THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Monday, January 6, 2025
గ్రృహ నిర్మాణం - తీసుకోవలసిన జాగ్రత్తలు
హైదరాబాదుకు బల్దియా అనే పేరు ఎలా వచ్చింది?
బల్దియా అనేది అరబిక్ పదం. అయితే ఉర్దూలోనూ బల్దియా అనే అంటారు. దాని అర్ధం నగరాన్ని పాలించే సంస్థ, నగర పాలక సంస్థ అని.
మునిసిపాలిటీని బల్దియా అనటం, మున్సిపల్ ఎన్నికలను బల్దియా ఎన్నికలు అనటం కేవలం మరో భాషలోని పదం వాడటం తప్పించి వేరే అర్థం, పరమార్థం ఏమీ లేదు.
హైదరాబాద్ ముస్లిం పాలకుల చేతిలో ఉన్నప్పటి నుండి, కొంతకాలం క్రితం దాకా హైదరబాదులో ముస్లింలు ఎక్కువగా, లేదంటే ఉర్దూ మాట్లాడేవారి సంఖ్య అధికంగా ఉండేది. కాబట్టి ఆ పేరు అలా స్థిరంగా ఉండిపోయింది.
దీని మీద ఉర్దూలో వ్రాసి ఉన్నది ఏమిటి అంటే-
అజీమ్-తర్ హైదరాబాద్ మజిలిసే బల్దియా. అజీమ్-తర్ అంటే గ్రేటర్, మజిలిస్ అంటే కార్పోరేషన్, బల్దియా అంటే మునిసిపాలిటీ.
మార్కెట్లో ఉండే పండ్ల మీద స్టిక్కర్ ఉంటుంది. ఎందుకని? దీని ఉద్దేశం ఏమిటి?
మీ ప్రశ్న పై చిత్రంలోని స్టిక్కర్ లాంటి దాని గురించి అనుకోని జవాబు వ్రాస్తున్నాను.
వీటిని PLU ప్రైస్ లుక్ అప్ (Price Look Up Code ) అని అంటారు.
ఇది మనకు ఆ పండు ఉత్పత్తి గురించిన ముఖ్య సమాచారాన్ని ఇస్తుంది.
మీరు కొన్న పండు స్టిక్కర్లో 4 అంకెలు ఉండి 3 లేదా 4 సంఖ్య తో మొదలవుతూవుంటే ఆ పండు ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారకాలు,ఎరువులు వేసి పండించారని అర్ధం.
ఒకవేళ 5 అంకెలు ఉండి 8 తో మొదలవుతువుంటే అది జెనిటిక్ గ మార్పు చేయబడిందని అర్ధం. ఇలాగ
అలా కాకుండా 5 అంకెలువుండి 9 సంఖ్యతో మొదలవుతువుంటే ఆ పండు పండించటానికి ఎటువంటి క్రిమిసంహారకాలు వాడలేదని,జన్యు మార్పిడికి గురికాలేదని, ప్రాచీన వ్యవసాయ పద్ధతులద్వారా పండిచారని తెలుస్తుంది.
ఏ స్టిక్కర్ లేకుంటే రైతులు వారికి వీలైన విధంగా పండించారని తెలుసుకోవాలి. క్రిమిసంహారకాలు వాడారో లేదో, సేంద్రియ పద్ధతుల ద్వారా పండిచారో లేక జెన్యు మార్పిడి చేసారో ఎవరికీ తెలియదు.
Travelling | వీసా గొడవ లేదు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ.. ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు..
Travelling | భారతీయులకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సోమ్‌నాథ్ ఆలయం నుంచి మేఘాలయా దాకా ఏ పర్యాటక ప్రదేశం చూసినా కళకళలాడుతూనే ఉండటానికి కారణం భారతీయ టూరిస్టులే.
కోవిడ్-19 తర్వాత యువతలో ట్రావెల్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. దేశీయంగానే గాక విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న ఖర్చు రూ. 12,500 కోట్లు. ఇది ఏడాది మొత్తం అనుకునేరు! నెల రోజులకు మాత్రమే.. మీరు కూడా దేశీయంగా పలు ప్రదేశాలకు వెళ్లి ఏదైనా విదేశీ ప్రయాణం చేయాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే అందుకు కజకిస్థాన్ బెస్ట్ ఆప్షన్. అదేంటి? ప్రపంచంలో విహారయాత్రలకు యూఎస్ఏ, యూకే, యూరప్ వంటి ఎన్నో ప్రదేశాలుండగా కజకిస్థానే ఎందుకు అంటారా? అయితే ఇది చదవాల్సిందే.
వీసా లేదు గురూ..
యూఎస్ఏ, యూకే, యూరప్ వంటి దేశాలకు ఎక్కడికి వెళ్లాలన్నా వీసా కష్టాలు పడాల్సిందే. అదీగాక అక్కడి ఖర్చులకు జేబులు చిల్లులు పడాల్సిందే. కానీ కజకిస్థాన్‌కు వీసా తంటాలేమీ లేవు. భారత పాస్ పోర్టు ఉంటే చాలంతే. భారత ప్రయాణీకులకు 14 రోజుల వీసా ఫ్రీ పాలసీని కజకిస్థాన్ 2022లో ఆమోదించింది. దీని ప్రకారం.. 180 రోజులలో ఒక భారతీయుడు మూడు సార్లు 14 రోజులపాటు అక్కడ వీసా లేకుండా విహరించొచ్చు. అదీగాక ఇక్కడ ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
మూడు గంటల్లో వెళ్లొచ్చు..
దేశ రాజధాని ఢిల్లీ నుంచి కజకిస్థాన్‌లోని అతి పెద్ద నగరమైన అల్మటికి విమాన ప్రయాణం మూడు గంటలు మాత్రమే. ఇండిగో, ఎయిర్ ఆస్తానా విమానాల్లో ఢిల్లీలో ఎక్కితే ఒక హిందీ సినిమా అయిపోయేలోపు అల్మటిలో దిగొచ్చు. గతేడాది భారత్ నుంచి ట్రావెలర్లు ఎక్కువ ప్రయాణించిన దేశంగా కజకిస్థాన్ నిలిచింది. Make MyTrip నివేదించిన ‘How india Travels Abroad’ అన్న నివేదిక ప్రకారం 2023 జూన్ నుంచి 2024 మే దాకా భారతీయులు అధికంగా ప్రయాణించిన 10 దేశాల జాబితాలో కజకిస్థాన్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. 2023లో ఈ దేశానికి భారత్ నుంచి 28,300 ప్రయాణీకులు కజకిస్థాన్ అందాలను చూసేందుకు వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడాదుల్తో పోల్చితే ఇది ఏకంగా 400 శాతం అధికమట.. ఈ విషయాన్ని స్వయంగా కజకిస్థాన్ టూరిజం కమిటీ చైర్మన్ డస్టన్ రైస్పెకొవ్ వెల్లడించాడు.
Sunday, January 5, 2025
విశాఖపట్నం విమానాశ్రయంని ఎందుకు VTZ అంటారు? ఎందుకు VSKP అన్నారు?
ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాలకూ గుర్తింపు కోడ్ లను ఇచ్చే సంస్థలు రెండు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ,ICAO. ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం. వీళ్లు ప్రతి విమానాశ్రయానికీ నాలుగక్షరాల గుర్తింపు సంకేతాన్ని కేటాయిస్తారు. ఇందులో మొదటి అక్షరం ఒక దేశాన్ని గాని, కొన్ని దేశాల సమూహం ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని గానీ సూచిస్తాయి. రెండవ అక్షరం ఆ దేశం/ భౌగోళిక ప్రదేశంలోని ప్రాంతాన్ని సూచిస్తుంది. చివరి రెండక్షరాలు ఆ విమానాశ్రయం పేరునో, అది ఉన్న ఊరినో ఆధారం చేసుకొని ఉంటాయి. భారతదేశానికి VA,VE,VI,VO అన్న నాలుగు సంకేతాలు కేటాయించారు. భారత పశ్చిమ ప్రాంత విమానాశ్రయాలు (ముంబై రీజియన్) VA తోను, తూర్పుప్రాంతానివి (కోల్‌కత రీజియన్) VE తోను, ఉత్తర ప్రాంతంవి (ఢిల్లీ రీజియన్) VI తోను, దక్షిణ ప్రాంతపు విమానాశ్రయాలు (చెన్నై రీజియన్) VO అన్న అక్షరాలతోను ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు ఢిల్లీ విమాశ్రయం కోడ్ VIDP అని, విజయవాడ విమానాశ్రయం కోడ్ VOBZ అని, విశాఖపట్నం కోడ్ VOVZ అనీ ఇచ్చారు. అంతర్జాతీయ వ్యవహారాలలోను, పైలట్ల మధ్య సంభాషణలకొరకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కొరకు, ఈ ICAO వారి నాలుగక్షరాల సంకేతాన్నే వాడుతారు.
ఇక రెండవది, మనకు బాగా పరిచయమైన మూడక్షరాల సంకేతం మరో అంతర్జాతీయ సంస్థ ఐన 'ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్' (IATA) వారిది. వారు ప్రపంచంలోని ప్రతి విమానాశ్రయానికీ (కొన్నిసార్లు కొన్ని నౌకాశ్రయాలకు, రైల్వేస్టేషన్లు, బస్ స్టాండులకు కూడా) ఒక మూడక్షరాల సంకేతనామాన్ని కేటాయిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థల ఉపయోగంకోసం ఈ కోడ్ ను రూపొందించారు. మనకు జారీ చేసే విమానం టిక్కెట్లపై ఉండేది ఈ IATA వారి సంకేతమే. వీలైనంతవరకు ICAO కోడ్ లోని చివరి రెండక్షరాలను తీసుకొంటూ మరో అక్షరాన్ని కలిపి వీరి కోడ్ ను జారీ చేస్తారు. ఇది ప్రపంచంలోని మరే విమానాశ్రయంతోనూ పోలకుండా ప్రత్యేకంగా ఉండాలి గనుక, మూడక్షరాలతో చేయగలిగే పర్మ్యూటేషన్లు మరీ ఎక్కువ ఉండవు గనుక, ఏదో ఒక అక్షరం పెట్టి సరిపెట్టేస్తారు. అలా విశాఖపట్నంకు ICAO ఇచ్చిన కోడ్ లోని చివరి రెండక్షరాలైన VZ ను తీసుకొని మధ్యలో ఒక అక్షరం చొప్పించి VTZ చేసారు. అలాగే రాజమండ్రికి RJA, విజయవాడకు VGA ఇలా.
ప్రత్యేకంగా ఉండడం తప్ప ఈ కోడ్ కు IATA వారి దృష్టిలో మరే ప్రాముఖ్యం లేదు. అందుకే కొన్ని విమానాశ్రయాల పేరుకు, ఊరికి, ఆ కోడ్ కు ఏమీ సంబంధం ఉండదు. ఉదాహరణకు చండీఘడ్ విమానాశ్రయం కోడ్ IXC, బెల్గాం విమానాశ్రయం కోడ్ IXG, అమృత్ సర్ విమానాశ్రయం కోడ్ ATQ ఇలా ఉంటాయి.
THE WORLD LONGEST WALK
💥 ప్రకృతిని చూస్తూ నడవాలనుకుంటే నడవడానికి ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి,ఇది కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా) నుండి మగడాన్ (రష్యా) వరకు వ్యాపించి ఉంది.విమానాలు లేదా పడవలు అవసరం లేదు, అవసరమైనచోట వంతెనలు ఉన్నాయి.
🤩 ఇది 22,387 కిలోమీటర్ల రహదారి. దీనిద్వారా మొదటినుండి చివరివఱకు నడవడానికి 4,492 గంటల సమయం పడుతుంది. ఏకధాటిగా నడిచినచో 187 రోజులు లేదా రోజుకు 8 గంటలుచొప్పున నడిస్తే 561 రోజులు పడుతుంది దీని మార్గంలో మనం నడిస్తే 17 దేశాలను దాటుతాం,
💥 ఆరు సమయ మండలాలు (TIME ZONES). సంవత్సరంలోని అన్ని సీజన్లలోను అంటే అన్ని ఋతువులలోను నడవవలసి ఉంటుంది. ! సైక్లింగు,మోటారు సైక్లింగు కూడా చేసేయొచ్చు. తగిన అనుమతులతో...!!
Saturday, January 4, 2025
పెరుగు గారెల మాదిరిగా గారెలతో చేసుకోదగిన ఇతర వంటకాలు ఏవి?
గారెలు అంటేనే కమ్మటి వాసన గుబాళిస్తుంది.
అందుకే తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి. అంటారు.
ఇంటికి అల్లుడు వచ్చాడంటే గారెలు ,కోడి కూర సిద్ధం చేస్తారు. గోదావరి జిల్లాలలో …
నాన్ వెజ్ తినని వాళ్ళకి అల్లం పచ్చడి బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా చాలా మంది ఇష్ట పడతారు.
టమాటా, క్రోత్తిమెర పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది.
కాలిఫ్లవర్, బంగాళాదుంప మసాలా కూర కూడా బాగుంటుంది గారెలు తో.
చింతామణి చట్నీ గోదావరి జిల్లాల్లో ఫేమస్. అల్లం పచ్చిమిర్చి జీలకర్ర నూరి ,శెనగపిండి తో చేస్తారు. సాంబారు హోటల్స్ లో చట్నీ తో పాటు ఇవ్వడం మామూలే.
ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కూడా గారెలు వేసుకుంటారు. ఇవి వేసుకుంటే కొంచెం వరి పిండి కలిపితే బాగుంటాయి.
ఇక అమ్మవారి నైవేద్యం గా అల్లం జీలకర్ర రుబ్బి గారెలు తయారు చేస్తారు.
కోన సీమ లో కొబ్బరి తురుమును కలిపి గారెలు వేస్తారు.
తిరుపతి ప్రసాదం గారెలు పొట్టు మినప్పప్పు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర వేసి, బరక గా పప్పు పప్పు గా రుబ్బి, గారెలు వేస్తారు.
పాకం గారెలు…స్వీట్స్ ఇష్టం అయిన వారికి చాలా నచ్చుతాయి. బెల్లం లేత పాకం పట్టి, వేడి వేడి గారెలు వేస్తే , చక్కగా నాని తిండానికి బాగుంటాయి.
ముదురు పాకం అయితే వారం రోజులు నిలువ ఉంటాయి.
బెల్లం వండే చోట పాకం వుంటుంది. అది తెచ్చి ఫ్రిడ్జ్ లో వుంచుకుని , గారెల్లో వేసుకుని తినొచ్చు.
Thursday, January 2, 2025
కుంభమేళా అంటే ఏమిటి? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఎందుకు ఉంటుంది?
మహా కుంభమేళా మొదలుకానున్న ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజంతా పొగమంచు కురుస్తూనే ఉంటోంది.
మధ్యాహ్నమైనా సూర్యుడి జాడ కనిపించని పరిస్థితి. అయినప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో రావడం కనిపిస్తోంది. త్రివేణి సంగమాన్ని దర్శించుకుని స్నానాలు చేస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లే దారుల్లో ఆంక్షలు విధించారు పోలీసులు. త్రివేణి సంగమం ఘాట్, హనుమాన్ ఆలయ కారిడార్, సరస్వతి ఘాట్, అరైల్ ఘాట్ మార్గాల్లో ఆంక్షలు కనిపిస్తున్నాయి.
40 కోట్ల మంది వస్తారని అంచనా
కుంభమేళాకు భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 123 దేశాల నుంచి ఈసారి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. చివరిసారిగా 2013లో ఇక్కడ జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కేశవ్ ప్రసాద్ మౌర్య నెల రోజుల కిందటే ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి మీడియా సమావేశాలు పెట్టి కుంభమేళాకు భక్తులు రావాలంటూ ప్రచారం చేశారు. ''కుంభమేళా నిర్వహణకు గతంలో రూ. 4,700 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు ముందుగా అనుకున్న దాని ప్రకారం సుమారు రూ. 6,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్రం కూడా సహకారం అందిస్తోంది'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ఇప్పటికే సాధువులు కుంభమేళా ప్రాంతానికి చేరుకుని అఖాడాలలో ఉంటున్నారు.
కుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. చివరిసారిగా 2013లో జరిగిన కుంభమేళా తర్వాత 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇది ఆరేళ్లకోసారి జరిగే మేళా. ఈసారి జనవరి 13న పుష్య మాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. ఈ 45 రోజులలో ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర (షాహి) స్నానాలు చేసేందుకు లక్షలాది భక్తులు వస్తారని అంచనా. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, నాగ సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు(నెల రోజుల దీక్ష పాటించేవారు), పీఠాధిపతులు, మఠాధిపతులు దీనికి హాజరవుతారు. కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు జరుగుతుందో తెలుగు పురోహితుడు యడవెల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ బీబీసీకి వివరించారు. ఆయన గత 12ఏళ్లుగా ప్రయాగ్‌రాజ్‌లో పౌరోహిత్యం చేస్తున్నారు. నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడంపై పురాణాల్లో భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని ఆయన చెప్పారు.
''సామ, అథర్వణ వేదాలలో చెప్పిన ప్రకారం.. దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేస్తే అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని మొదట జయంతుడు అనే కాకి తన నోట కరచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అమృత కలశంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో పడ్డాయని, అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతుంటారు'' అని ప్రవీణ్ శర్మ వివరించారు. దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు రాలి నాలుగు ప్రదేశాల్లో పడ్డాయని మరో కథనం కూడా ప్రచారంలో ఉందని ఆయన చెప్పారు. మథుర నుంచి వచ్చిన పురోహితుడు ధనుంజయ్ దాస్ కూడా ఇలాంటి కథనమే వ్యవహారంలో ఉన్నట్లు చెప్పారు. అయితే, ఆయన... అమృత కలశాన్ని నోట కరచుకుని వెళ్లింది కాకి కాదు, అది గరుడపక్షి అని తెలిపారు.
12 ఏళ్లకోసారే ఎందుకు?
కుంభమేళాను 12 ఏళ్లకోసారే ఎందుకు నిర్వహిస్తారో చంద్రశేఖర ప్రవీణ్ శర్మ వివరించారు. ''మనకు రోజు అంటే 24 గంటలు. అదే దేవతలకు రోజు అంటే సంవత్సర కాలానికి సమానం. ఆ పక్షి భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగిందని పురాణాల్లో ఉంది. అందుకే 12 సంవత్సరాలకోసారి జరుపుకోవాలనేది ఆచారంగా వస్తోంది'' అన్నారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోనే కుంభమేళా జరుగుతుంది. సరస్వతి అంతర్వాహినిగా ప్రహహిస్తుందని పండితులు చెబుతున్నారు.
కుంభమేళా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడకు చేరుకోవాలంటే దాదాపు మూణ్నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి.
త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి వీలుగా 'ఫ్లోటింగ్ చేంజింగ్ రూమ్స్'ను ఏర్పాటు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ''సాధారణ భక్తులతోపాటు వీఐపీల కోసం 12 జెట్టీలపై దుస్తులు మార్చుకునే గదులు నిర్మిస్తున్నాం. భక్తులు జెట్టీలపైకి చేరుకుని మెట్ల మార్గంలో నదిలోకి దిగి స్నానాలు చేసి పైకి వచ్చి దుస్తులు మార్చుకోవచ్చు'' అని వీటిని నిర్మిస్తున్న దాస్ అండ్ కుమార్ కంపెనీ భాగస్వామి యశ్ అగర్వాల్ బీబీసీకి చెప్పారు. ఇవి కాకుండా సంగమం ఒడ్డున తాత్కాలికంగా దుస్తులు మార్చుకునే గదులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటికీ కుంభమేళా ప్రాంతంలో నదిలో చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోంది. గత కుంభమేళాకు 22 ఫ్లోటింగ్ బ్రిడ్జిలు నిర్మించగా.. ఈసారి 30 వంతెనలు నిర్మిస్తున్నారు. ఇందుకు 3,308 పాంటూన్లు వినియోగిస్తున్నట్లు మేళా అధికారులు చెబుతున్నారు. వీటిపై మనుషులు కాలినడకన వెళ్లడమే కాకుండా 5 టన్నుల బరువున్న వాహనాలు కూడా ప్రయాణించే వీలుంది. వాహనాలు ఇసుకలో కూరుకుపోకుండా 2.69 లక్షల ఇనుప చట్రాలు, మొత్తం 488 కిలోమీటర్ల మేర దారులు నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇందులో కొన్ని దారులను నదీగర్భంలోనే చదును చేసి వేశారు. వాహనాలు కూరుకుపోకుండా ఉండేందుకు 2,69,000 ఐరన్ షీట్ల (చెకర్డ్ ప్లేట్లు)ను దారుల పొడవునా పరిచారు. నదిలో భూమిని చదును చేసి ఇసుక బస్తాలు వేసే పనులు జరుగుతున్నాయి. జేసీబీలు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తూ మట్టిని ఎత్తి పోస్తూ చదును చేస్తున్నాయి.
టెంట్ సిటీలో టెంట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.
కుంభమేళా కోసం త్రివేణి సంగమం చుట్టుపక్కల 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మేళా అధికారులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ప్రకారమే భూ కేటాయింపులు చేశామని కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు. ''నాలుగు వేల హెక్టార్ల భూమిని చదును చేసి.. అఖాడాలు, దండివాడ, అచారవాడ, శంకరాచార్య, మహామండలేశ్వర్లతోపాటు వివిధ సంస్థలకు ఉచితంగా కేటాయించాం. అక్కడ ప్రభుత్వం తరఫున టెంట్లు, నీటి కనెక్షన్, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించాం'' అని చెప్పారాయన. 1850 హెక్టార్లలో పార్కింగ్ వసతి కల్పించినట్లుగా వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు.
టెంటులో ఉండాలంటే రోజుకు రూ.1.10 లక్షలు
2019లో జరిగిన అర్ధ కుంభమేళా కోసం 80 వేల టెంట్లు వేయగా.. ఈసారి 1.60 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. టెంట్ సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు వీలుగా తాత్కాలిక టెంట్లు నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్సీటీసీ సహా 11 ప్రైవేటు సంస్థలు టెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. డార్మిటరీ, డబుల్ బెడ్ రూం విల్లా, సింగిల్ బెడ్ రూం, మహారాజా కాటేజీ తదితర పేర్లతో బుకింగ్‌కు అవకాశం కల్పిస్తోంది టూరిజం శాఖ. వీటిల్లో బెడ్, అటాచ్డ్ బాత్ రూం, సోఫా లేదా కుర్చీ, భోజన వసతి కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అఖాడాల వద్ద ఏర్పాటు చేస్తున్న టెంట్లలో కొన్ని సంప్రదాయ పద్ధతిలో గడ్డితో నిర్మిస్తున్నారు. ఇక్కడ రోజుకు రూ.1,500 నుంచి మొదలుకుని రూ.1.10 లక్షల వరకు అద్దెతో టెంట్లు అందుబాటులో ఉన్నాయి. డోమ్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో రోజుకు రూ.1.10 లక్షల అద్దె చెల్లించి ఉండే టెంట్లు నిర్మిస్తున్నారు.
గంగా నదిలో స్వచ్ఛత కష్టమే!
కుంభమేళా ప్రారంభానికి ముందుగానే యమున, గంగా నదిలో చెత్త, వ్యర్థాలు కనిపిస్తున్నాయి. భక్తులు పారవేసిన పూలు, ఇతర పూజా వ్యర్థాలు త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదిలో కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నది వద్ద ఉంటూ శుభ్ర పరుస్తూ కనిపించారు. చెత్తాచెదారం నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివేక్ చతుర్వేది చెప్పారు. నది స్వచ్ఛతకు సంబంధించి ఎన్జీటీ సూచనలకు తగ్గట్టుగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్య మెరుగుదలకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు.
''ఈసారి కుంభమేళాను దివ్య-భవ్య-డిజిటల్ కుంభమేళాగా చెబుతున్నాం. 1.50 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణతో పాటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటాం. 11 భాషల్లో అందుబాటులో ఉండే చాట్ బాట్ అందుబాటులోకి తీసుకువస్తున్నాం'' అని మౌర్య వివరించారు.
అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా
కుంభమేళా బందోబస్తులో 50 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారని కుంభమేళా అదనపు అధికారి వివేక్ చతుర్వేది బీబీసీకి చెప్పారు. ''2700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉన్నాయి. వీటితో భక్తుల కదలికలు, మేళా ప్రదేశాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం'' అని చెప్పారు. వంద మీటర్ల లోతుకు వెళ్లగల అండర్ వాటర్ డ్రోన్లతోనూ నిఘా పెట్టినట్లుగా మేళా అధికారులు చెబుతున్నారు. పాంటూన్ బ్రిడ్జిల వద్ద పోలీసుల గస్తీ ఎక్కువగా ఉంది. ఇవన్నీ వన్-వే వంతెనలు కావడంతో పోలీసులు ఒకవైపు నుంచే వాహనదారులను అనుమతిస్తున్నారు.
గత ఏడాది కాలంలో సంగమానికి వెళ్లేదారిలో రోడ్లు వెడల్పు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రహదారులు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుంభమేళా సమయంలో సమస్య మరింత పెరగవచ్చని ప్రయాగ్‌రాజ్ వాసులు చెబుతున్నారు. ''మొత్తం 5 నుంచి 6 వేల ప్రజా రవాణా బస్సులు ఉంటాయి. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మొత్తం 67 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నాం'' అని వివేక్ చతుర్వేది చెప్పారు.
మువావుండలు (ధనుమువా)
ఉత్తరాంధ్రలో శీతాకాలంలో ప్రత్యేకంగా అమ్మే ఒడిశా తీపి వంటకం ధనుమువా (తెలుగులో మువావుండలు అంటారు). ఒడియా భాషలో ధను అంటే ధాన్యం, మువా అంటే పేలాలు.
ఈ తీపివంటకాన్ని ముదుర పంచదార పాకంలో, కొత్త ధాన్యపు పేలాలలను, మిరియాల పొడిని వేసి గట్టిగా చెక్కీల రూపంలో తయారుచేస్తారు. ఆ చెక్కీలకు తీపిపాకంలో ముంచి తీసిన పలుచని కొబ్బరి ముక్కలను, జీడిపప్పును అద్దుతారు. ఈ వంటకం తినడానికి చాలా రుచిగా వుంటుంది. గట్టిగా రాయిలా వుండే ఈ వంటకాన్ని కత్తి లేదా గట్టి ఇనుప వస్తువుతో పగులగొట్టి తినాలి.
దక్షిణ ఒడిశాలో బరంపురం పట్టణం ఈ వంటకానికి ప్రసిద్ధి.
Monday, December 30, 2024
హైదరాబాద్ లోని ప్రాంతాలు. వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి?
A1.* ♨️ బేగం పేట.
6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం ను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..
కూతురికి కట్నం కింద ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదగా బేగంపేట అని పేరు వచ్చింది.
B2. *♨️చార్మినార్*
కులికుతుబ్ షా కట్టిన ఈ కట్టడానికి ప్రధాన ఆకర్షణ నాలుగు స్థంబాలు….
ఉర్దూలో చార్ అంటే నాలుగు, మినార్ అంటే స్థంబాలు… వీటి పేరు మీదుగానే చార్ మినార్ అనే పేరు వచ్చింది!
H3. *♨️సికింద్రాబాద్*
మూడో నిజాం సికిందర్ ఝా పేరు మీద ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది . అంతకుముందు సికింద్రాబాద్ ని లష్కర్ అని పిలిచే వారు.
I4.*♨️ఖైరతాబాద్*
ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగానికి ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది
N5. *♨️శంషాబాద్*
షమ్స్-ఉల్-ఉమ్రా అనే పేరు మీద శంషాబాద్ అనే పేరు వచ్చింది. షమ్స్ అంటే సూర్యుడు.
దీని అర్థం ప్రభువుల యందు సూర్యుడిలాంటి వాడని….
ఈ బిరుదు నవాబ్ మొయిన్-ఉద్-దౌలా బహదూర్ కు కలదు.!
A6. *♨️నాంపల్లి*
నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్ అనే దివాన్‌కు నెఖ్ నామ్ ఖాన్ అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది నాంపల్లిగా మారిపోయింది.
V7. *♨️హిమయత్ నగర్*
1933 లో ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్ యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ ఆసఫ్ జా పేరు మీద ఆ స్థలానికి హిమాయత్ నగర్ అని పేరు వచ్చింది.
A8. *♨️అబిడ్స్*
ఆరో నిజాం కాలంలో అల్బర్ట్ అబిద్ అనే ఒక ఆర్మేనియా యూదువ్యాపారి ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. తర్వాత కొంతకాలానికి ఆల్బర్డ్ అబిడ్ ఇంగ్లాండ్ కి వెళ్లిపోయినప్పటికీ ఆ స్థలానికి ఆ పేరే స్థిరపడిపోయింది!కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా అబిడ్స్ గా మారిపోయింది.
S9. *♨️సోమాజిగూడ*
నిజాం కాలంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారైన సోనాజీకి కొన్ని భూములుండేవి .
సోనాజీ కాస్త సోమాజి అయింది. గూడ అంటే చిన్న గూడెం లేదా ప్రాంతం అని అర్ధం. రెండు కలిపి సోమాజిగూడ అయ్యింది!
A10 . *♨️మాసబ్ ట్యాంక్*
6వ కుతుబ్ షాహ్ భార్య హయత్ భక్షిభేగంను మాసాహెబా అని పిలిచేవారు. మాసాహెబా పల్లె భూములకు సాగునీరు ఇవ్వడానికి ఒక ట్యాంక్ నిర్మించింది .
ఆ ట్యాంక్ పేరు మాసాహెబా తలాబ్ అని పిలిచేవారు . చివరకు ఆ పేరు మాసబ్ ట్యాంక్ అయింది .
N11. *♨️హైదరాబాద్*
కులీకుతుబ్ షా భార్య భాగమతి వివాహం తర్వాత తన పేరుని హైదర్ మహల్ గా మార్చుకున్నారు. హైదర్ మహల్ అంటే హైద్రా నగరం అని అర్ధం తర్వాత ఆ పేరు మీద హైదరాబాద్ గా మారింది .
T12 .*♨️మలక్ పేట్*
గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్ షా యొక్క సేవకుడు మాలిక్ యాకుబ్ పేరు మీదగా ఈ ప్రదేశానికి మలక్ పేట్ అనే పేరు వచ్చింది.
H13 . *♨️బషీర్ బాగ్*
బసిరుద్దౌలాకు హైద్రాబాద్ లో ఒక ప్యాలెస్ ఉండేది .
ఆ ప్యాలెస్ దగ్గర పెద్ద గార్డెన్ ఉండేది . బసిరుద్దౌలా పేరు మీద ఆ ప్రదేశానికి బషీర్ బాగ్ అనే పేరు వచ్చింది. బాగ్ అంటే గార్డెన్ అని అర్ధం .
O14. *♨️ఫలక్ నుమా:*
ఫలక్ అంటే ఆకాశం , నామ అంటే అద్దం . ఈ ప్రదేశం అంతా కొండలతో ఎంతో ఎత్తుగా ఉండేది . కాబట్టి ఆకాశానికి అద్దం అనే అర్థం వచ్చేలా ఫలక్ నామ అని పేరు పెట్టారు . ఫలక్ నామ కాస్త ఫలక్ నుమా అయ్యింది!
S15 . *♨️సరూర్ నగర్*
రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం సరూర్ నగర్ అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.
H16.*♨️లంగర్ హౌజ్:*
గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ ఖానా కాలక్రమేణా లంగర్ హౌజ్ మారింది.
గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.
K17.*♨️చెంచల్ గూడ:*
చిచ్లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో చెంచల్ గూడగా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.
U18.*♨️కార్వాన్:*
ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు కార్వాన్ అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.
M19.*♨️కవాడిగూడ:*
ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా కవాడిగూడగా మారింది.
A20.*♨️దోమలగూడ:*
దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది దోమలగూడగా మారింది.
R21. *♨️బేగం బజారు:*
హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో బేగం బజారుగా నిలిచిపోయింది.
K22. *♨️అఫ్జల్ గంజ్:*
ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది
S23.*♨️హైదర్ గూడ:*
మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గూడ ఏర్పడింది.
K24.*♨️తార్నాక:*
తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె..
నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది తార్నాకగా మారింది.
25.*♨️శాలిబండ:*
శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ నివసించేవాడు.
ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు.. కాలక్రమంలో అది శాలిబండగా మారింది
26.*♨️హబ్సిగూడ:*
నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను పిలుస్తున్నారు.
27.*♨️మదీనా:*
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది.
28.*♨️చిక్కడపల్లి:*
చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో చిక్కడపల్లిగా మారిపోయింది.
29.*♨️నౌబత్ పహాడ్:*
నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది.
30.*♨️బాగ్‌లింగంపల్లి:*
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను బాగ్‌లింగంపల్లి అంటున్నారు.
31.*♨️అడిక్‌మెట్:*
అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో అడిక్ మెట్ గా మారిపోయింది.
32.*♨️మీరాలంమండి:*
సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ మీరాలంమండి మార్కెట్ ఫేమస్!
౩౩.*♨️బార్కాస్:*
నిజాం సైన్యంలో అరేబియన్ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు బార్కాస్అని పిలుస్తున్నారు.
34.*♨️తాడబండ్:*
తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో తాడ్ బండ్‌గా మారిపోయింది.
35.*♨️ఎర్రమంజిల్:*
ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం ఎర్రమంజిల్ గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్ గా వాడేవారు.
36.*♨️కాచిగూడ:*
కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి కాచిగూడ అనే పేరొచ్చింది.
37.*♨️లాడ్ బజార్:*
మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన లాడ్ బజార్ లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.
38.*♨️ముషీరాబాద్:*
హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం ముషీరాబాద్ గా స్థిరపడిపోయింది.
39.*♨️ఫతే మైదాన్:*
ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు.
ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ ఎల్బీ స్టేడియం నిర్మించారు.
40.*♨️పబ్లిక్ గార్డెన్స్:*
పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడు బాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు.. బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా పబ్లిక్ గార్డెన్
41.*♨️చాదర్ ఘాట్:*
మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు చాదర్ ఘాట్ అని పేరొచ్చింది.
42.*♨️ఆస్మాన్ గఢ్:*
1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్ పేరు మీద ఆస్మాన్ గఢ్ ఏర్పడింది.
43.*♨️ఉమ్దా బజార్:*
నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద ఉమ్దా బజార్ ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్‌గా ప్రసిద్ధిగాంచింది.
44.*♨️గౌలిగూడ:*
గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం గౌలిగూడగా స్థిరపడిపోయింది.
45,*♨️లల్లాగూడ:*
రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం మౌలాలీ సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో లాలాగూడగా మారింది.
46.*♨️సుల్తాన్ బజార్:*
1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక,
ఆ ఏరియాని సుల్తాన్ బజార్ అని మార్చేశారు.
47.*♨️రికాబ్ గంజ్:*
రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో రికాబ్ గంజ్‌గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.
48.*♨️డబిర్ పురా:*
నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ డబిర్ పురాలో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.
49.*♨️అంబర్ పేట:*
అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది అంబర్ పేటగా స్థిరపడిపోయింది.
50.*♨️చాంద్రాయణగుట్ట:*
చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది చాంద్రాయణగుట్టగా మారిపోయింది.
51.*♨️చిలకలగూడ:*
చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిలకలగూడకు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!
52.*♨️మంగళ్ హాట్:*
మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో మంగళ్‌హాట్‌గా మారిపోయింది.
53. *♨️సైదాబాద్:*
1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరు మీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత సైదాబాద్ అని పిలుస్తున్నారు.
54.*♨️టప్పాచబుత్ర:*
టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని టప్పాచబుత్ర అని పిలుస్తున్నారు.
55.*♨️తుకారాం గేట్:*
లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు.
ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం తుకారాంగేట్ గా మారిపోయింది.
56,*♨️యాఖుత్ పురా:*
హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు యాఖుత్ పురా అని నవాబే నామకరణం చేశాడు...
Sunday, December 29, 2024
దేశంలోని కొన్ని ప్రాంతాల స్వీట్లు sweets
పంజాబ్ : కడా ప్రసాద్
రాజస్థాన్ : ఘేవర్
గుజరాత్ : సుతర్ ఫేనీ
మహారాష్ట్ర : శ్రీఖండ్
గోవా : బెబింకా
కర్నాటక : హాల్బాయి
కేరళ : అడప్రథమన్
తమిళనాడు : తిరునెల్వేలి హల్వా
ఆంధ్ర : మనందరికీ చాలానే తెలిసుంటాయిగా
ఒడిశా : ఛేనా ఫోడ
ఝార్ఖండ్ : గుర్ వాలీ రస్‌గుల్ల
బీహార్ : మాల్ పువా
ఉత్తర్ ప్రదేశ్ : షాహీ టుక్డా
మధ్య ప్రదేశ్ : గుజియా
వీటిలో ఒకటి రెండు మినహాయించి దాదాపు అన్నీ రుచి చూశాను. మరి మీరేమేమి రుచి చూశారో కూడా కమెంట్స డబ్బాలో రాయండి. :)
Saturday, December 28, 2024
ఒక సెకెండ్ హ్యాండ్ ఫ్లాట్ (Flat) కొనేటప్పుడు, మనం పరిశీలించుకోవాల్సిన, తెలుసుకోవలసిన విషయాలు
- మొదటిగా మీకు ఫ్లాట్ అమ్ముతున్న యజమాని యొక్క దస్తావేజులు అలాగే 13 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించాలి( గడచిన 13 సంవత్సరాల లో అమ్మిన వారు, కొన్న వారి పేర్లు సరిపోయాయా లేదా, మొత్తం ఆస్తి విస్తీర్ణం, అవిభాజ్య విస్తీర్ణం సరిపోయా లేదా, మొదటి నుండి చివరి డాక్యుమెంట్స్ లో సర్వే నంబర్స్ ఒకటే ఉందా లేదా, మొత్తం స్థలం హద్దులు, ఫ్లాట్ హద్దులు సరిపోయాయ లేదా అలాగే క్రయధనం పూర్తి గా అమ్ముతున్నవారికి పూర్తి గా ముట్టినట్టు ధృవీకరించారా లేదా, ఆస్తి స్వాధీన పరుస్తున్నట్టు వ్రాసారా లేదా చూసుకోండి).
- మీ అమ్మకం దారు దస్తావేజు ఒరిజినల్ చుపించమనండి. దాని నకలు రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి పొందండి. ఒరిజినల్, నకలు పోల్చి సరిచూసుకోండి.
- ఆస్తి పన్ను కరెంట్ బిల్ అమ్ముతున్న వారి పేరు మీద ఉన్నాడా లేదా చూసుకోండి.
- బిల్డింగ్ ప్లాన్ ప్రకారం కట్టరా లేదా ఒక వేళ అతిక్రమించి కడితే దానిని BPS లో రెగ్యులర్జేషన్ జరిగిందా లేదా, అకుపేషన్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా
- ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ లో ఆ ఆస్తి గురించి వాకబు చెయ్యండి. అలాగే అసోసియేషన్ కి అమ్ముతున్న ఆయన పేరు అసోసియేషన్ కి ఏటువంటి బాకీలు లేవు అని ఒక నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోండి.
- కార్ పార్కింగ్ గురించి మీ దస్తావేజు లో వ్రాస్తే క్లియర్ పార్కింగ్ లాట్ లో ఫ్లాట్ నంబర్ వ్రాసారో లేదో చూసుకోండి.
- కోన బోయే ఆస్తి మీద ఏమి లోన్లు లేవు అని నిర్ధారించుకోండి. దాని కోసం ఒక EC తీసుకోండి.
- మీకు అమ్మకానికి పెట్టిన ఆస్తి వేరే వాళ్లకు అమ్మకని పెట్టి, వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని మళ్లీ మీకు అమ్మకానికి పెట్టలేదు అని నిర్ధారించుకోండి.
- దీనికి బాగా అమ్మకం గలిగిన న్యూస్ పేపర్ లో ఒక ప్రకటన ఇవ్వండి. ఫలానా ఆస్తి ఫలానా వారి వద్ద నుండి కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పమని ఒక న్యాయవాది ద్వారా ప్రకటన ఇప్పించండి.ఇలాగా మీరు వ్రాసుకొని క్రయ అగ్రిమెంట్ లో డిఫాల్ట్ క్లాజ్ వ్రాసుకోండి. (పేపర్ ప్రకటన ఇస్తామని, ఎవరి దగ్గరనుండి అభ్యంతరాలు రాక పోతే రిజిస్ట్రేషన్ కి వెడతాము అని ఒక వేళ ఎవరి వైపు నుండి అయిన అభ్యంతరం వస్తె ఆ అగ్రిమెంట్ రద్దు అవుతుంది అని అలాగే మీరు అడ్వాన్స్ ఇచ్చిన రొక్ఖం వడ్డీ తో సహా వెనక్కి ఇవ్వాలి అని).
- అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్ లో యే ఆస్తి కొనుగోలు చెయ్యాలి అనుకున్నారో ఆ ఆస్తి ఉన్న భూమిమీద ఏటువంటి లాండ్ అక్వి జే సున్ లేవు అని నిర్ధారించుకోండి.
- కొనబోయే ఆస్తి మైనర్ పేరుమీదుగా లేకుండా చూసుకోండి.
చెన్నా పొడ (Chenna Poda) & పొడాపిఠా (Poda Pitha)
ఒకేలా కంటికి కనబడే రెండు ప్రత్యేకమైన ఒడిశా మిఠాయిలు ఇవి. చూడటానికి మన దిబ్బ రొట్టెలు లా కనబడతాయి, కాని తియ్యగా వుంటాయి.
చెన్నాపొడ(Chenna Poda):
దీనర్థం "కాల్చినజున్ను" అని. పొడ అంటే కాల్చడం అని, చెన్న అంటే జున్ను అని అర్థం.
(ఇక్కడ జున్ను అంటే ఈనిన పశువుల పాలతో చేసినది కాదు, నిత్యం వాడే పాలను విరుగగొట్టి చేసినది)
ఇది పూర్తిగా ఒడియా మిఠాయి పేరైనప్పటికీ శ్రీకాకుళం ప్రాంతంలో తెలుగులో ప్రత్యేకమైన పేరు లేకపోవడం వలన తెలుగు వారు ఇదే పదాన్ని వాడతారు. ఇక ఈ మిఠాయిని నిత్యం వాడే చిక్కని ఆవు/గేదె పాలను విరుగగొట్టి తీసిన జున్నుకు పంచదార, యాలకులు, కొంచెం రవ్వను జోడించి ముద్దను చేసి మనం దిబ్బ రొట్టెను కాల్చినట్టు కొంచెం తక్కువ సెగతో కాల్చి తయారు చేస్తారు. అలాకాల్చాడం వలన పంచదార, పాలపదార్ధం సమ్మేళనంతో కొద్దిపాటి ద్రవం తయారయ్యి ఈ మిఠాయికి అద్భుతమైన రుచి తెస్తుంది. ముక్కలుగా గాని, ఏక మొత్తంగా గాని ఈ మిఠాయిని అమ్ముతారు.
పొడాపిఠా (Poda Pitha) :
దీనర్థం "కాల్చిన పిండివంటకం" అని. ఒడియాలో పిఠా అంటే పిండివంటకం.
రూపంలో తయారీలో, కాల్చడంలో చెన్నాపొడాకు దీనికి తేడా కనబడదు. విరిగిన పాలజున్నులో వరి పిండి, మినపపిండి అదనంగా కలపడం మూలాన కొంచెం గట్టిగా వుంటుంది. రుచిలో తేడా వుంటుంది.
ఈ చిత్రంలో ఈ రెండూ వున్నాయి. రూపంలో తేడా వుండదు కాబట్టి నిశితంగా గమనించాలి. ఒడిశా వెళ్లేవారు వీటి రుచి చూడాల్సిందే.
కుంభమేళా ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? అంత ప్రాముఖ్యం పొందడానికి గల కారణాలు ఏమిటి?
ఇది పన్నెండు యేళ్ళకి ఒకసారి ఒక చక్ర భ్రమణం లాగా జరిగే ఉత్సవం.నాలుగు ప్రదేశాల్లో అంటే గంగా-యమునా-సరస్వతి సంగమం అయిన అలహాబాదు లేక ప్రయాగరాజ్ వద్ద ఇంకా,హరిద్వార్ లో,నాశిక్ లో,ఉజ్జయని లో దఫాల వారీగా ఇది జరుగుతుంది. ఆ కాలంలో నదీ స్నానం తో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలుకూడా జరుగుతూ ఉంటాయి.ఈ పద్ధతి ని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారని నానుడి.అయితే ఇంతకు ముందు అంటే రమారమి 18వ శతాబ్దం ముందుదాకా “మాఘ మేళ” అనె పేరు తో ఉండేదని తర్వాత అదే ఇలా కుంభ మేళ గా మారిందని కూడా అంటారు.
(న్యూస్18 వారి చిత్రం)
కుంభమేళ జరిపే సమయాన్ని బృహస్పతి లేదా గురు నక్షత్ర గమనం పై ఆధార పడి లెక్కిస్తారు .పురాణాల పరంగా సముద్ర మధనం లో వచ్చిన అమృతం, కుండలోనుంచి ఇలా నది లో పడిందని అంటారు."ఋగ్వేదం" లో,బౌద్ధ గ్రంధం "మజ్జిమ నికాయ" లో ఇలాంటి నదీ స్నాన ఉత్సవం గురించిన వివరణ ఉందట.
ఇక దీన్లో కొన్ని తేడాలున్నాయి.అవేంటంటే ..
పూర్ణ కుంభ మేళ : 12 యేళ్ళు గడిచాకా వచ్చేది.
అర్ధ కుంభ మేళ :6 యేళ్లకు జరిగేది.అంటే రెండు ప్రయాగ,హరిద్వార్ పూర్ణకుంభమేళా లకు మధ్య వచ్చేది .
మహా కుంభ మేళ :12x12 =144 యేళ్లకు జరిగేది.
ఇవిగాక ప్రతి చోటా లోకల్ గా కొన్ని స్నాన ఉత్సవాలు కూడా ఉన్నాయి.కురుక్షేత్ర,సోనేపట్ ,మన తమిళనాట కుంభకోణం లో “మహా మాఘ” ఉత్సవం.తిరుచానూర్ లో పద్మావతి అమ్మవారి కి జరిగే “పంచమి తీర్థం” ,ఇలాంటివి కూడా లక్షల్లో జనాలు హాజరు అయ్యే ఉత్సవాలే.
బృహస్పతి గ్రహం పై ఒక రోజుకి 10 గంటలే.అంటే తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే సమయం అన్నమాట.ఇక సూర్యుని చుట్టూ తిరిగేందుకు సుమారు 12 సంవత్సరాలు పడుతుంది (అంటే మన భూమి లెక్కలో )ఇది రమారమి గా చూస్తే 11.8618 భూమి సంవత్సరాలు అయితే కాలెండర్ సవరణలను(అధిక మాసాలు) కలిపితే పన్నెండు అనుకోవచ్చు.అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఒక కుంభ మేళ అనేది ఇలా నిర్ణయం చేశారన్న మాట.ఇక వీటిలో తేడాలు చూస్తే హరిద్వార్ కుంభ మేళ సమయంలో గురువు కుంభ రాశి ,సూర్యుడు మేషరాశి లో ఉండాలి.ప్రయాగ లో జరిగేటప్పుడు గురువు మేషం,సూర్య చంద్రులిరువురు మకరం లేదా గురువు వృషభం,సూర్యుడు మకరం లో ఉండాలి.ఇలా గ్రహ స్థితి ఉన్నప్పుడే కుంభమేళా లగ్నం నిర్ణయం అవుతుంది.నాసిక్ ,ఉజ్జయిని లలో ఒకే సంవత్సరం లో కుంభమేళా జరుగుతుంది.1986 లో హరిద్వార్ లో కుంభ మేళ జరిగితే మరలా 1998 లో ఆపైన 2010 ,2021 లో జరిగినవి.అలాగే ప్రయాగ లో 1989,2001,2013 లో జరిగినవి.సరిగా వీటి మధ్యలో అర్ధ కుంభ మేళాలు జరిగాయి.
(ట్రిప్ సావి వారి చిత్రం)
ఇక్కడ స్నానం జరిగే తిధులలో కూడా ఒక క్రమం ఉంటుంది.అమావాస్య స్నానం కు ప్రత్యేకత ఉంటుంది.అందులోకి షాహీ స్నాన్/రాజయోగి స్నాన్ ప్రాధాన్యత ఎక్కువ.అప్పుడే నాగా సాదువులు దిగంబరంగా పెద్ద ఊరేగింపుగా స్నానానికి వస్తారు.
వచ్చే కుంభమేళా ప్రయాగ లో 2025 లో జరగబోతుంది.
ఇక ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మత సంబంధమైన ఉత్సవం గనక. విశ్వాసాలు,ఆచారాలు,సంప్రదాయాలు మనలో గాట్టిగా పెనవేసుకు పోయాయి గనక.కొందరికి భక్తి ,కొందరికి ఇలాంటి ఉత్సవాలంటే అనురక్తి,ఇంకొంతమందికి భయం, వెరసి అదో పెద్దసంబరం.ఎవరి కారణం వారికి ఇంపు.
(సేకరణ)
Thursday, December 26, 2024
క్యూఆర్ కోడ్ ఎవరు, ఎలా కనిపెట్టారు?
మనకు బజారు లో దొరికే ఆన్నివ్యాపార వస్తువుల పైన రెండు రకాల కోడ్ లు కనిపిస్తాయి. మొదటిది బార్ కోడ్. ఒక యంత్రం చదవగల కోడ్ ఇది. దీన్ని ఏకమితీయ కోడ్ గా భావిస్తారు (1D – వన్ డైమెన్షనల్) .వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సమాంతర నలుపు తెలుపు గీతల సమాహారమే ఈ కోడ్. వీటిని కామన్ ప్రోడక్ట్ కోడ్ అని అంటారు. ఇందులో కొన్ని సంఖ్యలు,అక్షరాలూ అలాగే నలుపు తెలుపు గీతాల మధ్య మారే దూరం వల్ల ఈ కోడ్ రూపొందుతుంది. అది ఇలా ఉంటుంది….
ఇక రెండోది మీరడిగిన QR కోడ్.ఇందులో QR అంటే క్విక్ రెస్పాన్స్ (Quick Response) అంటే శీఘ్ర ప్రతిస్పందన సంకేతం అందామా. కాబట్టి ఈ శీ.ప్ర .సం. గురించి కొంచెం తెలుసుకుందాం.
1994 లో టొయోట కార్ల ఫేక్టరీ కి అనుబంధ సంస్థ అయిన “డెన్సోవేవ్ “(Denso wave ) కి ఒక క్లిష్టమైన పని అప్పచెప్పారు. అదేమిటంటే వాహనాల తయారీ స్వయంచాలిత తయారీ వ్యవస్థలో ఉన్న వాహనాల,విడిభాగాల ను ఆచూకీ తీసే సులభ పద్దతి ,త్వరిత విధానం కనుక్కోవడం. ఇలా మొదలైన ఈ శీ.ప్ర .సం. ఇప్పుడు వెబ్ సైట్ లలోకి వెళ్లేందుకు దారి చూపేలా, మొబైలు ద్వారా చెల్లింపులు ,ఇంకా విమాన,రైలు,బస్సు ప్రయాణ టికట్ లకూ ,ఇక వినియోగ దారుల వస్తువులు అన్నిటి పైనా తప్పనిదై పోయింది. 2000 సం. లో జపాన్ లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చి, 2002 కి ప్రపంచం అంతా పాకేసింది. డెన్సోవేవ్ కి హక్కులు ఉన్నప్పటికీ ఇది అందరికీ ఉచితం గానే ( కొన్ని షరతులకు లోబడి) అందుబాటులో ఉంది. దీన్ని వాడటం చాలా సులభం . మన మొబైలు కున్న స్కాన్ చేసే ఆప్ తో దీన్ని కేమేరా ద్వారా స్కాన్ చేస్తే, అది మనకు కావలసిన చోటికి ,తీసుకుని వెళ్లడమో లేదా, అప్పగించిన పని ఏదైనా చేసిపెడుతుంది. ఇంతేనా, వాట్స్ అప్ మన కంప్యుటర్ లో చూడాలంటే ఇలాంటి కోడ్ మనం వాడాల్సిందే.
ఇంతకీ ఏముంటాయి ఇందులో. 21 x 21 మాడ్యుల్స్ తో మొదలైన, ఈ శీ.ప్ర .సం ఇప్పుడు 177 x 177 మాడ్యుల్స్ దాకా పెరిగింది. మొదట్లో నాలుగు గుర్తుల సమాచారం ఇప్పుడు 4296 సంఖ్య వరకు ఎదిగింది (characters of ASCII).
ప్రధానంగా నలుపు తెలుపు చదరాల తో ఉండే ఈ శీ.ప్ర .సం, ని ద్విమితీయ కోడ్ (2D) గా వర్గీకరిస్తారు.
ప్రధానంగా దీనిలో నాలుగు భాగాలు ఉంటాయి.
1.స్థాన చిహ్నం : (position marking)
కోడ్ ఏ దిశలో చదవాలి అనేది ఈ చిహ్నం నిర్ణయిస్తుంది.పైన చిత్రం లో నారింజ రంగు చదరాలు మూదిటిని కలిపి ఒక కోణం ని ఏర్పరుచుకుని ఈ పని స్కేనర్ చేస్తుంది.
2.అమరిక చిహ్నం :(alignment marking)
మొబైల్ కెమరా ఏ కోణం నుండి స్కాన్ చేసినా అది సవ్య దిశలో చూపేలా ఈ చిహ్నం తోడ్పడుతుంది.
3.టైమింగ్ ఆకృతి :(timing pattern )
నిక్షిప్తమైన సమాచారమాతృక (data matrix) ని తప్పులు లేకుండా అంచనా వేయడానికి సహకరిస్తుంది.
4. నిశ్చల మండలం: (quiet zone)
ఇదొక రకంగా శీ.ప్ర .సంకేతానికి గుండెకాయ వంటిది. కోడ్ ఉన్న ప్రాంతం,లేని ప్రాంతం నడుమ సరిహద్దు లాంటిది ఈ ప్రదేశం.
మళ్ళీ ఇందులో క్రియాశీల ,నిష్క్రియా శీల అని ,రెండురకాల కోడ్ లు ఉన్నాయండి. మొదటి దానిలో, ఒకసారి చేసిన దానిలో మార్పులు ఎప్పుడైనా చేసుకుంటూ ఉండవచ్చు. అదే రెండో దానిలో ఒక సారి చేసి వేస్తె ,ఇక మార్చలేము.
ఉపయోగాలు: ఇవి బోలెడు అందులో కొన్ని మాత్రమె రాయగలం.ఎందుకంటే ఇది సర్వత్రా వ్యాపించిన విరాట్ స్వరూపం అయ్యి కూర్చొంది మరి.
లగేజ్ టేగులు,అడ్రెస్సులు,మొబైల్ చెల్లింపులు,హోటల్ లో వైఫై షేరింగ్ ,ఫోన్ నం .,ఈమెయిలు, ప్రత్యెక వెబ్సైట్ లు, సరుకుల వివరాలు,అడ్వర్టైజ్మెంట్లు,వస్తువు టో పాటు అమ్మే షావు వివరాలు...ఇలా ఎన్నో ఉన్నాయండి.
**నెట్ చిత్రాలు వాడటం జరిగింది **
(సేకరణ)
ధనుష్కోటి దేశంలోనే అత్యంత భయంకరమైన గ్రామంగా ఎందుకు పరిగణించబడుతుంది?
ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది.
రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా దనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే.. హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. . ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా.. ఈ ప్రాంతం మునిగిపోతుంది.
శ్రీలంకకు 18 మైళ్ల దూరంలోనే: ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సారి రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ చిట్టచివరి గ్రామాన్ని సందర్శించండి (సేకరణ)
ఇంట్లో హార్ట్ బ్లాకేజీని ఎలా తనిఖీ చేయాలి: కొన్ని సులభమైన పరీక్షల సహాయంతో..
ఇంట్లో హార్ట్ బ్లాకేజీని ఎలా తనిఖీ చేయాలి: కొన్ని సులభమైన పరీక్షల సహాయంతో, మీరు ఇంట్లోనే గుండె అడ్డంకిని సులభంగా గుర్తించవచ్చు. రండి, దాని గురించి వివరంగా తెలుసుకుందాం .
ఇంట్లోనే హార్ట్ బ్లాక్‌కు చెక్ పెట్టడం ఎలా: ఈ రోజుల్లో, తప్పుడు ఆహారపు అలవాట్లు మరియు సరైన జీవనశైలి కారణంగా, ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హార్ట్ బ్లాక్ సమస్య కూడా ఈ వ్యాధులలో ఉంది. గుండె పై గదుల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలు గుండె కింది గదులకు సరిగ్గా వెళ్లనప్పుడు హార్ట్ బ్లాక్ ఏర్పడుతుంది. దీని కారణంగా, గుండె సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది, ఇది వ్యక్తి మరణానికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో, గుండె ఆగిపోకుండా ఉండటానికి మీ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. హార్ట్ బ్లాక్‌ను గుర్తించడానికి ECG, ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ మరియు ఎకో వంటి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఇది కాకుండా, కొన్ని పని చేయడం ద్వారా మీరు ఇంట్లో గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు (Heart Test At Home). అవును, అడల్ట్ మరియు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రిల్ చుగ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. రండి, ఇంట్లోనే గుండె ఆరోగ్యాన్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం?
గుండె అడ్డంకిని తెలుసుకోవడానికి నడుము పరిమాణాన్ని కొలవండి
డాక్టర్ చంద్రిల్ చుగ్ ప్రకారం, ఒక మనిషి నడుము పరిమాణం 37 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే, అది అతని గుండె బలహీనంగా ఉండవచ్చని సూచిస్తుంది. మహిళల్లో ఈ పరిమితి 31.5 అంగుళాలు. నడుము పరిమాణం పురుషులకు 40 అంగుళాలు మరియు స్త్రీలకు 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉంటే గుండెకు తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.
హృదయ స్పందన రేటును తనిఖీ చేయండి
హృదయ స్పందన గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన సూచిక. మీరు ఇంట్లో మీ హృదయ స్పందన రేటును సులభంగా తనిఖీ చేయవచ్చు. గుండెలో అడ్డంకులు ఉన్నాయా లేదా అనేది మీ పల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. డాక్టర్ చంద్రిల్ చుగ్ ప్రకారం, సాధారణ కార్యకలాపాలు మరియు వయస్సు గల వ్యక్తి యొక్క పల్స్ రిలాక్స్డ్ స్థితిలో నిమిషంలోపు 60 నుండి 100 మధ్య ఉండాలి. అయితే, అథ్లెట్లలో ఇది 40 నుండి 50 మధ్య కూడా ఉంటుంది. మీ హృదయ స్పందన రేటు తక్కువగా ఉంటే మరియు మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు మైకము వంటి లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
40 మెట్లు ఎక్కండి
డాక్టర్ చంద్రిల్ చుగ్ ప్రకారం, ఇంట్లో మెట్లు ఎక్కడం ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఊపిరి, అలసట లేకుండా 15 నిమిషాల్లో 40 మెట్లు ఎక్కగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సంకేతాలను మీరు గమనించినట్లయితే, మీరు వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేసుకోవాలి. ఇది గుండె ఆరోగ్యానికి మంచి సంకేతం కాదు.
Wednesday, December 25, 2024
PANCHATANTRA STORY : The Jackal and the Drum
చెప్పులలో రకాలను (ఫ్లిప్ ఫ్లాప్స్, స్నీకర్స్, స్లిప్పర్స్, సాండల్స్ మొదలైనవి) గురించి ఏవి ఎప్పుడు వాడాలో వివరించండి?
ఎన్నో రకాల జోళ్లు/పాదరక్షలు/చెప్పులు రకాలు ఉన్నాయండి.మీరు అడిగినవి ప్రధానంగా స్త్రీ పురుషులు ఇద్దరు, వాడేవి. ఇలా కాకుండా,పురుషులవి,స్త్రీలవి అని విడివిడి గా ఉన్నాయి.
ఇక ప్రధానంగా లాంఛనంగా (formal) వేసుకునేవి, అలానే నియమాలు లేని అనధికార ప్రదేశాల్లో(informal) వేసుకునేవి అని రెండు భేదాలు ఉన్నాయి ఇందులో.
అంటే మొదటి రకం ఆఫీసు మీటింగుకి, పెద్దవారితో మాట్లాడటానికి,సభల్లో, ఇంకేదో ముఖ్యమైన వ్యక్తులుండే చోట, వేసే సూట్ బూట్ లన్న మాట. ఇక రెండో రకం పార్టీలకి, బయట స్నేహితులు,ఫంక్షన్ లు, షాపింగు ,ఊర మాస్ తిరుగుడు లన్నిటికీ పనికొచ్చేవి.
ఇందులో అన్నిటిని గురించి చెప్పను కాని కొన్నిటిని ప్రస్తావిస్తా.
లాంఛన/అధికారిక రకాలు :
(శిల్ప అహుజా చిత్రం)
మొదటిది డెర్బీ(Derby) బూట్ : ఇది సంప్రదాయ యూరోప్ రకం. ప్రధానంగా ఇందులో కనిపించేది బూట్ కి రెండుపక్కల రెక్కలులా ఉండే రెండు లేసులు కట్టుకునే ఐలెట్(eyelet) లను, వేంపు(vamp) అనే మధ్యన ఉండే భాగం పైన కుడతారు. దీన్నే ఓపెన్ లేస్(open lace) పద్ధతి అంటారు.
(pininterest చిత్రం)
ఆక్స్ ఫర్డ్(Oxford): ఇందులో పైన చెప్పినట్టు కాకుండా దానికి వ్యతిరేకంగా వేంపు కింద ఐలెట్ ఉంటాయి. అంటే ఇందులో ఐలెట్ లు కనిపించవు.బూట్ మొత్తం అటుక్కున్నట్టు ఉండిపోతుంది. పైవి రెండు తోలుతో చేసినవే.
(difference between info image)
బ్రోగ్ (Brogue): గట్టి తోలు ముక్కల్ని అతికినట్టు ఉండే ఈ రకం బూట్ లని గుర్తు పట్టే లక్షణం.చిన్న చిన్న రంధ్రాలు. బూట్ వేసుకున్నప్పుడు పేంటు మినహా కనిపించే భాగం లో రకరకాల ఆకృతుల్లో ఉండే గుండు సూది అంత రంధ్రాలు ఉంటాయి. దీన్లో మళ్ళీ నాలుగైదు రకాలున్నా వాటి జోలికి పోను.
(purfe dot com au image)
మాంక్ (Monk); ఈ రకం జోళ్ళ లో లేసులు ఉండవు.దాని బదులు స్ట్రాప్ లు ఉంటాయి. వీటిలో రెండు స్ట్రాప్ లుంటే డబల్ మాంక్ అంటారు. వీటిని కూడా చర్మం తోనే చేస్తారు.
(pinterest image)
బోట్(Boat) : కేన్వాస్ కానే చర్మం తో కాని చేసిన ఈ జోళ్లు పడవల్లో వాడటానికి చేసే వారట. తడి గా ఉండే పడవల్లో జారకుండా ఉండేందుకు మడమల్లో గాట్లు పెట్టి రక్షణ గా తయారు చేసేవారట. వీటిని సాక్సులు లేకుండా వాడతారు.
ఇవి కాకుండా డెసర్ట్ బూట్ లు,చెల్సియా (మడమ జోళ్లు ) ఇలా చాల రకాలే ఉన్నాయి.
ఇక అన్ని చోట్ల వాడే అనిర్ణీత/అనధికార ( informal) రకాలు:
flipflop(dreamstime image)
ఫ్లిప్ ఫ్లాప్ (flipflop): ఇవి మన బాత్రూం చెప్పులు. ప్లాస్టిక్ తో చేసి బొటన వేలు రెండోవేలు మధ్యన తాడు లాంటిది ఉండే “V’ ఆకారపు స్ట్రాప్ రకం అన్నమాట. వీటికి” ఈజిప్ట్ ,ఇంకా(INCA)” కాలపు చరిత్ర ఉందట. ప్రధానంగా ఇవి ఆరు బయట,బీచుల్లో పార్కుల్లో వాడటానికి పనికొస్తాయి. (మనదేశం లో తప్ప).చాలా చవకైనవి. వీటికి సాధారణంగా ఎత్తు మడమ(heel) ఉండదు.
(flipflop daily ఇమేజ్)
స్లిప్పర్స్(Slippers): మనం ఈ పేరుతో పై వాటిని పిలిచి కన్ఫ్యూజ్ అయినా, ఇవి మనం అనుకునేవి కావు. ఇవి కేవలం ఇంటి లోపల వాడేందుకు చేసినవి.ఎక్కువగా గుడ్డతో చేస్తారు. కింద సోల్ చాలా సున్నితంగా ఉండి, పదునైన వస్తువు గుచ్చుకుంటే రక్షణ ఇవ్వదు కనక బయట వాడరు. కాలుకు హత్తుకుని ఉండేట్లు ఉంటుంది.సులభంగా కాలు దూర్చటానికి అనువైన గూడు లాంటి ముందు భాగం వీటిలో ఉంటుంది.
(అమెజాన్ స్లిప్పర్ చిత్రం )
శాండల్ (Sandal) : ఇందులో కూడా ఎన్నో రకాలున్నా ప్రధానంగా ఉండే మార్పు స్ట్రాప్ లు. ఇవి సాధారణంగా వెనుక మడమ భాగం లోనే ఉంటాయి.కొన్నిటిలో ముందు కూడా ఉండవచ్చు. స్ట్రాప్ లు క్లిప్ లాగానూ, ప్లాస్టిక్ తో అతుక్కు పోయే రకమూ ఉంటుంది.
స్నీకర్ (sneaker): ఇవి రబ్బర్ గాని సింథటిక్ /కాన్వాస్ తో గాని చేసే జోళ్లు. చెప్పు అడుగట్ట (sole),వంగగల వంపు ఉన్న పదార్ధం తో చేస్తారు. జోడు మడమ వరకు వచ్చేవి ,రానివి కూడా ఉంటాయి. ముఖ్యమైన లక్షణం లేసులు ఉండటం.ఇవి అన్ని సార్లు కట్టుకునేవే కాకుండా పెద్దవిగా ఆకర్షణ కోసమూ ఉండవచ్చు. పాదాలకు అన్ని వేపులా మంచి రక్షణ ఉంటుంది.
(ఫ్లిప్కర్ట్ చిత్రం-స్నీకర్)
లోఫర్(Loafer): వినటానికి తిట్టులా ఉన్న మంచి ఫేషన్ జోళ్ళు ఇవి. తోలు తో ,కేన్వాసు తో చేస్తారు. చెప్పు అడుగట్ట (sole) సమతలం గా ఉంటుంది.నెలకు అంటుకు పోయినట్టు ఉంటాయి. లేసులే ఉండవు.కాలుని అంతగా కప్పి ఉంచవు. కాలు దూర్చి తోడుక్కోవటమే (slip on type).
(ఇండియామార్ట్ చిత్రం-లోఫర్)
మొకాసిన్(moccasin): ఇవికూడా దూర్చి తోడుక్కునేవే. కేన్వాస్.తోలు , గుడ్డ లతో తయారయ్యే ఈ జోళ్ల లో లేసులు ఉన్న అవి కేవలం అలంకార ప్రాయమే. అయితే వీటిలో అడుగట్ట ఉండి ఉండనట్టు అనిపిస్తుంది. జోడు అంతా కుట్లు,అలంకరణ తో ఉంటుంది.
(seo org వారి వుడ్లాండ్ మోకాసిన్)
పూర్వం రోజుల్లో ప్రెగ్నెన్సీ పరీక్షలు ఎలా చేసేవారు?
మీ ఉద్దేశ్యంలో మనదేశం అని అన్నారో లేక మొత్తం ప్రపంచంలో అని అన్నారో తెలియలేదు. మనదేశంలో పరీక్షల గురించి నేను వెతికినా ,ఋజువులున్న ఆధారాలు కనపడలేదు. తొందరపడి ఏదో రాయటం ఇష్టంలేక,మిగతా ప్రపంచ ఉదాహరణలు రాస్తున్నాను. అలాగే ఇప్పటి పరీక్ష వెనుక రసాయనికత వివరిస్తాను. ఓపిక గా చదవండి.
గింజల పరీక్ష :
3 వేళ ఏళ్ల క్రితం ఈజిప్ట్ లో స్త్రీ లు గర్భం దాల్చినట్టు అనిపిస్తే , వారి మూత్రాన్ని ,యవలు(barley ),గోధుమల గింజలపైన, పోసే వారట . ఒక వారం లోగా అవి మొలకెత్తితే వారు గర్భం దాల్చినట్టు నిర్ధారించే వారు. ఇది నేటి పరీక్షల తో పోలిస్తే 70 శాతం కచ్చితత్వం ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది ఏదో ఊహించి చేసినా, కొంతవరకు కరెక్టే మరి. దీని విషయం వివరణకి ,కొంత సమయం తీసుకుని ,మిగతా పరీక్షల విషయానికి పోదాం.
ఉల్లిపాయ పరీక్ష:
గ్రీకుల పద్దతిలో, మర్మావయవాల వద్ద ఉల్లిపాయ ఉంచి మర్నాడు నోటి నుండి, ఆ వాసన వస్తే గర్భిణి అనేవారు. లోపల పిండం వల్ల ,మొత్తం జీర్ణనాళం ,పూర్తి గా తెరుచుకుని ఒక గొట్టం లా పనిచేస్తుంది అని అనుకునేవారు. ఇందులో నిజం లేదని మీకు తెలుసు.
తాళం పద్దతి :
15 వ శతాబ్దంలో పరీక్ష చేయవలసిన వ్యక్తీ మూత్రం ఉన్న, ఒక గిన్నెలో తాళం వేస్తే మర్నాటికి కింద ఆ తాళపు అచ్చు ఉందంటే,గర్భధారణ సూచన గా భావించే వారు. ఇది కూడా అర్ధం లేని ఆలోచనే.
మూత్ర ప్రవీణులు :
వీరు 16 వ శతాబ్ది లో యూరోప్ లో ఉండేవారట . మూత్రం రంగు,లక్షణాలు చూసి పుట్టబోయే బిడ్డ , ఆడో , మగో ,చెప్పేసే వారట . కొందరు మూత్రాన్ని ద్రాక్షా రసం లో వేసి, అది పారదర్శకత కోల్పోతే, గర్భిణి అని తలచే వారట (clouding of wine).
కంటి రంగు:
గర్భం దాల్చిన వారికీ, రెండో నెలలోపు ,కంటిలో జరిగే మార్పులు గమనించి, ఫలితం చెప్పగల నేర్పు ఆనాటి వైద్యులకు ఉండేది. ఇలా అన్నది 16 వ శతాబ్ది వైద్యుడు జాక్ గిల్మవు (jacques guillemeau ). గర్భధారణ సమయంలో కంటిలో మార్పులు, కొందరిలో సహజమే అని నేటి పరిశోధనలు చెపుతున్నాయి కూడా.
చాడ్విక్ చిహ్నం (Chadwick’s sign) :
మర్మావయవాల వద్ద, ఎక్కువ రక్తప్రసరణ వల్ల ,రంగు పెరుగుతుందని ,1836 లో ఫ్రెంచి వైద్యు డైన జెమ్స్ చాడ్విక్ ,కనుగొన్నాడు. అయితే ఇది అందరికీ ,అన్నిసార్లూ వీలుపడే పరీక్ష కాదు. ఆకాలంలో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా అరుదుగా చేసేవారు.
కుందేలు పరీక్ష:
1920 లో ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు, సెలమార్ అష్హీమ్ ,జోన్దేక్ లు, దీన్ని ప్రస్తావించారు. గర్భిణి మూత్రాన్ని, కుందేలు లో ఎక్కించినట్టయితే, దానిలో గర్భాశయ వృద్ధి కనపడుతుంది. ఇది పూర్తిగా పెరగని ,పిల్ల కుందేళ్ల లలో కూడా, గమనించారు.అయితే ఇలా ఒక గర్భ పరీక్ష కోసం, రెండుమూడు కుందేళ్ళు చనిపోయేవట. దీనివల్లే గర్భం దాల్చటాన్ని, నర్మగర్భంగా “కుందేలు చచ్చింది” అనే వారట. ఇలా కుందేళ్లే కాకుండా, ఎలుకలు,చుంచులు బోలెడు, వారికోసం చంపబడేవి.
కప్ప పరీక్ష :
ఇది కూడా కుందేలు వంటిదే. 1940 చివరి వరకు దీన్ని చేస్తూనే ఉండేవారంటే దీని ప్రాచుర్యం గమనించండి. ఇక్కడకూడా గర్భిణి మూత్రాన్ని, బతికున్న కప్ప లోకి, సూది ద్వారా ఎక్కించి, 24 గంటలలో అది గుడ్లు పెడితే వారు గర్భిణీయే ,అని నిర్ధారణ చేసేవారు. ఇందు కోసం "జేనోపాస్ "(xenopus) అనే" ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్" ని ఉపయోగించేవారు. వీటిని పెంచి, పెద్దఎత్తున సరఫరా కూడా చేసేవారు.
పైన ఆన్ని చోట్లా మూత్రం అని, తెగ రాసేశాడు ఏమిటా అని తిట్టుకుంటున్నారా? అందులో ఒక కారణం ఉందండి .
(bioninja image)
గర్భందాల్చిన వారి మూత్రం లో ఉండే హార్మోనులు ప్రత్యేక మైనవి .అండం, శుక్రకణం తో కలిసి ,ఫలదీకరణ జరిగి, పిండంగా మారే క్రమంలో, జరాయువు (placenta) నుండి ,ఒక హార్మోను విడుదలవుతుంది. దీన్ని hCG(human Chorionic Gonadotropin) గా పిలుస్తారు. ఇది గర్భిణి శరీరాన్ని, పిండం వృద్ధికి ,అనుగుణంగా మారేందుకు, సూచనలు పంపుతుంది. అంటే అండాశయానికి, ఇక అండం తయారీ ఆపి ,పిండం ఎదిగేందుకు ,సహకరించమని చెప్పటం, అన్నమాట. ఏదైనా హార్మోన్, పని అయ్యాక, అది మూత్రం ద్వారా, విసర్జింప బడుతుంది. అందుకే ,గర్భిణి మూత్రంలో ఇది ఉంటుందన్నమాట. మూత్రం కంటే రక్తంలో ఇది అధిక ప్రమాణం లో ఉంటుంది. అందుకే రక్తపరీక్ష ,మూత్ర పరీక్ష కంటే, ఎక్కువ ప్రభావశీలి .
(clear blue image )
అదే, గర్భం లేని వ్యక్తి, మూత్రంలో ఇది ఉండదు. ఈ హార్మోన్ యే , కుందేళ్ళు ,ఎలుకలలో, అండాలను వృద్ధి చేసేలా ప్రేరేపిస్తున్నది. ఇంకా చెప్పాలంటే గోధుమలు,యవలు మొలకెత్తే లా కూడా చేస్తున్నది. నిజానికి hCG అనే దాని పని, గుడ్లు తయారు చేయించటం కాదు కదా ,అని మీకు సందేహం రావచ్చు. అలా చేసేందుకు ఉన్న, లూటీనయిజింగ్ హార్మోన్ (luteinizing hormone) ని ,ఇక్కడ చెప్పిన hCG అనేది, అనుకరణ(mimic ) చేయటం వల్ల ఇలా జరుగుతుంది. అయితే గర్భం దాల్చని వారిలో ఈ లూటీనయిజింగ్ హార్మోన్ ఉంది గా, అదే ఈ పని చేయొచ్చుగా అని మీరంటారు. రసాయనిక పరంగా , దాని కంటే, hCG యే ఎక్కువ ప్రభావశీలి.
1970 లలో చేసే పరీక్షల్లో టెస్ట్ ట్యూబుల్లో నమూనా సేకరణ చేసేవారు. ఇందులో గొర్రె రక్తం, hCG ప్రతిదేహం (antibody) లను కలిపి, అందులో మూత్ర నమూనా చేర్చి, కణాలు గడ్డకడితే, గర్భం లేదని,కట్టకపోతే, గర్భమని సూచన చేసేవారు.
(freepik image)
ఇక తర్వాత చిన్న ప్లాస్టిక్ కడ్డీల (stick) పరీక్షలు మొదలయ్యాయి. వీటిలో గొర్రె రక్తం బదులు, కొన్ని వర్ణాలతో కలిపిన, hCG ప్రతిదేహాలు ఉంటాయి. దీనివల్ల ఆధునిక యువతులు తమ ఇంటి లోనే పరీక్ష చేసుకునే సదుపాయం లభించింది .
(సేకరణ కోరా నుంచి)