Adsense

Wednesday, June 4, 2025

అష్టమి కష్టదినమా?

*మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ 'అష్టమి వ్యాధి నాశినీ' అనేది ప్రసిద్ధ వాక్యం. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించినా, ఔషధాన్ని సేవించినా సత్వరం శుభఫలితం కలుగుతుందని 'చరక సంహిత' చెబుతోంది. మరి అష్టమినాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం. నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం. అవే అష్ట భార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అంటారు. ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా, వారంతా హరీ అన్నారు. ఒక్క అష్టమి అనే కాదు, ప్రతీ తిథీ మంచిదే. అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపింది,* *మనం అర్థం చేసుకుని ఆచరించాల్సిందీ ఇదే.*

*కష్టాలను తొలగించే అష్టమి*

*శివ పురాణం ప్రకారం, అష్టమి రోజు కాలభైరవుడిని ఆరాధించే సమయంలో ఈ మంత్రాలను పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి.*

*"అత్యంత క్రూరమైన మహాకాయ కల్పాంత దహనోపం, భైరవ నమస్తుభ్యం అనుమతి దాతుమర్హసి||"*

*"ఓం భయహరణం చ భైరవః "*

*"ఓం కాలభైరవాయ నమః"*

*"ఓం హ్రీం బాం బతుకాయ్ ఆపదుద్ధరణయ్ కురుకురు బతుకాయ్ హ్రీమ్"*

*ఈ మంత్రాలను స్మరిస్తూ అష్టమి రోజున కాలభైరవుని విగ్రహం లేదా పఠం ఎదుట దీపం వెలిగించాలి.*

Tuesday, June 3, 2025

ధూమవతి జయంతి

ధూమవతి జయంతి హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది **దశ మహావిద్యలు** (దశ మహా దేవీ రూపాలు)లో ఏడవదైన **ధూమవతి దేవి** జన్మదినంగా పరిగణిస్తారు. ఈ పండుగ సాధారణంగా **జ్యేష్ఠ మాసంలో అమావాస్య** నాడు వస్తుంది, అంటే వేసవి కాలంలో జూన్ నెలలో జరుగుతుంది.
### ధూమవతి దేవి గురించి:

* ధూమవతి అనేది ఒక క్రూరమూర్తి, ఆమెను సాధారణంగా **విధవ రూపంలో** చిత్రిస్తారు.
* ఆమెను **విధ్వంసకారి శక్తి**, **తాత్కాలికత**, **తపస్సు**, **విరక్తి**, మరియు **మోక్ష మార్గం** యొక్క చిహ్నంగా పరిగణిస్తారు.
* ఆమె స్వరూపం పొగ (ధూమం) లాంటి ధూళి వంటి మాయను సూచిస్తుంది – అందుకే "ధూమవతి" అనే పేరు వచ్చింది.

### జయంతి సందర్భంలో ఆచరణలు:

* ఈ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.
* ధూమవతి మంత్రాలు జపించడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి మరియు శత్రు నాశనం కోసం ఆరాధన చేస్తారు.
* ప్రత్యేకంగా తపస్సు, ఉపవాసం, మరియు మౌనవ్రతం వంటి ఆచారాలను అనుసరించే వారు ఉన్నారు.
* సాధకులు ఈ రోజు తాము కోరుకునే సిద్ధులు, రహస్య విద్యలు సాధించేందుకు ధూమవతి తల్లిని ఉపాసిస్తారు.

### ప్రత్యేకతలు:

* ఈ తల్లి అనుగ్రహం వల్ల మనిషి లోక వ్యామోహం నుంచి బయటపడతాడు.
* ఆమె సాధన ఎక్కువగా తపస్వులు, తంత్రికులు చేస్తారు.

ధూమవతి తల్లి జయంతి సాధారణ ప్రజల కన్నా అధికంగా ఆధ్యాత్మిక సాధకులకు, తంత్ర విద్యలో నిమగ్నమైనవారికి అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు.

త్రిలోచనాష్టమి వ్రత కథ

త్రిలోచనాష్టమి వ్రత కథ** (Trilochanashtami Vrata Katha) అనేది భగవంతుడు శివుని "త్రిలోచన" స్వరూపానికి సంబంధించిన పవిత్ర కథ. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష అష్టమి నాడు శివభక్తులు ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, శివుని ఆరాధిస్తే, పాపాలన్నీ నశించి మోక్షఫలితాన్ని పొందుతారని పురాణ కథలు వివరిస్తాయి.
---

### 🕉️ త్రిలోచనాష్టమి వ్రత కథ:

పూర్వకాలంలో **విదర్భదేశంలో సుధర్మ అనే రాజు** ఉండేవాడు. అతనికి ధర్మపత్నిగా **సత్యవ్రతా** అనే సతీమణి ఉండేది. ఆమె మహాశివభక్తురాలు. శివుని భక్తి చేసేవారు, ఉపవాసాలు చేసేవారు, ప్రతిరోజూ శివాలయంలో సేవచేసేవారు.

ఒకనాడు ఆమె తన స్వప్నంలో భగవంతుడైన **త్రిలోచనుడు (మూడుకళ్ల శివుడు)** దర్శనమిచ్చాడు. ఆయన ఆమెకు ఇలా చెప్పారు:

> "జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష అష్టమినాడు నేను త్రిలోచన స్వరూపంలో భక్తుల పాలిట ప్రత్యక్షమవుతాను. ఆ రోజున ఉపవాసం చేసి నన్ను పూజించే వారికి జన్మజన్మల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది."

ఆమె ఆ రోజున త్రిలోచనాష్టమి వ్రతాన్ని ఆచరించి, దీపారాధన, అభిషేకం, బిల్వపత్రాల సమర్పణ మొదలైన శివారాధన చేశారు. ఆమె భర్త రాజు సుధర్మ కూడా ఆమెతో పాటు ఈ వ్రతాన్ని ఆచరించాడు. వారి జీవితాల్లో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి, రాజ్యం ప్రశాంతంగా మారింది. చివరికి వారు **శివలోకాన్ని** పొందారు.

---

### 🙏 త్రిలోచనాష్టమి పూజ విధానం (సంక్షిప్తంగా):

1. పూజకు ముందు శౌచాచరణం చేసి ఉపవాసం ఉండాలి.
2. శివలింగానికి పాలు, పంచామృతం, నీళ్లు అర్ఘ్యం చేయాలి.
3. బిల్వపత్రం, అభిషేకం, ధూప దీప నైవేద్యం సమర్పించాలి.
4. ఈ వ్రతకథను వినాలి లేదా చదవాలి.
5. శివాష్టోత్తర శతనామావళి, శివ కవచం, మహామృత్యుంజయ మంత్రం జపించాలి.

---

### 🎁 ఫలితాలు:

* పాప నాశనం
* కష్ట నివారణ
* ఆరోగ్యం, ఆయుష్షు
* శివానుగ్రహం మరియు మోక్షప్రాప్తి

---

Monday, June 2, 2025

వాల్మీకి రామాయణం - 16

నామకరణం.... అంతరార్థం.
శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తత్వదీపిక.

వశిష్ఠులవారు ఇక్ష్వాకు వంశ పురోహితులు. చక్రవర్తికి సంతానము కలిగినందుకు అత్యంత ప్రీతినందినవాడై జ్యేష్ఠునకు 'రాముడు' అను నామధేయముంచెను.

కైకేయి కుమారునకు 'భరతుడు," సుమిత్ర కుమారులకు లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామధేయముంచెను,

అవి లోక సామాన్యముగ అర్ధరహితములగు పేర్లు కావు. వశిష్ఠుడు త్రికాలజ్ఞుడగుబచే భవిష్యత్తు నెరింగి అందరిని ఆనందింప చేయువాడు కనుక రమయతి - ఇతి - రామః అని పెద్దవానికి రామనామము ఉంచెను.

అంతియేగాక యోగులు ఈతనివి ధ్యానించి ఆనందించుచుందురు కనుక 'రాముడు' అను అర్ధము కూడ ఆ నామమునందు కలదు.

అట్టి స్వభావము గల మహాత్ముడు శ్రీరాముడు. 'ర' అనునది అగ్ని బీజము కలది. 'మ' అమృతబీజము కలదిగ చెప్పుదురు. 'ర - అను అక్షరమును ఉచ్చరించగనే పాపములు పోయి

'మ' అనుటచే అమృతత్వము సిద్ధించును, అహంకార మమకారములు తొలగుటకు రామనామము శరణము.
ముక్తికి ప్రాపు అది.

రామ అను పేరులో అక్షర సంఖ్యను బట్టి 'ర రెండు 'మ' ఐదు అని లెక్కింతురు. అట్లు అంకెలు వేసి వానిని తలక్రిందులుగ వ్రాయుల శాస్త్రమర్యాద ,

రెండు, ఐదు వేసి ముందు వెనుకలు చేసిన ఏబది రెండు అగును. అక్షరములు ఏబది రెండు. అక్షర సమూహము అంతట చేతను తెలుపబడెడివాడు రాముడు,

అనగా ఏ శబ్దము అయినను బాహ్యమగు ప్రకృతి వికారమగు శరీరములో నున్న జీవులలో నున్న పరమాత్మనే తెలియజేయుము, కనుక సర్వ శబ్దములు భగవంతుని తెలియచేయునవే.

శ్రీ రాముడు శ్రీ మహావిష్ణువే కనుక రామునికి సర్వశబ్దములు నామధేయములే అగునని రామ నామము ఉంచెను.

ఒకరిని ఆనందింపచేయువాడు, తాను ఎల్లప్పుడు ఆనందించువాడు రాముడు, ఇది మానవుల సామాన్యలక్షణమై యుండవలెను.

ఇంక కైకేయి పుత్రునకు 'భరతుడు' అను పేరును ఉంచి తండ్రి మరణించిన తరువాత, రాముడు వనవాసమునకు ఏగిన తరువాత

పదునాలుగు సంవత్సరములు రాజ్యమును రాజు కాకుండ రాజుగ పరిపాలించి నందువలన భారమును మోయగల సమర్ధుడగుటచే భరతుడు అను పేరు సార్ధకమాయెను.

లక్ష్మీ సంపన్నుడను అర్ధముతో 'లక్ష్మణుడు' లను పేరును ఉంచెను. చక్రవర్తి కుమారుడగుటచే ఐశ్వర్యవంతుడు "అగుటయే గాని అతడు భౌతికముగ ఐశ్వర్యమును అనుభవింపలేదు.

అయినను అతనిని లక్ష్మీవర్ధనుడు, లక్ష్మి సంపన్నుడు అని వాల్మీకి వ్యవహరించెను.
లక్ష్మి అనగా లోక ప్రసిద్ధమగు ఐశ్వర్యము కాదు శ్రీరామునిలో నిత్య సన్నిధి కలిగియుండుటయే లక్ష్మణుని ఐశ్వర్యము.

అట్టి ఐశ్వర్యము లక్ష్మణునకే ఉన్నది. లౌకికమైన ఐశ్వర్యము నశ్వరము, కాని భగవత్ సన్నిధానమనెడి ఐశ్వర్యము శాశ్వతము.

సుమిత్ర పుత్రుడగు లక్ష్మణుని సోదరునకు 'శత్రుఘ్నుడు' అని నామధేయము నుంచెను.

గొప్ప' శత్రువులను జయించిన రామ లక్ష్మణులకు లేని బిరుదు
ఇతనికి లభించెను.

మధురలో రాజగు లవణుని ఈతడు చంపినాడు కనుక ఈతడును శత్రుఘ్నుడే అనవచ్చును గాని అదికాదు శత్రువులు అవగా ఇంద్రియములు, ఇవి ఎన్నడును మనను వదలి ఉండవు.

ఇవి విషయములపై ఆకర్షించి మనస్సును పాడుచేయును. వాటిని జయించినవాడు, శత్రుఘ్నుడు ఈతని గొప్పతనము, ఇంద్రియములను లౌకిక విషయములనుండి మరల్చుట కాదు.

భగవంతుని కూడ వీడి భగవద్భక్తువకే అంకితమైన ఇంద్రియములు కలవాడు. భరతుడు రాముని భక్తుడు. అతనిని ప్రేమించినవాడు శత్రుఘ్నుడు లోకమంతయు రాముడు రాముడని ఆదరించుచున్నను

ఆతని (శత్రుఘ్నువి) ఇంద్రియములు మాత్రము రాముని వైపు ప్రసరింపక భరతుని యందేస్థిరపడియున్నవి.

భగవానుని ప్రేమించుటకంటె భగవద్భక్తులను ప్రేమించుట చాల విశేషము. లోకవిషయములను వదలి భగవద్విషయమున ప్రసరించుట ఎంత కష్టమో భగవానుని వదలి

భగవద్భక్తులయందే మనసు నిలచుట అంత కష్టము. అట్టి స్థితి ఆతనికి సహజమున కలిగినది కనుక ఆతడు శత్రుఘ్నుడు.

ఇట్లు నాలుగు నామధేయములు సార్ధకములు...

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం -15

పాయస విభాగం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న జననం. శ్రీ మహావిష్ణువులో అర్ధాంశ-రాముడు,
అతనిలో చతుర్థాంశ (1/8)- భరతుడు,
అర్ధాంశ (1/4) లక్ష్మణుడు, మరొక చతుర్థాంశ (1/8) - శత్రుఘ్నుడు, పాయసం పంచిన పరిమాణంలోనే అవతారాంశలు.


తనకు ఇచ్చిన పాయసభాగాన్ని కౌసల్య అందరికంటే ముందు భుజించింది. అందుకని అందరికంటే పెద్దవాడు రాముడు జన్మించాడు.

సుమిత్ర తనకు ఇచ్చిన పాయసభాగాన్ని (1/4) వెంటనే భుజించకుండా, మిగిలినదాన్ని మహారాజు ఎవరికి ఎలా ఇస్తాడో అని క్షణకాలం వేచిచూచింది.

ఈ లోగా తనకు అందిన భాగాన్ని (1/ 8) కైక భుజించింది అప్పుడు మిగిలిన భాగాన్ని కూడా (1/8) దశరథుడు సుమిత్రకు ఇవ్వగా రెండూ కలిపి చివరగా భుజించింది అందుకని ఇదే క్రమంలో భరతుడు (1/8) లక్ష్మణ (1/4) శత్రుఘ్నులు (1/8) జన్మించారు.
ఇదీ సాంప్రదాయికుల సమన్వయం)

రాముని జనన కాలం లో
అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.

వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి. గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది.

సూత వందిమాగధులకూ బ్రాహ్మణులకూ గోవిత్తసహస్రాలను దశరథుడు పంచిపెట్టాడు.

ఇంకా చాలామందికి చాలా బహుమతులు అందించాడు. ఆనందోత్సాహాలతో పదకొండు రోజులు గడిచాయి. పన్నెండవనాడు నామకరణ మహోత్సవం జరిగింది.

జ్యేష్ఠునికి రాముడని, కైకేయీపుత్రునికి భరతుడని, సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడూ అని వసిష్ఠులవారు నామకరణం చేసారు. జాతకర్మాదులు జరిపించారు.

పౌరజానపదులకూ బ్రాహ్మణులకూ దశరథుడు బ్రహ్మాండమైన విందు చేసాడు. రత్నరాశులు పంచిపెట్టాడు.

వీరిలో జ్యేష్ఠుణ్ని చూస్తే తండ్రికి చెప్పరాని ఆనందం కలుగుతోంది.
సర్వ ప్రకృతి ఆనందపరవశం అవుతోంది

నలుగురూ వేదవేదాంగాలను అభ్యసించారు.
ధనుర్వేదంలో నిష్ణాతులయ్యారు. సకలనీతిశాస్రాలూ అభ్యసించారు.

గజాశ్వరథ విద్యలు నేర్చారు. గురు శుశ్రూషారతులు,
పితృ శుశ్రూషారతులుగా దినదిన ప్రవర్ధమానులు అయ్యారు..

( స‌శేష‌ము )..

Saturday, May 31, 2025

వాల్మీకి రామాయణం - 14

ఆరు ఋతువులు గడిచిపోయాయి.
పన్నెండవనెల. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమినాడు పునర్వసు నక్షత్రయుక్త (చతుర్ధపాదం) కర్కాటక లగ్నంలో సూర్య గురు శుక్రాంగారక శనిగ్రహాలు అయిదూ స్వోచ్చస్థానంలో ఉండగా

బృహస్పతి చంద్రులు కలిసి ఉన్న ముహూర్తంలో కౌసల్యాదేవి శ్రీరామచంద్రుణ్ని ప్రసవించింది. జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడు జన్మించాడు

తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చ సంస్థషు పంచసు॥

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్||

కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ |
విష్ణోరర్ధం మహాభాగం పుత్ర మైక్ష్వాకువర్ధనమ్ ||..

మర్నాడు దశమి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మీనలగ్నంలో పుష్య నక్షత్రయుక్త శుభముహూర్తంలో సూర్యాంగారకాది పంచగ్రహాలూ స్వోచ్చస్థానాల్లో ఉండగా కైకేయి భరతుణ్ని ప్రసవించింది

భరతో నామ కై కేయ్యాం జజ్జే సత్యపరాక్రమః సాక్షాద్విష్ణోశ్చతుర్చాగ స్సముదితో గుణైః

అదేరోజున సూర్యోదయం అయ్యాక ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటకలగ్నంలో సూర్యాంగారకాది పంచగ్రహాలు స్వోచ్చస్థానాలలో ఉండగా సుమిత్ర లక్ష్మణశత్రుఘ్నులను కవలను ప్రసవించింది

అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ
వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణో రర్ద సమన్వితా

పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతా తు సౌమిత్రీ కుళీరేఽభ్యుదితే రవౌ|

ఆ సమయంలో గంధర్వులు అవ్యక్త మధురంగా గానం చేసారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేసారు దేవ దుందుభులు మ్రోగాయి. ఆకాశంనుంచి పుష్పవృష్టి కురిసింది.

అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.

వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి.
గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది...

( స‌శేష‌ము )..

వాల్మీకి రామాయణం-13

శ్రీమన్నారాయణుడు దశరథుని ఇంట పుత్రత్వం పొందగా బ్రహ్మదేవుడు దేవతలనూ దేవర్షులనూ సమావేశపరిచి ఒక ప్రకటన చేశాడు.

దేవతలారా ! విష్ణుమూర్తికి సహాయకారులుగా ఉండే నిమిత్తం మీరంతా అప్సరఃకాంతలయందు వానర మహావీరులను సృష్టించండి.

బలశాలులు, బుద్ధిమంతులు, మాయావిదులు, కామరూపధారులు, వాయువేగులు, ఉపాయజ్ఞులు, నీతివిదులు, విష్ణుతుల్య పరాక్రములు అయిన వానర వీరులను సృష్టించండి.

ఇంతకు మునుపే నేను జాంబవంతుడనే ఋక్ష మహావీరుణ్ని సృష్టించి ఉన్నాను. ఆవలిస్తూండగా హఠాత్తుగా నా నోటినుంచి జన్మించాడు.

దేవతలూ ఋషులూ అందరూ ఈ బ్రహ్మవాక్కును శాసనంగా అంగీకరించారు. వానరరూపాలు ధరించి అప్పర కాంతలతో విహరించి వానర మహావీరులను సృజించారు.

ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, బృహస్పతి తారుని, కుబేరుడు గంధమాదనుని, విశ్వకర్మ నలుని, అగ్నిదేవుడు నీలుని,

అశ్వినీదేవతలు ద్వివిద-మైందులను, వరుణుడు సుషేణుని, పర్జన్యుడు శరభుని సృష్టించగా వాయుదేవుడు అందరిలోకీ బుద్ధిమంతుడూ

బలవంతుడూ వజ్రకాయుడూ గరుత్మత్సమానుడూ అయిన హనుమంతుణ్ని సృష్టించాడు.

వేలకు వేలుగా సృష్టింపబడిన ఈ సింహ శార్దూల పరాక్రములు నఖదంప్ట్రాయుధులై శిలా పాదపాయుధు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.

పర్వతాలను పెళ్ళగించగలరు, సముద్రాలను కలచివేయగలరు, భూమి కుళ్ళగించగలరు, ఆకాశానికి ఎగురగలరు, మేఘాలను పట్టగలరు, మత్తమాతంగాలను ఒంటిచేతితో నిలపగలరు

గట్టిగా అరిచి - ఎగిరే పక్షులను పడగొట్టగలరు
వీరందరినీ దేవతలు గుంపులుగా విభజించి నాయకులను నియమించి భూగోళంలో దశదిశలకూ పంపించా వీరందరికీ మహానాయకుడు ఇంద్రసుతుడైన వాలి.

అతని ఆజ్ఞమేరకు అందరూ నిర్దిష్ట పర్వతారణ్యాలకు వెళ్లి పోయారు భూగోళమంతా ఆవరించారు.

సరయూ తీరం లో దశరథుడు అశ్వమేధము,పుత్రకామేష్ఠి పూర్తి చేసి దీక్ష విరమించి అయోధ్యా చేరాడు.....
పుత్రజనానాన్ని ప్రతీక్షిస్తున్నాడు......

ఆరు ఋతువులు గడచి పోయాయి.....చైత్రమాసం వచ్చింది...

( స‌శేష‌ము )..

Friday, May 30, 2025

వాల్మీకి రామాయణం-12

పుత్రకామేష్టి పాయస విభాగం.
శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తత్త్వ దీపిక ....

శ్రీమహావిష్ణువు ఒక్కడే పాయసము ద్వారా ముగ్గురు భార్యలలో నాలుగు రూపములతో జన్మింపబోవుచున్నాడు.

ఇతర పురాణములలో శేషుడు లక్ష్మణుడుగ, శంఖ, చక్రములు భరతశతృఘ్నులుగ వచ్చినట్లు ఉన్నది.

కాని శ్రీరామాయణమున విష్ణువే నాలుగు రూపములతో వచ్చినట్లు చెప్పబడియున్నది.

దీనిలో తెలుసుకో దగిన రహస్యము ఇమిడియున్నది. ఈ శరీరములో ఉన్న జీవుని పురుషుడు అందురు.

పురుషుడు జన్మించినందుకు కొన్ని ఫలములను కోరి సాధించవలెను. వారికి పురుషార్ధములందురు. అవి నాలుగు, ధర్మము, అర్ధము, కామము, మోక్షము.

ధర్మార్థ కామములు మూడును ఎట్లు సాధింపవలెనో వేదములలో పూర్వభాగము చెప్పినది.
ఉత్తర భాగమున మోక్షము ఎట్లు సాధింపవలెనో చెప్పెను.

మానవుని శరీరము సత్వ, రజ, స్తమోగుణములతో కూడిన ప్రకృతిచే ఏర్పడినది. ఇది జీవువిచే భరింపతగినది.

అనగా భరించి పోషింపతగినది. అందుచే శరీరము భార్య ఆత్మ భర్త శరీరమునందు సత్వము
సమస్సు అవి మూడు గుణములు ఉండుటచే మూడు విధములుగ ప్రవర్తించుచుండును.

ఈ కథలో దశరధుడు జీవుడుగ, కౌసల్య, సుమిత్ర, కైకేయి అవెడి ముగ్గురు భార్యలు సత్వ, రజ, స్తమోగుణముల చే భిన్నన్వభావలగు ముగ్గురు భార్యలుగ కనపడుచున్నారు,

శరీరమును పాందినవాడు ఈ శరీరములో సాధించవలసిన నాలుగు పురుషార్థములను పొందుటయే ఇందు నిరూపింపబ ఉనది.

ముగ్గురు భార్యలు, నలుగురు పుత్రులు అనునది ఈ రహస్యమును సూచించుచున్నది.

పాయసభాగముచే నలుగురు కలిగినట్లు కథలో స్పష్టమగుచున్నది.
శ్రీమన్నారాయణుడు అవతార స్వీకరణ చేస్తున్నాడు కనుక ఇతర దేవతలు ఎలా జన్మిస్తున్నారో రేపటి రోజున న చూద్దాం......

( స‌శేష‌ము )..

వాల్మీకి రామాయణం - 11

మహార్షీ! ఋష్యశృంగా! అశ్వమేధం పూర్తి అయ్యింది. కుల వర్ధనమైన మరొక యజ్ఞం ఏదయినా నీవు చేయించాలి అని దశరథుడు ప్రార్థించగా...

దశరథుని ప్రార్ధనను ఋష్యశృంగుడు అంగీకరించాడు. రాజా! నీకు నలుగురు కుమారులు కల్గుతారని ఆశీర్వదించాడు.

వెంటనే ధ్యాన నిమగ్నుడయ్యాడు. కొంతసేపటికి కన్నులు తెరిచాడు మహారాజా! నీకు సంతాన ప్రాప్తికోసం

పుత్రీయమైన ఒక ఇష్టిని నిర్వహిస్తాను. ఇది అధర్వ వేద ప్రోక్తం.ఆ విధానంలో జరిపిస్తాను.

వెంటనే ఇష్టి ప్రారంభమైంది. సమంత్రకం గా తొలి ఆహుతిని ఇచ్చారు.వెంటనే బ్రహ్మాది దేవతలు తమతమ భాగాలు స్వీకరించడానికి రానే వచ్చారు...

అప్పటికే రావణాసురుడు వల్ల పడుతున్న బాధలను చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గర విన్న వించారు.

త్రిలోక కంఠకుడైన రావణుని సంహరించే ఉపాయం చేయమని ప్రార్థించారు.

ఇలా బ్రహ్మదేవుడు పలుకుతున్నపుడే అక్కడికి విష్ణుమూర్తి విచ్చేసాడు. దేవతలంతా ముక్త కంఠంతో ప్రార్థించారు

మహావిష్ణూ ! లోకహితం కోరి నిన్ను అభ్యర్థిస్తున్నాం. మహర్షి సమతేజస్కుడై శ్రద్ధాభక్తులతో పుత్రకామేష్టి చేస్తున్న ఈ దశరథ మహారాజుకు నీవు పుత్రుడుగా జన్మించు.

నిన్ను నీవే నాలుగా విభజించుకొని దశరథుని ముగ్గురు భార్యలయందు- పుత్రత్వాన్ని పొందు.

ఇలా మానవుడుగా జన్మించి అటుపైని లోకకంటకుడైన రావణాసురుని సంహరించి ముల్లో కాలకూ

దేవగంధర్వ సిద్ధ సాధ్యాప్సరో గణాలకూ ముని బృందాలకూ సుఖశాంతులు ప్రసాద్దించు మహాప్రభూ !

మా అందరికీ నీవే గతి. నీవు తప్ప మరొక దిక్కులేదు. రాక్షస సంహారంకోసమని మనుష్యలోకంపై మనసుపెట్టు అని కోరారు

దేవతలారా ! నిర్భయంగా ఉండండి. మీరు కోరినట్టే మానవజన్మ ఎత్తుతాను. సపుత్రబాంధవంగా రావణుణ్ని
సంహరిస్తాను.

కొన్ని వేల సంవత్సరాలపాటు మనుష్యలోకాన్ని పరిపాలిస్తాను. మీ మాట ప్రకారం ఈ దశరథ మహారాజునే తండ్రిగా అభిలషిస్తున్నాను.

బ్రహ్మాది దేవతలందరూ ఆనంద భరితులై శ్రీమన్నారాయనుణ్ణి భక్తి తో స్తుతించారు.

పుత్ర కామేష్టి శాస్త్రీయంగా చేస్తున్న దశరథ మహారాజుకు యజ్ఞకుండం నుంచి ఒక అద్భుతాకారం కాంతులీనుతూ దర్శనమిచ్చింది.

కృష్ణవర్ణుడు. రక్తాంబరాలు ధరించి ఉన్నాడు. ఎర్రని ముఖం. దుందుభిస్వనం. సింహపు జూలువంటి రోమాలు మీసాలు.

పొడవైన జుట్టు. సర్వశుభ లక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, శైలశ్యంగంలా సమున్నతుడు
శార్దూల సమవిక్రముడు, సూర్యతేజస్వి, అగ్నిజ్వాలా సదృశుడు.

ఆ దివ్యపురుషుని చేతులలో బంగారు పాత్ర ఉంది. దానికి వెండిమూత ఉంది.  ఆ పాత్రను ఎంతో ఆప్యాయంగా పొదివి పట్టుకొని ఉన్నాడు అందులో దివ్యపాయసం ఉంది.

దశరథా! నన్ను ప్రాజాపత్య పురుషుడంటారు. ఇదిగో ఇది దేవతలు చేసిన దివ్యపాయసం. నీ భార్యలకు
పంచిపెట్టు, పుత్రకామేష్టి సఫలం అవుతుంది.

నీకు పుత్రులు కలుగుతారు- అంటూ పాయసపాత్రను అందించాడు. మహారాజు అమితానందంతో అందుకొని భక్తిశ్రద్దలతో ముమ్మారు ఆ దివ్యపురుషునికి ప్రదక్షిణం చేసాడు.

ప్రాజాపత్య పురుషుడు పయనమయ్యాడు.
దశరథ మహారాజు పాయసపాత్రతో అంతఃపురం సమీపించాడు.

కౌసల్యను పిలిచి ఇది పుత్రీయమైన పాయసం స్వీకరించమని సగం (1/2) ఇచ్చాడు. మిగిలిన సగాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం (1/4) సుమిత్రకు ఇచ్చాడు. తక్కిన సగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసి ఒక భాగం (1/8) కైకకు ఇచ్చాడు. మిగిలినది (1/ 8) ఆలోచించి సుమిత్రకే మళ్ళీ ఇచ్చాడు.

ముగ్గురు రాణుల ఆనందానికి అవధులు లేవు. ఎవరికి వారు పాయసం భుజించి

దివ్యతేజస్సుతో విరాజిల్లారు కొన్ని రోజులకు ముగ్గురూ గర్భవతులయ్యారు. దశరథుడు ఆనందపరవశు డయ్యాడు...

Note. వాల్మీకి రామాయణం లో బాలకాండ 15,16 సర్గలు పారాయణ చేయడం తో సంతానాన్ని పొందుతారు.

Thursday, May 29, 2025

వాల్మీకి రామాయణం-10

వసిష్ఠ ఋష్యశృంగుల  మాట ఆజ్ఞగా, వారే అగ్రగాములుగా ఒక శుభముహూర్తాన దశరథుడు అంతఃపురంనుంచి బయలుదేరి. శాస్త్రోక్తపద్ధతిలో యజ్ఞవాటికను ప్రవేశించాడు అలనాడు విడిచిపెట్టిన యాగాశ్వం ఈ సంవత్సర కాలంలో దేశాలన్నీ తిరిగివచ్చింది.

సరయూనది ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభమయ్యింది. ఋశ్యశృంగుడు బ్రహ్మగా బత్విక్కులు అన్ని కార్యక్రమాలూ యథావిధిగా నిర్వహిస్తున్నారు.

శాస్త్ర ప్రకారం నడుస్తున్నారు. -తృతీయసవనాలు -మీమాoసా కల్పసూత్రోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నారు.

ఈ హోమాలలో అహుతంకానీ స్ఖాలిత్యం కానీ ఎక్కడా
కనిపించడం లేదు. అంతా బ్రహ్మసదృశంగా మంత్ర ప్రకారం నిర్విఘ్నంగా జరుగుతోంది.

యజ్ఞం జరిగిన అన్నిరోజులలోనూ అలసిపోయినవాడుగానీ, ఆకలి గొన్నవాడుగానీ కనిపించలేదు.

అందరూ తృప్తితో ఆనందంతో గడిపారు. ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి అని పెద్దలు ప్రేరేపిస్తోంటే కార్యకర్తలు అన్నవస్త్రాలు పుష్కలంగా పంచిపెడుతున్నారు.

శాస్త్ర విహితంగా దశరథుడు మరియు పట్టపు మహిషి కౌసల్య  దేవితోను చేయవలసిన అన్ని క్రియలను  పూర్తి చేశాడు.

అంతా పూర్తి అయ్యింది. దక్షిణా ప్రదాన సమయం వచ్చింది. మహారాజు తన సామ్రాజ్యంలో తూర్పుభాగాన్ని హోతకు, పశ్చిమభాగాన్ని అధ్వర్యునికి, దక్షిణ భాగాన్ని బ్రహ్మకు, ఉత్తరభాగాన్ని ఉద్గాతకు దక్షిణగా సమర్పించాడు

ఈ భూమిని మేము ఏం చేసుకుంటాము, అధ్యయనాధ్యాపనాలే తప్ప మేము రాజ్యాలు మహారాజా ఏలగలమా!

దీనికి ప్రత్యామ్నాయంగా ఒక మణి, ఒక రత్నమో, ఒక గోవో , రవ్వంత బంగారమో ఏదో ఒకటి నీకుతోచినది ఇచ్చి ఈ భూమిని తీసేసుకో.

మొత్తం సామ్రాజ్యాన్ని నీవే రక్షించు. అని  ఋత్విక్కులు ఏకకంఠంగాపలికారు.

అప్పుడు దశరథుడు ఒక్కొక్కరికీ వేలసంఖ్యలో గోవులను, కోట్లలో వెండి బంగారాలను సమర్పించాడు

అందరూ తెచ్చి ఋష్యశృంగ వసిష్ఠులముందు ఆ సొమ్ములను రాశిపోస్తే వారు యథోచితంగా న్యాయంగా అందరికీ భాగాలు పంచారు.

భూరి దక్షిణలతో విప్రులనందరినీ సంతుష్టి పరిచి దశరథుడు హర్ష పర్యాకులేక్షణుడై నిలిచి సవినయంగా సభా నమస్కారం చేసాడు.

విప్రులు ఆనందంతో మనసారా ఆశీర్వదించారు. మహారాజులు తప్ప నిర్వహించలేని అశ్వమేధాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిచేసి పాపరహితుడై దశరథుడు ప్రకాశిస్తున్నాడు

మహర్షీ! ఋష్యశృంగా! అశ్వమేధం పూర్తి అయ్యింది. కుల వర్ధనమైన మరొక యజ్ఞం ఏదయినా నీవు చేయించాలి...

( స‌శేష‌ము ).

Note. ఈ అశ్వమేధ యజ్ఞం ఓ సుదీర్ఘ ప్రక్రియ. చాలా వివరాలు వాల్మీకి కూడా అందించారు.

బాలకాండ 12,13,14 సర్గలలో  వివరించారు. అందుకే కలియుగం లో అశ్వమేధ యాగాలు నిషిద్ధం అంటారు...

సేకరణ...

వాల్మీకి రామాయణం-09

సుమంత్రుడు చెప్పిన సలహామేర దశరథుడు అంగరాజ్యానికి వెళ్లి ఋష్యశృంగ మహర్షిని శాంతా సహితం గా ఆహ్వానించి అయోధ్యకు తీసుకొచ్చి తగిన విధం గా సత్కరించి తను చేయు యజ్ఞం గురించి మంత్రి పురోహోతులతో కలసి సవివర్క్మ్ గా తెలియ జేశాడు.

వసంతంలో చైత్రపూర్ణిమనాడు దశరథుడు యజ్ఞం ప్రారంభించాడు. ఋష్యశృంగునికి నమస్కరించి ప్రధాన ఋత్విక్కుగా అభ్యర్థించాడు.

ఆ ముని అంగీకరించాడు. సుయజ్ఞ వామదేవ జాబాలి కాశ్యప వసిష్ఠులతో కలిసి యజ్ఞనిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. అవసరమైన సంభారాలకు ఆజ్ఞాపించాడు.

దశరథుడు ఋత్విక్కులనందరినీ యథావిధిగా పూజించాడు. మీ అందరి ఆశీస్సులతో యజ్ఞం నిర్విఘ్నుంగా కొనసాగాలి.

ఋష్యశృంగుని ప్రభావంవల్ల ఇది సఫలమై నా సంతానేచ్ఛ నెరవేరాలి. ఇదీ నా ప్రార్థన ఆన్నాడు

నీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఒకరు కాదు - నల్గురు పుత్రులు నీకు ఉదయిస్తారని ఋత్విక్కులు ఏకకంఠంగా ఆశీర్వదించారు.

వసిష్ఠ ఋష్యశృంగుల సూచనల మేరకు సంవత్సరం పొడుగునా ఎవరు చెయ్యవలసిన జప హోమాది కార్యక్రమాలకు వారు బద్ధకంకణులై వెళ్లిపోయారు

సంవత్సరం గిర్రున తిరిగింది. మళ్ళీ వసంతం వచ్చింది. ఆ రోజున దశరథ మహారాజు వసిష్ఠునికి నమస్కరించి అసలైన ముఖ్యయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించమని ప్రార్థించాడు.

అంతా నీదే భారం అన్నాడు. వసిష్ఠుడు అంగీకరించి నేర్పరులైన యాజ్ఞకులను ఆహ్వానించాడు.

సుమంత్రుణ్ని ప్రత్యేకంగా పిలిచి ధర్మాత్ములైన రాజులందరికీ ఆహ్వానాలు పంపమన్నాడు.

అన్నిదేశాలనుంచీ అన్ని వర్ణాలవారినీ ఆహ్వానించమన్నాడు. మిథిలా-కాశీ-కేకయ- అంగ రాజ్యాధిపతులను స్వయంగా వెళ్ళి పిలిచి రమ్మన్నాడు.

సింధు సౌవీర సౌరాష్ట్ర దాక్షిణాత్య దేశాధిపతులకు ఆహ్వానాలు పంపమన్నాడు. మనకు మిత్రులైన
తక్కిన రాజులు అందరినీ ఆహ్వానించమన్నాడు.

వసిష్ఠుని నోటినుండి వచ్చినమాట వచ్చినట్టు అమలు జరిగిపోతోంది.
ఏ పని ఎంతవరకూ జరిగిందో ఎప్పటికప్పు పనులు జరుగుతున్న తీరుకు వసిష్ఠుడు సంతృప్తి చెందారు.

ఎవరికీ ఏ అవమానమూ జరగకూడదు ఎవరికి ఏది ఇచ్చినా శ్రద్ధతో ఇవ్వండి. అశ్రద్ధతో నిర్లక్ష్యంగా మ్రొక్కుబడిగా ఇవ్వకండి. అలా ఇస్తే దాతకు హాని కలిగిస్తుంది.

ఈ హెచ్చరికను పదే పదే చేస్తున్నాడు. యజ్ఞవాటికా నిర్మాణం పూర్తి అయ్యింది. బహుదూరాలనుంచి రేయింబవళ్ళు ప్రయాణించి రాజులంతా వచ్చారు.

రత్న మణిమాణిక్యాలు బహుమతులు తెచ్చారు. అందరినీ యథోచితంగా సత్కరించి వారి వారికి కేటాయించిన గుడారాలలో విడిది చేయించాడు. స్వయంగా వెళ్లి దశరథ మహారాజుకు అం అంతా తెలియజేసాడు.

రాజేంద్ర! మనస్సుతో నిర్మింపబడినదా అన్నంత అద్భుతంగా అందంగా యజ్ఞవాటిక రూపుదిద్దుకొంది.ఇక యజ్ఞం ప్రారంభిచమని ప్రార్థించాడు వశిష్ఠుడు...

( స‌శేష‌ము )..

Wednesday, May 28, 2025

వాల్మీకి రామాయణం -08


అశ్వమేధ యాగం కు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఒకనాడు సుమంత్రుడు ఏకాంతంలో దశరథ మహారాజును
కలుసుకున్నాడు

నీకు సంతాన ప్రాప్తిని గురించి సనత్కుమారుడు ఋషిగణం సన్నిధిలో చెబుతూండగా నేను విన్న విషయం తెలియజేస్తున్నాను. ఆలకించు

కాశ్యప మహర్షికి విభాండకుడు, అతనికి ఋష్యశృంగుడూ జన్మిస్తారు. ఋష్యశృంగుడు పితృసేవ- తపస్సు తప్ప మరొకటి ఎరుగడు

సరిగ్గా ఇదే కాలానికి అంగదేశాలకు రోమపాదుడు రాజు అవుతాడు. అతని అధర్మ ప్రవృత్తివల్ల ఘోరమైన అనావృష్టి ఏర్పడుతుంది.

ఏ ఉపాయంతోనైనా సరే విభాండకసుతుణ్ని ఋష్యశృంగుణ్ని రప్పిస్తే వానలు పడతాయని విప్రులు సలహా ఇస్తారు.

ఆ ఋష్యశృంగుడికి నీ కూతురు శాంతను ఇచ్చి వివాహం చెయ్యమని కూడా చెబుతారు కానీ విభాండకుడికి భయపడి ఎవ్వరూ మేము వెళ్ళమంటే మేము వెళ్ళము అంటారు.

చివరికి వేశ్యలు ధైర్యంచేసి వెళ్ళి ఋష్యశృంగుణ్ని తీసుకువస్తారు. వానలు అతనితోనే వచ్చి కురుస్తాయి. అంగాధిపతి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు.

సరిగ్గా ఇక్కడే సుమంత్రుని మాటలకు దశరథుడు అడ్డువచ్చాడు. వేశ్యలు ఋష్యశృంగుణ్ని ఎలా తీసుకురాగలిగారో వివరించమన్నాడు. సుమంత్రుడు ఇలా వివరించాడు -

విభాండకుడు ఆశ్రమంలో లేని సమయం చూసి వేశ్యలు గాత్ర మాధుర్యంతో ఋష్యశృంగుణ్ని చుట్టుముట్టారు.

స్త్రీ పురుష భేదం తెలియని ఋష్యశృంగుడు యథావిధిగా అతిథి మర్యాదలు జరిపాడు.

కుశల ప్రశ్నలు అయ్యాక ఆ వేశ్యలు తాము తెచ్చిన మధుర భక్ష్యాలను వింత ఫలాలుగా అతనికి సమర్పించి

వెంటనే తినెయ్యమని చెప్పి కౌగిలింతలతో వీడ్కొల్పి ఆశ్రమం నుంచి త్వరత్వరగా బయటపడ్డారు. అతడు అస్వస్థ హృదయుడయ్యాడు.

మరునాడు అదే సమయానికి ఋష్యశృంగుడు మనసు ఉండబట్టలేక వేశ్యలను వెదుక్కుంటూ వచ్చాడు

అప్పుడు ఆ వేశ్యలు మా ఆశ్రమానికి వస్తే ఇంకా వింతలూ విశేషాలూ చూపిస్తామంటూ అంగీకరింపజేసి ఋష్యశృంగుణ్ణి
తమ పట్టణానికి-అంగ రాజధానికి- తీసుకువచ్చారు

వర్షంతో ఋష్యశృంగుడూ, ఋష్యశృంగునితో వర్షమూ అంగ రాజ్యంలో అడుగుపెట్టాయి

రోమపాదుడు ఎదురువెళ్ళి ఋష్యశృంగుణ్ణి విధివిధానంగా అర్చించి అంతఃపురంలో ప్రవేశపెట్టి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేశాడు.

దశరథ మహారాజా ! సనత్కుమారుడు చెప్పిన కథలో నీకు హితమైన అంశం తెలియజేస్తున్నాను శ్రద్ధగా విను ఇక్ష్వాకు వంశంలో దశరథుడు జన్మిస్తాడు.

అతనికి అంగరాజు రోమపాదునితో సఖ్యం ఏర్పడుతుంది
అనపత్యుడైన దశరథుడు తన యజ్ఞనిర్వహణకు శాంతా భర్తను పంపమని కోరుతాడు.

రోమపాదుడు అంగీకరించి పుత్రవంతుడైన ఋష్యశృంగుణ్ని అయోధ్యకు పంపుతాడు.

యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దశరథుడికి అమిత పరాక్రమవంతులు వంశవర్ధకులు అయిన నలుగురు పుత్రులు కల్గుతారు.

మహా ప్రభూ ఇది సనత్కుమారుడు చెప్పిన విషయం కాబట్టి నీవే స్వయం గా వెళ్లి సకల రాజలాంఛనాలతో సత్కరించి ఋశ్య శుంగుణ్ణి తీసుకోరా అని సుమంత్రుడు తెలిపెను....

( స‌శేష‌ము )

వాల్మీకి రామాయణం -07

సంతానం లేదని చింతనతో మంత్రి పురోహితులతో సమావేశం ఏర్పాటు చేయాలని దశరథుడు  సుమంత్రునికి ఆదేశాలు జారిచేసేను.

రాజు గారి అదేశాలమేరకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి,కాశ్యపుడు ఇతర బ్రాహ్మణ పురోహితులు ఇతర మంత్రివర్గం తో సమావేశం ఏర్పాటు చేసెను.

ఆ సమావేశం లో దశరథుడు తన మనసులోని మాటను వారి ముందు ఉంచెను.

సంతానం లేని నేను అశ్వమేధ యాగం చేయ బూనినాను.శాస్త్రము యందు చెప్పబడినట్టు నియవిజ్ఞముగా ఎట్లు చేయవలెనో ఉపాయము ఆలోచించి తెలపండి అని తెలిపెను.

రాజు నోటినుండి వెలువడిన మాటలకు మంత్రి పురోహిత వర్గము సంతోషముతో

యాగమునకు కావాల్సిన సామాగ్రి సమకూర్చుకోనుము,యజ్ఞాశ్వమును విడువుము, సరయూ నది తీరంలో యజ్ఞాశాలను నిర్మించుము అని అశ్వమేధ యాగానికి కావాల్సిన పూర్వరంగమును సమాయత్తము చేసెను.

అంతపురమునకు దశరథుడు వెళ్లి తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర ,కైకేయి లతో తెలియజేసెను.

ఇక మీరు యజ్ఞ దీక్ష తీసుకొనవలెను సంతానార్థమైన  యజ్ఞము లో భాగం అని చెప్పిన వెంటనే వారి ముఖాలు మంచు విడిచిన కలములవలె ప్రకాశించెను.


(ఇంకా ఉంది)

Tuesday, May 27, 2025

వాల్మీకి రామాయణం - 06

అయోధ్యా పురి చక్రవర్తి అయిన దశరథ మహారాజు వేదవేదాంతములను తెలిసిన వాడు. పౌరులకు మేలుకలిగించు అనేక యజ్ఞములు చేస్తుండెడి వాడు. ఆ మహారాజు కొలువులో 8 మంది మంత్రులు. వారు దృష్టి,
జయంతుడు,విజయుడు,సిద్ధార్థుడు,అర్థసాధకుడు,అశోకుడు,మంత్రపాలుడు,మరియు సుమంత్రుడు(అత్యంత ముఖ్య వ్యవహారాలను చూసే వాడు).

ఈ మంత్రి వర్గం ఇతర రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నది ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు.తప్పుచేసిన తనబిడ్డలైనను శిక్షించ గల నిబద్ధత గల వారు.

నిరపరాదులైన పగవారైనను క్రోధముతో శిక్షింపక సమబుద్ది కలవారు.త్రికరణ శుద్దిగా అందరూ ఏకతాటిపై రాజ్యవ్యవహారాలను చూసెడి వారు.

వశిష్టుడు, వామదేవుడు అను మహర్షులు చాలాకాలము నుండి
ఇక్ష్వాకువంశపురోహితులై, ఆ దశరధునికి హితులై ప్రాధాన్యము వహించి యుండిరి.

ఇంకను జాబాలి మున్నగు ఋషులును ప్రధానులైయుండిరి. రాజ్యవ్యవహారము లందు వీరికిని ముందు పేర్కొన్న మంత్రులతో బాటు ప్రాముఖ్యముండెడిది.

అందువలననే అయోధ్యానగరమునగాని కోసలదేశమునందుగాని ఎచ్చటను అసత్యము పలుకుటగాని,

మోసముగాని, స్త్రీ వ్యామోహముగాని, అధర్మముగాని, అన్యాయముగాని మచ్చుకకైన కనిపించెడిదికాదు.

నగరమునందు, దేశము నందు నివసించువారు మంచి వస్త్రములు ధరించి, చక్కని ఆలంకారములు దాల్చి మంచి నడవడికగలవారై తమరాజగు దశరథుని మేలుకొఱకై సదా నీతి యందు జాగురూకతతో ప్రవర్తించుచుండిరి.

తనయందు ప్రీతిగలవారును, బుద్ధికౌశలము గలవారును, రాజ్యకార్యాచరణ దక్షులును అగు మంత్రులచే పరివేష్టితుడై

ప్రకాశవంతములగు కిరణములతో నొప్పు బాలభానునివలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుడువలె నీ భూమండలము నంతను దశరథ మహారాజు పాలించుచుండెను.

ఇంతటి ప్రభావం కలిగిన దశరథ చక్రవర్తి కి చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వలన మనసులో చింతన ఏర్పడింది.

సంతానం కోసం మంత్రి,పురోహిత వర్గం తో సమావేశం ఏర్పాటు చేసి సమాలోచన చేసెను దశరథుడు...

( స‌శేష‌ము )..

వాల్మీకి రామాయణం - 5

అది అయోధ్యానగరం. సరయూ నది తీరం. మనుచక్రవర్తి స్వయంగా సంకల్పబలం చే నిర్మించినాడు. సంతుష్టులగు ప్రజలతో,ధనధాన్యాలతో నిండియుండి కోసల దేశం గా ప్రసిద్ధి చెందింది.


అయోధ్యా నగరం 12 యోజన ముల పొడవు,3 యోజనముల వెడల్పు గలది.మంచి పుష్పాలతో నిండిన తోటలు,రాజమార్గాలు

సుంగంధభరితమైన తోరణాలు,చక్కగా అమర్చినటువంటి వీధులతో గొప్ప పట్టణం గా విరాజిల్లుచుండెను.

మిక్కిలిఎత్తైన రాజభవనాలతోను,వాటిపై ఎగురుచున్న జెండాలతో ను,పెద్ద పెద్ద నర్తన శాలలతోను,

పూదోట లతోను ఉన్న నగరం లోకి శత్రువులు ప్రవేశింపడానికి
వీలుకాకుండా లోతైన ఆగడ్తలతోను అయోధ్యానగరం ప్రకాశించుచున్నది.

ఏనుగులు,గుఱ్ఱములు,ఒంటెలు,అవులతోను,అధికంగా సామంతరాజులతోను ,దేశ విదేశ రాజులు,వ్యాపారస్తులతో క్రిక్కిరిసి ఉండెను.

ఇలా పరిపూర్ణ హంగులతో ఉన్న ఆ నగరం దేవేంద్రుని అమరావతి తో సమానం గా ఉండెను.

తల్లిదండ్రులు,భార్యాపుత్రులుమనుమలు,బంధువులతో లేని ఇల్లు ఒక్కటైనను అయోధ్యలో కనపడదు.

చదువురానివారు కానీ,దుష్టుడు కానీ,దొంగ కానీ,నాస్తికుడు కానీ పట్టణం లో వెదికనను కనపడడు.

ఇట్టి మహా నగరాన్ని అజ మహారాజు పుత్రుడగు దశరథ మహారాజు పాలన చేస్తుండెడి వాడు...

( స‌శేష‌ము )..

Note.1 యోజనము =12కిలో మీటర్ల దూరం తో సమానం.


Monday, May 26, 2025

వాల్మీకి రామాయణం-4

వాల్మీకి ఆశ్రమం లో చతుర్ముఖ  బ్రహ్మ జరిగిన సంఘటన  తెలుసుకొని,

జరిగిన రామకథ అంతయు నీకు ప్రత్యక్ష సమానాకారముగా గోచరమగును అని వరమును ఇచ్చెను.

నీవు రచించు ఈ కావ్యం లో ఒక్క మాటైన అసత్యము ఉండదు.రామ కథ పుణ్యమైనది.మనోహరమైనది.

యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

పర్వతములు,నదులు భూమి మీద ఉన్నంత వరకు రామకథ లోకములో వ్యాపించి ఉంటుంది.

తదుపగత సమాససన్ధియోగం
సమమధురోపనతార్థ
వాక్యబద్ధమ్,
రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్.

ఈ రామచరితము రావణ వధ   వాక్యాలు మధురంగా అర్థభరితముగా ఉంటాయి

ఈ కావ్యము సుమారు 24 వేల శ్లోకాలు,7 కాండలతో విరాజిల్లుతుంది.
వేదోపబృంహనార్థాయ....
వేదము యొక్క సమగ్ర వివరణ గాను, చదివినను,పాడినను మధురంగా ఉంటుంది.

ఇంకా ఆయుష్యం, పుష్టిజనకం, సర్వశ్రుతిమనోహరం....అని వరం ఇచ్చారు  బ్రహ్మగారు.

బ్రహ్మ గారి వరప్రభావం వలన జరిగిన రామచరిత్రను అంతా కళ్ళకు కట్టినట్టు కనపడింది

తదేక దృష్టితో రచన సాగించారు మహర్షి రామచరిత్రకు 3 పేర్లు సూచన చేశారు

1.రామాయణం
2.మహత్తుకలిగిన సీతమ్మ చరిత్ర
3.పౌలస్త్య వధ.

ఈ రాసిన గ్రంథం మొతాన్ని  ఆశ్రమమ లో ఉన్న రామచంద్రుని పుత్రులు కుశ లవుల కు నేర్పించాడు.

వారు అయోధ్యలో గానం చేశారు అక్కడ ఉన్న నగర పౌరులు బాగుందని ప్రశంసించారు,బహుమతులు బహుకరించారు.

ఆ నోటా ఈ నోటా ప్రచారం చెంది రామచంద్రుని వరకు ఆ గాన ప్రవాహం చేరింది.

రాముడు కూడా అక్కడవున్నవారితో ఈ సీతాచరిత్ర నాకు కూడా ఊరట కలింగించింది. సావధాన చిత్తులై వినండి అని ఆదేశించారు.

ఇక మనము కూడా రామచరిత్రను అనుభవిద్దాము...

(ఇంకా ఉంది)

వాల్మీకి రామాయణం-3

నారదమహర్షి చే ఉపదేశం పొందిన సంక్షేప రామాయణాన్ని మననం చేస్తూ మధ్యాహ్న సమయానికి..

తమసానది తీరమునకు తన శిష్యుడైన భరద్వాజుని తో కలసి వెళ్లెను వాల్మీకి మహర్షి.

నిరంతరం  రామకథాగానం చేయడం మూలన మనస్సు నిర్మలమైనది. ఆభావాలే ప్రకృతి లో కనపడ్డాయి....

పక్కనే ఉన్న భారద్వాజునితో నది లో ఉన్న నీటి ని చూస్తూ అనేశాడు కూడా...

ఓ భరద్వాజా బురద లేని స్వచ్ఛమైన నీటి ని చూసావా నిర్మలమైన  ఉత్తమ మనుజుని వలే ఉన్నది అని చెబుతున్న సమయం లో నే ఆశ్చర్యాన్ని కలిగించే ఓ దృశ్యం మహర్షి కంట పడింది.....

ఓ క్రౌంచ పక్షుల జంట...ప్రేమాతిశయముతో ఒకటిని విడచి మరొకటి ఉండని స్థితి....

ఆసమయంలో ఓ బోయవాడు ఆ జంటలో మగ పక్షిని బాణం తో కొట్టేసాడు.....ఆ ప్రదేశం అంతా ఆ పక్షి రక్తం తో నిండినది ఆడ పక్షి  తన రెక్కతో విసురుతూ విల విల లాడుతూ మగ పక్షి చుట్టూ తిరుగుతోంది దీనం గా రోదిస్తోంది.

పక్కనే బోయ వాడు విల్లంబులతో నిలుచు కొని వున్నాడు.....
అత్యంత అల్ప సమయం లో జరిగిన ఈ దృగ్విషయాన్ని వాల్మీకి కన్నులతో కాక హృదయం తో చూసాడు....

అంత వరకు ప్రశాంతం గా ఉన్న మనసు లో ఒక్క సారి అలజడి చెలరేగింది.....ఒక్క సారి హృదయాంతరాలలో నుండి శోకం తో కూడిన మాటలు తన్నుకొని వచ్చాయి.....

శ్లో! మానిషాద! ప్రతిష్ఠాం త్వ! మగమః శాశ్వతీస్సమా: |
యత్ క్రౌంచమిధు నాదేక మవధీఃకామమోహితమ్౹౹

ఓ కిరాతకుడా! నీవు కామవసా న  క్రౌంచపక్షుల జంటనుండి మగ పక్షి ని చంపినావు కనుక నీవు చాలాకాలం లోకం లో అప్రతిష్ఠితను పొందుదువు.

వాల్మీకి నోటి వెంబడి వచ్చిన మాటలు ఏదో శాపం గా కనుబడుతున్నాయి అని చింతిస్తున్నాడు....

పక్కన ఉన్న భరద్వాజుడు గురువాక్కు ను నిశితంగా చూస్తున్నాడు.
4 పాదాలుగా ఉన్నాయి....
ఒక్కో పాదానికి 8 అక్షరాలున్నాయి....
ఒక క్రమబద్దం గా ఉన్నాయి....

గతం లో చదవని విధం గా కనబడుతున్నాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు....
అవును ఈ శ్లోకం ఛందోబద్ద రచనకు మూలం. మొదటి శ్లోకరూప వాజ్ఞ్మయం....

ఆది కావ్యం రామాయణం,
ఆది కవి వాల్మీకి ......
వాల్మీ రామాయణ రచనకు పునాది.....

శ్లోకాన్ని పరిశీలిస్తే ఓ  శాపం గా కనపడుతుంది కానీ కావ్య ఆరంభము మంగళ వాక్యాలతో మొదలు కావాలి మరి ఇదేమిటి ఇలా ఉంది అని మన పెద్దలు విస్తుపోయారు .....

పరికించారు దివ్యదృష్టి తో దర్శించారు అప్పుడు  ఆ శ్లోకమే ఇలా అగుపించింది.

మా నిషాద-లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా ! త్వమ్=నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఇ్చమిథునాత్ =రాక్షసదంపతు లైన రావణమండోదరులనుండి కామమోహితమ్=కామపరవశ మగు, ఏకమ్=ఒక డైన రావణుని, అవధీః శాశ్వతీ:,స్థిరము లైన, సమాః సంవత్సరములయందు, ప్రతిష్టామ్=మాహాత్మ్య
మును, అగమః=పొందితివి.

ఓ శ్రీనివాసుడా! రావణమండోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై
సీతాదేవి నపహరించిన వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.

ఇలా చూస్తే ఓ మంగళకరమైన శ్లోకం గా కనిపిస్తుంది.

ఈ ఛందోబద్ధమైన శ్లోకాన్ని గురుశిష్యులు ఇద్దరూ స్మరణ చేస్తూ వికారానికి లోనైన మనసులతో ఆశ్రమం చేరారు.

వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తదేకదృష్టితో   శ్లోకాన్ని స్మరణ చేయడం ప్రారంభించాడు.

అపుడే ఆశ్రమానికి చతుర్ముఖ బ్రహ్మ గారు విచ్చేసారు.

( స‌శేష‌ము )

Sunday, May 25, 2025

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి♪?ఎలా జరుపుకోవాలి? దీని వలన ఉపయోగములు ఏమిటి ?మాసశివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి?

ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు♪.

అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం♪.
శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి♪.

మహాశివుడు లయకారకుడు♪, లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు♪, అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా మారుతాడు...

చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది.

మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి.
దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి.
అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు.

అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.

ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి.

మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.
మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి, దీపాలను పడమర దిక్కున వెలిగించి  *ఓం నమః శివాయ* అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి.

ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. 

శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి.
దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు.
తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

*ఈ రోజున ఏమి చేయాలి ?*
శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి, తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.

ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి.
విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి,
శివునికి అభిషేకం అంటే ప్రీతి,
కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో  ఈ రోజున అభిషేకం చేయాలి.

అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం.
అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి, ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది.

ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.

ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం.
ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట, లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే
శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు.
మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.

కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది.
అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి.

ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు  చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు...
స్వస్తి..🙏🌹

             *_🌻శుభమస్తు 🌻_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏

Saturday, May 24, 2025

వాల్మీకి రామాయణం-2

త్రేతాయుగం  నడుస్తోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం. ప్రశాంత మైన వాతావరణం. తపో భూమి.
వేదాధ్యయన తత్పరుడు, తపసంపన్నుడు అగు నారదమహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు.

ఆ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకం లో  ఈ కాలం లో గుణవంతుడు ఎవడు.?

వీర్యవంతుడు ఎవడు?
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడును ఎవ్వడు?

చారిత్రము తో కూడుకొన్నవాడు ఎవడు?
సర్వభూతములయందు హితుడెవ్వడు?
విద్వాంసుడెవ్వడు?
సమర్థుడెవ్వడు.?

ఏకప్రియదర్శునుడు ఎవడు?
ద్యుతిమంతుడు, అసూయలేనివాడు ఎవ్వడు?
కోపము వచ్చినచో దేవతలైనను భయపడుదురో అట్టి నరుడెవ్వడు?

అని 16 గుణాలను సంబందించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపెను.

సమాధానము గా నారదుడు ఓ మహర్షి..!
నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోట వుండటం దుర్లభం ......

కానీ ఇప్పుడు ఇక్ష్వాకు కులమున జన్మించిన  వాడు రాముడు అను పేర జనుల చే పిలుచు కొనువాడు లో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడు గుణము లేని వాడు గా ఉన్నాడు....

అనిచెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తం గా ఉపదేశాత్మకంగా, నారదుడు అందించాడు.


ఇదం పవిత్రం పాపఘ్నం
పుణ్యం వేదైశ్చ సమ్మితం ౹
యః పఠే ద్రామచరితం
సర్వపాపై: ప్రముచ్యతే౹౹

పాపములను నశింపచేయునది, పుణ్యమైనది, వేదములతో సమానమైనది ఈ చరిత్ర,

ఎవడుచదువుతాడో, తెలుసుకుంటడో
అతడు సర్వపాపములనుండి విముక్తి చెందుతాడు 

ఈ చరిత్ర ఆయుష్యకరమైనది, సత్యమైనది, నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోడ బంధు సమూహములతో  జీవనం గడుపుతాడు.

శరీరం పడిపోయినతరువాత పరమపదము చేరును. అని తెలిపి నారదుడు  ప్రయాణమయ్యెను.

సంక్షిప్తం గా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణం గాను, బాల రామాయణం గానూ, మూల రామాయణం గాను, ప్రసిద్ధి.
నిత్యపారాయణ యోగ్యం..

(ఇంకా ఉంది..)
- జై శ్రీరామ...

వాల్మీకి రామాయణం-1

రామాయణం..
ఎందరో జీవితాల్లో మార్పుతెచ్చింది.
ఎందరికో  మార్గ దర్శనం అయ్యింది.
ఎంతో మంది నిత్యం పారాయణ చేస్తున్నారు.
ఎన్నో విలువలు..
ఎన్నో ఆదర్శాలు..
ఎన్నో నిత్య ఆచరణ సత్యాలు..
ఎన్నో పతివ్రతా ధర్మాలు..
ఎంతో సోదర ప్రేమ..
ఎన్నో తాత్విక విషయాలు..
ఎన్నో రాజ ధర్మాలు...

రాముని గుణాలు అనంతం.
రాముని సత్యవాక్యం అనంతమైనది.
రామాయణం లో ఆదర్శాలు అనంతమైనవి.

రామాయణం లో విలువలు ఆనంతమైనవి.
రామాయణం లో సోదర ప్రేమ అనంతం.
రామాయణం లో పతివ్రతాధర్మాలు అనంతం.

ఇలా అనంత మైన రాముని చరిత్రను అల్పం గా చెప్పుకోవడం కష్టతరం. పైగా అది సీతమ్మవారి చరిత్ర కూడాను. ఇంతటి వాల్మీకి చెప్పిన రామాయణం
తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం...

- జై శ్రీరామ్..