం పద్మనాభంచ కంబళం |*

*శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకమ్ కాళీయం తథా ||*

*ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం |*

*సాయంకాలే పఠేనిత్యం ప్రాతఃకాలే విశేషతః ||*

*తస్య విషభయం నాస్తి సర్వత్రవిజయీ భవేత్ ||*

*ఈ శ్లోకాన్ని నిత్యం సాయంకాలంలో పఠించదగ్గది. ప్రాతఃకాలంలో పఠించడం విశేషం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించేవారికి విషభయం ఉండదు. అన్నింటా విజయమే లభిస్తుంది.*

*సర్వేజనాః సుఖినోభవంతు


Wednesday, December 11, 2024

అష్టాక్షరీ మంత్ర మహిమ.!!

అష్టాక్షరీ మంత్ర మహిమ...........!!

" ఓం నమో నారాయణాయ " అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.

ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే

శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు.

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం

" ఓం నమో నారాయణాయ " అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా

ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం,

నకారం రక్త (ఎరుపు) వర్ణం,

మో అనే అక్షరం కృష్ణ (నలుపు),

నా అనే అక్షరం ఎర్రగానూ,

రా అనే అక్షరం కుంకుమరంగులోనూ,

య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,

ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.

" ఓం నమో నారాయణాయ" అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది.

ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి,

" ఓం నమో నారాయణాయ" అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు

"ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.

పాలు ఎక్కువగా పలుమార్లు మరగకాచడం ద్వారా అందులో పోషకాల్లో ఏదైనా మార్పు వస్తుందా? ఇలా ఎక్కువసార్లు కాయడం ద్వారా అందులో ఏవైనా హానికారకాలు పోగొట్టగలమా ?

 పాలను పలుమార్లు మరగకాచడం వలన కలిగే మార్పులు:

▫️పోషకాల నష్టం: పాలను ఎక్కువసార్లు మరిగించడం వల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు నాశనమవుతాయి. ప్రత్యేకించి, విటమిన్ సి, బి విటమిన్లు, నాశనమయ్యే అవకాశం ఉంది.

▫️ప్రోటీన్లు: ఎక్కువసార్లు మరిగించడం వల్ల ప్రోటీన్లు కొంతవరకు దెబ్బతింటాయి. ఇది పాలను జీర్ణించుకోవడం కష్టతరం చేస్తుంది.

▫️ఖనిజాలు: కాల్షియం వంటి కొన్ని ఖనిజాలు పాత్రలకు అతుక్కోవడం వల్ల కొంత నష్టం జరగవచ్చు.

▫️హానికారకాల నిర్మూలన: పాలలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు ఇతర హానికారక జీవులు మరిగించడం ద్వారా నాశనమవుతాయి. అయితే, అన్ని రకాల హానికారక జీవులు నాశనం కాకపోవచ్చు.

▫️పాల రుచి మారడం: ఎక్కువసార్లు మరిగించడం వల్ల పాల రుచి మారి, కొద్దిగా కాలిన రుచి వస్తుంది.

▫️పాలలోని ప్రోటీన్లు గట్టిపడటం: ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని ప్రోటీన్లు గట్టిపడి, పాలు తాగడానికి కష్టంగా ఉంటాయి.

హానికారకాలను పోగొట్టగలమా ?

🔹బ్యాక్టీరియా నాశనం: పాలను మరిగించడం వల్ల అందులోని హానికారక బ్యాక్టీరియా చనిపోతాయి. కాబట్టి పాలను ఒకసారి బాగా మరిగించడం వల్ల అధిక భాగం బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

▫️ఇతర హానికారకాలు: పాలలో ఉండే ఇతర కొన్ని హానికారక పదార్థాలు కూడా వేడి వల్ల నాశనం అయ్యే అవకాశం ఉంది.

ముగింపు: పాలు ఒకసారి బాగా మరిగించడం వల్ల అందులోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అయితే, ఎక్కువసార్లు మరిగించడం వల్ల పోషకాల నష్టం జరగడం, ప్రోటీన్లు మారడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే, పాలను ఒకసారి మాత్రమే బాగా మరిగించి, తర్వాత వెంటనే చల్లార్చి ఉపయోగించడం మంచిది.

(సేకరణ)

శనగ పిండితో ఇడ్లీలలోకి చేసే చట్నిని బొంబాయి చట్నీ అంటారు. దానికి పేరెలా వచ్చింది?

సెనగ పిండి తో చేసే ఈ పదార్థం మహారాష్ట్ర వారి వంటకం. వారు జొన్న పిండి తో చేసే రొట్టె ను భాక్రి అంటారు. ఈ భాక్రి కి జత, ఈ సెనగపిండి చట్నీ. వారు దీనిని జుంక ( zunka ) అంటారు. Zunka bhaakri మహారాష్రీయుల జనప్రియమైన ఆహారం. ఎంత అంటే, అక్కడి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పిల్లలకు ఇదే పెడతారు. తమిళ సోదరులకు ఇడ్లి సాంబారు ఎలాగో, మరాఠీయులకు జున్క భాక్రి అలాగే.

పైన చెప్పింది చదివితే ,ఇక మనం దానిని బొంబాయి చట్నీ అని ఎందుకంటామో మీకు తెలిసి పోయి ఉంటుంది.మన ఊరిలో హోటళ్లు మనకు హోటళ్లు మాత్రమే. కానీ బయటి ఊళ్లలో ఆంధ్ర restaurant అని ప్రత్యేకం గా పేర్కొంటారు. బొంబాయి చట్నీ కూడా అలంటి పేరే.

ఉత్తర కర్ణాటక, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలలో దీనిని పిట్ల అని కూడా అంటారు. కమ్మని రుచి కలిగిన బొంబాయి చట్నీ చేయడం కూడా చాల సులభం.

వీర్యం పెరుగుటకు ఎక్కువగా ఏమి తినాలి ?

వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరచడానికి సరైన ఆహారం, జీవన శైలి, మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు కీలకం. మీ శరీరానికి అవసరమైన పుష్కలమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కింద చెప్పిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది:

▫️జింక్ ఉండే ఆహారం : జింక్ వీర్యనాణు ఉత్పత్తికి కీలకమైన పోషకం. ఉత్తమ వనరులు: బాదం, వేరుశెనగలు, సూర్యకాంతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు.

▫️ఫోలిక్ యాసిడ్ : వీర్య నాణ్యత మెరుగుపడటానికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఉత్తమ వనరులు: ఆకుకూరలు, బీన్స్, బ్రోకోలీ, సిట్రస్ పండ్లు.

▫️ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : వీర్యం చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉత్తమ వనరులు: చేపలు (సాల్మన్, మాక్రెల్), అవోకాడో, వాల్‌నట్స్, చియా గింజలు.

▫️విటమిన్ C మరియు విటమిన్ E : వీటికి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి వీర్య నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఉత్తమ వనరులు: కివీ, నారింజలు, స్ట్రాబెర్రీ, బాదం, గింజలు.

▫️విటమిన్ D : ఇది టెస్టోస్టెరోన్ ఉత్పత్తికి ఉపయోగకరం. ఉత్తమ వనరులు: సూర్య కాంతి, ఫ్యాటీ ఫిష్, గుడ్లు.

▫️అరటి పండ్లు : బనానాలో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

▫️పాలకూర : దీనిలో ఫోలేట్ సమృద్ధిగా ఉండి వీర్య ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.

▫️నీరు : డీహైడ్రేషన్ వల్ల వీర్య పరిమాణం తగ్గే అవకాశం ఉంది. అందుకే రోజుకి కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి.

మంచి జీవనశైలి అలవాట్లు :

▫️ధూమపానం, మద్యం వంటి అలవాట్లను తగ్గించండి.

▫️ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయండి.

▫️రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం.

మీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చడం ద్వారా వీర్యం ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. రోగనిరోధక శక్తిని, మరియు శారీరక సామర్థ్యాన్ని పెంచడానికి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

(సేకరణ)

ఇన్‌స్టంట్ కాఫీకి ఫిల్టర్ కాఫీకి తేడా ఏంటి? 99.5% మందికి ఈ విషయం అస్సలు తెలియదు!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే హాట్ డ్రింక్స్‌లో కాఫీ ఒకటి.. ముఖ్యంగా ఈ కాఫీలో రెండు రకాలు ఉంటాయి. ఒక్కటి ఇన్‌స్టంట్ కాఫీ, మరోక్కటి ఫిల్టర్ కాఫీ..

చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలీదు..తెలిసినవారికి ఆ రెండింటీలో ఏది మంచిదో అని డౌట్ కూడా ఉంటుంది.

ఇన్‌స్టంట్ కాఫీని ఎలా తయారు చేస్తారంటే.. కాఫీ గింజల పొడితో చేస్తారు. కాఫీ పొడిని చేయడానికి రకరకల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు. ఈ పొడి మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ పొడి పాలలో లేదా నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటారు.

ఫిలర్ట్ కాఫీని కాఫీ గింజల ముక్కలతో తయారు చేస్తారు. ఈ కాఫీ రుచిగా, సువాసన కూడా సూపర్‌గా ఉంటుంది. ఇన్‌స్టంట్ కాఫీ కంటే ఫిలర్ట్ కాఫీయే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కాఫీ సువాసన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలోనూ యాంటి ఆక్సిడెంట్లు, కెఫిన్‌లు ఉంటాయి.

పాలిఫినాల్స్, హైడ్రాక్సీసిన్నమిక్ యాసిడ్స్‌ ఫిలర్ట్ కాఫీలో ఉంటాయి.ఇవి ఇన్‌ప్లమేషన్‌ను తగ్గిస్తాయి అందుకే పలువురు వైద్య నిపుణులు కూడా ఫిల్టర్ కాఫీ మంచిదని చెబుతూ ఉంటారు. ఇంకా ఇన్‌స్టంట్ కాఫీ విషయానికి వస్తే అందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కాఫీ గింజల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

మీరు ఇన్‌స్టంట్ కాఫీ తాగ్గినా, లేక ఫిల్టర్ కాఫీ తాగ్గినా లిమిటెడ్‌గా తాగ్గితే మంచిది..అలా అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌స్టంట్ కాఫీలో క్రీమర్స్ యాడెడ్ షూగర్స్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

ఫిల్టర్ కాఫీలో షూగర్ లేదా పాలు కలపకుండా తాగితే చక్కెర స్థాయిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఇన్‌స్టంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీ చాలా టేస్టిగా ఉంటుంది.అలాగే ఫిల్టర్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.

(సేకరణ)

మర్ఫీ సూత్రాలు (Murphy's Laws)" అనేవి మీకు తెలుసా?

మీరు ఎప్పుడైనా,కారు మబ్బులని చూసి వర్షం పడబోతుందని రైన్ కోట్ ,గొడుగు తీసుకుపోతే చుక్క నీరు కూడా పడలేదా? మర్నాడు కసిగా, మీకు నచ్చిన డ్రెస్లో ఎండ ఉందని, నల్ల కళ్ళద్దాలు వేసుకుని కులాసాగా పోతుంటే, మీపైన జోరున వాన పడిందా ?

ఇలాగ కొన్ని సార్లు విధి మనతో ఆటలాడినప్పుడు ఖర్మ రా…. బాబు ఖర్మ… అనుకుని నెత్తి కొట్టుకుంటారా. నేను అంతే.

అయితే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి వాటిమీద రాసిన సూత్రాల గురించి, ఘనత వహించిన మర్ఫీ గారి గురించి విన్నప్పుడు, ఎక్కడో ఓ తెల్లోడు కూడా ఇలానే ఫీల్ అయ్యాడు అనిపించి, సరదాగా చదివానండి. పుసుక్కున నచ్చేసి, అప్పటినుండి ఇలాంటి సంఘటన జరిగితే, మొహం మాడ్చేసుకుని తిట్టుకుంటూ ఉండకుండా, ఒక చిన్న నవ్వేసుకుని "ఓరి మర్ఫీ నువ్వు మామూలోడు కాదురా" అనుకుంటా. ఇంతకీ మర్ఫీ అనేవాడు ఉన్నాడో లేదో కూడా తెలీదు(లేదని సూత్రీకరించారు ) కానీ ఈ సూత్రాలు మాత్రం నెట్ లో, పుస్తకాల్లో బాగా ప్రసిద్ధి అయ్యాయి .

(the originalmetalsidecompany image)

వీటి గురించి మీరెప్పుడు వినకపోతే కొన్ని చెణుకులు విసురుతా చూడండి. నా సామిరంగా మీరు కూడా వీటికి ఫాన్స్ అయిపోతారనే దానికి ఏ మాత్రం సందేహం లేదు.

  • తోటలో తికమకలు (laws of gardening) : పక్కోడి తోటలో పనిచేసే పనిముట్లు, వాడి తోటలోనే పనిచేస్తాయి, మీ తోటకి పనికి రావు.
  • పెద్ద పెద్ద పేరున్న పరికరాలు, అసలు పనే చేయవు.

ఎవరూ దాన్ని వాడటం లేదంటే , దాంట్లో అర్ధం ఉందన్న మాటేగా.

మీకు అస్సలు అవసరం లేని వస్తువు, అతి ఎక్కువగా కనపడుతుంటుంది .

ఇంకా ఇలాంటివి కొన్ని…

(thebrightside image)

  • మీరు అతి కష్టంగా వెతికి సంపాదించిన వస్తువు, మీ చేతి కొచ్చిన మరుక్షణం నుంచి ప్రతి షాపులో దర్శనం ఇస్తుంది.
  • మీరేదైనా వస్తువుని కనపడలేదని కొత్తది కొన్న మరుక్షణమే, అది మీ కళ్ళముందు ప్రత్యక్షం అవుతుంది.
  • మీరు నించున్న క్యూ కన్నా, పక్క లైన్ ఎప్పుడు వేగంగా కదలటం ఖాయం.
  • మీరు వెతుకుతున్న వస్తువు ఎప్పుడూ, మీరు ఖచ్చితంగా ఉండదులే అనుకున్న ప్రదేశంలోనే దొరుకుతుంది.
  • షాపులు మూసిన తర్వాతే, వస్తువుల అవసరం వస్తుంది.
  • డాక్టర్లు ఉండని ఆది వారాలు ,సెలవ రోజుల్లోనే, రోగాలు వస్తాయి.
  • ఏదైనా తప్పు జరిగేందుకు ఆస్కారం ఉందంటే, ఆ తప్పు జరిగే తీరుతుంది.
  • ఒక వస్తువు ఎంత ఖరీదైనదైతే అంత ఎక్కువ పగిలే చాన్సు ఉంటుంది.
  • అన్ని ఉపద్రవాలు కట్టగట్టుకుని ఒక్కసారే వస్తాయి.
  • ఏదైనా ఒక విషయం గురించి మీరు చెప్పాలనుకున్నపుడు…1)మంచిదైతే వెంటనే అది మాయం కావటం ఖాయం..2) చెడ్డ దైతే వెనువెంటనే జరగటం ఖాయం.
  • మనం అరువిచ్చిన పుస్తకాల్లో మనకు పిచ్చపిచ్చగా నచ్చే పుస్తకం మాత్రం నికరంగా ఎట్టి పరిస్తితుల్లో వెనక్కి రాదు.
  • మనం ఒక వస్తువు ఎన్ని రోజుల్నించో వాడకుండా పెట్టి పెట్టి, చిరాగ్గా బయటకు విసిరేస్తామా ,మరుక్షణమే దాని అవసరం వస్తుంది.

ఇది ఇంకా అదిరిపోయే సూత్రం…ఒకవస్తువు ఏ వేపు పడితే దుంప నాశనం అయ్యే ప్రమాదం ఉంటుందో నూటికి నూరు సార్లు ఆవేపే పడుతుంది.(సాధారణం గా మన సెల్ ఫోన్ లో స్క్రీన్ ఉండే వైపు). ఇంకోవైపు పడదుకాక పడదు.

మీరు కూడా సేకరించి వీటిని చదవండి.సరదాగా నవ్వుకోండి.

(సేకరణ)